"పోనీ కొంత కాలంపాటు పనిచేసి చూద్దాం. మనకిలాంటి అవకాశం రావడమే అదృష్టం!" తరువాత మీ ఇష్టం అన్నది మంజరి.
చలపతి ఓ పదినిమిషాలపాటు ఏమీ పలకలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. తీరా అన్నాకగానీ, తను అనకుండా ఉంటే బావుండేదన్న ఆలోచన మంజరికి రాలేదు.
"అందుకే మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యమన్నాను. నా ఉద్దేశ్యమేదో చెప్పిందాకా ప్రాణాలు తీశారు. తీరా చెప్పింతరువాత మనస్సు కష్ట పెట్టుకుంటారు,. ముక్కు మేఖమూ ఎరగని దాన్ని, నా అభిప్రాయంతో మీకేంపని చెప్పండి? మీకు ఏదితోస్తే అది చెయ్యండి" అన్నది మంజరి.
"ఎగ్రిమెంటటుకు వోప్పుకుందాం మంజరీ! ప్రతిక్షణం రిస్కును ఫేస్ చేయ్యడం మాటలుకాదు. నువ్వన్నట్లు- మూడేళ్ళపాటు మనకు దేన్నీగురించీ వెదుక్కోవలసిన బాధ ఉండదు. మనం చెయ్య దలుచుకొన్నదేదో, ఆదరిమీలానే చేయ్యచ్చు.ఈ లోగా ఈ కపెనీ వారు, తమకోసమైనా నీకు పబ్లిసిటి ఇవ్వకతప్పదు. ఇవన్నీ నేకు ఫ్యూచర్లో మాంచీ ఎస్పెట్స్ ! అల రైట్ సాయత్రం వెళ్ళి చెప్పోస్తాను." అన్నాడు చలపతి.
ఆ తరువాత అతను ఏదో గొణుక్కొంటూ వెళ్లిపోవడం తాయారు చూసింది.
"అయ్యాగారూ శానాకోపంనీదున్నారండీ!" అన్నది తాయారు.
వెళ్ళారా అన్నది మంజరి.
"అఁ పోయినారండీ అమ్మాయి గారూ! ఏటేటో గొణుక్కుంటూ ఉన్నారండీ"
"అఁ, గోనుక్కోమనవే, ఇప్పుడు పోయిందేమీటీ! బంగారం లాంటి అఫర్ చేతికోస్తే వోద్దనమంటాడు. ఇదేం గ్రహచారం తాయారు ! తెల్లవారేటప్పటికి లక్ష ప్రశ్నలు సంపాదించాలంటే ఎలా?" అన్నది మంజరి.
"మా పసందుగా అన్నారండీ అమ్మాయిగారూ! అయినా ఈ మద్యన అయ్యగారికి కోపం జాస్తి అయిపోనాదండీ! చీటికి మాటికీ, అయిందానికీ, కాందానికీ ఇలా చిర్రెత్తిపోతావుంటే నేగ్గడం కష్టమండీ!" అన్నది తాయారు.
మంజరి ఏదో అనబోయింది.
తాయారు తనలోతనే నవ్వుకొంటూంటే "ఏమిటే " అన్నది.
"అమ్మాయిగారూ, మీరు నిమనుకోండి అబద్దమనుకొండి. మీపేరు పాండిబజారంతా మోగిపోతా ఉండాగమ్మాయిగారూ! ఈ ఫిల్డు లో మీ అంత సక్కనోరు లేరనీ, మీరే కనక ఈ రోయినైతే జనం ఇరగబడి చూస్తారని,అనుకొంటావుంటారండీ అమ్మాయి గారూ!" అన్నది తాయారు.
"ఇవన్నీ నీకెలా తెలుసు!" అన్నది మంజరి.
"నిన్నటూడియో కెళ్ళినానుగడండీ! అడ విన్న నుండీ!"
మంజరికో అనుమానం వచ్చి, "స్టూజియోలో నీ కేంపనె" అన్నది.
తాయారు కాస్సేపు తటపటాయించి, అసలు విషయం బయట పెట్టింది. సినిమాలమీద మోజు ఇంకా చావలేదనీ ఏనాటికైనా పైకి రావచ్చుననే నమ్మాకంతో, అక్ స్ట్రావేషాలు వేస్తూ ఉంటుందిట. ఇలా నడవగా ఎప్పటికైనా పైకి రాలేకపోతానా అని తాయారు నమ్మకం.
"ఈ సంగతి ఎనక మీకోపాలి చెప్పినట్లు గ్యాపకమండీ అమ్మాయిగారూ" అన్నది తాయారు.
"అమ్మాయి గారూ! అయ్యగారి మాటల్ని మీరు లేక్కచేయకండి. ఇంకో మడిసికి తెలియకుండా, నేరుగా మీరా కంపెనీలో చేరిపోండి.శానామంది ఆ కంపెనీ గేటుకాడ, ఉద్దేగం దొరికినా అందదండీ అమ్మా"
"అలాగేలేవే! నేనూ అంతేననుకొన్నాను. ఆ కంపెనీకే పోయాడనుకొంటాను. ఎగ్రిమెంటుకు వోప్పుకొంటే సరేసరి! లేదా రేపొద్దున నేనే వెళ్ళి చెప్పోస్తాను. ఆ తరువాత ఎవరికీ కోపం వచ్చినాసరే! ఎవరో ఏదో అనుకుంటారని, చేతులారా, సిద్దాన్నాన్ని మట్టిలో కలురకోవడం నాకిష్టంలేదు." అని నిశ్చయాన్ని బయట పెట్టింది.
