"దేనికైనా టైంరావాలి బ్రదర్. నువ్వు ప్రామిస్ చేస్తే డైరెక్టర్ గా నీ పేరే ఎనౌన్స్ చేయిద్దాం. నీ ఖర్మకాలి నీకు పేరయితే లేదుగానీ, తెలివితేటలున్నాయి. ఇంతకాలం, నీబుర్ర ఇతర్లకు కీర్తి సంపాదించి పెట్టండి. ఇహనన్నా నీ కోసం నువ్వేమన్నా చేసుకో" అన్నాడు చలపతి.
అసిస్టెంటు కాసేపు తనలో తను ఏదో గొనుక్కున్నాడు.
"అంతేనండీ బాబూ అంతే! "అడబడుచు" సినిమాకు నేనే వర్క్ చేశాను. సెంచరీ కొట్టింది. ట్రోఫిలు, పూలహారాలు సన్మానాలు, డైరెక్టర్ కొట్టేశాడు, నా ముఖం చూసినవాడే లేడు. ఎవరని ఏంప్రయెజనం?" అన్నాడు అసిస్టెంట్.
"నువ్వా పిక్చర్ చూశావో లేదోగానీ మంజూ, మార్వేలేస్ సీన్స్ ను సెల్యూలాయిడ్ లో కెక్కించాడనుకో మనవడు.
బృందావన్ గార్డెన్స్ ను, బొచ్చెడంత మండి ఘాట్ చేసారు. మనవాడూ చేశాడు. డిఫరేన్స్ చచ్చినంత ఉన్నది. బ్రదర్- సీన్ లో, హీరో హీరోయిన్లు చేత వండర్ ఫుల్ రోమాన్స్ చేయించావయ్యా! జనం వెర్రత్తిపోయిందక్కడే!"
"అడబడుచు" సినిమాను మంజరి కూడా చూసింది. సగంలోనే బోరెత్తి లేచివచ్చింది, కానీ ఈ మాట తను అనడానికి లేదుగదా చచ్చి?
"సరేలే బ్రదర్ ఈవిడ మన ముందుగానే వో ముక్క చెప్పివుంచు..... ఇహ వెళ్ళిరండి" అన్నాడు చలపతి.
"మీరో!" అన్నట్టు చూసింది మంజరి.
"మనవాడేలె మంజరీ! ముందు మీరు పదండి! పడి నిముషాల్లో వస్తాను."
చలపతి తనతో రాదనీ మంజరికి రూఢయిపోయింది. ఆవిడకెందుకో కొద్దిగా భయంకూడా వేసింది" ఒకసారి తను, ఆసామివెంట చిన్న కార్లో కూచుని పత్తిపాడుదాకా వెళ్ళింది....
-మంజరి తిరిగొచ్చేసరికి పక్కా రెండు గంటలయింది. ముఖం నిండా అక్కడక్కడా రంగు మరకలున్నాయి.
"ఇక వెడదాం!" అన్నది మంజరి., ఆవిడంట ఉత్సాహంగాలేదు.
"ఎందుకని" చలపతి అడగనూ లేదు మంజరి చెప్పానూలేదు. ఈ సోదంతా ఎవరితో నన్నాచెప్పకుందామని ఆవిడ హృదయం ఆరాటపడిపోయింది. ఆ క్షణాన "తన మనిషి" అని చెప్పుకో దగ్గ వారెవరూ మంజరికి కనిపించలేదు.
మూడోరోజుకు రిజల్టు తెలిశాయి. చావు కబురు చల్లగా అందించాడు అసిస్టెంట్. మంజరి కుప్పకూలిపోయింది.
"అప్పటికి నేను ఒకటికి పదిసార్లు చెప్పానండీ! "సరే, సరే" నంటూ వనే కెమెరామేన్ కొంప ముంచెశాడు., సౌండ్ ఇంజనీర్ వాడికి వంట పాటపాడాడు. ఇహ నేను చయ్యగలిగిందేమీ లేదు మీరేమన్నా మంజరికూడా చూసింది. అందులో ఉన్నది తనబొమ్మేగాని తనకూ, ఆ బోమ్మాకూ మద్య ఎక్కడా పోలికేలేదు, అంత వికృతంగా తన ముఖం ఉండటమే నిజమయితే తను సినిమాకు గాదుగదా ఎందుకూ పనికిరాదు. ఉండవలసినంత అసహ్యంగానూ ఉన్నదా బొమ్మ.
"సరేలే బ్రదర్. వాళ్ళను నేనొకసారి కలిసి చూస్తాను " అన్నాడు చలపతి అంతే అసిస్టెంట్ ను ఇక పోమ్మని అర్ధం.
అతను వెళ్ళాక చలపతి సన్నగా నవ్వాడు.
"నువ్వేమీ దిగులుపడకు మంజరీ! ఇలా జరుగుతుందని ముందుగానే తెలుసు..... వాళ్ళకేదో కావాలి. అందుకోసం ఏడుస్తున్నారు. ఎంత అందమయిన వాళ్ళనైనా అసహ్యంగా గ్రాప్ చేసి, కంఠం భాగులేదని పిస్తాడు సౌండ్ ఇంజనీర్. వీళ్ళిద్దరి దయాలేకపోతే,ప్రోడ్యూసర్ కాదుగదా,వాణ్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా ఏమీ చెయ్యలేడు. అదీ కీలకం. నేనోసారి వాళ్ళ దగ్గర కెళ్ళేస్తాను. మన దగ్గర డబ్బుమైనా ఉన్నాదా?" అన్నాడు చలపతి.
