Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 50

                                                       30
మంజరికిప్పుడు పట్ట పగ్గాలు లేకుండా ఉన్నాయి. ఎంత దాచుకొందామన్నా ఈ ఉత్సాహం బయట పడుతూనే ఉంది. కాలం - మరీ నెమ్మదిగా గడుస్తున్నదేమో ననిపించిందావిడకు. ఎందుకయినా మంచిదని, మద్రాసులో వున్న అరికన్ కుటుంబాలు, కొన్నింటిని కలుసుకొన్నది. ఆ దేశంలోని ఆచార వ్యవహారాలను గురించి, సాంఘిక  జీవితాన్ని గురించి ఆవిడ ఎన్నో విషయాలను వారినుండి నేర్చుకొన్నది. ఇది గాక, "అరికా ప్రజలు - ప్రభుత్వము" 'అరికా దేశపు సంస్కృతి'- 'అరికన్ ప్రజల సాంఘిక జీవనం' వంటి పుస్తకాలు చాలా తెప్పించి చదువుకొన్నది. ఈ సమాచారం చాలా పోగుపడిన మాట నిజమే కాని, ఇదంతా ఎప్పుడు, ఎక్కడ ఉపయోగ పడుతుందో ఆవిడకు తోచలేదు. తన కాలంలో ఎక్కువ భాగం, ఈ కుటుంబీకులతో గడపడం దవారా, ఆవిడ అరికా భాషోచ్చారణను అవగాహన చేసుకొనేందుకు వీలు కలిగింది. అలాగే భారత దేశాన్ని సంగ్రహంగా పరిచయం చేసే పుస్తకాలు కొన్ని చదివింది. కొన్ని పుస్తకాల నుండి మంజరి నోట్సు కూడా తీసుకొన్నది.
ఈ గొడవ ఇలా సాగుతున్న సమయంలోనే,. చిన్న చిన్న కంపెనీలవారు, తమ పిక్చర్లు పూర్తి చేసుకోవడానికి తొందర పడసాగారు. దాదాపు మూడు మాసాలపాటు మంజరి అరికా దేశపు అతిధిగా ఆ దేశంలో పర్యటిస్తుందాయే! ఆ తరువాత, ఆగ్నేయాసియా దేశాల మీదుగా ఇండియా కొచ్చేసరికి -ఎంత హీనమైనా ఇంకో మాసం, మాసంన్నర దాకానన్నా పట్టవచ్చు. ఈలోగా ఇంకోదేశ మన్నా అటునుండి అటే - మధ్యంతరంగా -మంజరిని ఆహ్వానిస్తే, ఈ వ్యవధి ఇంకా పెరిగి పోక తప్పదు. అంతదాకా, సినిమా రిలీజ్ కాకపోతే, ఇహ బొచ్చె చేతి కొచ్చినట్లే లెఖ్ఖ. ఈలోగా ఇంకో నాలుగు సినిమాలు రిలీజుకు సిద్ధమవుతాయి. వాటి పోటీని తట్టుకోవడం కష్టం. ఆ తరువాత రిలీజ్ చెయ్యడానికి సీజన్ మంచిది కాదు. ఇవన్నీ ప్రతి ప్రోడ్యూసరూ చూసుకోవలసిందే!
ఎక్కువ స్నిమాలకు ఒప్పుకోవడం ఎంత బుద్ది తక్కువో మంజరికి నసాళిని కంటేంతగా అర్ధమయింది. కాళ్ళా వేళ్ళా పడే వాళ్ళ దగ్గర్నుంచి, కళ్ళెర్రజేసే వారిదాకా ఉన్నారు. వీరందర్నీ తను నయానో భయానో, సంతృప్తి పరచవలసిందే. అరికా ఆహ్వానం చూసుకొని వీళ్ళను కాదనడానికి లేదు. చిత్రమేమిటంటే - ఇంతమంది ఇంతగా తనకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. గనకనే, తనీరోజున అరికాదేశం పోగలుగుతున్నది. ఈ దేశంలో ఎంత మందికిలాంటి మహదావకాశం కలుగుతుంది గనకా!
మంజరి మనస్సిప్పుడు ఇసుళ్ళ పుట్టకన్నా కనాకష్టంగా తయారయి పోయింది. అరికా ప్రయాణ సన్నాహాలు, సినిమాల కురదలాలను పూర్తిచేయడం, ఈ మధ్యనే 'అనారోగ్యం' నుండి బయట పడడం, ఆ దిక్కుమాలిన పత్రిక వాడు 'సశేషం - సశేషం' అంటూ తనమీద వ్యాసాలు రాయడం, వెళ్ళేగాగా పెళ్ళి పనులు పూర్తి చేయమంటూ శర్మ వత్తిడి చేయడం - అదేదో ప్రాజెక్టు పని తమకంపెనీకి ఇప్పించమంటూ గుజరాత్  వ్యాపారి ' త్రివేది' కళ్ళ ముందు లక్షలు మెరిపించడం, రాజన్ సనిగుడు, బోంబాయినుండి 'లాలారాం' టెలిగ్రాములు,ఇంకేదో ఊళ్ళోమూసువేయబోతున్న హైస్కూలుకు భారీ ఎత్తున విరాళ మివ్వమంటూ విజ్ఞప్తి చేస్తూ ఓ ముఠా వొచ్చి పడటం- ఎన్నింటినని ఆవిడోక్కటే చూసుకొంటుంది? పోనీ- ఇంకొకరి నిర్ణయానికి వొదిలే సమస్యలు కూడా కావివి. అవునో కాదో తను చెప్పాలి. ఎ సంగతి చెప్పాడానికయినా తానా విషయాన్ని క్షుణ్నంగా అర్ధం చేసుకోవాలి.తనకు రవంత వెసులుబాటు దోరికుతే, ఇలాంటి బోడి సమస్యలు లక్షసార్లు చేసుకొంటుంది. కానీ అ వెసులుబాటేది!
ఏది ఏమయినప్పటికకీ, తను వెళ్ళేలోగా ఈ బీరకాయపీచును ఏదో విధంగా వోదిలించుకోవాలని, తనతోబాటు అమెరికా పోగూడదని మంజరి తలపోసింది. శర్మ పెళ్ళిని మాత్రం - తను తిరిగి వచ్చిందాకా వాయిదా వేసింది. సరా సురోపడి చాలావరకు కొద్దికొద్దిగా ఉన్న సినిమాలునంతా పూర్తిచేసింది. హైస్కూలువాళ్ళకు వేయిన్నూట పదహార్లుకు ఓ చెక్కుపంపించి, ఇంతకు మించి నా వల్లకాదు' అను కూడా ఉత్తరం చివరన ఓ ముక్క చేర్చండి.తనకిప్పుడు తీరికలేదనీ, మళ్ళా తను తిరిగిచ్చిందాకా ఆగే పక్షంలో, ప్రాజెక్టు కాంట్రాక్టు వ్యవాహారం గురించి చేయ గలిగిందేదో చేస్తానని, త్రివేడికి చెప్పిపంపేసింది. లాలరాంకు - తనోచ్చినప్పుడు అన్ని వివరాలూ మాట్లాడుకొందామని వైర చేసింది.
ఎంత తొందరపడ్డా మూడున్నర మాసాలకు పైగా పట్టింది ఫార్మాలిటిస్ అన్నీ పూర్తి కావడానికి. ఇంకో పది రాజులకు ప్రయాణమనగా, మద్రాసులో ఉన్న పెద్ద పెద్ద సినిమా కంపెనీలు, డిస్టిబ్యూటర్లు,ఆర్టిస్టులు,పూట కొకరు చొప్పున మంజరికి పార్టీ లివ్వసాగించారు. తొలిగా పార్టీ ఇచ్చిన పెద్దమనిషి రావుగారు. ఆయనా సందర్బంలో చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చాడు.
"మంజరి గారు విదేశాలకు వెళ్ళడంమంటే, మద్రాసు సినీ పరిశ్రమ వెళ్ళడమన్న మాటే! ఆంద్ర చలన చిత్రం కలామతల్లీ, తన ప్రజ్ఞా ప్రభావాలను దెశదేశాలలోనూ ప్రదర్సించగల మహాదవకాశం ఈ నాటికైనా లభిచునందుకు చాలా సంతోషం.ఆమె మజరిగా కాక - మనమదరి ప్రతినిధిగా, అమెరికా దేశం వెళ్ళుతున్నదని నేను మనస్పూర్తిగా భావిస్తున్నాను. ప్రాచ్య పాశ్చాత దేశాలు నాగరికతలు భిన్నమైనా వైనప్పటికీ, వాటి పునాదులు వొక్కటే ననడంలో సందేహంలేదు. ప్రజల హృదయాంతరాలలో, నారి జీవన విధానములో ఈ పునాడులున్నాయి. బాహ్యంగా, ఎంతో వైవిద్యంతో ఈ తెండు సంస్క్రుతులకూ మంజరి వారిది వంటి వారిని నెఉ హృదయపూర్వకంగా నమ్ముతున్నాను" ఈ దోరణిలో ఆయన అరగంట సేపు మాట్లాడారు. మంజరి అరికా దేశం వెళ్ళాడనికి, ప్రాచ్య పాశ్చాత్య సంస్క్రుతులకూ సంభంధమేమిటని అడిగిన వాడొక్కడు లేడు. ఇటీవల రావుగారు అబివృద్ది పరచిన లలితా కళ్ళలో 'ఉఅపన్యాసం' వొకటి.అది ఎ సంధర్బం కానీయండీ., ఆయన గారు,కళ,సంస్కృతీ,సాహిత్యం,సజనాత్మకత, సస్వైక్యం, అది బౌతిక పరమార్దం.తాదాత్మ్యం, భావవ్యజనం, వగైరా వగైరా పదాలను రెండేసి నిమిషాల కొకటి చొప్పున పేల్చిపారేయడం అభ్యసించారు.దీనివల్ల వారికి 'నరన తో బాటుగా ఇంకా అనేక విషయాలలో పరిపూర్ణమైన ప్రవేశమున్నదన్న భ్రమ ఏర్పడసాగింది.బాగా తెలిసిన వారికి రావుగారితో విరోధం పెట్టుకోవడం ఇష్టం లేదు. ఏమీ తెలీనవారు ఇదంతా నిజమేనని గాడంగా విశ్వసించారు. యికరావుగారు ధోరణికి అద్దే మున్నది?
ఆఖరకు విజయ. చంద్రం కూడా బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చారు. లోలోపల ఎన్ని కలతలున్నా అందరూ కలిసికట్టుగా- కనీసం పైకయినా -ఆ పది రోజులూ పని చేశారు. ఈ పార్టీలతో ఊపిరాడక చచ్చేటట్టున్నాను. ఖర్మకాలి నా జాతకంలో అరికా దేశం వెళ్ళేరాత ఉన్నదో లేదో' అన్నది మంజరి చాలా సార్లు విసుగుతో.
చలపతి - ఓ పర్దా మనిషిని - పదహారణాల తెలుగు వాణ్ని - ఓ రాత్రిపూట పట్టుకొచ్చి మంజరికి పరిచయం చేశాడు.
"ఎవరు?" అన్నది మంజరి ఆ పదహారణాల తెలుగు వాడికి నమస్కారం చేస్తూ.
"నా స్నేహితుడు, విజయవాడలో పుస్తకాల కంపెనీ పెట్టుకొన్నాడు. పోటీవల్ల పైకిరాలేక పోతున్నాడు. మీ పుస్తకం వేస్తాట్ట. మీ చేత 'సరే' అనిపించుకు పోదామని-" అంటున్నాడు చలపతి.
"నా పుస్తకమేమీటి చలపతీ!" అనేసింది మంజరి.
అన్న తరువాత నాలుక కోరుక్కున్నది. చలపతి ఆ పెద్దమనిషితో చెప్పివుడడమే జరిగితే, పాపం- అతనేమయిపోతాడు?
"అదేనండీ!" అంటూ ఎంతో వినయంగా సమాధానం సమాధానం చెప్పసాగాడు చలపతి, " మీ జీవిత చరిత్రను, సచిత్రంగా ప్రకటిస్తానంటున్నారు......"
"సరే!" నన్నది మంజరి అయేమయంగా.,
"నువ్వు పద కిష్టయ్యా! అమ్మగారు "సరే" నన్నారుగా, మిగతా విషయాలు నేను మాట్లాడివస్తాను....." అంటూ ఆ పదహారణాల తెలుగువాణ్ణి అవతలకు పంపేశాడు చలపతి.
తీరా అతను వెళ్ళిపోయాక "ఎమీటీ కధంతా?" అన్నది మంజరి, కనుబొమ్మలు చిట్లిస్తూ.
"ఏమిలేదు మంజూ. నువ్వాల చూస్తూవుండు - నీ చేత అద్బుతాలు చేయించే పూచీ నాది! నిజీవిత చరిత్ర సిద్దంగా ఉన్నదనీ, దాన్ని పుస్తకంగా వేస్తే వేళ కాఫీలు అమ్ముడవుతాయని, మాకిష్టగాడికి చెప్పాను. వాడు 'అలాగే' అన్నాడు.
"వాడు సరేననుకో చలపతీ! ఆ కిష్టయ్యతో అట్లా ఎందుకన్నావ్?" అన్నది మంజరి.
"నిన్నేందుకు అరికా, దేశానికి ఆహ్వానించారో, చాలా మందికి తెలీదు. డానికి బలమైనా భాక్ గ్రౌండ్       మనము ఏర్పాటు చేసుకోకపోతే నలిగురు నాలుగు మాటలు అంటారు. ఇప్పుడు పార్టీల్లో నిన్నకాశానికి ఎత్తేస్తున్న వారంతా నువ్వంటే యిష్టముండే ఆపని జేస్తున్నా రానికోకు.ఎంతమంది లోలోపల కుళ్లుకుపోతున్నారో నాకు తెలుసు... వాళ్ళందరకూ సమాధానంగా ఉండేలాగున, ఈ పుస్తకం తయారు కావాలి. ఈ కిష్టైగాడు న్యూస్ ప్రింట్ కోసం ఇక్కడి కొచ్చాడు. పనిలో పనిగా ఈ పుస్తకం తగిలించాను" అన్నాడు చలపతి.
"మరి రాయలిగదా!"
"రాయాలి, నువ్వోచ్చేదాకా, ఈ శర్మగాడు చేసేపనేమిటిట? ఈ లోగా దాన్ని తాయరు చేస్తాను. నువ్వు ఎప్పటికప్పుడు. అరికా నుండి న్యూస్ పోటోలు పంపుతూ ఉండు.మేమిక్కడ గాని కాఫీలు తీసి బాగా పబ్లిసిటీ యిస్తాం. అలాగే నీగురించి ఆదేశంలో పడిన న్యూస్, నీ పోటోలు పభ్లిష్ చేసిన పత్రికలు, నీ ఇంటర్వ్యూలు, వచ్చిన మాగజైన్లు..... ప్రముఖులను నువ్వెప్పుడెప్పుడు కలుసుకొన్నదీ తేదీలు, వేళలూ, నీకు అతిద్యంమిచ్చిన వారిపేర్లు, నీకు చేసుకొని అట్టే పెట్టు. లేదా- ఎరోజు విశేషాలు, అరోజునేరాసి మాకు పంపించు - అవన్నీ మేము జాగ్రత్త పురుస్తాం. నువ్వు తిరిగొచ్చాక....."
"ఊఁ" అన్నది మంజరి అతను ఆగడం చూసి.
"వీటి సాయంతో నువ్వో పుస్తకం ప్రచురించవచ్చు. నీ జీవిత చరిత్రకన్నా నీవు రచించిన ఈ పుస్తకం ఇబ్బడి ముబ్బడిగా అమ్ముడుపోతుంది.... ఎందుకూ నవ్వడం.... అమ్మకం కాదనా నీ అనుమానం"   
"కాదు... నేను రాయడమేమిటాని" అన్నది మంజరి.
"సరే! ఏదో చెయ్యి..... అన్నట్టు ణ వెంట నువ్వుకూడా రావడానికి వీలుపడుతుందా? బహుశా అలా కుదరదనుకొంటాను. అలాంటి అవకాశం ఉంటే ఎంత బావుండును!" అన్నది మంజరి.
ఆవిడకు తనమీద అమ్తకడ్డు అనురాగం ఎందుకేర్పడిందీ చలపతికి తెలియలేదు. ఆ ఆనందంలో ఉక్కిరి బిక్కిరయి అతనింకో సూచన కూడా చేశాడు.
ఆ దేశం వాళ్ళకు వ్యాపారమంటే చాలా ఇష్టం. అందుకోసం ఎంత దూరదేశమయినా పోతారు. లాభాలోస్తాయనుకొంటే, ఎంత పెట్టుబడి పెట్టమన్నా పెడతారు. నీకక్కడ అబాపతు మనుషులు తటస్థపడితే- తప్పకుండా ఎదురవుతారనుకో- ఈ విషయం కదిపిచూడు.... ఎందు కంటున్నానంటే అమ్మాయ్... ఎంతకాలం కొట్టుకుచచ్చినా ఈ సినిమా ఫీల్డు నమ్మతగింది కాదు. ఎప్పుడో వొకప్పుడు మనం చల్లగా తప్పుకోవలసిందే! ఆ నాటికి మన చేతిలో ఏముంటే అదే మనకు దక్కుదల. ఆ నాలుగు రాళ్ళూ మార్చుకొని తింటుంటే  రాళ్ళూ మార్చుకొని తింటుంటే ఎంతకాలం వస్తాయి గనక?  తీయడం ప్రారంభింస్తే కొండల్లాంటివి తరిగిపోతాయి. ఇహ నీ బోడి సంపాదనోక లెక్కలోది కాదు. అంచాత - తెలివిగా-ఈ లోగానే., ఏదో వో ఇండస్ట్రీ ప్రారంబించావేఅనుకో! బాలారిష్టాలన్నీ గడిచి,అది నిలబడగలిగేనాటికి, నువ్వూ ఈ ఫీల్డు నుండి రిటైరవుతావు. కడుపులో చల్ల కదలకుండా, ఈ ఇండస్ట్రీస్ చూస్తూ కూచోవచ్చు. నువ్వయినా నేనయినా ఎంత కాలమని ఈ లాయసాపడగలమొ చెప్పు?" అని బోధించాడు చలపతి.
'అబ్బే అదికాదు" అన్నది మంజరి తననుతాను సర్దుకుంటూ. నువ్వెంత దూరంగా ఆలోచిస్తావో తలచుకొంటే ఆశ్చర్యం వేస్తుంది చలపతీ! భగవంతుడు నాకీ తెలివి,ఏమ్డుకివ్వలేదో ననుకొంటాను చాలాసార్లు."
"లోకం భగ్గుమని మండిపోయేదే నా తల్లీ!" అనుకొన్నాడు చలపతి.
పైకిమాత్రం__
"ఆ సింగినాదం తెలివితేటలు పోనిస్తూ" అన్నాడతను.
ఇంకా అక్కడే వుంటే ఏమేం చెబుతాడోనని, ఏదోపని పురమాయించి అవతలకు పంపించేసింది మంజరి. అతగాడు వెళ్ళాక,ఆ వెళ్ళిన దిక్కుగా మేటికలు విరిచిందావిడ.
ఎంత కాదనుకొన్నా చలపతి చెప్పిన మాటలే చెవుల్లోగింగురు మంటున్నాయి.తనకింకా ఎక్కువకాలం ఈ రంగంలో చోటుండదని ఎప్పుడో ఊహించింది మంజరి. ఈనాడు పడిగాపులు పడుతున్న జనమే రేపు తను కనిపిస్తే చిదరించుకోవచ్చు. అయితే ఆదశ రావడానికి హీనమైనా ఇంకో పదిసంవత్సరాలు పడుతుంది. ఈ లోగా తనపేరు గీటిలాగా వెలగవలసిందే! తనమాటకు ఎదురుండకూడదు. ఇక ముందెప్పుడో,ఏదో అవుతుందని ఆ అయ్యేదాన్ని తలుచుకొంటూ ఇప్పటినుండే మధన పడటం మాత్రం ఏం భావ్యం గనక! ఆ పదహారోనాడు,తను ఇబ్బంది పడవచ్చు పడకపోవచ్చు. అప్పటి స్టితిని చూసి జడుసుకొని,తానీ నిమిషం నుంచే హడలుకు చావడం కేవలం అనవసరం! ఉన్నంత వరకూ నిప్పులాగా మండవలసిందే! లేనప్పుడు బూడిద కమ్ముకొని మగ్గిపోవలసిందే! కాకిలాగా పదికాలాల పాటు ఉసూరు మంటూ బతకడంలో అనందం లేదు....
ఆ రాత్రి నిద్రపడుతుందన్న ఆశ బొత్తిగా లేకపోయింది మంజరికి! మనస్సును కుదుట పరుచుకొందామనుకొన్న కొద్దీ, అది చెల్లాచెదురు కాసాగింది. పోనీగదా గట్టిగా కళ్ళు మూసుకొంటే- కళ్ళు తెరచినప్పటి విషయాలే మెదలుతున్నాయి.... పూర్వం లాగా "పానీయం పుచ్చుకొంటే, నిద్రముంచుకురావడం లేదు. నిద్ర సంగతి దేవుడుకి తెలుసు-కనీసం-హైలెవెల్ లో మత్తుకూడా కలగడంలేదు. నిద్ర తీసుకొన్నామన్న సంతృప్తి తప్ప ఆ తీసుకోవడంవల్ల- పూర్వం అనుభవించిన ద్రీలింగ్ అనుభవంలో కొచ్చి ఎంతకాలమయిందో! తనొక వేపున ఒక్కొక్క మెట్టే పైకెక్కిపోతూ ఉంటే, ఇంకోవేపున మామూలు మనుషులకుండే సుఖ సౌఖ్యాలు కూడా లేకుండా పోతున్నాయి., అయినా,సంపాదన మీద, కీర్తిమీద తనకింకా యావపోలేదు! మనిషి దుఃఖబంధంనుండి తప్పుకోలేనట్లే సుఖబంధాలనుండి కూడా తప్పకోలేడేమో ననిపిస్తుంది!"
అనవసరంగా అవలించి,అంతకన్నా అనవసరంగా వొళ్ళు విరుచుకొని పక్కమీద అటూ ఇటూ పొర్లింది మంజరి! గడియారం టిక్కు టిక్కులు,దూరంగా పహరావాడి బూట్ల చప్పుడు తప్ప, ఇంకేం శబ్దమూ వినిపించడంలేదు.
రేపీ వేళకు తను డిల్లీలో ఉంటుంది. ఆ తరువాత, బొంబాయి. అటునుంచి బీరూట్, లండన్-అలా- నగరం నుండి నగరానికి, దేశం నుండి ఇంకో దేశానికి రివ్వున ఎగిరిపోతూ-
ఈలోగా సర్దుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకైనా మంచిది, పత్రికల వాళ్ళకో పార్టీ ఇవ్వమన్నాడు శర్మ. ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి డిన్నర్ ఏర్పాటు చేయడం బావుంటుందన్నాడు చలపతి.తను దానికీ దీనికి కూడా తలూపింది.ఇన్నీంటికి చలపతి ఆ ఏర్పాట్లేమన్నా చేశాడా లేదా?
మంజరి చలపతి గదికి ఫోన్ చేసింది. బెల మోగుతున్నదే గానీ ఎవ్వరూ ఎత్తలేదు.
"ఉత్త దున్నపోతు"అనుకొన్నది మంజరి.
"ప్రతిదీ నేను కనుక్కొంటూ ఉండాలి. ఏ మాత్రం కను మరిగినా,ఏదో పీకలమీదకి తీసుకొచ్చి పెడతారు.ఈ తెలివి తక్కువ సజ్జుతో ఇక వేగలేను" అని గొణిగింది మంజరి.
ఆ వెంటనే ఆవిడ కింకో విషయం కూడా జ్ఞాపకం వచ్చింది! ఇంతవరకూ జరిగిన ప్రయత్నల్లోనూ, వాటి జయాపజల్లోనూ, తన పాలెంత? చలపతి, శర్మల పాళ్ళెంత? వీరు గాక- ఇంకో రేవరన్నా అయితే. తనిన్ని పనులు సాధించగలిగేదేనా? వీరయినా ఇంకొకరి కోసం, ఇంతలా  శ్రమ పడతారా? పడతారని చెప్పడం సాహసమవుతుంది. అయినప్పుడు ద నెందుకలా వారిమీద చీటికీ మాటికీ కస్సు బుస్సు మనడం?
మంజరి తల చిట చిట లాడిపోయింది. డ్రాయరు సోరుదు లోంచి సీసాలాగి కొన్ని బిళ్ళలు మింగి, నీళ్ళు తాగింది. బిళ్ళలు గొంతులోనే చిక్కడినట్లనిపించింది. ఇంకో గుక్కెడు నీళ్ళు గుటక వేసింది.
తన గదిలో ఈ పక్కమీద పడుకోవడానికి- బహుశా అదే ఆఖరు కావచ్చు. తను దేశాలనుండి తిరిగొచ్చాక బొంబాయిలో స్థిరపడి పోదామనుకొంటున్నది. అక్కడ- తనకు అన్నివసతులూ సక్రమంగా ఉంటే - మద్రాసులోని ఈ ఇళ్ళను, వసంతకో, రాజమణికో, ఇస్తుంది- ఇష్టమయితే- బుద్దిపుడితే లేదా- తెలియకుండానే రాసిపారేస్తుంది! అదీ కానప్పుడు మద్రాసుయూనివర్సిటీకి డొనేషన్ కింద ఇచ్చేస్తుంది. తెలుగుదాన్నయి ఉండుకూడా అరవ విశ్వవిద్యాలయానికి రాసిచ్చినందుగ్గాను, తెలరుగు పత్రకలు తనను దుమ్మెత్తి పోస్టే పోయవచ్చు. కానీ తన సంపాదనలో ఎక్కువ భాగం తమిళ దేశం నుండే వచ్చింది. వాళ్ళడబ్బు వాళ్ళకిస్తే తప్పేముంది?
అయినా తనకివేం ఆలోచనలట! అన్నీ అప్పగింతలు పట్టవలసిన అవసరం ఇప్పుడే మొచ్చిందీ?
ఏమొచ్చిందో మంజరి చెప్పుకోలేక పోయింది. ఎందుకంటే అప్పుటికే ఆవిడ మనస్సంతా మబ్బు కమ్మినట్లుయిపోయింది. కనురెప్పలు బరువుగా కిందికి వాలిపోతున్నాయి. మేడదాకా పచ్చడం లాక్కుని పక్కకుతిరిగింది మంజరి!
డ్రాయర్ సోరుగులోని 'గార్దినాల్' సీసా బోసిగా ఆమెవేపు చూసింది.
-ఆ మర్నాడు, అక్షరాలా మంజరికి ఊపిరి ఫీల్చుకోవాడానికైనా తీరిక లేకపోయింది. మద్రాసులోని పిలిం ప్రముఖ లోక్కొక్కరే ఆమెను అబినందించిపోసాగారు. కొందరి దగ్గరకు ఆమే స్వయంగా వెళ్ళి వారి ఆశీర్వాదాలు పుచ్చుకొని మరీ వచ్చింది. మాధవరావుకు, రామచంద్రానికి వారంరోజుల కిందట టేలిగ్రాములు ఇచ్చింది. వారినుండి జవాబు లేదు.
"రిప్లయి పెయిడ్ టెలిగ్రాం ఇవ్వండి" అన్నది మంజరి ఆ రోజు ఉదయమే.
శర్మ ఇచ్చానన్నాడు కూడాను. కానీ జవాబులేదు. ఇంకోసారి కనుక్కోవడానికి శర్మ కూడా అందుబాటులో లేడు. అతను బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు. సినిమా పత్రికలకు, ప్రశ్నలు రాసేవాళ్ళని కూడా ఆ పార్టీకి ఆహ్వానించాడతను.
"చాలా జింజింఖానా పెట్టుకొన్నావయ్యా శర్మాజీ!" అన్నది మంజరి.
"మన వసంతా వారితోనే ఉన్నది. రేపు మీ న్యూస్ వెయవలసినవాళ్ళూ, మీ బొమ్మ అచ్చు వేసేవాళ్ళు వీళ్ళే! ఈ జనం గనక 'ఆసింగ్గినాదం' అనుకోన్నారో, నీరు అరికాదేశం వెళ్ళినా అంతరిక్షానికేళ్ళినా, మీ పొరుగువాడికి తెలీదు. అంచాతనే నేనిన్ని బదనలు పడుతూంట-" అన్నాడు శర్మ.
అతనింకో విశేషం కూడా చెప్పాడు.
"ఈ పార్టీకి కొంతమంది అరికా దేశం వాళ్ళను కూడా పిలిచాను. వారుగానీ, ఇంకెవరన్నాగానీ నిన్ను రకరకాల ప్రశ్నలడిగితే- అడుగుతారనుకో- ఠకామని చెప్పెయ్యి. మరీ కంఠతాపట్టింది వొప్పగించినట్టు కాకుండా- ఆ విషయంతో నీకు క్షుణ్నంగా పరిచయమున్నట్టు మాట్లాడు.... మధ్య మధ్య, కాస్తంత తడుముకొన్నట్ట్లూ, మామూలుగా నువ్వు చేస్తూ ఉండేదే!" అన్నాడు శర్మ.
మంజరి తలూపింది!
ఆవిడ భయపడుతున్నదని కాదుగానీ,ఏదో బెరుకు బెరుగ్గానే ఫీలవుతున్నదనడం మాత్రం నిజం.
ఆ విషయం పార్టీ ఇస్తున్నప్పుడు మరింత స్పష్టంగా తేలిపోతుంది.
"ఈ ఆహ్వానం మీకేరావడానికి ప్రత్యెక మైన కారణం ఏదన్నా ఉందా?" అని అడిగాడోక విలేఖరి.
ఈ ప్రశ్న మంజరి ఊహించనిది. దీనికి జవాబు ఆవిడ దగ్గర సిద్దంగా లేడు. ఆవిడ తత్తరపడుతూ శర్మకేసి చూసింది.
అతనొక పక్కగా రెందు వరసల వెనగ్గా ఉన్నాడు. ఆ సమయంలో శర్మ చేయ్యగిలగిన సాయం కూడా ఏమీ లేదు.
"మీరేం చెప్పలేరా?" అన్నాడతనే!
మంజరి తలెత్తి అందరికేసి ఓ సారి చూసింది!
"మీలాంటి పెద్దల ఆశీర్వాదమే ప్రత్యేకమైన కారణం!" అన్నది మంజరి.
చిన్న కలకలం చెలరేగి సర్దుకొన్నది.
"మన దేశపు సినిమాలు, విదేశీ వాటికన్నా - సాంకేతికంగా తక్కువ స్థాయిలో ఉంటాయిగదా! ఇందుక్కారణమేమిటని అరికా దేశీయులడిగితే మీరేం చెబుతారు?" అన్నాడో విలేఖరి.
"అన్ని సినిమాలూ- సాంకేతికంగా తక్కువ స్థాయిలో ఉన్నాయన్న వాదనతో నేనేకీ భవించలేను. సత్యజిత్ రాయ్ సినిమాలు- ర్ విదేశీ చిత్రాల  స్థాయికి తీసిపోవు" అన్నది మంజరి.
"మరి ఆచార వ్యవాహారాలను చూసి, వారు పరిహసించవచ్చు అప్పుడేం చేస్తారు?" అన్నాడతనే.
"అలా జరగదు. వారు నన్ను కావాలని తమ దేశానికి ఆహ్వానిస్తున్నారు. అదీ ప్రభుత్వ స్థాయిలో ఒక విదేశీ అతిధిని ఇబ్బిందిపడే ప్రశ్నలడిగి అవమానపరుస్తారు. అదీ నేనునుకోను...... దురదృష్టవశాత్తూ అలానే జరిగితే నా నిరసనను తెలియపరచి, నా పర్యటనను రద్దు చేసుకొంటాను."
"హియర్ హియర్ అన్నారెవరో వెనక బెంచీల ముంచి.
"మన సినిమా పరిశ్రమకు, మీ పర్యటన ఎలా భావిస్తుంది?" అన్న ప్రశ్నకు మంజరి మంచి సమాధానం చెప్పింది!
"ఈ రోజుల్లో ఏ దేశపు సంస్కృతి అయినా గరిగీసి, మది గట్టుకు కూచోవడం సాద్యం కాదనుకొంటాను. యూరప్ నుండి ఎంతో నేర్చుకొన్నాయి. అలాగే మన సంస్కృతీ ప్రభావం, ఆగ్నేయాసియాదేశాలమీద ముమ్మరంగా ఉంటే మనమీద - ఇంగ్లాడ్, అమెరికా దేశాల నాగరికత ప్రభావం హెచ్చుగా ఉన్నది. ఇది మనం కాదనలేని సత్యం! ఇందులో ఏది గొప్పది? అన్న ప్రశ్నకు తావేలేదు. దేని గొప్పదనం దానిదే! నేను సాంస్క్రుతిక ప్రతినిది మాత్రామే ఆదేశం పోతున్నాను. ఈ పర్యటనవల్ల కలిగే లాభామేమీటో, ఇప్పటికిప్పుడే నేను అంచనా వేసి చెప్పలేను.ఇటువంటి సహృద్భావ పర్యటన వలన కలిగే ఫలితాలను, గ్రాప్ గీసి చూపెట్టడం సాధ్య కాదేమో మరి! అయినా అరికా దేశీయులకు భారతీయ సాంస్కృతిక జీవనవిధానాన్ని గురించీ, ఆంద్రుల ప్రత్యేకతను గురంచి నాకు తెలిసిన మేరకు చెప్పగలని మీకు మాట ఇస్తున్నాను. నాకు గానీ - నచ్చను తెచ్చే ఏపనీ నేను చేయమని మీకు హామీ ఇస్తున్నాను. అల్లాంటి కార్యాకలాపాలతో పాల్గొనబోనని మీముందు సఫధం చేస్తున్నాను.....
ముందుగా చేసుకొన్న ఏర్పాటు ప్రకారం శర్మ చప్పట్లు కొట్టాడు. నిమిషం తిరుక్కముందే ఉప్పెనలా ఆ ధ్వని అంతటా వ్యాపించింది.
"దేశాలమద్య,జాతుల మద్యా సరిహద్దులు చెరిగిపోతున్నాయి. భూగోళమంతటా వొక వొక ప్రభుత్వం ఏర్పాటుకాగల శుభదినం ఎంతో దూరంలో లేదు. ఇ క్యారాజ్యసమితి- అ తరహ భావనకోక రూపం వంటిది! ప్రపంచ ప్రజానీకమంతా వోకే వ్యక్తిగా నాగరికతా గ్రంధానికి ప్రతి జాతివారూ వొక  అధ్యాయాన్ని చేర్చుతూనే ఉన్నారనీ, తెలియచేయడం నా పర్యటన ముఖ్యాంశం. ఇదేంత  బలంగా నేను చేయగలిగితే నా పర్యటన అంతగా ఫలప్రదమయినట్లు లెక్క.ప్రత్యేకంగా ఫిలిం పరిశ్రమ  కలిగే లాభం కూడా ఉంటుందేమో, నేను చెప్పలేను..... అది- ఆ దేశీయులు, మనతో ఏ మేరన సహకరిస్తారన్న విషయాన్ని బట్టి నిర్దారణ చేయవలసి ఉంటుంది" అన్నది మంజరి.
ఇద్దరు ముగ్గురు విలేఖరులు చిల్లర మల్లర ప్రశ్నలేవో అడిగారు. మంజరి వాటికి చల్లగా సమాధానం చెప్పేసింది. రాజన్ మధ్యాహ్నమే వచ్చాడు. అతనితో వో నిమిషం ఏ కామ్టంగా మాట్లాడదామనుకొన్నది మంజరి.దీనంగా ముఖంపెట్టి.
"ముందు కావలసిన పనులేమో చూడు.మనం తరువాత మాట్లాడుకొందాం!" అన్నడా  పద్దమనిషి.                             అయినా అతని కా అవకాశం చిక్కనేలేదు.
విమానం బయలు దేరడానికి ఒక గంట వ్యవధి ఉమ్దాగానే చలపతి అంగ లార్చసాగాడు.
"నువ్వు చప్పున బయలు దేరాలి. కనీసం పావుగంట ముందైనా అక్కడుండకపోతే బావుండదు" అన్నాడతను.
"అయినా నలబై నిమిషాల టైముందిగా!" అన్నది మంజరి.
ఆ పిల్లకేమో దిగులు దిగులుగా ఉంది.
"ఎంత హీనంగా చూసుకొన్న ఏ రెండో చేరడానికి గంట పడుతుంది. మద్యలో రైల్వేగేటు వేశారంటే చచ్చామన్నమాటే! అందుకనే- అవసరానికి పనికొస్తుందని మన రెండోకారు గేటు అవతలపక్కన ఉంచమని పంపించాను. మరి నువ్వు తేమల డానికి పది నిమిషాలన్న పట్టదా! ఇప్పటి కప్పుడే రెందు నిమిషాలు తిరిగాయి."
రాజన్ లోపలికి పోవడం చూసి ఏదో పనిన్నదానిలాదా మంజరి కూడా లోపలి కొచ్చింది.
"మళ్ళా  రప్పుడు కనిపిస్తావ్?" అన్నాడు రాజన్
మంజరి సమాధానం చెప్పకుండా, అతన్ని కౌగిలించుకొని వదిలేసింది.
"మీరు వచ్చారు గనక సరిపోయింది గానీ, లకపావుతే- కధంతా అడ్డం తురిగి ఉండును" అన్నది మంజరి.
"అదేం?" అన్నాడు రాజన్.
"నేను ప్రయాణం మానేసేదాన్ని!" రాజన్ ఏదో అనబోయాడు. బయటినుండి చలపతి అంగలార్చులు వినిపిస్తున్నాయి మంజరి చప్పున కౌగిలి వదిలి ఇవతలికొచ్చింది.
"శాస్రీగారు పెట్టిన లగ్నం - ఖచ్చితంగా మూడు నిమిషాలు మాత్రమే  ఉంది. నీ సామానంతా కారులోకి సరాం " అన్నాడు చలపతి.
మంజరి ఎదురుగా ఉన్న తిరుపతి వేంకటేశ్వరస్వామి పఠానికి నమస్కరించింది!
"ఇంకొక్క నిమిషమే ఉంది!" అన్నది వసంత డగ్గుత్తికతో.
మంజరి నిశ్శబ్దంగా మెట్లుదిగి, కారులో కూచున్నది.నిమిషం పూర్తయింది. కారు బయలుదే౦రింది.
దోవపొడువునా, మంజరి అబిమానాలు, గుంపుపడి చూడసాగారు. కొంతమంది ఆమె కారు రాగానే "జేజే"లు కూడా కొట్టారు. ఫీచర్ పిలిమమ్సు తీసే ఓ పరోద్యూసర్ ఈ దృశ్యాలన్నీఘాట్ చేశాడు.శర్మగారు స్వయంగా ఏర్పాటు చేసిన పాతికమంది ఫోటో గ్రాఫర్లు దోవపొడువునా, ప్లాష్ లు వేస్తూనే ఉన్నారు.....
విమానశ్రయమంతా ఫిలిం ప్రముఖులతో నిండిపోయింది.... పూలదండలతో  మంజరి పూర్తిగా మునుగిపోయింది. వచ్చే బహుమతులకు అంటూ పొంతూ కనిపించలేదు.
"అహ మీరువెళ్ళి కూచొండి.... విమానం ఇంకో అయిదు నిమిషాల్లో బయలుదేరుతుంది!" అన్నారెవరో....
పూలదండలు, బహుమతులు,వసంతకిచ్చింది మంజరి. ఆవిడ బుగ్గలు పుణికిముద్దాడింది.
"జాగ్రత్త... కనిపెట్టి ఉండు..." అన్నది చెవిలో.
అదే ఆఖరిమాట.
తలోంచుకొని విస విస విమానంకేసి వచ్చింది. లోపలికి పోతూ, ఓ సారి వెనక్కు తిరిగి చూసింది. కొన్ని వందల చేతులు తనను గాలిలో అల్లలాడుతున్నాయి.... మంజరి తన సీట్లో కూచుంది. ఆమె కేమిటోగా ఉన్నది. మనస్సంతా ఏదో వట్టి గిలగిల లాడి పోతున్నట్లునిపించింది.
అద్దంలోంచి, మరోసారి బయటకి చూసిందావిడ, ఆ జనప్రవాహానికి ఓ చివతన, విసిరేసినట్లుగా, రెందు ముఖాలు విమానం కేసి ఆత్రంగా చూస్తున్నాయి. మరుపు మసకలోంచి వారిని గుర్తుపట్ల గలిగింది మంజరి!
అతను రామచంద్రం.!
ఆ పక్కనే నుంచున్నది మాధవరావు!!
నాళాలను బద్దలు చేసుకొని రక్తం పైకి ఉబుకుతుందేమోననిపించిందామెకు.
ఏదో అనబోయిందావిడ-
మరు క్షణంలో విమానం గజగజలాడసాగింది.
మంజరి కింది పెదవి కొరుక్కుంటూ, చివుక్కున లేచి నిలుచుంది.
విమానం బయలుదేరింది.
అద్దానికి ముఖం ఆనించి, విసిరేసి నట్టున్న ఆ ఇద్దరికేసి చూసింది మంజరి!
రామచంద్రం, పై ఉత్తారీయంతో కళ్ళోత్తుకొంటున్నాడు. మాధవరావు అతని భుజాలమీద చేతులు వేసి పరుగెత్తుతున్న విమానం వేపు చూస్తున్నాడు.
మంజరి తన సీట్లో కుప్పకూలిపోయింది. రెందు చేతుల్లోనూ ముఖాన్ని దాచుకొని వెక్కిక్కి ఏడుస్తున్న సమయంలోనే ఎయిర్ హొస్టేస్, చిరునవ్వుతో ఆమె పక్కనే కూచుని ముంగురులను దిద్దసాగింది.