"ఎయ్యేళ్ళు బతకండి తల్లీ! నా కడుపులో ఆలోచనే మీరు చెప్పిండ్రు. అన్నది తాయారు. కాస్త మీరక్కడ నిలబడినంక నాకేదన్నా ఎరుపాటు చేపించండమ్మాయిగారూ! మీరు తలుసుకొంటే, కాదనేవారెవరూ ఉండరు మీకాడ బతుకుతున్నదాన్ని. మీ పేరు సెప్పు కొంటా"
"అలాగేలేవే" నాకే ఇంకా దారుడ్డంలేదు, ముందు నన్ను కాస్త ఊపిరిఫీల్చుకొనీ! నేను సుఖంగా ఉంటూ, నిన్ను భాధపడనిస్తానని ఎప్పుడూ అనుకోను, సరా! అన్నది మంజరి.
"మీరామాత్తారం అమీ ఇచ్చినారు. నాకంతే సాల్నండీ!" అన్నది తాయారు.
సాయంత్రానికల్లా చలపతి వచ్చి, ఇన్సురంటూ కుర్చూలో కూచున్నాడు. మంజరి మంచినీళ్ళుగ్లాసు అందించింది. రెండు గుటకలు త్రాగి, గ్లాసు మంజరి చేతికిచ్చి జేబులోంచి, ఆకుపచ్చరంగు కాగితం తీసి మంజరికిచ్చాడు చలపతి.
"ఏమిటిది?" అన్నది మంజరి.
"చెక్కే! జయాపిలింస్ వాళ్ళు మూడు మాసాల జీతం అడ్వాన్స్ గా ఇచ్చారు. మంచిరోజు చూసుకొని అగ్రిమెంటు సంతకం కోసం పంపుతామన్నారు."
మంజరి శరీరం గాలిలో తేలి పోతున్నట్ట్లుగా ఉంది.
"ఇంద! మీదగ్గరే ఉంచండి!" అన్నది మంజరి చెక్కును అతనికే ఇస్తూ.
"అది నీ పేరు మీదుగా రాశేరమ్మా., కనక నీదే ! దాన్ని నువ్వేం చేసుకొంటావో చేసుకో!"
క్షణంలో మంజరి ముఖ కవళికలు మారిపోయాయి. లోపల అమనుకొన్నా. పైకిమాత్రం, ఏమతో నొచ్చుకొన్నట్ట్లుగా మాట్లాడింది.
"మీరింకా మనిద్దరి మద్యా ఎడం ఉంచుకొనే మాట్లాడుతున్నారని నేననుకోలేదు. నాపేర్న రాయడమేమిటి? నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసు కొనడమేమిటి ఏమిటండి ఇదంతాను? మిమ్మల్ని కష్టపెట్టి ఏదో బావుకుతిందామని నాకేనాడూ లేదు.నా ఉద్దేశం చెప్పమంటే చెప్పాను గానీ, దాని ప్రకారమే చేసితీరాలని నేనేమీ అనలేదు. నేనేదన్నా తప్పుచేస్తే మీరు దండించ వొచ్చు. అంతేగానీ ఇలా సూటీ పోటీలను, నన్ను హింసపెట్టొద్దు. అంతగా ఇష్టం లేకపోతే ఈ చెక్కును మీరు తీసుకోకుండా ఉండలేకపోయారా? ఆ కంపెనీ వాళ్ళకైనా అదేం రోగం ? ఆడదాని పేరుమీదుగా చెక్కు రాయడమెందుకట? ఎదురుగా మారున్నారుగా! ఇంద! మీరు పట్టు కొచ్చిన చెక్కు మీకే పారేస్స్తున్నాను. దాన్ని కంపెనీ కే తిరిగిస్తారో చించి ముక్కలే చేసుకొంటారో మీఇష్టం! ఈ మాటలని, మంజరి లోపలికి కెళ్ళి పోయింది.
చలపతి వచ్చి చూసేసరికి, మంజరి మంచంమీద పక్కగా తిరిగి పడుకొని ఉన్నది. అతను తలుపులువేసి, అదే మంచంమీద కూచుని, మంజరిని తనవేపు తిప్పుకొన్నాడు. ఆవిడ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖమంతా గండరించి ఉంది.
"నేనేమన్నానని మంజరి అంతకోపం?" అన్నాడు చలపతి. ఆవిడ ముంగురులు సవరిస్తూ.
"అ బాధ పడేవాళ్ళకుగానీ తెలీదు. ఇలా మాటలకు విషంపూసి నన్నెందుకు బాధపెడతారో తెలీకుండా ఉంది."
"ఈ కాంట్రాక్టు నిజంగా నాకు ఇష్టంలేదు మంజరీ! నివ్వేదో అనుకొంటున్నావు గానీ, దీన్నిగురించి నువ్వు పశ్చాత్తాప పడవలసిన టైం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు కాలు జరకుండా ఉంటే మంచిదని నేననుకోన్నాను. కానీ అదేమీ జరగలేదు." అన్నాడు చలపతి.