"అఁ"
"రెండొందలివ్వు"
చలపతికున్న ఆత్మవిశ్వాసం మంజరికి లేదు. ఈ ఘట్టంలో తనకు విజయం తప్పదని చలపతి గట్టిగా తెలుసు. అతను చాలా ఉత్సాహంగా వారిని కలుసుకోని మాట్లాడాడు.
"అదృష్టవశాత్తూ మీరిద్దరూ ఒక్కచోటనే కనిపించారు" అంటూ ప్రారంబించాడు చలపతి. "ఈ రోజుల్లో మనిషి మాటలకు బొత్తిగా విలువలేకుండా పోయింది. బ్రదర్. ఎప్పుడో రావలసిన డబ్బు ఇవాలే చేతికందింది రేపు నా పిక్చరుకు మీరు పనిచేస్తే చేశారు. లేకపోతే లేదు. అందుకోసం నేనేమీ ఉచ్చుపన్నడంలేదు. మీకు అభ్యంతరం లేకపోతే, ఇవ్వాళ మీకో చిన్న పార్టీ యిద్దామనివుంజి మా మంజిరి ఇస్తున్నదనుకోండి, పెద్ద అట్టాహాసమేమీ లేదు. వెరీ సింపుల్! అందరం హౌటల్లో కలుసుకొందాం. ప్రోగ్రాంను ఛేంజ్ చేయ్యకండి!"
ఇంత గట్టిగానూ చెప్పిన చలపతి ఆ సమయానికి అయిపూ ఆనమాలూ లేకుండాపోయాడు. తను ఏమాత్రం వీలున్నా హౌటలు కోస్తాననీ, తను రాలేదన్న కారణంతో పార్టీని, కాన్సిల్ చేయ్యవద్దనీ, బిల్లును నువ్వే చేల్లించమనీ మంజిరికి పదే పదే చెప్పాడు.
"పోనీ మీరు కూడా ఉండరాదా?" అన్నది మంజిరి.
చలపతి తారా మండలానికి లేచాడు.
"నువ్వు దద్దమ్మవని పదే పదే రుజువు చేసుకోకు మంజరీ! నేను ఉండటానికేం ఉంటాను. కానీ అందువల్ల వరిగిందేమీ లేదు. నేను లేకపోవడమే మంచిది. ఆమాత్రం తెలీనివాణ్ని కాదుగదా నేను.... పిక్చరుకు వేంకటేశ్వర్లు లంటి ప్రొడ్యూసర్లుతో చనువుగా ఉండటం ఎంత అవసరమో, వీళ్ళతో ఉండటమూ అంతే అవసరం. నువ్వు మరీ అమాయకంగా కనిపించాలని చూడకు. మనుషుల్ని అంచనా వేయడంతో, సాధారణంగా నేను పోరపడను. నా తృప్తికోసం, నువ్వుపాకులాడకు. నీ అభివృద్దికి చేయూత నిచ్చేవాళ్ళున్నారు. ముందువారితో మంచిగా వుండు.... యిదంతా నీకోసమే గాని, నాకోసం గాదు ."
అనుకొన్న వేళకు అందరూ హౌటల్లో కలుసుకొన్నారు. మంజరి యింటికి తిరిగి వచ్చేసరికి, తెల్లావారుఝామున మూడుగంటలైంది. లోగడకన్నా ఈసారి ఆవిడ పుచ్చుకొన్న మోతాదు కొంచెం ఎక్కువే అయినా, ఇంటికొచ్చి వాంతి చేసుకోలేదు. చలపతి నిద్రకళ్ళతో తలుపుతీసి, తిరిగి ముసుగు పెట్టుకు నిద్రపోయాడు. మంజరి కాలి జోళ్ళన్నా తియ్యకుండా, మంచంమీద ముడుచుకు పడుకుని, పదినిమాషాల్లో నిద్రపోయింది.
-ఆ మొన్నాడు రాజమణికి ఉత్తరం రాసింది మంజరి. అప్పటికే చలపతి ఆ శుభావార్తను కూడా తీసుకోచ్చాడు. తన ఫోటోలు చాలా అందంగా వున్నాయనీ, తన ముఖం స్క్రీన్ కూ బాగా నచ్చుతుందనీ, తన గొంతు మెలోడియస్ గా వున్నదనీ,సమస్తరసాలను తనగొంతు వోప్పిస్తుందనీ, వాళ్ళిద్దరూ ప్రోడ్యూసర్లుకూ రికమండ్ చేశారట.