డిల్లిల్లో ఉన్న 48 గంటల్లోనూ, ఏ ఎనిమిది గంటలో తప్ప మంజరి స్థిమితంగా  డేందుకే వీల్లేకపోయింది. ఆవిడ అంతకు ముందే ప్రముఖుడికి జాబురాయడం మంచి పనయింది. ఆయన కారు మంజరికోసం సకల సన్నాహాలతోనూ ఎదురు చూస్తున్నాడు. ఢిల్లీలోని  చాలామంది ప్రముఖులు ఆమెను అతిధిగా ఆహ్వానించారు. కానీ వ్యవధిలేని కారణంగా వాటన్నింటినీ ఆవిడ సవినయంగా కాదనవలసి వచ్చింది. "ఇండో అరికన్ కల్చరల్ డెవలప్ మెంటు సొసైటీ వారు హోటల్ అశోక్ లో బ్రహ్మాండమైన పార్టీ యిచ్చారు. దానికి కళాకారులకన్నా, రాజకీయ వేత్తలు, కోటీశ్వరులు వచ్చారు. ఢిల్లీ ప్రముఖుడు వారిలో చాలామంది మంజరికి పరిచయం చేశాడు. వారందరూ ఆ.డి.పి.తో అతి చొరవగా మాట్లాడటం చూసి, మంజరి ఆశ్చర్యపోయింది.
"నన్ను మాటిమాటికీ 'సార్ సార్' అని పిలవకండి. నా పేరు సక్సేనా? నేను బాగా  అభిమానించేవారు నన్ను 'అండీ' అంటే చాలా బాధపడతాను" అన్నాడు ఢిల్లీ ప్రముఖుడు.
"మీపేరు తెలీకకాదు" అన్నది మంజరి నవ్వుతూ. "మిమ్మల్ని అంత చనువుగా పిలవడం నాకిష్టం లేకే మీరు ఆకాశమంతటి మనుషులు."
"అందరికీనీ? మీ విషయంలో గాదు" అన్నాడు సక్సేనా. తరువాత ఆమెను లోపలికి తీసుకొచ్చి గది తలుపులు వేశాడు.
"మీకిప్పుడా తీరింది! ఇంత కాలం ఏం చేస్తున్నారు?" అన్నది మంజరి, అతను పిచ్చెత్తి పోయేలాగా చూస్తూ.
ఈ అస్త్రం సక్సేనా మీద పనిచెయ్యలేదు. అతను చాలా సాదాగా ఉన్నాడు.
"మీరు నాకేదో అప్పగించారు. చేశాను. మీరు చెప్పిన ఆరు దేశాలనుండీ 'వీసాలు' పుచ్చుకొన్నాను" అన్నాడు సక్సేనా.
"చాలా థాంక్సండీ!" అన్నది మంజరి.
"ఈ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీకుండా ఉంది."
సక్సేనా అటూ ఇటూ చూసి, గొంతు సవరించుకొన్నాడు.
"చెప్పండి? నా చేతిలో ఉన్నదేదైనా నేను చేస్తాను."
"నాకా నమ్మకముంది" అన్నాడు సక్సేనా. "మీరంటే అవసరం లేకపోవచ్చు గానీ నాకో కారు కావాలి. నా మిత్రుడికి దాన్ని ప్రజెంట్ చెయ్యవలసి ఉంది. ఇక్కడ కొనలేక  కాదుగానీ, అనవసరంగా బోలెడంత ఖర్చు చెయ్యడం ఎందుకనిపించి మానేశాను మీరు అరికా వెళ్ళగానే ఓ కారు కొనెయ్యండి? మీరు తిరిగొచ్చేప్పుడు మీతోబాటు ఇండియాకు తీసుకురావచ్చు. అప్పుడు డ్యూటీ ఇంతపడదు. సెకండ్ హాండ్ కదూమరి!"
"ఫారెన్ ఎక్సేంజి కావద్దూ?" అన్నది మంజరి.
"నేను దానిక్కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. మీరు చేయవలసిందల్లా కారు నాది" అనడమే! మీకేమీ అభ్యంతరం లేకపోతే నాకీ ఉపకారం-
"ఎంతమాట!" అని అతని రెండు చేతులూ పట్టుకొని, మృదువుగా నొక్కింది మంజరి.
ఆ రోజు మధ్యాహ్నం బాంబే నుండి 'లాలారాం'-'త్రిపాఠీ'-'జోగీందర్' వచ్చారు.
లాలారాం మిగతా ఇద్దరినీ మంజరికి పరిచయం చేశాడు.
"నేనీ రాత్రికే బాంబే వస్తున్నాను కదా! అంత తొందరపడ్డారేం?" అన్నది మంజరి.
"లేదు మనం మాట్లాడవలసింది చాలా ఉంది" అన్నాడు లలారాం.
"అయితే ముందుగా రాకపొయ్యారా! అసలే నాకు టైం లేదు గదా!" అన్నది  మంజరి కొంచెం విసుగ్గా.
అది గమనించి కూడా ఏమీ జరగనట్లే ఉన్నాడు లాలారాం.
"త్రిపాఠీ పేరు మీకు తెలిసే వుండాలి. అహమ్మదాబాద్ లో రెండు మిల్సున్నాయి. జోగీందర్ బాంబేలో గొప్ప ఆటోమొబైల్ డీలర్. వీరిద్దరితోనూ, నేను బిజినెస్ ను గురించి రాత్రే వో వొప్పందానికొచ్చాను....వింటున్నావా?" అన్నాడు లాలారాం.
"యస్, ప్రొసీడ్" అన్నది మంజరి. "త్వరగా"
"మన పిక్చర్ ఫారెన్ లో -ముఖ్యంగా అరికాలో ఎగ్జిబిట్ చేయడానికి నువ్వు ఏర్పాట్లు చేసి పెట్టాలి. తరవాత - 'ఇండో అరికన్, కొల్లాబరేషన్ పిక్చర్స్ పేరుతో నేనో కంపెనీని ఏర్పాటు చేశాను. దానికి నువ్వాదేశం నుండి కొంత కాపిటల్ పెట్టించాలి. అక్కడి నుండి కావలసినంత డబ్బు మీరిద్దరూ పెడతారు" అన్నాడు లాలారాం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS