Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 25

"పోండి బాబూ! మీరేప్పుడూ- వస్తారుగా ! మీకోసం ఎదురు చూస్తుంటాను.... సినిమా చూసి ఎన్నిరోజులయిందో.... మంచి పిక్చర్ కేడదాం "
"ఓ, కె." అని కేకేశాడు వెంకటేశ్వర్లు.
అతను వెళ్ళిపోయాక, తలపట్టుకొని కూర్చిలో చేరదిలపడి పోయింది మంజరి.
వెంకటేశ్వర్లు అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఆ సాయంత్రం కాదు గానీ, అమొన్నాడు అతను రెండు వేల రూపాయలూ పట్టుకొచ్చి మంజరి చేతికిచ్చాడు. మంజరి ఆశ్చర్యపోయిండనడం చాలాదిక్కడ. ఆ క్షాణాన వెంకటేశ్వర్లుపట్ల ఆమెకు జాలికూడా కలిగింది. తమమీద ఎంత ఆపేక్ష లేనిదే, రెండువేలు తెచ్చి తన చేతుల్లో పోస్తాడు? తనంటే పడీచచ్చేవాడికి తానేమిస్తున్నదిట ? అందం సంగతి సరే సరి! ఒకప్పటి శరీరం, అయిదుకూ పడికీ కూడా అమ్ముడు పోయంది. మంజరి కనుకొలకుల్లో సన్నగా నీటి జీరలు ఏర్పడ్డాయి.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అన్నాడు వెంకటేశ్వర్లు, వెళ్ళకున్న ఉంగారాలను సరిగ్గా తిప్పుకుంటూ.
ఏంలేదు..... మీకెలా కృతజ్ఞత చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.
ఈ మాట మనస్పూ ర్తిగానే అన్నది మంజరి.
"ఈ పద్దతి నేను చెబుతాను!" అంటూ కాలుస్తున్న సిగిరేట్టుని దూరంగా గిరాటేట్టి దగ్గరగా వచాడు వెంకటేశ్వర్లు.
మంజరి అలానే నిలబడింది.
అతని మంజరిని మెత్తగా ముద్దు పెట్టుకొని "నేనో మాట అంటాను. నేవ్వేమీ అనుకోనంటే చెబుదామని వుంది..... మరి చెప్పనా ?" అన్నాడు.
మంజరి చెప్పమన్నట్టు తలూపింది ఆవిడ చేతిలో, ఇరవై వందరూపాయలనోట్లుయింకా ఫెళ ఫెళ లాడుతూనే వున్నాయి.
"మనం హంపీ పోదామనుకొన్నాం గదూ? ఆనాటికి మీ చేల్లెల్ల్ని కూడా రమ్మను.ముగ్గురం కలిసి వెడదాం. బ్రహ్మాండంగా అక్కడ ఎంజాయ్ చేయ్యేచ్చు.... నీ కేమన్నా అభ్యంతరమా? అసూయగానీ పడుతున్నావా?"
అంతవరకూ, అతనిపట్ల వున్న సదభిప్రాయం కాస్తా ఈ వాక్యాలతో సమూలంగా త౫ఉదిచి పెట్టుకుపోవడమే కాకుండా, వెంకటేశ్వర్లు మీద చెప్పరానంత అసహ్యంకూడా వేసింది ఆ నోట్లు అతని ముఖాన గిరాటేట్టి, మెడమీద చెయ్యివేసి వీధిలోకి పడనేట్టాలనిపించింది. అంతలోనే వెంకటేశ్వర్లు పగలపడి నవ్వాడు.
"మీ ఆడవాళ్ళలో వున్న రోగమే ఇది! ఏమున్నా ఏం లేకపోయినా చచ్చినంత అసూయమాత్రం వుంటుంది..... అవునుగానీ, మీచేల్లెలి పేరేమిటన్నావ్?"
"వసంత" అన్నది మంజరి.
" పేరు బాగానే వుంది.... మరి- మనిషి ఎలా వుంటుందో తెలీదు.... నీలాగానే వుంటే వెరీగుడ్.... అదయినా నువ్వోప్పుకుంటేనే సుమా!" అన్నాడు వెంకటేశ్వర్లు.
మంజరి ముభావంగా వుండటం చూసి, ఆమెను కన్వీన్స్ చెయ్యడానికి  ప్రయత్నాలు ప్రారంభించాడు.
"మనం ఎంతకాలం బతుకుతామో మనకే తెలీదుమంజరి! ఉన్న నాలుగు రోజులూ పైలాపచ్చీసుగా వుండాలి. దిక్కుమాలిన కుశంకలన్నీ పెట్టుకొని జీవితంలోని కాస్త సుఖాన్ని వదులుకోవడం నాకిష్టం లేదు... నా మట్టుకు నాకు వెరైటీ కావాలి. గాని గెద్దులాగా నేను వసంతకు పంపించు. ఆవిణ్ణి అక్కడ పనులు సర్దుకొని రమ్మను. మనతోబాటే వుంటుంది. మన పిక్చర్ లోనే ఆవిడకూ ఓ చిన్న వేషం ఇద్దాం"
"అలాగే!" అన్నది మంజరి.
వెంకటేశ్వర్లు ఇదే పంపిణీమీద ఇంకో అరగంటసేపు వాగి వాగి వెళ్ళిపోయాడు,
మజారి కుర్చీలోనే జారగిలపడి కళ్ళు మూసుకోన్నది.
                                              *                *               *                 *                                          
రెండు మూడురోజులు చలపతి, మాంఛీ కధకోసం గాలించిన మాట నిజమే! కానీ అతనికి నచ్చిన కధంటూ ఏదీ కనిపించలేదు. మంచిదానికోసం చూస్తున్నామని, అటువంటిదేమీ దొరక్కపోతే శ్రీ కాంత్కధనే స్క్రీన్ చేస్తామనీ,ఫోక్ లోర్ తీయాలనే అనుకొన్నప్పటికి సోషల్ కూడా మరీ అంత తీసికట్టు కాదనీ, రెండు మూడు మాసాల్లో పిక్చర్ రిలీజ్ చెయ్యాలనీ చలపతి చాలా మందికి చెప్పుకొచ్చాడు. దీనివల్ల - నావకళా చిత్రాలయవారికి ఇంకా సరైనా కధ రోదకలేదన్నది రూఢాగీ తేలిపోయింది. ఈ విషయం రుజువు చేసుకొన్నాక రఘురామాచార్లు గారు సరాసరిగా నావకళా చిత్రాలయ వారి ఆఫీసుకు పనిమాలావచ్చి తనను టాను పరిచయం చేసుకొన్నాడు.
