వెన్ను నొప్పి మీ వీపుకు వెనుక భాగం తీవ్ర మైన నొప్పి తో బాధ పడుతున్నారా? ఎక్కువ సేపు కూర్చుని పని చేసినా, అదే పనిగా ఎక్కువ సేపు బండిపై 
కూర్చునిప్రయాణం   చేసిన సహాజంగా వెన్ను నొప్పి తో తీవ్రంగా ఇబ్బంది పడతారు. సహాజంగా మీ వెన్ను పూస ఒక పక్కకు వంగి పోవడం. నిటారుగా కూర్చోలేక ఒక పక్కకి ఓంగి కూర్చోడం అలవాటు చేసుకుంటారు. అది వెన్ను కింది బాగంలో డిస్క్ బోన్స్కు మధ్య  ఉండే మృదువుగా ఉండే కుషన్ లాంటి భాగం పాడై పోతుంది. ఇది ఆర్తరైటిస్ కు దారి తీస్తుంది. సహజంగా కొంచం మీతలను ముందుకు సాచి ప్రతి 1/2 గంటకు నాలుగు వైపులకు తిప్పాలి. ఒక వేళ ఏదైనా నొప్పి స్పాం జామ్ అలాంటి నొప్పి ఉంటె చల్లని ఐస్ ముక్కలను లేదా హీటింగ్ ప్యాక్ ను ఆప్రాంతం లో పెట్టాలి. అయితే మీశారీరాన్ని పల్చటి టవల్ లేదా ఒక గుడ్డలో డాక్టర్ సలహా మేరకు వ్యవహరించాలి. 

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం సరిగా లేకుంటే వెన్ను నొప్పికి దారి తీస్తుందా...

మనం తీసుకునే ఆహారం సరైనది కాక పోతే శరీరం ఇంఫ్లామేషన్ కు గురి అయ్యే అవకాశం ఉంది. మీ శరీరం బలంగా ఉండాలంటే ప్రోటీన్లు, పప్పు ధాన్యాలు పండ్లు ఫలాలు, కాయ గూరలు,అవకాడో సాల్మన్, వంటివి మీ ఆహారం లో తీసుకుంటే కండరాలు బలో పేత మౌతాయి. మీ శరీరంలో ఉన్న టిష్యుల ని మన శరీరానికి కాల్షియం, ప్రోస్ఫరస్, విటమిన్ డి , తీసుకోవాలి. ఎముకలలో లేదా కండరాలు బలహీన పడ్డ అరిగి పోయినాడిస్క్ లో సమస్యలు వస్తాయి. 

మీరు నిదర పోయే పరుపులు, మెట్రేసేస్, సరిగా ఉండక పోవచ్చు...

మీ వెన్ను పూసకు సరైన సపోర్ట్  ఇచ్చే విధంగా మీ శరీర నిర్మాణానికి అనుగుణంగా ఉండే మెట్రేస్సేస్ ను మీరు ఉపయోగించాలి.  అదే మీరు ఎలా నిద్ర పోవాలో మీకు సూచిస్తుంది. ఇప్పటికే మీకు వెన్ను నొప్పి ఉంటె ఆ పరుపు లేదా మెట్రిసెస్స్  గట్టిగా ఉంది ఉండవచ్చు.  అందుకే మీ పరుపు ఎత్తుపల్లా లుగా ఉండడం ,మీరు వేసుకునే పిల్లో సరిగా లేకాపోయినా అటు వెన్ను నొప్పి మెడ పట్టేయడం వంటి సమస్య రావచ్చు. అలా ఎన్ని పరుపులు, మాట్రిసెస్స్  మార్చినా పరిస్థితి అలాగే ఉంటె నేల పైన ఏమిలేకుండా అంటే చాప, దుప్పటి, పిల్లో లేకుండా పడుకునే ప్త్నం చేయండి. ఒక వేళ ఇతర వెన్ను నొప్పి తగ్గించే పరుపులు మాట్రేసేస్స్ వారానికి పైగా వాడినా తగ్గ కుండా ఉంటె వాటిని తిరిగి ఇచ్చేయండి. కొందరు వాళ్ళు పడుకునే తీరును బట్టి వెన్ను పూసకింది భాగంలో తీవ్ర మైన నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు వాటిని మార్చి పడుకోవడం చాలా కష్టం. అది మీకు అలవాటుగా మారితే చెప్పలేము. మీరు టవల్ ను చుట్టు కొడం, మీ కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకోడం. వల్ల మీ వెన్నుపూస వెనుక వైపు వంకరగా మారుతుంది లేదా మరో పిల్లో తో చేయవచ్చు. మీ మెదవైపు నుండి కిందకి ఎలాంటి పరుపు ఉండాలో మీరు సుఖంగా నిద్రపోవాలంటే ఎలాంటి పరుపు ఉండాలో  మీకు ఏది సుఖ వంతమో ఎంచుకోండి.