"ఇప్పుడే బండి కదిలింది, ఇక గానీస్పీడ్ అందుకోదు" అన్నాడు చలపతి. ప్రొడ్యూసర్ తో మాట్లాడాను. ఆయన నీకో వేషం ఇవ్వడం ఖాయం. పనిలో పనిగా రావుగార్ని, వారి ప్.యస్ నూ చూసోచ్చాను.ఆయన మన పిక్చర్ కోసం ఎదురు చూస్తున్నాడు. పోరపాటునైనా నువ్వు మాటజారకు. వేంకటేశ్వర్లు గారు ఏ నిమిషానికైనా రావచ్చునని చెపుతూవుండు అంతకుమించి మాట్లాడకు.... పోతే కవి గార్ని దర్శించుకొచ్చాను, నీ కారెక్టరుకు రవ్వంత ప్రామినెన్నను ఉండేలాగా చూడమన్నాను. ఇంపార్టెంట్ సీన్సులో నువ్వుండటమే కాదు. నీకు పడి దైలాగ్సూ వుండాలి. పిక్చర్ మొత్తంమీద నాలుగైదు చోట్లన్నా, నువ్వు క్లోజప్ లో కనపడాలి. కెమెరా మన్ తో నువ్వోసారి చెప్పిచూడు. నేనూ జ్ఞాపకం చేస్తాను..... ఆహుసా ఎల్లుండి సెట్ లో నువ్వుండాలను కొంటాను. రావుగారూ ఉంటారు. ఆయన అసాధ్యుడు చాలా పలుకుబడి గలిగినవాడు. అలాంటివారి అండ దండలు మనబోటి చిన్నవాళ్ళకు అవసరం. ఆయన తలుచుకొంటే, నిన్నేమైనా చేయగలడు. ఇహా- తలచుకొంటాడు. లేదా అనేది కేవలమూ నీ మీదనే ఆదారపడి వుంది ."
మంజరిలో ప్రతీకణం, ఉద్వేగంతో నిండిపోయింది. తను చాలా కాలం నుండి అదురు చూస్తున్న ఫలితం ఈ నాటికిగానీ చేతి కందలేదు. దీని క్కారణంగా ప్రధానంగా చలపతే! అనేక సందర్బాల్లో తను చలపతిని అసహ్యించుకొంది. మనిషిని తిట్టకూడని తిట్ట్లుకూడా తిట్టింది. మానసికంగా చాలా వ్యధ చెందింది, ఒక దశలో చెప్పా చెయ్యకుండా రాజమణి దగ్గారకు వెళ్ళిపోదామనికూడా అనుకొంది. కానీ అన్నింటిని వోర్పుతో భరిస్తూ వచ్చింది. చలపతి తనకన్నా వోపిగ్గా కష్టపడ్డాడు. ఈ పరిశ్రమలో తనకోస్థానం సంపాదించి పెట్టాడు. తను ఏమీచ్చినా యీ రుణం తీరదు. మంజరి హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది.
"నాకోసం మీరుపడిన శ్రమకు విలువలేదు మేష్టారూ! రాతిని ఎచ్చి రత్నాల సరసన వుంచారు. ఈ రుణం నేనెలా తీర్చుకోవాలో తెలీకుండా వుంది" అన్నది మంజరి.
ఏమిస్తానంటావ్?" అన్నాడు చలపతి నవ్వూతూ.
మంజరి లేచి, అతని మేడచుట్టూ చేతులు పొదివి కావలించుకోన్నది.
"ఇవ్వడానికి నాదగ్గర మేమీ లేదు నేనేమీదాన్ని. ఇంతకన్నా గొప్పదేదయినా భగవంతుడు నాకిస్తే దాన్ని మనస్పూర్తిగా అర్పిస్తాను....." అన్నది మంజరి అర్దనయనాలతో.
ఆక్షాణాన మంజరిలో క్షుద్రమైన ఉద్రేకాలేవీ లేవు. అనేక సంవత్సరాల తరువాత, ఏ మాయపోరలూ కప్పని అంతర్యంనుండి ఆ మాటలు వెలువడ్డాయి. నిజంగా భగవంతుడే కనిపించి లోకోత్తర మైనా వరమేదైనా మంజరికిచ్చి వుంటే, ఆవిడ హృదయపూర్వకంగా దాన్ని చలపతి పాదాంకింత చేసి వుండేది. వివిధ ప్రభావాలకు అతీతంగా, నిజమైన మనిషిగా మంజరి కొన్ని క్షణాలాపాటు జీవించింది.
11
డైరెక్టర్ చెప్పావలసినవన్నీ చెప్పాడు. అంతకు ముందే అసిస్టెంట్ అనవలసిన రెండు దైలాగులూ పాతికసార్లన్నా అనిపించింది ఉంటాడు. ఈలోగా చలపతి. ఆవిడకు ధైర్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నాడు. "రెడీ" అన్న కేకా, ఆ వెంటనే, భాతనేత్రాల్లాంటి లైట్లు వెలగడమూ ఒక్కసారే జరిగాయి, "సైలెన్స్ "అని అసిస్టెంట్ నీరసంగా అరిచాడు. పాప అతనికి గత రెండు మాసాలనుండి జీతం అందనేలేదట! అతని గొడవ అతనిదీ!