"ఇప్పటికైనా మించి పోయిందేమీలేదు. ఈ ఎగ్రిమెంటుకు నేను వోప్పుకోలేదని, ఉదయమే వెళ్ళి చెప్పిరండి!" అన్నది మంజరి.
చలపతి ముక్కుమీద వేలు పెట్టుకొని "చ్ చ్ చ్ చ్ "అన్నాడు.
"అంతకన్నా తెలివితక్కువపని ఇంకోటి లేదు. జయా పిలింస్ వారిని గురించి నీకేమీ తెలిసినట్టులేదు. వారు తలుచుకొంటే నిన్ను ద్వంసం చేసి పారేస్తారు. ఈ ఊళ్ళో నీకు గద్దెడు మంచి నీళ్ళు కూడా పుట్టకుండా చెయ్యగలరు. అదేంలాభంలేదు..... సరే జరిగిందేదో జరిగింది.ఇందెందుకొచ్చిందో మనకు తెలీదు.... అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. పరబ్రహ్మశాస్రీగారు కనిపించారు. అవలేల్లుండి ఉదయం మంచి లగ్నం ఉన్నాదట. అరవం, హిందీ తెలిసిన ట్యూటర్వీ, తనే మనింటికి, పంపుతామన్నారు. నటరాజ్ గారి డాన్స్ లకు సినిమాల్లో మంచి గిరాకి వుంది. వార్నేమో డాన్స్ మాష్టర్ గా మాతాడాను. పాఠాలు డాన్స్ కూడా ఆ లగ్నంలోనే ప్రారభించుదాం!" అన్నాడు చలపతి.
"నాకు తెలియుడు అదంతా మీఇష్టం!" అన్నది మంజరి.
"నిజంగా నువ్వీమాటమీద నిలబడతావా మంజరీ!" అన్నాడు చలపతి.
"అఁ"
"తిరిగితే ?"
"నా మాటమీద, మీకామాత్రం నమ్మకంకూడా లేదన్నమాట"
"ఉన్నది.....నా ఇష్ట మేమిటంటే"
"అమ్మదొంగా! ఇదా మీ ఎత్తు? ఈ విషయంలో మీ పప్పులేమీ పనికిరావండి బాబూ! అయ్యో రామ! నన్ను లేవనన్నా లేవనివ్వండి...." అన్నది మంజరి.
ఈ మాటలేమీ చలపతి వినిపించుకోలేదు. మంజరికి అ అవకాశం ఇవ్వనూ లేదు. తన జీవితం ఇప్పటికొక స్టాయి కొచ్చిందనీ, ఈ మేసులుబాటులో తను భవష్యత్తుకోసం రాచమార్గాలను ఏర్పాటు చేసుకోవచ్చుననీ మంజరి మనస్పుర్తీగా విశ్వసించింది.తనొక స్టితికి వచ్చాక.అటు రాజమణికి, వసంతకూ,కూడా తగిన ఏర్పాటేమన్నా చేయాలనుకొన్నది. ముందుగా ఇల్లు మారడం ముఖ్యమనీ, తను కొత్తగా చేరే ఇల్లు చాలా పెద్దదిగానూ, టేలిపోనూ,ఇద్దరు ముగ్గురు పనివాళ్ళూ, ఫాన్లూ.తివాచీలూ,ఈ అట్టాహాసమంతా ఏర్పాటు చేసుకోవాలని కూడా మంజరి అనుకొన్నది. ఏం చెయ్యాలన్నా ముందుగా చలపతి కి తను సంప్రదించాలి. అతని అనుమతిమీదనే ఎ మార్పులన్నా చెయాలి. అతన్నికాదని, అతని ఇష్టానికి వ్యతిరేకంగా చేయడం భావ్యం కాదని మంజరికి తన ఉద్దేశాలన్నీ చలపటికి చెప్పినప్పుడు, అతను అట్టే ఆశ్చర్యపడలేదు.
"నేనూ ఆ విషయాన్ని గుఱించె ఆలోచిస్తున్నాను. టి.వగర్ లో రెండు మూడు మేడలు చూశాను అవేవి నాకు నచ్చాలేదు అవి మనకు అచ్చి వచ్చే ఇళ్ళు కావు. అందులో ఇదివరకు చేరినవారెవరూ పైకిరాలేదు. అద్దే కాస్త ఎక్కువైనా మనం మంచి ఇంట్లోకే మారాలి.ఇల్లు కుదిరాక గానీ,మనం ఫర్నీచర్ సంగతి ఆలోచించి లాభంలేదు" అన్నాడు చలపతి.
ఈ మాటలట్టున్నప్పుడు చలపతిలో ఉత్సాహామేమీ లేదు. అతను చాలా పరధ్యానంగానూ, అంతో ఇంతో చిరాకుగానూ కనిపించాడు.
ఏమిటని మంజరిఅడగనూలేదు. చలపతి "ఫలానా" అని చెప్పనూలేదు.
రెండుమూడు రోజులదాకా, చిన్న చిన్న ఆర్టిస్టులు చాలా మంది మంజరి ఇంటికి వచ్చిపోసాగారు. వారిలో చాలామంది తన కన్నా అందంగా ఉన్నారనీ,తనకన్నా తెలివైనవారనీ మంజరి హృదయపూర్వకంగా నమ్మిండి,. వారిని చూసి అసూయ పడటానికి బదులుగా ఎంతో జాలిపడింది.