మీ పొట్టపై తలగడ పొట్టకింద తలగడ...

అలా చేయకుండా ఉంటేనే మంచిది. ఒక వేళ మీకు వెన్ను పూస నొప్పి తీవ్ర సమస్యగ  ఉంటె మీకు మెడ లేదా వెన్ను కింది భాగం లో నొప్పి ఉంటె  మీ పోట్టకింది భాగం  వరకు పిల్లో పెట్ట వచ్చు. మీ స్థానాలను మార్చి మార్చి తలగడ మారుస్తారు. అదీ మీ తలను మెత్తటి పిల్లో పై   ఉంచి మీ మెడ పై స్థానం లో పెట్టవచ్చు.

అసలు మనం ఎలా పడుకోవాలి...

వెన్ను నొప్పి తీవ్రంగా ఉంటె ఎదో ఒక వైపు కు తిరిగి పడుకోవాలి.అది కొంతవరకు వెన్ను నొప్పి ని నివారించవచ్చు మీ కాళ్ళ మాధ్య పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అది మీ పిరుదల కింది భాగం లో పడుతుంది. మీ చెస్ట్ ను దగ్గరగా మీ కాళ్ళను ఉంచి ముడుచుకుని పడుకోండి. ఒక వేళ అప్పటికే  వెన్ను నొప్పి ఉన్న వారికి చాలా ఉపయోగ పడుతుంది.

దీర్ఘ కాలంగా కూర్చున్న వారికి వెన్ను నొప్పి...

ముఖ్యంగా పని చేసే ఉద్యోగస్తులు. పని చేసేప్రదేశాలాలో దీర్ఘ కాలంగా  ఎక్కువ సేపు  కూర్చోడం వల్ల వెనుక భాగంలో ఉండే కండరాలు మెడ , వెన్ను పూస, పై తీవ్ర ప్రభావం పడడం వల్ల మీరు కూర్చునే ప్రదేశం లో నిటారుగా కూర్చోడం. అలా కాక పోయినా మీకు ఎంతవరకు కంఫర్టబుల్ గా కూర్చున్నారు ? అన్నది ప్రశ్న మీ వెన్ను పూస దీర్ఘకాలం ఎక్కువసేపు కూర్చోడానికి సహకరించదు. కొన్ని సార్లు లేచి అటు ఇటు కొన్ని నిమిషాలు తిరుగుతూ  నడుస్తూ ఉండాలి. మీ శరీరానికి ప్రతి అరగంటకీ కాస్త విరామం ఇవ్వాలి.

శరీర వ్యాయామం తప్పించారా..

మన శరీరానికి వెన్ను క్రింది భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటె మేరు ఉత్చా హంగా పని చేయలేరు. మీ వెన్ను పూసకు  బలమైన పోట్టద్వారా సహకారం అవసరం వెనుక భాగంలో ఉన్న కండరాలు, సరిగ్గా ఉంటేనే బరువును లేపగలరు. ప్రతి రోజూ మీ శరీర వ్యాయామం చేయడం ద్వారా మీరు మెట్లు ఎక్కగలరు. మీ ఇంటికి అవసర మైన సరుకులు మోయడం , నడవడం, లేదా ఈత కొట్టడం వంటి అలవాట్లు ఎక్కువరోజులు  చేయకుంటే శరీరం బలహీన పడి పోతారు. చాలా కాలంగా అలాగే ఉంటె  ఒకేసారి చేస్తే శరీరానికి గాయాలు ఏర్పడు తాయి.

పొగ తాగడం...