రఘు రామాచార్లు గారు పేరుమోసిన సినిమా కవి. మూకీల నాటి నుండీ ఆయనగారు యీ పరిశ్రమలో వున్నారు. నూరు.నూట పాతిక చిత్రాలకు కధలు, సంభాషణలు, పాతాలూ రాశారు.సినిమాలో ఏవేవివుండాలో ఏయే పాళ్ళాలో వుండాలో వారికి బాగా తెలుసు,పరమబూటు పాటలూ, అంతకన్నా బూతుసంభాషణలూ వ్రాసి,సెన్సార్ వారి కత్తెరపడకుండా చూడగలిగిన ప్రజ్ఞవంతులాయన. ఆయన పేరు చెబుతే సినీసాహిత్యలోకం మోకరిల్లి తీరవలసిందే! అటువంటి సినిమహాకవి, తమ ఆఫీసు కొచ్చాడంటే మాటలా ?
రామబ్రహ్మంగారు, ఇదివరకే ఆచార్ల వారి పేరు వినివున్నాడు. వారి దర్సనంమాత్రం కాలేదు. ఆమాటే అన్నాడు కూడాను.
ఎంతమాట! 'మన' ప్రాంతం నుండి మీరోచ్చారనీ యీ మద్యనే నాకు ఎలిసిమ్ది. చాలా సంతోషించాను. నిన్నా మొన్నా ఇక్కడికి వద్దామనుకొన్నాను గానీ తీరింది కాదు బాబూ! తలనిండా పనులున్నాయి, నేనా- వాళ్ళాలాగా, వీళ్ళాలాగా కుర్ర వెధవలచేత రాయించి, నా పేరు పెట్టుకోను. పార్టి ముక్కా నేను స్వయంగా రాసుకోవాలి. అప్పటి గ్గానీ నాకు తృప్తివుండదు అన్నాడు ఆచార్లు గారు.
రామబ్రహ్మంగారు "ఊఁ " కొడుతున్నాడు.
"ఈ సంగతులన్నీ మీకు తెలీనవి కాదనుకోండి. సినిమా సక్సెస్ కావడమన్నది - కేవలం కధమీదనే ఆధారపడి వుంటుందండీ అదే పునాది. స్టార్ కాస్టు వున్న  పిక్చర్స్ మట్టి గొట్టుకుపోవాడానికి ఇదే కారణం.నేపని చేసిన పిక్చర్లన్నీ ప్రోడ్యూసర్లకు లక్షలు తెచ్చి పెట్టాయి నేను కధకూ, సంభాషణకూ, పాటాలకూ ప్రాముఖ్యమిస్తాను..... మీరా లక్షలు పోసి తియ్యబోతున్నారు- కాస్తలో లోపించకండి. మంచి కధ దొరికిందా గప్ చిప్ మణి పుచ్చుకోండి లేదా"-
"ఓ పిక్చర్ కు మీరేం తీసుకొంటారండీ?" అన్నాడు రామబ్రహ్మంగారు.
"పడి బాబూ! ఆఫీసుకొచ్చినప్పుడల్లా కార్లో పెట్రోలు పోయించాలి. ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలి ముందుగా సగం తీసుకుంటాను. పేపర్ వర్కంతా అయ్యాక, మిగతా సగమా తీసుకొంటాను" అన్నాడు రాఘురామాచార్లుగారు.
రామబ్రహ్మంగారి గుండె గభీలు మన్నది. మావుష్టి మూడు గంటల సేపుండే సినిమా కధకు పదివేలా? పైగా పెట్రోలు ఖర్చులా? మా కంపెనీ అంత భరించలేదులెండి" అన్నాడు రామ బ్రహ్మం చల్లాగా.
"నేనంత యివ్వమనలేదు బాబూ! నా రేటు అడిగారు గనక చెబుతున్నాను మీరు కధకోసం వేడుకుతున్నారని   విని, ఇలా వచ్చాను ఎందుకంటారు? నా కివ్వమని అడిగేందుకు కాదు మీరా కొత్తవారు. కలం పట్టుకోడం వచ్చిన ప్రతివాడు, సినిమాకు రాయమంటూ బయలు దేరుతున్నారు. వాళ్ళు పాతికకు,యాబైకూ కధ లిచ్చేస్తారు. కూడాను, కానీ, మీరా కధమీద గుమ్మారిమ్చే లక్షల మాటేమిటంటున్నాను..... నేను డబ్బు మనిషిని కాదు. భగవంతుడు నాకు తినా, కుదవా ఇచ్చాడు. నాకేదిగులూ లేదు. కానీ మీలాంటి కొత్తవారు. తెలియక ఇందులో పడిపోతూ వుంటే నేను చూస్తూ వూరుకోలేను. ఈ పరిశ్రమ లోకి కొట్టాపెట్టుబడులు రావాలి. కొత్తరకం రావాలి. మీరూ కావాలంటే నా కధ నొకదాన్ని వూరికే యిస్తాను తీసుకోండి. బాగావెళ్ళి నాలుగు డబ్బులోస్తే నాకివ్వడం, నష్ట పోయ్యారనుకొండి- మిమ్మల్ని నేను దమ్మిడి అడగను, నేనీ మాట ఎంత భారవాసామీద అన్నదీ మీరర్డంచేసుకొంటే నాకంతే చాలు" అన్నారు ఆచార్లుగారు.
రామబ్రహ్మంగారికి ఆలోచన భాగా నచ్చింది. ఓ కొత్తవాడి చేత పిక్చర్ కు రాయించుకొని ఎక్స్ పెరిమేంట్ చేయడం కన్నా పేరుప్రతిష్టలున్న ఆచార్లువారి చేతనే పని చేయించుకుంటే పోలా? అందులోనూ ఆయనగారు- సంభాషణలు, పాటలతో సహరేడిగా వున్న స్క్రిప్ట్ యిస్తామంటున్నారు పైగా చిల్లికానీ ఇప్పుడవసవరంలేదంటున్నారు. ఇంతకన్నా తనక్కావలసిందేముందీ?