"వర్తున్న వారెందరో ఇలా బూజుపట్టిపోతున్నారు. సినిమా మనుషుల చూపులు పైకిపోతాయే గానీ, కిందను చూడవు ఇది చాలా అన్యాయం" అన్నది మంజరి.
తన అదృష్టాన్ని గురించి, తన భవష్యత్కార్యాక్రమాన్ని గురించి రాజమణి కొక జాబు కూడా రాసింది!
"అక్కా!" ఆనాడు నువ్వేఉద్దేశంతో నన్ను చలపతి వెంట పంపించావో గానీ,ఈ రోజున దాని ఫలితం నాకు కనిపించ సాగింది. ఈ మద్యలో నేను మానసికంగా చాలా వ్యధ ననుభవించాను. ఒక్కోసారి పారిపోయి నీదగ్గరకు వచ్చేదామని కూడా గట్టిగా అనుకొన్నాను. కానీ నువ్వు వప్పుకొన్నావుగాదు. నాకిక మూడేళ్ళదాకా ఆర్దికంగా ఏలోటూ లేదు. రెండుమూడు రోజులలో కాంట్రాక్టుమీద సంతకం చెయ్య బోతున్నాను. ఈలోగా ఆ కంపెనీవారు నాకు మంచి పబ్లిసిటి ఇస్తారట. ఇదంతా లాభాసాటి వ్యవహారం. కాదనీ చలపతి సణుతున్నాడు. అయినా నేనే వోప్పుకొన్నాను. నీనుంచి జాబువచ్చి చాలా రోజులయింది. నీ ఆరోగ్యం ఎలా ఉన్నది? వసంత ఏమంటోంది? మిగతావారు క్షేమమేనా ? ఈ మద్య పోలీసులు నీవున్న ప్రాంత్మీద దాడిచేశారనీ పేపర్లో చదివాను. నీకేమీ ఇబ్బంది కలగలేదు గదా! నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అ చెక్కు మార్పించగానే నీకు కొంత పంపుతాను. దాదాపుగా నేనిక్కాడ స్టిరపడినట్లే లెక్క. త్వరలోనే నువ్వూ, వసంతా ఇక్కాడికి రావలసి ఉంటుంది. నేనిక్కాడ సుఖంగా ఉంటుంన్నప్పుడు మీరింకా ఆ పాడుపనిలో ఉండటం నాకిష్టంలేదు. తొరగా జవాబురాయి. ఇల్లు మారాలనుకొంటున్నాను. ఉంటాను-
నీ చెల్లెలు,
-మంజరి."
ఉత్తరం తాయారు చేతికిచ్చి పోస్టు చేయించింది. ఈ జాబు చూసి రాజమణి ఏమనుకొనేదీ ఉహించి మంజరి మురుసుకొన్నది.వసంత, మద్రాసు ప్రయాణంకోసం పరవళ్ళు తొక్కుతూ, ఉంటుందనీ, ఈ సందడిలోపడి అది ఖాతాదారుల్ని కూడా సరిగ్గా చూడక పోవచ్చు ననీ,మందరి ఊహించింది.తనకు జయా ఫిలింస్ లో కాస్త స్టాయి చిక్కాక. వసంతనుకూడా చేర్పించాలనుకొన్నది. పెద్ద పెద్ద స్టార్సు చాలామంది చిన్వారిని చిన్న చూపు చూస్తూ వుంటారని, వారిని పైకి రాకుండా అణగతొక్కుతుంటారనీ, కాస్త కనుముక్కుతీరు సజావుగా ఉన్నవారు., తమ ప్రక్కన యాక్టు చేయడానికి వొప్పుకోరనీ, సరోజ చెప్పింది. వారిముందు తాము వెలాతెలా పోవలనివస్తుందేమోనన్న భయమే దీనికి కారణమని కూడా సరోజ చెప్పింది. అభిమందించడానికి కొచ్చిన భారతి తోనూ సరోజతోనూ ఈ విషయం స్పష్టంగా చెప్పనే చెప్పింది.
ఈ పెద్దవాళ్ళందరూ, ఒకప్పుడు చిన్నవాళ్ళే నన్న సంగతి మరచి పోకూడదు. తము పడిన కష్టాలు ఇంకోరు పడకూడదనీ వారైనా సుఖంగా ఉండాలనీ అనుకోవాలి గానీ ఇలా మా చకమ్మ కోరికలు కోరకూడదు. నా కేమన్నా అవకాశమంటూ ఉంటే మీకు తప్పకుండా సాయంచేస్తాను నిజంగా నాకన్నా సరోజ చాలా అందంగా ఉంటుంది...."
"అఁనా ముఖం" అని చప్పరించేసింది సరోజ, మధ్యలోనే!
"అది కాదమ్మా! నిన్ను స్తితిచేయడం కాదు - నేను నిజమే చెబుతున్నాను అవునా? నాకన్నాముందునుండి ఈ రంగంలో ఉన్నది. అయినా పట్టుకుని పది సినిమాలైనా వచ్చాయికాదు. వచ్చినవాటిల్లో నైనా, ఒక్క మంచి వేష మన్నా దొరకలేదు.నన్నిడిగితే ఇది చాలా అన్యాయమంటాను. దీన్ని కనీసం నానుండైనా మార్చుకొంటూ రావాలి." అన్నది మంజరి.
"మీ మనస్సు చాలా గొప్పది అక్కా! భగవంతుడు నీకు సర్వసహాయాలు చేయాలని కోరుకొంటున్నాను. అని వాగి నమాస్కారం చేసింది సరోజ."
భారతి కళ్ళు కూడా మిలమిల లాడాయి. నారు వెళ్ళిపోయాక చలపతి, నిప్పులు తొక్కిన కోతిలాగా చిందులువేశాడు.
"నువ్వుసలు రాజీకీయ వాదివి కావలసింది. నా ఖర్మకాలి ఆర్టిస్టువు కాబోతున్నావ్! నీ సంగతేదో నువ్వు చూసుకోమని లక్ష సార్లు చెప్పాను. లోకమరమత్తు పనులు వదిలెయమన్నాను. నా మాటలమీద నీకు గురికుదిరినట్లు లేదు. ఈ తుక్కు సజ్జనంతా ఉద్దరిస్తానంటావు, ఆపని నీవల్ల నవుతుందో కాదో నీకు తెలుసా? పిచ్చి మోహందానా! నువ్వనవసరమైనా విషయాల్లో జోక్యం చేసుకోకు, ఎవరి జాతకానికి ఎవరు కర్తలోయ్? నీకు మూడేళ్ళు ఎగ్రిమెంటు రాకముందు వీళ్ళల్లో ఎవరన్నా నీ ముఖం చూశారా? ఆ భారతి నువ్వేసిన వేషం కోసం డైరెక్టర్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగిందో నీకు తెలుసా? రావుగారు చెప్పకపోయినట్లయితే. వేషం డిఫనెట్ గా భరతికి దక్కేది. అదోచ్చి నాలుగు బులిబుచ్చకం మాటలు చెప్పగానే నువ్వు నీ స్థాయికి మించి వాగేశావు. వాళ్ళు నిన్ను గురించి ఏమనుకొంటారో తెలుసా?" అన్నాడు చలపతి.
మంజరిక్కూడా కోపం వచ్చింది. గట్టిగా సమాధానం చెప్పాలనుకొంది.
"అఁ తెలుసు!" అన్నది మంజరి.
అ సమాధానం వస్తుందని చలపతి కూడా అనుకొని ఉండడు. మొదట దిమ్మర పోయాడు.తరువాత తేరుకొని సన్నగా నవ్వాడు.
"అయితే చెప్పు!" అన్నాడు చలపతి.
'నేను చాలా మంచిదాన్ననుకొంటారు. గర్వంలేని దాన్ననీ సహాయం చేసే గుణున్నదనీ అనుకొంటారు.!" ఈసారి విరగబడి నవ్వాడు చలపతి.
"పిచ్చిదానా! అలా చేస్తే అనుకోరే... నువ్వెంత పూల్ వి అనుకొంటారు.ఇప్పట్లో నీమాట కెమే విలువ వుండదని వారికి తెలుసు. కానీ ఇక ముందేన్నడన్నా నువ్వు గొప్పదానివయితే అప్పటికి పరిచయం పనికొస్తుందని వారి ఉద్దేశం! నిన్ను చూసి వారు రెండు మూడు రోజులు నవ్వు కొన్నా నా కాశ్చర్యంలేదు.... ఈ కాస్త 'కాకా'కే నువ్వు ఉబ్బిపోతే, రేపు నీ చుట్టు ఈ బాపతు జనం మంద కజతారు., అప్పుడు నీవు ఉబ్బాడానికే ఉండదు. అయినా ఈ చిన్న ఎగ్రిమెంటుకే నువ్వు తన్మయం చెంది, నన్ను మరచిపోతే ఎలా? నువ్వేదో గడిచి గట్టెక్కాననుకోవడం భ్రమ! నిజంగా నీ కెరీర్ ప్రారంభమయిందే ఇప్పుడు. కాబట్టీ అమ్మాయి...."
మంజరి ముఖం గోటి గాటుకు నెత్తురు బొట్టులేకూండా ఎండిపోయింది.కనీసం -కళ్ళల్లో నీరు కూడా తిరగలేదు. పెదవులు ఆర్చుకు పోయాడు.
"అదీ సంగతి. నువ్వేమీ అనకు. అనవసరంగా ఏదీ కమిట్ కాకు నేనున్నానుగదా! ఆ విషయాలన్నీ నాకోదిలేయ్" అన్నాడు చలపతి.
మంజరి ఏదో చెప్పబోయింది. చలపతి వినిపించుకోకుండనే వెళ్ళిపోయాడు.
అరగంట కిందట ఎంత ఉత్శాహంగా ఉన్నదో, ఇప్పుడంతకు పదిరెట్లు కుంగిపోయింది మంజరి. మనస్సు నిండా చీకటి పొగలు కమ్ముకొని.ఆవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. శరీరమంతా దిగచెమటలు పోశాయి. మాడులో గునపంతో పొడిచినట్లు పోటు ప్రారంభమైంది. హయిగా నిద్రపోతే బావుండు ననిపించింది. కానే నిద్రరాదని తెలుసు. మేలుకొని ఉంది ఇంత సంక్షేభానికి తట్టుకో లేదనిపించింది మంజరికి.తాయారును పిలిచి, వందరూపాయల కాగితమిచ్చి, హొటల్ గుర్తులన్నీ చెప్పింది.
"ఓ మీరు ఈడనే కూసోండి అమ్మాయిగారూ! మా పక్కింట్లో డాక్టరుగారున్నారండీ! ఆయనగారు ఇసువంటి సీసాలు శానా అమ్ముతారండీ! అరి కూడా తెసానుండండి అమ్మాయిగారూ!"
పది నిమషాలకల్లా పమిటతో రంగుసీసా, చేతిలో సోడాలతో సహా తాయారు వచ్చింది.ఎంతో అనుభవమున్న దానిలాగా, "ముందు" గ్లాసులో పోసి సోడా కలిపి మంజరికిచ్చింది. అవాసన చూస్తూనే ఆవిడ తల తిరిగిపోయింది.కానీ,అది పుచ్చుకోకపోతే తను నిద్రపోలేదు.కనుక ముక్కు మూసుకొనైనా ఆకాస్తా నోట వేసుకో వలసిందే! మంజరి అపనే చేసింది. తీరా చేశాక మోతాదు చాలదేమో ననిపిస్తుంది. మరో గ్లాసు పుచ్చుకొన్నది. పుల్లని త్రేపు లోచ్చాయి. శరీరమంతా రోమాంచమయింది. గాలిలోకి తేలిపోతున్నట్టుగా ఉన్నదేగాని, నిద్రమాత్రం రావడంలేదు. నిద్రరానిదే లాభంలేదు గనక, నిద్రవచ్చేదాకా "ముందు" పుచ్చుకోక తప్పదు గదా ఈ పంపిణిమీద మరో రెండు గ్లాసులు ఖాళీ చేసింది. మూడు నాలుగు గ్లాసులు ఖాళీ చేసిన సంగతి మంజరికి బొట్టుగా తెలియదు.అప్పటికే ఆవిడ స్వాధీనం తప్పిపోయింది. ఎటువంటి ప్రయత్నమూ లేకుండానే కళ్ళుమూసుకు పోయాయి అంతదాకా, గ్లాసులందిస్తున్న తాయారు, ఆఖర్న మిగిలిన కాస్తమందునూ, నీళ్ళన్నా కలపకుండా పుచ్చుకొని, కటికినేలమీద పడుకొని నిద్రపోయింది.....
చలపతి ఆ రాత్రి రానేలేదు. ఉదయం బోగులాడుతూ వచ్చి, పిడుగులాంటి వార్తను మంజరిముండు పడేశాడు.
మంజరి కొయ్యబారిపోయింది. యిప్పుడేమిటి చెయ్యడం?
"ఏం చేస్తావో చెయ్యి, జయా ఫిలింస్ వారికి రావుగారు మరో కాండిడేట్ ను రికమేండ్ చేశారు.వచ్చే పిక్చర్ లో, రావును బుక్ చేదామని జయావారు, చాలా రోజుల్నించీ అనుకొంటున్నారు గానీ, అతను వొప్పుకోడేమోననీ,అడిగి లేదని పించుకోవాలిసోస్తుందేమోనని వెనకా ముందాడుతున్నారు. ఇప్పుడు వారికో అవకాశం చిక్కింది. అందుకు బదులుగా తమ ఫిక్చర్లో పనిచేయమంటారు. బహూశారావుగారు దీనికి ఒప్పుకోవచ్చు కూడానూ" అన్నాడు చలపతి.
"మనకు ఎడ్వాన్స్ కూడా ఇచ్చారు గదండి!" అన్నది మంజరి.
"ముష్టి మూడు వేలరూపాయలకోసం జయా ఫిలింస్ వారు చూడరు, మూడువేల రూపాయలకన్న నీకన్నావారికి రావుగారు ముఖ్యం"
మంజరి కళ్ళు పూర్తిగా పొడారి పోయాయి.
"అబ్బా" తలపగిలి పోతున్నదండీ!" అన్నది మంజరి."నా కేమీ తోచడంలేదు. మీరేమన్నా చెయ్యగలిగితే చేయండి లేదా భగవంతునికో దణ్ణం పెట్టి మానుకోండి ఇంతకు మించి నేను చెప్ప గలిగిందేమీ లేదు."
చలపతి కింద పెదవికోరుక్కోంటూ సన్నగా నవ్వాడు.
"కేవలం మనమీద కోపంతోనే రావుగారీపని చేశాడు మంజరీ! మనం మూర్తిగారిని కలుసుకొన్నామనీ, ఆయన నిన్ను జయా ఫిలింస్ వారికీ రిక మండ్ చేశారనీ, రావుగారికి తెలిసింది. వెంటనే తను "జ్యోత్స్న " అనే అమ్మాయికి కబురుపెట్టి జయా ఫిలింస్ కు పోను చేశాడు.ఇదంతా నాకు రావుగారి ప్రైవేట్ సెక్రటరీ చెప్పాడు" అన్నాడు చలపతి.
"అయితే మనం యీ ఎగ్రిమెంటుకు నీళ్ళో దులు కావువలసిందేగా?" అన్నది చెప్పాడు. వాడి కేమన్నా మనం ఉపకారం చేయాలి"
"అలాగే చేద్దాం" అన్నది మంజరి.
"జయ ఫిలింస్ వారికి పైనాన్స్ చేసేది మెహతాగారు. ఆయన గనక నిన్ను గురించి ఓ ముక్క చెబితే చాలు. రావుగారి నన్నా వాదులు కొతారుగానీ,మెహతాను జయావారు వదులుకోలేరు."
"అయితే మీరు మెహతాతో చెప్పి చూడకపోయారా?" అన్నది మంజరి.
"నీ పర్మిషన్ కోసం చూడకుండానే ఆ పనీ చేసుకొచ్చాను. రాత్రల్లా ఇందకోసమే తిరిగాను మంజరీ! మెహతాతో ఇంటర్వ్యూ దొరకడమే బ్రహ్మప్రళయం, ఆయనతో నేనీగొడవలన్నీ చెప్పలేదు. మంజరి అనే అమ్మాయి ఓ చిన్నపార్టీ ఇవ్వ దలుస్తున్నదనీ, డానికి మీరు చీప్ గెస్టుగా ఉండాలనీ అన్నాను.మెహతా ఎంత వ్యాపారదక్షుడో అంత శృంగార పురుషుడు. దేవుణ్ణి కాదని బ్రతకవచ్చుగాని ఆయన్ను కాదని, ఒక్క కంపెనీ సినిమా తీయలేదు. దాదాపు అన్ని కంపెనీలకూ ఆయనగారు పైనాన్స్ చేస్తుంటారు. మరి ఆయన మాటకు కాకపోతే ఇంకెవరిమాటకు విలువ ఉంటుందమ్మా?" అన్నాడు చలపతి.
మంజరి పలకలేదు.
"సిద్దాన్నం చేతులారా పాడు చేసుకోనడం దేనికని, నేనీపార్టీని ఎరేంజ్ చేశాను.
జయా ఫిలింస్ తో ఎగ్రి మెంట్ పోయినందుకు నాకు భాధలేదు, కానీ,మనం తలపెట్టిన పనిలో అపజయం ఎదురుకాకూడదు అదీ నా పట్టుదల వజ్రాయుధంలాంటి వాణ్ని నీకు పరిచయం చేస్తూన్నాను. అతని చేత నువ్వేమయినా చేయించవచ్చు. ఐతే నువ్వనుకొంటున్నంత తేలికగా మెహతా లోమ్గాడు అతన్ని లోంగదీసి జయా వారికి చెప్పించుకో వడమన్నది. కేవల నీ మీదనే ఆధారపడి వున్నది. నువ్వూ పనిలో సక్సెస్ అయ్యావో - నీ రధానికి రంగంలో ఇహ అడ్డేలేదు" అన్నాడు చలపతి.
చలపతి ఉద్దేశాన్ని ఎప్పుడో పసిగట్టింది మంజరి! ఇలా ఎంతమందితో తను "చనువుగా" ఉండా లో భోదపడలేదు, వీరందరి అవసరమూ తనకు ఉంటుందనీ, నీరి దయాధర్మాలమీదనే తన భవష్యత్తు ఆధారపడి వుంటుందనీ. ముందుగా తెలసిస్తే అసలు తానీ రంగంలోకి రాకనేపోవునేమో! తీరా వచ్చాక మేలబంటిదాకా దిగబడి పోయాక,వెనక్కు రావడంకన్నా పూర్తిగా మునగడమే ఉత్తమం!
చాలా నిరాడంబరంగా పార్టీ జరిగింది. మెహతాను మంజరికి లాంఛన ప్రాయంగా పరిచయం చేశాడు చలపతి.
"ఇదో బ్రహ్మండమైనా పార్టీ అని మీకు కలిగిస్తే నన్ను మన్నించాలి. కేవలం కుటుంబంలో జరిగినట్టు జరుపుకుంటున్నాం. మంజరి కొత్తగా ఈ ఇండస్ట్రీ లో కొచ్చిన ఆర్టిస్టు. మీవంటి వారి ఆశీర్వచనం ఆవిడకు కావాలి.మీ పేరు చెప్పుకొని పైకొచ్చినవాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకొన్నవాళ్ళంతా ఈనాడు టాప్ రాంకులో ఉన్నారు..... నన్ను నేలరోజుల్నించీ ప్రాణాలు తీస్తుంది. మిమ్ముల్ని చూపించమని, ఈ రోజుగానీ,ఆ అవకాశం చిక్కలేదు. నా పనేదో ఇక అయిపోయింది మీరిద్దరూ పెర్మిట్ చేస్తే నేనలా వెళ్ళి ఓ సిగరేట్ కాల్చుకోస్తాను.....
మెహతా "నో నో " అంటూండగానే చలపతి వెళ్ళిపోయాడు. గదిలో ఇద్దరే మిగిలిపోయారు. మెహతాకు ఇటువంటి సంఖతనాలు చాలా మామూలు,మంజరికూడా ఈ విషయంలో బాగా ఆరితేరిన ఘట్టం. తనభవిషత్తు ఈ బొజ్జగాడి చేతుల్లో ఉన్నందును కొన్నప్పుడల్లామెహతా మీద ఆవిడకు అసహ్యం వెయసాగింది. కంచి మేకలాగా యెప్పుడూ ఏదో నవుల్తూ, తలనుండి కాళ్ళదాకా ఎత్తుపల్లాలు భవిషత్తును నిర్ణయించటం కన్నా దౌర్భాగ్యం లేదను కొన్నది. మంజరి తను లోగడ మాదిరిగా 'వ్యాపారం' లో ఉండేది. కానీ ఇప్పుడల్లాకాదు. తను వీడికోసం పరవటిల్లి పోతున్నట్టు నటించాలి. వీడి దాహాన్ని తీర్చాలి. అందుకు బదులుగా వీడు తన ఎగ్రిమెంటును ఖాయపరుస్తాడు. అందువల్ల తనకు సినిమాలో వేషాలు దొరికుతాయి. ఆ వేషాలవల్ల కీర్తి దక్కుతుంది. డబ్బు దక్కుతుంది. అందుకోసం తన చండాలమంతా నోరుమూసుకొని భరించాలి.
మెహతా హిందిలో ఏదో అన్నాడు. మంజరికి హిందీ రాదనీ తెలిసి ఇంగ్లీషులో మాట్లాడాడు. అదీ మంజరీకి తెలియలేదు.
"టామిల్ తెరియా?" అన్నాడు మెహతా. మంజరి మోఎనంగా ఉండటం చూసి "మైగాడ్ !" అన్నాడు.
12
ఈ సంఘటన జరిగిన మూడో రోజున జయా పిలింస్ జనరల్ మేనేజర్ నాగరాజుగారు, పనిమాలా మంజరి యింటికొచ్చి ఎగ్రిమెంట్ మీద సంతకం చేయించుకొని మరీ వేళ్ళాడు. అతనున్న కాస్సేపు చలపతి పోయిన పోకిళ్ళు ఇన్నీ అన్నీ కావు. మంజరికూడా ఆ సమయములో ద్విపాత్రాభినయం చేసింది.వినయానికి లోటు కలగనివ్వలేదుగానీ ఎ మాత్రమో అతిశయాన్ని కూడా ప్రదర్శించింది.
"మరో వారం రోజుల్లో స్క్రిప్టు పైనలైజ్ అవుతుందమ్మా మీ కారెక్టర్ కూడా నిర్ణయమయింది. కాగానే మీకు కబురు పెడతాను.మరినాకు సెలవిప్పిస్తారా?" అన్నాడు నాగరాజు. లేచి నమస్కరిస్తూ.
మంజరి కూడా నమస్కరించింది.
తీరా ఆ పాత్రవిషయం తెలిసేనాటికి, అందులో సినిమా మొత్తంమీద దానికి అట్లే ప్రాముఖ్యం లేదని తెలిసింది. పిక్చరంతటా ఆ హిరోయిన్ కారెక్టర్ కాదు. కనీసం సెకండ్ హిరాయినన్నా కాదు.పోనీ హిరోకో హిరోయిన్ కో,విలనుకో,వాంప్ కో, కామెడి యనుకో,దగ్గర సంబంధాలు న్నదీకాదు. కధలో ఓ బలమైనమార్పుకు అది మంచి కైనా చెడ్డకైనా సరే కారణభూతం కాని పక్షలో, ఆ పాత్రను ప్రేక్షకులు చస్తే జ్ఞాపకం ఉంచుకోరు.
"అమ్మాయీ! ఇదీ సంగతి,ఈ కారెక్టర్ నీకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టేదికాదు.ఇందులో నిన్ను చూసినవారెవ్వరూ, పడి వారాల పాటన్నా జ్ఞాపకం ఉంచుకోరు" అని తన అభిప్రాయాన్ని ప్రకటించాడు చలపతి.
మంజరి అంతదూరం ఆలోచించకపోయినా, ఆ పాత్ర మంచిది కాదనిమాత్రం నమ్మిందిగనక చలపతి అభిప్రాయంతో ఏకీభవించింది.
"అయితే ఇది నావల్ల కాదని చెప్పేయనా?" అన్నది మంజరి.
"అందువల్ల లాభం ఉంటుందనుకోను. నువ్వు వాళ్ళస్టాప్ ఆర్టిస్టువు.వాళ్ళే వేషమిస్తే దాన్ని వెయవలసిందే! కాదనడానికి వీల్లేదు. ఎగ్రిమెంట్ ను బ్రేక్ చేస్తే అందుకయిన ఖర్చులన్నీ నీనుండి వడేసి పిండుకొంటారు" అన్నాడు చలపతి.
"మరి నన్నేగంగలో దూకమంటారండీ! ఈ కారెక్టరేమో పడదాయె. ఇహ ముక్కు మూసుకొని విషం పుచ్చుకోవడంకన్నా గత్యంతరం కనపడ్డంలేదు. అన్నది మంజరి, నుదుటమీద చెమటను పమిటతో తుడుచుకొంటూ!"
చలపతి తక్షణమే ఏమీ చెప్పలేదు. గట్టిగా నిట్టూర్చి ఓ సిగరేట్ వెలిగించాడు. పదినిమిషాల పాటు వరంగాలో అటూ ఇటూ పచార్లు చేశాడు. కళ్ళు రెండూ నులుముకొంటూ., వోళ్ళు విరుచుకొన్నాడు.