మీరు అధికంగా పొగతాగడం వల్ల కింది భాగం లో వెన్ను నొప్పి రావచ్చు దీని వల్ల రక్త ప్రసారం  నిరోధిస్తుంది మీ వెన్నుపూసకు  రక్త .ప్రసారం నిలిచి పోతుంది. దీని వల్ల వెన్నుపూసకు  ఉండాల్సిన కుషన్  డిస్క్ మరియు ఎముకల మధ్య  అరిగి పోవచ్చు లేదా విరిగిపోవచ్చు. అవి మీ ఎముకలను మరింత బలహీన పరుస్తాయి. దీని వల్ల ఆస్టియో ప్రోరో సిస్ వస్తుంది. మీరు పోగతాగడం వల్ల వెన్నునొప్పి కి కారణం అవుతుంది. మీ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే టట్లు అయితే పోగాతాగడం మానేయాలని మానేస్తే డాక్టర్ సహాయం తీసుకోండి. 

అధికంగా తినడం...

అతిగా ఆహారం తిన్న మీ ఎముకలపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా మీ శరీరం బరువు పెరుగు తుంది.మీరు తీసుకునే ఆహారం   ఆత్రంగా ఎక్కువ తీసుకుంటే ప్రమాదమే అంటున్నారు వైద్యులు మీరు తీసుకునే ఆహారం మెల్లిగా   తీసుకొండి. దీని వల్ల మీశారీరానికి సమపాళ్ళలో పోషకాలు అందుతాయి.దీని వల్ల మీ శరీరానికి కొన్ని క్యాలరీల లభిస్తాయి. మేరు కాస్త స్నాక్స్, వెన్న, చిప్స్ శాఖాహారానికి  బదులు కొంత పెరుగు తీసుకుంటే మంచిది.

మీరు మోసే బరువు  మీశారీరం పై పడుతుంది....

మీరు మోసే మీ బరువైన సంచులు ముఖ్యంగా పాట శాలకు వెళ్ళే పిల్లలు పెద్దలు ఆబరువుకు  శరీరం అలిసి పోతుంది.  శరీర కండరాలు అలిసి పోతాయి. అది మీ వెన్నుపూసకు సపోర్టు చేయలేదు. ఇది చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల బరువు మోయలేక  బాల్యం నుంచే స్కోలియోసిస్ వంటి సమస్యతో బాధ పడుతున్నారు. బాల్యం లోనే వెన్నుపూసవంగింది అంటే ముందు ముందు తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు అంటున్నారు  స్పయిన్ సర్జన్లు ఒక్కోక్కసారి వెన్ను కింది భాగం లో డిస్క్ ఫ్రోలాప్స్ అయినా అవ్వచ్చు అలాంటప్పుడు స్పైన్ సర్జరీ చేసినా ఫలితం ఉండబోదని అంటున్నారు. వైద్యులు.

మీరు నడిపే వాహానం సరిగా లేకపోయినా నడుము నొప్పికి కారణం...

మీరు నడిపే వాహానం కూర్హునే పోస్చర్ సరిగా లేకపోడం మీశారీరానికి సరిపడా ఎత్తు లేకపోవడం. అదేవిధంగా హ్యాండిల్ సరిగా లేక పోయినా వాహనాన్ని  సరిగా నడపలేరు. అదేపనిగా ఎక్కువసేపు వాహనాన్ని నడపడం కష్టం. మీ వెన్ను నొప్పితో బాధ పడుతున్నప్పుడు ఫిజియో తెరఫిస్ట్ సహకారంతో 
వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు. లేదా ట్రాక్స్ ద్వారా వెన్ను నొప్పి కి కొన్ని తెరఫీలు చేస్తారు అయితే నిపుణులైన వైద్యాధికారుల సమక్షంలోనే  కొన్ని తెరఫీలు చేయాలి.

 హై హీల్స్...

 హై హీల్స్ ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉన్న మహిళలు వాడే హై హీల్స్ ఎగుడు దిగుడుగా ఉంటె ఆటు నడవలేక ఎత్తుపల్లాలు ఎక్కువై అది మీ వెన్ను పూస పై తీవ్రప్రభావం చూపిస్తుంది. అది మీ ఆఫీసులో వేసుకోవచ్చు. నడి చేందుకు వాకింగ్ షూ వాడచ్చు . మీరు సరైన షూ వాడక పోవడం వల్ల కాలి మడమలకు సరైన రక్త  ప్రసరణ జరగదు. అది మీ వెన్ను పూసపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సమస్య తీవ్రం కాక ముందే  సిట్టప్స్ యోగా చేయడం వల్ల కొంత ఉపసమనం ఉంటుంది.  వెన్ను చూపని వాడె మగాడు వెన్ను పూసకు సమస్య వచ్చిందో ఇక అంతా సమస్యే.