సంతోషానంతా దాచుకొంటూ రామబ్రహ్మంగారు పొడి దగ్గు దగ్గారు.
"అలాగే బాబుగారు! మీలాంటి వారు. పనిమాలా ఇంత తప్పకుండా కబురు చేస్తాం" అన్నాడు రామబ్రహ్మం.
మీనుంచిమాట తీసుకొన్నాక గానీ,నేను ఇంకొకర్ని గురించి ఆలోచించను అంటూనే రఘు రామాచార్లుగారు వెళ్ళిపోయారు.
ఆచార్లవారి పాచిక అనేక చోట్ల పనిచేసినట్లే రామబ్రహ్మం మీదా పనిచేసింది.అయితే ఆచార్లు వారు పాచిక విసిరనట్టుగా రామబ్రహ్మంగారికి తెలీదు. ఒకప్పుడు - సినిమా  కళా స్తాయి కోల్పోయి, పరిశ్రమ స్టాయిలోకి వచ్చాక. ఆచార్లుగారికి పోటీ ఎదురుయింది. రఘు రామాచార్ల కన్నా బాగా రాయగలిగిన వారు చాలామంది ఈ పరిశ్రమలోకి వచ్చారు. దీంతో లోగడ వారికున్న గిరాకే చాలావరకూ తగ్గిపోయింది. రాతగాళ్ళ మద్య పోటీ నానాటికీ పెరిగిపోసాగింది దీనికి రఘురామాచార్లుగా రొచిట్కాకనిపెట్టి నానా చేఱలూపడి పేరులో కొచ్చిన రచయితలను కూడగట్టుకొన్నారు.కొత్తవారిని రాకుండా చూడటం లక్ష్యంగా పెట్టుకొన్నారు. పోరబాటున ఎక్కడున్నా ఓ కొత్త రచయితలను ఆధారపు దొరికితే, వీరు మళ్ళీ దాన్ని కాస్తా నిర్మూలించి వస్తూవుంటారు.కొత్తవాళ్ళ కిచ్చే డబ్బుకే తనూ రాస్తాననేవాడు. ఎవరికయినా ఏమని పిస్తుంది? పేరు ప్రతిష్టలు లేని రచయితను పెట్టుకోవడం కన్నా అదే రేటుకు రాస్తానంటున్న పాత రచయితను పెట్టుకోడం మంచిదని పిస్తుంది. దీంతో కొత్తవాడికి స్టానమే లేకుండా పోతుంది. ఈ విధంగా రఘురామాచ్రలుగారు నేట్టుకోస్తున్నారు. అదీగాక - ఆయనకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గరా, నటీనటుల చేతా దిస్త్రుబ్యూటర్ల చేతా ప్రోడ్యూసర్లకు చేర్పించేవారు. వీరిమనసులు నొప్పించడం యిష్టంలేకా, ఇష్టంమున్నా వొప్పించి సినిమా తీయడం అసాద్యమనీ గ్రహింపుకొచ్చీ, చాలా కంపెనీలు వీరిచేతనే తమ సినిమాలకు మాటాలు  పాటలూ రాయించుకొన్నారు.
ఒకసారి ఏదో కంపెనీవారు 'పాదుకా పట్టాభిషేకం' సినిమా తీయాలనుకొన్నారు. శివరామబ్రహ్మంగారు ఇటువంటి కధలు రాయడంలో ఆరితేరినవారిని పేరున్నది. "పాదుకా పట్టాభిషేకం" లోనే వారు భరతునికొక డ్రీమ్ సీక్వెన్స్ పెట్టి అందులో దశావతారాలు చూపించారు. ప్రోడ్యూసార్లు, అన్నీ మాట్లాడుకొని, కవికీ, యాక్తార్సుకూ,ఎడ్వాన్స్ లిచ్చి, డిస్టి బ్యూటర్, రఘురామాచార్లు గారికి స్నేహితుడు.తమ అయిదారు లక్షలదాకా పెట్టుబడి పెడతాననీ, అయితే స్త్రిప్టు తన ఇష్టం వచ్చినట్టు మార్చాలని తనకు నచ్చేలాగా రాయగలిగినవారు రఘురామాచార్లుగా రోక్కరే నన్నాడు.
మేమను శివరామబ్రహ్మంగారికి నాలుగువేలు ఎడ్వాన్సిచ్చాం. ఇప్పుడెలా మార్చడం? అన్నారు ప్రోడ్యూసర్లు.
"అంతకన్నా నేను చెప్పగలిగిందేమీ లేదు. మీకలా ఇష్టమయితేనే మీ పిక్చర్ నాకివ్వండి. లేదా ఇంకో కంపెనీకి ఇచ్చుకోండి..... అసలు నేనే ప్రోడక్షన్ ప్రారంభిద్దామనుకొంటున్నాను" అన్నాడు డిస్టిబ్యూటరు.
అవతలి వాళ్ళకు కుందేలయిపొయ్యారు.
శివరామబ్రహ్మంగారి కిచ్చిన నాలుగువేలూ వదులుకొని, రఘురామాచార్లు గారికి పదివేలిచ్చుకొన్నారు. ఈ సంభాషణలు జరిగేనాటికి ఆ చార్లవారిదగ్గర అసలు ఏ స్క్రిప్టూ లేదు. ఆ దరినిలా ఆయనగారు ఈ పనిమీద కూచుని నెలరోజ్జుల్లో పూర్తీచేశారు.అటువంటి పలుకుబడి ఉన్నవాడాయన.
"ఇదిగో - అదిగో అంటూనే రఘురామాచార్లుగారు మూడు నాలుగు మాసాలు, రామబ్రహ్మంగార్నీ, వేంకటేశ్వర్లునూ తన చూట్టూ తిప్పుకొన్నాడు. ఈలోగా మూడు నాలుగు వేలు వారినుండి పిండి పారేశాడు, తీరా ఆయన కధను వేసేనాటికి, నావకళా  చిత్రాలయ సంస్థ సినిమా తీసేస్టితిలో లేకుండాపోయింది.