మంజరి కొద్దిగా వణికిపోయిన మాట నిజమే! ఆ క్షణాన ఆవిడకు ఎన్నో విషయాలు జ్ఞాపకమొచ్చాయి. అదీగాక, తనచుట్టూ చాలా మండి హేమా హేమీలు నిలబడి ఉన్నారు. తను ఏం చెయ్యభోయి,ఏం చేస్తే ఎవరేమంటారో నన్న భయం, అవిణ్ను కంపించేసింది. దీంతో ఆషాట్ సరిగ్గా రాలేదు.
"రీటేక్" అన్నాడు దర్శకుడు.
మంజరి కదేమితో బోధపళ్ళేదు.
చలపతి దగ్గరకొచ్చి, మేల్లాగా నువ్వు చాలాబాగా చీసావు మంజరీ. ఇంతకన్నా భాగా చేయడానికి అవకాశముందేమో డైరెక్టర్ గారు చూడాలనుకొంటున్నారు. ఇప్పుడు చేసినపనే మళ్ళీ తీస్తారా. ఈసారి నిర్బయంగా ఉండు. డైలాగ్ స్పష్టంగా అను. డైరెక్టర్ ఎక్కాడదాకా రమ్మంటే, అంతవరకే రావాలి. సరేనా!" అని దువ్వి వెళ్ళిపోయాడు.
మళ్ళీ లైట్లు వెలిగాయి. మళ్ళీ రెడీ అన్నకేకా, సైలెన్స్ అన్న నీరసపు అరుపూ, కెమెరా కదలడమూ అంతా మామూలే ! రెండుమూడు నిమిషాల తరువాత, "ఓకే" అని డైరెక్టరన్నాడు ఉత్సాహంగా. చలపతి ఆవిణ్ణి ప్రక్కకు తీసుకుపోయాడు. అతను ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు.
"ఇహ మనం పోదామా?" అన్నది మంజరి.
"అప్పుడే ! నువ్వింకా హీరోతో మాట్లాడనేలేదు. ఇంకాస్సేపు వుండాలి" అన్నాడు చలపతి.
ఇందాకణ్నించి తనను వేదిస్తున్న సందేహాన్ని కాస్తా బయటపెట్టింది మంజరి.
"ఒకేరకం డైలాగులు రెండుసార్లెందుకు తీసారండీ!" అన్నాదావిడ.
"ఇంకా నువ్వునయం. ఒక్కో ఆర్టిస్టు, ఇరవై షాట్స్ దాకా తీసుకొంటారు. ఇవన్నీ ఉంచరు. ఇందులో ఏది బాగా ఉంటేదాన్నే ఉంచుతారు. మిగతవన్నీ అవతల పారేస్తారు.... పిక్చరంతా ఇలా ముక్కల కిందనే తాయారవుతుంది."
డైరెక్టర్ కాలుగాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ప్రోడ్యూసర్ నిప్పులుతొక్కిన కోతిలాగా చిందులు తొక్కుతున్నాడు. ఇవ్వక ఇచ్చిన ఒక్క కాల్ షీట్ లోనూ మూడో వంతు ఇప్పటికే అయిపోయింది. ఇంతవరకూ హిరోరాలేదు. ఆయన గారి రాకకోసం. జగజెట్టీ లందరూ ఎదురుచూస్తున్నారు.
"ఏమిటి బ్రదర్ వ్యవహారం " అన్నాడు చలపతి అసిస్టెంట్ తో ఇద్దరూ కలిసి, చాటుకు వచ్చారు.
"ఈ లైన్లో పని చేయ్యటం కన్నా అడుక్కు తినటం మంచిదయ్యా బాబూ! ఇంతవరకూ హిరోరాలేదు. ఎందుకనీ గట్టిగా అడిగే ధైర్యం మాకులేదు. అడిగితే - అసలు కాల్ షీట్స్ ఇవ్వాడేమో నని మా భయం! అదీగాక - మనం మాత్రం, ఖచ్చితంగా ఆయనకు డబ్బిచ్చి చచ్చిందేముందీ ? మా ప్రొడ్యూసర్ డబ్బుకోసం తిప్పాతాడు,. వాళ్ళేమో,. ఇట్లా ఏడిపిస్తారు. ఏం చచ్చెట్లు ?" అన్నాడు అసిస్టెంట్.
గంట తరువాత గానీ, హీరో రావుగారు రాలేదు. ఆయనగారు మేకప్ చేయించుకోరు. అల చేయించుకోవడం చిన్నతనంగా కూడా వారు భావిస్తారు.
రావుగార్ని చూస్తూనే అందరి ముఖాలూ నవ్వులతో విప్పారాయి. డైరెక్టర్ ఎదురుగా వెళ్ళి, సాదరంగా ఆయన్ను కార్లోంచి దింపారు.
"మన్నించాలి. కాస్త ఆలస్యంమైంది" అన్నారు రావుగారు.
"ఏమిటండి మీదంతా చాదస్తం? ఏమిటిట ఆలస్యమైతే ! మరేం ఫర్వాలేదు. మీరుకాస్త రెస్టు తీసుకోండి. నేమ్మదిగా చూదాం..... ఈలోగా అసిస్టెంట్ మీకు....." అన్నాడు డైరెక్టర్.
"నమస్కారం సార్! ఇంతకుముందే మావాడు బాంకులో కాష్ కట్టి వచ్చాడు. మీచేక్ ను సబ మీట్ చేయండిసార్ అసలు నిన్ననే నాకు అందాలిసింది. కాస్త ఆలస్యమయింది." అన్నాడు ప్రోడ్యూసరు.
మంజరి ఇవన్నీ చూస్తూ విస్తుపోయింది. క్షణాలమీద మనుషులేలా మారిపోతారో, ఎంత చిత్రంగా మాట్లాడుతారో, ఆవిడ కనుభవంలోకి వచ్చింది.
మరోసారి ఇంకో దృశ్యాన్నికూడా మంజరి చూసింది. ఈ పిక్చర్ లోనే 'భారతి' అని ఓ అరిస్తూ పనిచేస్తూ ఉంది. ఆవిడ సెకండ్ హీరోయిన్, ఆవిడకు ఇడ్డిన్లు తీనటమంటే ఇష్టం అవి పడితేగానీ, మూడ్స్ రావుట. రాత్రి ఒంటిగంట దాటింది."భారతి" ఇడ్డిన్లు కావాలని అడిగింది. "ఇదిగో పంపిస్తూన్నా"నన్నాడు అసిస్టెంట్. ఆవిడ ఎదురుగానే ఒక మనిషిని కారిచ్చి పంపించాడు కూడా. ఈలోగా భారతి తో రెండు మూడు షాట్స్ తీశాడు డైరెక్టరు. షాట్ కూ షాట్ కూ మద్య, ఆవిడ ఇడ్డిన్లని గోల పేడుతూనే ఉన్నది. అసిస్టెంట్ "ఇదిగో అదిగో" అంటూనే ఉన్నాడు. తెల్లవారుఝాము నాలుగైంది ఇడ్డిన్లు రాలేదుగానీ, సీన్ లో ఆవిడ వసంతా పూర్తయింది. మొత్తానికి భలే అసాధ్యూడివయ్యా నువ్వు. నన్ను పస్తుంచి పనిచేయించుకోన్నావ్." అన్నది భారతి నవ్వుతూ.
ఇంకోసారి "విమల" ఒక గమత్తు ఇన్సిడెంట్ చెప్పింది. ఆవిడకు అయిదొందలు రావాలట. ఎన్నిసార్లడిగినా, తనతో పని తీరి తీరిపోయింది. గనక ఇక తనకా దేఅబ్బు రాదని కూడా అనుకొన్నదిట. కానీ, చివరి నిమిషంలో కధలో చేసిన మార్పుల ఫలితంగా, తనతో మళ్ళా అవసరం కలిగిందట అప్పుడు డబ్బంతా ముందుగా ఇస్తేగాని రంగు వేసుకోనన్నదిట, నిల్చున్న ఫళంగా కారు మీద అవిన్ను స్టూడియోకు పట్టుకొచ్చారట. ఆపూట పనేదో అయిపోయింది. అమొన్నాడు భాంకుకెళ్ళి చెక్కు సబ్ మీట్ చేస్తే అందులో నూటపాతిక రూపాయల కన్నా ఎక్కువలేవుట తను ఏడుస్తూ ఇంటికోచ్చానన్నది విమల.
"నివ్వెం దుకూరుకున్నావమ్మా! నాలుగూ దులిపెయ్క్ పోయ్యావా?" అన్నది మంజరీ కోపంగా.
విమల నీరసంగా నవ్వింది.
"ఇక్కడి గొడవలు నీ కింకా పూర్తిగా తెలీవు అక్కయ్యా! ఫలానా కంపెనీ డబ్బివ్వలేదని, మనం పైకి చేప్పుకోవడానిక్కూడా లేదు మనలాంటి చిన్న ఆర్టిస్టుల గోడు ఎవరీకి పట్టదు. గట్టిగా అడిగితే ట్రబుల్ సమ్ ఆర్టిష్టుంటారు. ఆ పేరు పడ్డాక మనకసలు వేషమే దొరకదు. అడక్కుపోతే డబ్బివ్వరు" అన్నది విమల.
"దేని కేమిటి మందు?" అన్నది మంజరి.
"ఏంలేదు ఇదింతే!" అన్నది విమలను. సరిజ చాలా కాలం నుండి ఈ ఆఖరనినాకు తెలిసింది మంజరి! పనయ్యాక. చాలా కంపెనీలు డబ్బివ్వవు. అందుకని ఆ పూట ఘాటింగ్ కు రానన్నాను. అసిస్టెంట్ చెక్కు చేతికిచ్చాడు. అదినాకు రావలసిన మొత్తానికి సరిపడా ఉంది. ఇదిగో వస్తున్నాను పాడమని ముంగుదా భాంకు కెళ్ళాను చెక్కు ఇచ్చాను. డేబ్బాయ్ రూపాయలు తక్కువుగా ఉంది. వెంటనే నేను కంపెనీపేరు డేబ్బయ్ రూపాయలు జమవేసి, వెయ్యిరూపాయలూ డ్రా చేశాను. ఆ రోజునే నేనాపని చెయ్యకపోతే., ఆ వెయ్యి రూపాయలూ నాకుదక్కేవిగాదు"అన్నది సరోజ
ఈ ఫిక్చర్ ధర్మమా అంటూ, మంజరి ఇటువంటి లోగుట్టులన్నీ తెలిసి వచ్చాయి. రకరకాల మనుషులతో పరిచయమయింది. వారి అనుభవాలు వింటుంటే, ఒక్కోసారి తల తిరిగిపోతూ ఉండేది. ఎక్ స్ట్రాలాగోడు మరీ అనిమానుషంగా కనిపించింది మంజరికి. వారికి సరిగ్గా డబ్బివ్వరనీ, గౌరవంగా చూడరనీ, వారిలో చాలామంది రోజుకొకపూటైనా సరిగ్గా తినరనీ, ఎక్కువమంది, శరీరనమ్ముకొని బ్రతుకుతుంటారనీ తెలిసి మంజరి ఖేదించింది. తానీ రంగంలో కాస్త కాలూని నిలబడటమే జరిగితే, ఈ పరిస్టితులన్నింటినీ మార్చాలని కూడా అనుకోన్నది.
మంజరి తోలిసారిగా నటించిన ఫిక్చర్ రిలీజయింది.బాగా డబ్బుకూడ చేసుకొంది, అనేకచోట్ల శతదినోత్సవాలు చేసుకొంది. డిస్టిబ్యూటర్ల పెట్టుబడిపోను ప్రోడ్యూసర్ వాతాకింద ఎన్నో లక్షలోచ్చాయని కూడా చలపతి చెప్పాడు. కానీ ఇందువల్ల మంజరికి వరిగిందేమీ లేదు.
తనను గురించిగాని, తన నటనను గురించి గానీ, పత్రికలు ఏమన్నాయోనని మంజరి చాలా ఆత్రంగా వెదికింది. చాలా పత్రికలు మంజరి పేరన్నా ఎత్తలేదు. ఒకటి రెండు మాత్రం ఫలానా ఫలానా వారు ఇందులో నటించారు" అని మాత్రమె అన్నాయి. శతదినోత్సవాలకు మంజరి కోదా పంపడానికి చలపతి విశ్వప్రయత్నాలు చేశాడుగానీ, అవేమీ ఫలించలేదు.
ఈ ఫిక్చరులో నువ్వు తార వధాని కేక్కుతావని నేననుకోలేదు. నువ్వు నలుగురి దృష్టిలోకి వస్తే చాలనుకొన్నాను. అపనేదో బాగానే అయింది. నీకు ఇంకో ఫిక్చర్ లో ఇంతకన్నా మంచివేషం దొరకాలి. అవునిగానీ,మంజరి నీకు డాన్స్ మయినా వచ్చునా?" అన్నాడు చలపతి
"రాదు" అన్నది మంజరి.
"ఫర్వాలేదు.,ఇవ్వాళే పరబ్రహ్మశాస్రీగారి నడిగి మంచి ముహూర్తం పెట్టిస్తాను. నువ్వు డాన్స్లు నేర్చుకో. పనిలో పనిగా అరవం,హింది కూడా నేర్చుకో నీకు బ్రహ్మండమైనా పాండిత్యం అవసరంలేదు, స్పష్టంగా మాట్లాడ్డామూ, ఎదటి వారంనాది అర్ధం కావడామూ, ముఖ్యం. తెలుగు ఫిల్డుకన్నా టామిల్ ఫీల్డు ఎంతోనయం. వాళ్ళ పేమెంట్స్ కూడా చాలా డీసెంటుగా ఉంటాయి.హిందీ సంగతి సరే ననుకో. అదింకో ఐదారేళ్ళకుగానీ, మనం ఆలోచించలేం. కానీ ఇప్పణ్నంచే మనం జాగ్రత్తపడాలి గదా!" అన్నాడు చలపతి.
మంజరికి ఫిక్చర్ వల్ల చిల్లీకానీ ముట్టలేదు. కానీ టాలెంటున్న ఆర్టిస్టుని పేరుమాత్రం పడింది. దీనికితోడు మంజరి అందం చాలామందిని ఆకర్షించింది. మంచి వేషమిస్తే. బాగా రాణిస్తుందని ఒకరిద్దరు అనుకొన్నారు. చలపతిరావుగారి వర్షంతోనూ, మూర్తిగారి వర్గంతోనూ కలుపుగోలు తనంగాఉండి, మంజరికి మంచి ప్రచారం చేయించాడు.
మూర్తిగారుకూడా ప్రివ్యూ రోజున, ఈ ఫిక్చర్ చూశాడు. అప్పుడతని ప్రక్కనే కూచున్న చలపతి మంజరి రాగానే, ఓ ముక్క వదిలి చూశాడు.
"హీరోయిన్ కన్నా, మన కాండిడేట్ బాగుందయ్యా చలపతి! ఇదే ఫస్టుఫిక్చరన్నావు గదూ! అయినా ఫర్వాలేదే! బాగానే చేసిందే!" అన్నాడు మూర్తిగారికి తెలుసు ఇప్పాటి ఆర్టిస్టులతో, ప్రోడ్యూసర్లు యమయాతనలు పడుతున్నారనీ, వారుకొత్త ముఖాలకోసం వెదుకుతున్నారనీ అయినా ఎవరూ సాహాసం చేయలేకే పోతున్నారనీ ఆయనకు తెలుసు.తాగిన అవకాశమిస్తే మంజరి తప్పకుండా రాణిస్తుందనికూడా మూర్తిగారు గ్రహించారు.ఇంతటి శక్తి సామార్ద్యాలున్న మనిషి ఏనాడూ మూలనపడి ఉండడు.
అప్పుడప్పుడు కనిపించవయ్యా బాబూ! ఏదన్నా మంచివేషం దొరికితే అమ్మాయికి చెబుతాను.... అవునుగానీ ఏమిటి రావుగారి కబుర్లు? అయనీ మద్య నన్నుగురించి చాలా అసహ్యంగా మాట్లాతున్నాట్టగా నిజమేనా? అన్నాడు మూర్తి.
"మీరు తెలియందేముంది సార్! నాతోనైతే అనలేదు గానీ, ఆయన స్వభావం మాత్రం అటువంటిదేనంటారండీ! మీకు, రావుకూ పోలికేమిటండీ? అయినా మొన్న రిలీజయిన ఫిక్చర్ లో, అసలు రావుగార్ని ముందు హీరోగా బుక్ చేసారండీ? మనవాడివల్ల కాలేదు డిస్టిబ్యూటర్ కూడా తోక ముదిచేలాగా కనిపించాడు. అప్పుడు కాదుటండీ వాళ్ళు మీ దగ్గరకొచ్చిందీ!" అన్నాడు చలపతి.
"అవునవును ఆ, సంగతి నాకూ తెలుసు అందుకే గదిఎదుటే దులిపిపారేశాం ఆ ఫిక్చర్ లో నేనో కొత్త మేనేరిజం ఇంట్రోడ్యూస్ చేశాను, జనానికి అది బాగా పట్టింది, ఇప్పుడు ఎక్కాడచూసినా ఆగోడవే!" అన్నాడు మూర్తిగారు.
"చిత్తం.,చిత్తం! ఆ ముక్క నాకెప్పుడో తెలుసునండీ!" అన్నాడు చలపతి.
నాలుగైదు రోజుల తరువాత, మూర్తి గారో పెద్ద సినిమా కంపెనీకి ఫోనుచేసి మంజరి విషయం చెప్పారు.
"మీరు చూశారోలేదోగాని, చాలా ఫ్యూచరున్న ఆర్టిస్టు నేను నిన్ననే చూశాను, మంచి వేషమిస్తే వేషమిస్తే బ్రహ్మండంగా రాణిస్తుంది. ఏ ప్రోడ్యూసరో అమాంతం ఆవిడరేటు పెంచేసిన తరువాత,, మిగతా వాళ్ళంతా వెర్రిమొఖాలు వేస్తారు. మీరో పనిచేయండి ఏకంగా మూడు సంవత్సరాలకు, ఆవిడతో ఓ ఎగ్రిమెంటు కుదుర్చుకొండి. మీరు చూస్తానంటే. ఆర్టిస్టును మీ ఆఫీసుకు పంపుతాను....."
వ్యాపార దక్షతకలిగిన ఆ కంపెనీ యజమానులు. మంజరిని పిలిపించి చూశారు. అవిణ్నుపంపివేశాక, చలపతి తో ఎగ్రిమెంటును గురించి ప్రస్తావించారు.
"మూడేళ్ళపాటు మాకంపేనీలో ఉంటుంది. ఈ పీరీడ్ లో మా ఫిక్చార్ర్లన్నింటిలోనూ, మేనిచ్చిన వేషం వేయాలి. అవసరమైనప్పుడు. కంపెనీయే కారు పంపుతుంది. దీనికి నీ కిష్టమేనా!" అన్నారు కంపెనీవారు.
చలపతి నీళ్ళు నమిలాడు.
"మీరిచ్చిన వేషమంటున్నార్ సార్.... మరీ చిన్న చిన్న వేషలయితే ఆ అమ్మాయి పైకిరావడం కష్టం గదా సార్? అయినా నాదేముంది సార్! ఆ మేను గూడా అడుగుతాను. ఈ సాయంత్రానికల్లా ఏ సంగతీ మీకు చేబుతాన్ సార్!" అన్నాడు చలపతి.
ఇంటికోచ్చాక మంజరితావు సంప్రదించాడు చలపతి.
"నాదేముండండీ! మీ కేదిష్టమైతే నాకు అదే ఇష్టం!"
అసలే ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నాడేమో మంజరి సమాధానం మరింత చిరెత్తుకొచ్చింది.
"నా ఇష్టమే నీ ఇష్టంగానీ, నీకు స్వంత ఇష్టాలంతూ ఏమీ లేవన్నమాట!" అన్నాడు చలపతి చాలా సీదాగా.
మంజరి పలకలేదు. చలపతి కోపంగా ఉన్నాడని తెలుసుకొంది. ఏమంటే ఏం కొంప మునుగుతుందో తెలీనప్పుడు, అసలేమీ అనకపోవడమే మంచిదని మంజరి ఉద్దేశం.
"మాట్లాడమేమీటోయ్?" అన్నాడు చలపతి.
ఈ సారి మంజరికి కొద్దిగా కోపమా, రవ్వంత భయమూ కలిగాయి.
ఈ పూట మీ మనస్సేమీ బావున్నట్లులేదు. సాయంత్రంలోగా మనమేదో వొకటిచేద్దాం ముందు మీరు స్నానం చేయండి, ఈలోగా నేను ఇద్దరీకీ అన్నం వడ్డించేస్తాను. మనం కలిపి భోంచేసి ఎన్ని రోజులయిందో! తాయారూ! అయ్య స్నానానికోస్తున్నాడు. గంగాళంలో నీళ్ళు తొలిపిఉంచు" అంటూనే అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
అసలు సమస్యనుండి తన్ను తప్పించడానికి మంజరి ప్రయత్నిస్తున్నదిని, చలపతి తెలుసు. అతనావిషయాన్ని అప్పటికి ఎత్తకుండా భోజనానంతరం కదిపాడు.
"మీ ఉద్దేశ్యం చెప్పండి! తరువాత నా విషయం చెబుతాను అన్నది మంజరి. తమలపాకులకు సున్నం రాస్తూ."
చలపతి సిగరేట్ ముట్టించి గట్టిగా పోగపిల్చీ, మంజరి మీదికి వదిలాడు.
"అబ్బా! ఉండండిబాబూ! నాకీ పాడు సిగరెట్లంటే అసలే పాడదు " అన్నది మంజరి.
చిటికవేసి, సిగరేట్ నిసి రాల్చుతూ చలపతి తన అభిప్రాయము చెప్పుకొచ్చాడు.
"జయా ఫిలింస్ వారు ఈ రంగంలో అరితేరిన ఘటికులు మట్టి నుండి మాణిక్యాలను పుట్టించటం ఎలాగో ఒక్క వారికే తెలుసు. నీకు మూడేళ్ళ ఎగ్రిమెంట్ ఇస్తున్నారంటే. అందుకు వింజుమలె, వారు నీకు చెల్లించేది. నేలకు వెయ్యి చొప్పున ఏడాదికి, పన్నెండు వేలున్నా, పన్నెండును మూడు పెట్టి హేచ్చిస్తే - పన్నెండు మూళ్ళు ముప్పైయారు వేలును. అంటే - మూడేళ్ళకు కలిపి వాళ్ళు నీకిచ్చే ముప్పెయ్యారు వేలు. వాల్లాకు,బ్రహండమైన స్టూడియో ఉన్నది ఒకేసారి అయిదు ఫిక్చర్లు ఘాట్ చెయ్యొచ్చు. తలుచుకొంటే మూడు మసాలకో ఫిక్చర్ చొప్పున మూడేళ్ళలోనూ పన్నెండు సినిమాలను లాగి అవతల పారేయగలరు. అందుగ్గాను నీకు గిట్టీది సినిమా కు మూడువేలు. ఇదేమిటండి రేటు కాదు కాబట్టి ఆ కంపెనీలో నువ్వు చేరడం భావ్యంగా నాకుతోచలేదు" అన్నాడు చలపతి.
"వాళ్ళు ఏడాదికి నాలుగు ఫిక్చర్లూ తియ్యకపోవచ్చుగా!"
"నిజమే! అలాంటి ఉద్దేశమేదో వారికి లేకపోతే. నీమీద ఇంతడబ్బు ఖర్చు చెయ్యడానికి వాళ్ళు దద్దమ్మలుకాదు. భగవంతుడి దయవల్ల నీకు మంచి వేషం దొరకాలేగానీ రెండో ఫిక్చర్ లోనే నివ్వు పాతికవేలను డిమాండ్ చెయ్యేచ్చు నువ్వాసంగతి ఆలోచిచావెం?" అన్నది మంజరి.
"అలాక్కాదు, ఏదో నా సంతృప్తికోసం నువ్వామాట అన్నావు గానీ, అది నీ అసలు అభిప్రాయం కానేకాదు. నీకా కంపెనీలో చేరాలనీ లోలోపల ఉంది. అది బయటపెడితే., నేను నొచ్చుకొంటానేమోనని నువ్వు దాస్తున్నావు అవునా?" అన్నాడు చలపతి.
మంజరి నవ్వి అతని చెంపలు నిమిరి మెటికలు విరిచుకోంది. ఎనిమిది వేళ్ళూ, కిటకిటమని విరిగాయి.
"మీరు దేవాంతకులండీ బాబూ! మనుషుల కడుపులోదూరి ఆలోచనలు తెలుసుకొంటారు. భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను. నా ఉద్దేశం అదే!" అన్నది మంజరి.
"అవునా ! మరి - అందుకు నువ్వు చెప్పేకారాణాలేమీటీ- అని?"
"మూడేళ్ళపాటు, డబ్బుకు లోటుండదు, వేషాలకోసం వెదుక్కోనక్కరలేదు, నామీద అంతడబ్బు పెడుతున్న వాళ్ళు, నాకో చిన్నదీ చితకడీ వేషమివ్వరు. నానుంచి నాలుగు డబ్బులు పిండుకోవాలనే చూస్తారుగదా! జటా ఫిలింస్ పేరు పొందిన కన్సరన్ అని మీరే చెప్పారు"