రామబ్రహ్మంగారూ,వేంకటేశ్వర్లు కుక్కాలకన్నా అధ్వాన్నంగా పోట్లాడుకొన్నారు.
"నువ్వు నన్ను నిలువునా ధ్వంసం చేశావు నా డబ్బంతా ముండలకీ తాగుడుకూ ఖర్చుచేశావు, చుట్టానివని నమ్మాను. నాకొంప ఆర్పావురా వెంకన్నా అని వాపోయాడు రామబ్రహ్మం"
వేంకటేశ్వర్లు మాట్లాడలేదు గానీ అతని తరుపున చలపతి మాత్రం బాగా నోరు చేసుకున్నాడు. "బాబూ! మీరు పెద్దవారనుకొన్నాను గానీ, ఇంత బద్మాషులనుకోలేదు, మాదీఉంది. మావాటా మాయిష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకొంటాం. అడగాడానికి నువ్వేవరువట? నే కిష్టమైతే కంపెనీలో ఉండు. లేదా నీభాగం వదులుకొని వెళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, నేనిక్కాడ పుట్టి ఇక్కడే పెరిగినవాణ్ని మళ్ళా మీరు సెంట్రల్ స్టేషన్ చూడరు. తరువాత నీ యిష్టం మీ పెట్టా, బెడ్డింగు పట్టుకెళ్ళి ఏ హౌటల్లోనన్నా దిగండి.... ఇంకో క్షణంమీరు మీ ఆఫీసులో ఉండటానికి వీల్లేదు " అన్నాడు చలపతి.
రామబ్రహ్మం నివ్వెరపోయాడు. చలపతి ఇంతలా మాట్లాడుతాడని ఆయన కలలో గూడా అనుకొని ఉండడు. వేంకటేశ్వర్లు గానీ, చలపతి నోరు మూయిస్తాడేమోనని, ఓ నిముషంపాటు షడ్డకుని కేసి చూశాడురామబ్రహ్మం. వేంకటేశ్వర్లు, నిర్లిప్తంగా కూచుని ఉన్నాడు. రామబ్రహ్మం కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంకో మాట లేకుండా, చిన్నచేసంచిలో గుడ్డలు సర్దుకొని, నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు.
చకచకా మెట్లు దిగుతున్న రామబ్రహ్మం కేసిచూసి తలదించుకొన్నాడు వేంకటేశ్వర్లు.
"ఎంతమ్ముడూ! నేనలా అన్నందుకు నీకేమన్నా బాధగా ఉందా?" అన్నాడు చలపతి.
ఏం?" అన్నాడు వేంకటేశ్వర్లు.
"నువ్వు ముభావంగా ఉంటేను"
వేంకటేశ్వర్లు నవ్వాడు.
రామబ్రహ్మంగారు పోవడంతో కంపెనీ వ్యవాహారాలు కుదుట పడతాయని చలపతి అంచనా, అతగాడికి వేంకటేశ్వర్లుపై బ్రాహ్మండమైన నమ్మకమున్నది. మంజరిద్వారా, వేంకటేశ్వర్లు ఆస్టిపాస్తుల వివరాలన్నీ లోగడే తెలుసుకొన్నావాడు కావడంచేత నావకళా చిత్రాలయకు వేంకటేశ్వర్లును ఏకైక యజమానిగా చేసి, తను నాటకమాడుదామనుకొన్నాడు. అందుకే రామబ్రహ్మంగారిన్ని అనరానిమాటలు కూడా అన్నాడు. కానీ దానికి విరుద్దంగా జరిగింది. వేంకటేశ్వర్లు పేదవాడిని కాదుగానీ, అతను చెప్పుకొన్నంత ఉన్న వాడు కాదు. రామబ్రహ్మం వెళ్ళిపోయిన రెండోవారంలోనే, వాయిదా డబ్బు చెల్లించనందుకుగ్గాను, కంపెనీ వారాచ్చి కారునుపట్టుకేళ్ళారు.అసలే బాంకులో ఉన్న బాలెన్స్ అంతంత మాత్రం. ఈ లోగా వేంకటేశ్వర్లు దాన్ని చుప్తాగాడ్రాచేసిపారేసాడు. ఓ నెల రోజులు టాక్సీ మీద ఆఫీసు రాకపోకలు జరిగాయి, తరువాత అవీ తగ్గిపోయాయి.
నెలాఖరయ్యేసరికి, ఆఫీసుకు అద్దేపనివాళ్ళ జీతాలు కలిసి, పన్నెండు వందలు ఇవ్వతేలారు. నావకళా చిత్రాలయవారు కంపెనీ ఎత్తేసారని. పాండీ బజారంతా మోగిపోయింది.
"ఇప్పుడేం చేద్దాం?" అన్నాడు వేంకటేశ్వర్లు కళ్ళు నులుముకుంటూ.
"నా ఖర్మ కాలి సమయానికి చెల్లికానీ లేకుండా పోయింది. నువ్వోపని చెయ్యి తమ్ముడూ! ఇంతదాకా వచ్చి వెనక్కు తియ్యడం నాకే నామోషీగా ఉంది. మనం సినిమా తియ్యాలిసిందే! ఆ నిర్ణయానికి తిరుగులేదు. మీరు ఊరుకెళ్ళిరండి. మా మరదళ్ళు పిలల్ల్నూ చూసినట్టూ ఉంటుంది. అక్కడి వ్యవహారాలు చక్కపెట్టి నట్లూ ఉంటుంది.ఓ వారం రోజులుండి మీరో యాబైకి తక్కువ గాకుండా పట్టుకురండి. ఈలోగా నేనింకో భగస్థుణ్సిచూస్తాను. అంటే- మేషడ్డకుళ్ళాగామడతపెచీల రకంకాదు. మనం చెప్పినట్టు వినేవాడు మావాడే ఉన్నాళ్ళెండి, ఏమంటావుమంజరీ!" అన్నాడు చలపతి.
"అదేబావుంది!"అన్నది మంజరి.
"రైటో ననుకో, నేనింటికి రాసిన జాబుకు జవాబుకూడా రాలేదు. అదావుచ్చిందాకా నేను కదలడాని క్కూడా వీల్లేదుగదా!" అన్నాడు వేంకటేశ్వర్లు.
"నేనో అందుకే అందోళన పడుతున్నాను తమ్ముడూ! జవాబు రాలేదంటే అక్కడేదో ఇబ్బందులున్నాయనేగా అర్ధం.... నువ్వు మరోలా అనికోకు.నాదగ్గరో పాతిక రూపాయులన్నాయి..... పర్వాలేదు పట్టుకేళ్ళు. తర్వాత చూసుకొందాం " అన్నాడు చలపతి.
మంజరి ఒక్కర్తే బిక్కు బిక్కు మంటూ వసారాలో కూచున్నది.
"వెళ్ళారా?" అన్నది మంజరి.
ఆమె గొంతులోని బాధను చలపతి తరవాత తాఫీగా సిగరేట్ వెలిగించి, గుప్పుమని ఇంటి కప్పుకేసి పొద ఊది సన్నగా నవ్వాడు.
"మళ్ళా ఎప్పుజోస్తానన్నారు?" అన్నది మంజరి.
"ఎక్కడికి? మద్రాసుకా!" అని నవ్వాడు చలపతి. "పిచ్చిదానా! ఇంకా వేంకటేశ్వర్లు వస్తాడనేనా నీ నమ్మకం.!"
"మరి?" అన్నది మంజరి బిత్తరపోతూ.
"అదంటే అతనికారాడు, రాలేడు,అద్దెకింద, ఆఫీసు లో ఉన్న ఫర్నీచరును తీసేసుకొంటారు.ఇంటివాళ్ళు.పనివాళ్ళకు మాత్రం చేసిన చాకిరీ దండగవుతుంది. ఈ మొహాలు సినిమా తీసేవిగావని నాకెప్పుడో తెలుసు. అందుకనే నేను అందినంతవరకూ పిండుకోమన్నది. ఎందుకైనా మంచిదని, మనకు ఉపయేగ పడేవాళ్ళందరకీ, కంపెనీచేత  తణమో, కణమో ఇప్పించాను. వాళ్ళందరూ మనకు తప్పకుండా సాయపడతారు" అన్నాడు చలపతి.
"అఁ నా బొందసాయం!" అనుకొన్నది మంజరి నిట్టూరుస్తూ.
చలపతి విషయాన్ని ఇట్టే గ్రహించాడు.
"నువ్వలా ప్రతిదానికి కుంగిపోతే నేను చెయ్యగలిగిందేమీ లేదు. దేనికైనా కాలం కలిసిరావాలి. మన ప్రయత్నమూ ఉండాలి. ప్రయత్నలోపమోమీ లేదు గదా! ఈ మెట్లన్నీ అందరూ ఎక్కవలసిందే ! ఇంకొంత కాలం చూద్దాం. ఈలోగా ఏం జరిగినా జరగవచ్చు" అన్నాడు చలపతి
మంజరికి ఈ శుష్క ప్రయాలరు వినే వోపిక లేక పోయింది. అవిడలేచి ఇంట్లోకి వెడుతుంటే, చలపతి వెనకాతలేవచ్చి భుజం మీద చెయ్యివేసి తనవేపు తిప్పుకొన్నాడు. మంజరి అతని ముఖంకేసి చూసి, తలదించుకొన్నది.
"నాకదే పాలుపోవడంలేదు మంజరీ! నువ్వింత అందంగా ఉంటావుగదా, ఇంచక్కా భావాలను ఎక్స్ ప్రెస్ చేస్తావుగదా! నీకెందుకు ఈ ఇండస్ట్రీలోస్థానం ఉండదా అని! తప్పకుండా ఉంటుంది. అడుగులకు మడుగులేత్తే రోజులున్నాయి..... నీ మాటమీద సినిమా పరిశ్రమ బాగోగులు ఆధారపడి ఉందే రోజులున్నాయి. అయితే వాటికోసం నువ్వు కాస్త వోపికపట్టాలి అంతే!" అన్నాడు చలపతి.
మంజరి మౌనంగా నవ్వింది.
"ఏమో బాబూ! నాకా గొడవలేమీ తెలీవు. సుఖంగా ఉన్న దాన్ని తెచ్చి ఇక్కడ పడేశారు.... మీరనకముందే నాకీ, సినిమాల ఆలోచనేలేదు. మీరు "సైఁ" అంటున్నారుగనక, నేనూ అంటున్నాను. ఈ రోజుతో ఈ ప్రయత్నాలకు తెర దించేయండి మంచి రోజు చూసుకొని గుంటూరు వెళ్ళిపొదాం. మన నాటకాలు మనకు ఉండనే, ఉన్నాయి. మీకు, నాకూ పొట్ట జరక్కపోదు" అన్నది మంజరి.
"నేను వాజమ్మనని నువ్వనుకోంటే తప్ప ఈ మాటలని ఉండవు" అన్నాడు చలపతి.
మంజరి అతన్ని నిలువునా ఆలింగనం చేసుకొని, బరువంతా చలపతిమీద మోపుతూ, మీరలా పెడర్ధాలు తీయకండి. నా మనస్సేమీ బావోలేదు. తెలీక ఏమన్నా అనివుంటే మర్చిపోండి ఈపూట నీకేమీ పనుల్లేవుగా- ఉన్నా వాటికి ఎగనామం పెట్టేసేయ్యండి. కాళ్ళు ముడుచుకొని మీ పొట్టలో పడుకోవాలని ఉన్నది హాయిగా నిద్రపోతే తప్ప నాకు కులాసాగా ఉండడు అన్నది.
                                *            *               *                            
ఆ తెల్లవారి రావుగార్ని కలుసుకొన్నప్పుడు, చలపతి కొన్ని విషయాలు బయట పెట్టాడు .
"నిజంగా ఈ ఫీల్డంత ఛండాలపు ఫీల్డు ఇంకొకటిలేదు రావుగారూ! ఇదిగో పులంటే, అదేమర్రాతోక- అంటారు. రామబ్రహ్మం గారితో పడక ఆయన్ను పంపించేశాం. ఇప్పుడు, కంపెనీ సోల్ ప్రోప్రయిటర్ వేంకటేశ్వర్లు గారే! నన్ననే ఏడ్వకేట్ ను కన్సల్టు చేశాంలెండి,."
ఆయన గారు కంపెనీ పేరుకూడా మార్చమన్నాడు, లేకపోతే 'నావకళా చిత్రాలయ' వారి లయబిలిటీస్ అన్నీ భరించాలి చోస్తుందన్నాడు. ఆలోచించి చెబుతున్నాను..... నాకేమో మనస్సులో ఆకపేరు మెదలుతూ ఉన్నదనుకోండి,మీ అనుమతి కూడా తీసుకుని ఆపెరును కన్ ఫమ్ చేదామమకోంటున్నాను. మీరు మాత్రం కాదనకండి " అన్నాడు చలపతి.
రావుగారు సినిమాటిక్ గా నవ్వి వూరుకొన్నారు.
"మీరంటే ఈ సినీ లోకానికి దేవుళ్ళాంటి  వారు మామంజరి కి దేవాది దేవుళ్ళాంటి వారు మీపేరు, మంజరి పేరు కలిసివచ్చే లాగా కంపెనీకు పేరు పెడదామని అభిప్రాయం. మీ పేరులోని మొదటి అక్షరం చేర్చి 'రామ ఫిలింస్' అంతే ఎలా ఉంటుంది?" అన్నాడు చలపతి.
"నేనేం చేశానని మీకింత అబిమానం చలపతి గారూ?" అన్నాడు రావు.
"ప్రత్యేకంగా నాకేదో చేశారనీకాదు, చెయ్యమనీ కాదు. మీ వల్ల ఈ పరిశ్రమకు చాలా మేలు కలిగింది. నాకదే పదివేలు. ఇంతకన్నా మీకు నేను ఇంకో రూపంలో కృతఙ్ఞతలు చెప్పుకోలేని స్టితిలో ఉన్నాను."
"థాంక్స్" అన్నాడు రావుగారు. తరువాత ఆ పేరును కాగితం మీద రాశారు. ఒకటి రెండుసార్లు వినీ వినపదనట్ట్లుగా ఆ పేరును ఉచ్చరించారు. మెల్లిగా తలపైకెత్తి "బావుందండీ ! అలాగే కానివ్వండి, కానీ, మీకబ్యంతరం లేకపోతే, ఈ రెండక్షరాలకూ ముందుగా "శ్రీ " ని చేర్చండి, అప్పుడు ఇంకా నోమ్డుగా ఉంటుంది."
"గుడ్, గుడ్ వెరీగుడ్ వెరీ వెరీ నైస్ సజెషన్. "శ్రీరామ ఫిలింస్"- ఇదే పేరును ఖాయం చేస్తున్నాను. రెండు మూడు రోజుల్లో కంపెనీని రిజిష్టర్ చేయించేస్తాను. మా బాస్ నిన్ననే ఊరుకేళ్ళాడు. ఈ దపా ఓ లకారం భ్యాంకులో లేనీదే పని ప్రారంభించం అయితే నాదో చిన్న రిక్వెస్టున్నది. కంపెనీ తరపున ముందుగానే మీకు డబ్బు ముట్టచెప్పే బాద్యత నాది మీరు మాత్రం శ్రమ అనుకోకుండా, కాల షీట్లు ఇప్పించాలి. మీప్రోగ్రాం ఇస్తే, మిగతావారికి నేను ఎడ్జేస్టు చేసుకోమంటాను." అని ప్రాధేయపడ్డాడు చలపతి.
"ష్యూర్ ష్యూర్ నేను తప్పకుండా చూస్తాను" అన్నాడు రావు గారు.
"మరి సెలవు" అంటూ చలపతి మేడమీంచి కిందికొచ్చి రావుగారి పర్సనల్ సెక్రటరీకి ఎదురుగా కూచుని, ఓ సిగరేట్ ఆఫర్ చేసి, అతను తీసుకొన్నాక, తనూ వొకటి అంటించాడు.
"చెప్పండి" అన్నాడు పి.యస్.
"ఏం లేదు బ్రదర్. రావుగారితో కాస్తపనుండి వచాను నువ్వు కాస్త సాయంపడితివా, బండి లాగించేస్తాను ఉన్న కిలకమంతా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నది "
మీకోసం.....
"నువ్వు ఏమన్నా చేస్తావని నాకు తెలుసు బ్రదర్. మన వాడివి వున్నావనే నీ దగ్గరకొచ్చాను. మా కంపెని పిక్చర్ ప్రారంభించడానికి ఇంకా అయిదారు మాసాలుపడుతుంది. మా మంజరికేమో పొద్దుపోవడం లేదుట, ఈలోగా ఏదన్నా చిన్న వేషాలు వేస్తే అదే పేరు పడుతుందంటే వినిపించదుకోదు. నాకూ - ఓ రకంగా ఆవిడ ప్రపోజల్ నచ్చింది. ఈ లోగా ఆవిడకు, కెమేరాఫియర్ తీరితే. రాఫిలిందుబారా తగ్గినా తగ్గినట్టే! ఏంమంటావ్?" అన్నాడు చలపతి.
"రైటే" అన్నాడు పి.యస్.
"నువ్వు- రావుగారు యాక్ట్ చేస్తున్న పిక్చర్స్ లో ఎక్కడన్నా జాగా ఉన్నదేమో చూసిపెట్టు. మనవాళ్ళు గొడవలు నీకు తెలీనివి కాదు గదా! మరో గంటకు సెన్సార్ కు వెళ్ళుతుందనగా కూడా. ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటారు. అలాంటివి భోలేడు ఉండే.ఉంటాయి. కాస్త పుణ్యం కట్టుకో భాయీ! సాటి కులంవాణ్ని ఆమాత్రం అభిమానముంచు.,నేనైనా మరిచిపోయేవాణ్ని కాదులే,!"
"ఇవ్వాళ టూ టునైన్ కాల షిట్ ఉంది. ఈ ఫిక్చర్ మొన్ననే ప్రారంభించారు, కొన్ని సీన్సు ఇంకా ఫైనలైజ్ కాలేదనుకుంటాను. అసిస్టెంటును కనుక్కొని రేపు చెబుతాను" అన్నాడు పి .యస్.
"థాంక్స్" అంటూ చలపతి వచ్చేశాడు.
రావుగారి పర్సనల్ సెక్రటరీ అన్నమాట నిలబెట్టుకొన్నాడు.స్టూడియో కెళ్ళినప్పుడు మరచిపోకుండా అసిస్టెంట్ డైరెక్టర్ ను అడిగాను. ఇంకా నాలుగైదు వేషాలకు ఎవ్వర్నీ బుక్ చేయలేదని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్. అవి చిన్నవేషాలనీ, అవసరమైతే ఒకటి రెండు వేషాలను డెవలప్ చేసి. వాటికి ఇంపార్టెన్స్ ఇప్పించవచ్చునని కూడా చెప్పాడు.
"అదయ్యా సంగతి!" అన్నాడు ప్ల.యస్. ఆ తెల్లవారి చలపతితో
"థాంక్యూ! మరి నేను వెడుతున్నాను. మళ్ళా కనిపిస్తాను " అన్నాడు చలపతి.
తిన్నగా మంజరి దగ్గరకొచ్చి, నీరెట్టే విరిగి నేతిలో పడింది మంజరి! మోహన్ మూవీస్ వారి సోషల్ పిక్చర్లో నీకో వేషం దొరికింది. ఇవ్వాళ్ళే రేపో కంపేనీవారు నీకోసం వస్తారు ." అన్నాడు చలపతి.
"నిజంగానండీ!" అన్నది మంజరి
"ఇహ నువ్వు సినిమాల్లో చేరతావో, గుంటూరు వెళ్ళి నాటకాలు వేసుకుంటావో నీ యిష్టం...... ఇంత కాలానికి నీ అదృష్టం బైటపడింది. నిన్ను ఆపడం హరిహర బ్రహ్మదుల వల్ల కూడా కాదు"
"పోదురూ మీదంతా బడాయి." అన్నది మంజరి. అతని వీపు మీదుగా వంగి ముఖంలో ముఖం ఉంచుతూ.
"చూస్తావుగా!"
మంజరి శరీరమంతా గాలిలో తేలి పోతున్నట్టయింది.
మోహన్ మూవిస్ వారి పిక్చర్ మంజరి వేషం దొరకటానికి ముందుగా, చలపతి ఇంకో చిన్న నాటకం ఆడవనసివచ్చింది. అతగాడు రావుగార్ని ఘాంటింగ్ సమయంలో కలుసుకొని, మంజరి విషయం ప్రస్తావించాడు.
"ఈ ఫిక్చర్ ఏవో రెండు మూడు చిన్న వేషాలున్నాయని ఇంకా పైనాలైజ్ కాలేదనీ తెలిసింది. మీ ఫోన్ మంజరి - మీరున్న ఫిక్చర్ లో ఉండాలని నా ప్రాణాలు తీసేస్తోంది రావు గారూ! ప్రోడ్యూసరెమో, మీరు ఊఁ అంటే తప్ప ఇచ్చేలా లేరు. మీరు చెప్పారని ఓ ముక్క ఆయనతో అనమంటే అంటాను. వెళ్ళి చేప్పిరానా అన్నాడు చలపతి.
"ఇంకా ఎవర్నీ బుక్ చెయ్యకపోతే చేప్పోచ్చుననుకోండి. అయినా - మన ఫిక్చర్ ఉండనే ఉన్నాదిగా ఈలోగా ఈ కక్కుర్తి దేనికా అని?"
రావుగారు మన పిక్చర్ ఉన్నాడిగా అని ఎందుకన్నాడో చలపతి ఇట్టే పసిగట్టాడుయ ఆయనగారు - అసలు పిక్చర్ తీసేదీలేనిదీ కనుక్కోవడం కోసమే ఈ ముక్క వాదాని చలపతికి తెలుసు.
బాగా అన్నారు.నేను నెత్తీనోరు కొట్టుకొని మరీ చేప్పాను. తనకు భయం తీరడంకోసమన్నా వేషం వేస్తానన్నది. "సరే" నన్నాను. పోనివ్వండి - మనం వేంకటేశ్వర్లుగారు ఇవ్వాళ జాబురాశారు. మన ప్రయత్నాలన్నీ రావుగారితో చెప్పామనీ వారి సహాకారం తప్పకుండా పొందమనీ మరీ మరీ రాశారు కావాలంటే రావుగారికి ఓ పడి పదిహేను దాకా ముందుగానే సర్దుగామానీ రాసాడు. మిమ్మల్నిడిగి జవాబు రాద్దామను కొంటున్నాను. మీరేం చెబితే అదే రాస్తాను. అన్నాడు చలపతి.
"ఐ యాం నాట్ పర్టిక్యులర్ ఎబౌట్ మనీ మిస్టర్ చలపతీ!" అన్నాడు రావు., ట్రాలీమీద వెనక్కు నడుస్తున్న కెమెరాను చూస్తూ "సర్లెండి ఆలోచిద్దాం.... మీరేదో పనిమీద వేళ్ళస్తానన్నారుగా.... పోయిరండి, ఆ ప్రోడ్యూసర్ ఏమన్నదీ నాకు చెబితే అవసరమయితే -"
"అలాగే"
కాల్ షిట్ టైం అయిపోతున్నా., నాలుగు నిమిషాల ఫీలీమ్ తీయనందుకు డైరెక్టర్ మీద రుసరుసలాడి పోతున్నాడు. ప్రొడ్యూసరు. సరిగ్గా ఆ సమయంలో అక్కడికొచ్చాడు చలపతి. ప్రోడ్యూసర్ కోసారి నమస్కారించి నుంచున్నాడు.
 ఏం బాబూ ఏమిటి సంగతి అన్నాడు ప్రోడ్యూసరు రవంత చిరాగ్గా.
"అప్పుడే రావుగారితో మాట్లాడాను....." అని ప్రారంభించాడు చలపతి.
"అంతా చూస్తూనే వున్నాను నాయానా!గట్టిగా  ఏమనడానికి  లేకుండా ఉంది.హీరోగారేమో నీతో హస్కు వేసుక్కూచున్నాడు. హీరోయిన్ కు అలసటోచ్చి కూచుండి పోయింది. వాళ్ళను పిలిచే దమ్ములు మాడైరెక్టరుకు లేవు..... చెప్పండి ఏమిటి కధ?" అన్నాడాయాన మళ్లా.
మన ఫిక్చర్ లో రెండు మూడు చిన్న చిన్న వేషాలేవో ఉన్నాయటగా ఓ వేషానికి - కాస్తంత మంచి వేషానికి వారికి తెలిసిన అమ్మాయిని తీసుకోమని మీతో చెప్పమన్నారు. ఆ పిల్ల పేరు మంజరి. ఇందా - ఇదీ అడ్రసు, రేపు మీ ప్రోడక్షన్ మేనేజర్ని ఈ అడ్రసుకు పంపించండి అని  ఆడ్రసుకాగితం ఇచ్చాడు చలపతి.
"అలాగే బాబూ! తప్పకుండాను హీరో చప్పాకకూడా బుక్ చెయ్యక ఇహ జన్మలో ఈ ఫిక్చర్ పూర్తీకాదు, అయితే చూడ్నాయానా! ఇదేవత్తే - మంజరివా- రావుగారికి -" అని ఆగిపోయాడతను.
"మరేనండీ! ఏవో సంబంధాలుంటాయి, లేకపోతేవారు, పని మాలా నన్ను పిలిచి చెప్పరుగదా? మీరు మాత్రం వారిమాట నెందుక్కాదనాలి? ఓ వేషం పారేయండి ఎవర్నో ఒకర్ని బుక్ చేయక తప్పనప్పుడు., హీరో రికమేండ్ చేసిన కాండిడేట్ నే బుక్ చేస్తేపోయే. అయినా సంతోషిస్తాడు. ఎప్పుడన్నా పీకలమీద కూచుంటే,ఇంకో నాలుగు కాల్ షీట్లు ఇస్తాడు" అని సలహా ఇచ్చాడు చలపతి.
ఈ సలహా ఆయనకూ నచ్చింది. ప్రోడక్షన్ మేనేజర్ని పిలిచి రేపు ఈ ఎడ్రస్ కెళ్ళి అవిన్ను తోలుకురావయ్యా పంతులూ! అన్నాడు ప్రోడ్యూసర్.
"ఏఓ.కె.సార్" అన్నాడు ప్రొడక్షన్ మేనేజరు.
మంజరి జగన్మోహనంగా అలంకరించిచుకొని కుర్చీలో కూచున్నది. చలపతి ఆవిడకు ఎదురుగా కూచున్నాడు. మంజరి మాటిమాటీకి గడియారం కేసి వీధి కేసి చూస్తున్నది.
"వస్తుంది వస్తుంది తప్పకుండా  కారువస్తుంది." అన్నాడు చలపతి సన్నగా నవ్వుతూ "ఇప్పుడు నువ్వెంత అందంగా వున్నావంటే ప్రోడ్యూసరూ, డైరెక్టరూ ఉన్న హీరోయిన్ను పీకిపారేసి, ఇంత వరకూ తీసిన ఫిలిం తగలెట్టేసి, నిన్ను హీరోయిన్ చేసి మళ్ళా రీఘాటింగ్ జరుపుతారేమో ననిఫిస్తుంది."
"మనషుల్ని ఉబ్బేయ్యడం మీకు బాగా చాతవుద్ది" అన్నది మంజరి.
"అక్కడ కూడా "అవుద్ది " "పోద్ది " అనవాకు, అందంగా సున్నితంగా మాట్లాడాలి..... అదుగో..... అప్పుడే నువ్వు ముఖం మాడ్చేస్తున్నావు, నీతో ఎలా వేగడం చెప్పు మంజరీ! నీకేమో ఇక్కడి సంగతి సందర్బాలు తెలియవాయె. చెబితెనేమో కోపమాయె, చెప్పకుండా తెలుసువడం నీవల్ల కాదాయె..... అవునా అమ్మాయీ! నువ్వు భయపడకు. లైట్లు మైకు, మనుషులు, కెమెరా- ముందస్తిగా కాస్త గాభరాగా ఉంటుందనుకో. నిభాయించుకోవాలే. ఏవో నాలుగు రకాల ష్టిల్స్ తీస్తారు."
"అంటే ?" అన్నది మంజరి.
"అంతేనా?" అని అలిచించాడు చలపతి. ఆ విషయం ఎలా ఎలా తెలియచెప్పాలో అతనికి బోధపళ్ళేదు. 'అంతే- మరేంలేదు.నాలుగైదు పోజుల్లో నిన్ను ఫోటో తీస్తారన్నమాట. నవ్వుతూ ఆలోచిస్తూ, దిగులుపడుతూ కోప్పడుతూ వున్నప్పుడు. నువ్వెలా వుండేదీ వాళ్ళకు తెలియాలి గదూ మరి? అంచాత, అన్నిరకాల బావాలనూ చూపెట్టమంటారు. జాగ్రత్తగా యాక్ట్ చెయ్యాలి.... మరేం లేదు. ఆ బావాన్ని బాగా ఎక్సప్రెస్ చెయ్యాలన్నమాట. అలాగే రకరకాల డైలాగ్స్ అనిపిస్తారు. అవన్నీ రికార్డుచేసి వింటారు. వాటినీ తప్పలేకుండా భావయుక్తంగా అనాలి. ఈ కాస్త గడ్డూ గడిస్తే,ఎన్నెమ్మభయం తీరిపోయినట్లే. నేనూ ఉంటాననుకో.... కానీ చెప్పోచ్చేదేమిటంటే"
చలపతి వాఖ్యం పూర్తి చెయ్యకుండానే కారు వచ్చింది. మంజరి ముందుగా వెళ్ళికారులో కూచుంది. ఆ తరువాత చలపతి డైవర్ ప్రక్కగా వచ్చి కూచున్నాడు. మంజరికి పాతసంఘటన గుర్తుకొచ్చింది. ఓ సారి వేంకటేశ్వర్లు కూడా ఇలానే తనను కార్లో తీసుకెళ్ళాడు. తరువాత హౌటలుకెళ్ళడం, సీ


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS