Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 51

''భగవంతుడు నాకింత అందమిచ్చినందుకు సంతోషించాలో, ఎడవాలో కూడా తెలీదు..... నా ఫోటోలకోసం, కోట్లాది ప్రపంచ ప్రజలు ఎదురు చూస్తుంటారని తెలిసినప్పుడు ' నేను వారిని పరోక్షంగా భాధపేడుతున్నాన' అనిపిస్తుంది..... కానీ మిదేశం సంగాతేమో నాకు తెలీదు - ఇక్కడ తరాలకున్న వ్వక్తిత్వం చాలా పరిమితం, నిర్మాతలు ఏం చెప్పినా చేయ్యవలసిందే ! ఎవరో నాబోటి మొండి ఘటాలు మాత్రం  కాదని ఎదురు తిరిగి, లేనిపోని చిక్కులు కొన్ని కొని తెచ్చుకొంటారే తప్ప-"
'' దాదాపుగా అక్కడా అంతే!'' అన్నది మంజరి.
''ఈ అందం నన్ను పాడుచేసిందే ననుకొంటాను. దీనికోసం  కోటీశ్వరులైనవారు , నా పాదాల ముందు సాగిలపడి, ఆకర్షనల వలపన్ని, నన్ను స్థిమితంగా ఉండనీవడంలేదు.... ఎక్కడన్నా కాలూని నిలుద్దామంటే నేను నమ్ముకొన్నభూమి,  చూస్తుండగానే కళ్ళముందు కరిగిపోతున్నది.  మళ్లా ప్రవాహంలో దూకి, ఊపిరి తిరక్కుండా ఈదుకు పోవలసిందే ! ఏవో సంకెళ్ళు, తాళ్ళు క్షుద్రమైన నీటిచట్టాలు, అసూయలు- ఇలాంటివి నాకు గిట్టవు. ఇంకొకరికి కోసమని ఇవన్ని నేను నటించలేను'' అన్నది మారిలిన్.
ఆవిడ ఏ విషయం గురించి ఇలా అంటున్నదీ మంజరి గ్రహించింది.
'' మీకు మనుషులంటే 'కసి'గా ఉంటుందా?. అన్నది మంజరి ఆకస్మికంగా అన్న తరువాత, నాలుక కొరుక్కున్నది. ఆవిడతో తననేపాటి పరిచయమున్నదని అలా తూలిమాట్లాడటం? అయినా, మరిలిన్ నోచ్చుకోలేదు. పైగా పాళ్ళన్నీ మెరిసేలాగా నవ్వి, మంజరి చేతిని, మెత్తగా నొక్కింది.
''నాకు  మనుఘులంటే పరమ ద్వేషం ఉంది. కానీ అందరి మీదా కాదు. నన్ను భాదించిన వ్వక్తులన్నా, తరిమికొట్టిన వ్వక్తులన్నా, అడుగడుగునా ఆటంకాలు కల్పించినవారన్నా, నన్ను ఇరుకుల్లో పెట్టి, వొంచి,చీల్చి, తమ అవసరాలు గడుపుకునే వారన్నానాకు మహాద్వేషం. అంతేకాదు - ఆ వ్వక్తులు ఏ తరగతులకు చెందుతారో ఏ వవస్థలకు చందుతారో- వాటిని కూడా నేను నా ప్రతి  రక్తకణంతోనూ ద్వేషిస్తాను..... ఒకప్పుడు, ఈ పరిశ్రమ నన్ను క్షణం నిలబడనీయకుండా తరిమి తరిమి కొట్టింది. నేనెందుకూ పనికిరానని తీర్ఫు చెప్పింది. నామీద, ఫుంఖాను ఫుఖంగా అపవాదులు అబద్దాలు గుమ్మరించింది. తట్టుకొని  నిలబడ్డాను. ఇవ్వాళ నాకోసం నా గుమ్మం ముందు కోటీశ్వరులు, చేతులు గట్టుకుని నిలబడటం చూస్తున్నప్పుడూ, నా కోసం వెయ్యిమంది సెట్మిద నేరిక్షిస్తున్నారని తలిసినప్పుడు నాకు మహా హాయిగా ఉంటుంది.
సాధ్యమైనంత ఆలస్యంగా నేను స్టూడియోస్ కు వెడతాను. నాకోసం ఎదురుచూసి చూసి రానని నిరాసపడి, జరుగుతున్న నష్టానికి ఆందోళనపడి, ఏమి అనలేక, అనకుండానూ ఉండలేని అయోమయావస్థలో పడి, మనుషులు గిజగిజ లాడిపోవటం నాకెంతో ఇష్టం చాలా మంది 'త్వరగా రారాదా?' అంటారు నన్ను , రాలేక కాదు - రావడం కష్టమనీ కాదు. ఒకప్పుడు నేను ఎదురు చుశాను. వీరందరి దయా దాక్షిణ్యాలకోసం, ముష్టివాళ్ళలాగా నిరీక్షిస్తూ కుర్చోవడాన్ని కావాలనే నేను సుష్టిస్తూన్నాను. 'పాపం' అని నేను జారిపోవడమే జరిగితే నాకసి తిరేదేప్పుడు?. ఇంకో జన్మ ఉంటుందో లేదో, నాకు తెలియదు. ఉన్నా నా కిలాంటి  మహత్తరవకాసం అప్పుడు లభిస్తుందో లేదో అంతకన్నా తెలీదు. అందుకనే -ఈ జన్మలోనే, నేను చేయగలిగినవన్నీ చేయదలసుకున్నాను'' అన్నది మరిలిన్ మన్రో.
''మీరు తరచుగా లాస్ ఏంజెల్స్ లోని కంటి హాస్పిటల్ కు పోతుంటారని చదివాను నిజమేనా?. అన్నది మంజరి.
మన్రో ఓ క్షణం అలోచించి-
''నిజమే!'' అన్నది నవ్వి''నే నక్కడే పుట్టాను. బహుశా అందుకే నాకీ పరిశ్రమ మీద ఇంత 'గ్రిప్' ఉన్నదేమో ననుకొంటాను......  నా తండ్రిని నేనెరగను. నా తల్లి పేరు 'గాడిస్ మన్రో' ఆమె మహాభయంకరమైన దరిద్రాన్ని అనుభవించింది. ఆ వారసత్వం నాకూ సంక్రమించింది. కుక్కపిల్ల లాగా, బానిసలాగా, నేను చాలా చేతులు మారాను, ఇంత తిండి లేక రోజులకు రోజులు వస్తున్నాయి, భహుశా మీకు తెలుసమో, నేను నా నగ్న చిత్రాన్ని ప్రకటనలకు అమ్ముకోని బతికాను......"
''పోనీండి!'' అని సర్దబోయింది  మంజరి.
' ఇందులో రహస్యంగానీ, అబద్దంగాని లేదు. అవో మెరుపుల్లాంటి మాటలు తియ్యగా చెప్పి, లోకాన్ని మోసగించ గాలంగానీ, మనల్నిమనం మోసం చేసుకోగలమా? ఆత్మ వంచనను నేను సాహించలేను. అందుకే జీవితంతో రాజిపడలేక పోతున్నానేమో ననుకొంటున్నాను. కొంత మోస, పగ,
కృత్రిమత్వం, నటన, లౌక్యం ఇలాంటి వేవో కొన్ని ఉంటేతప్ప జీవితంలో రాణించలేమని నా నమ్మకం. కానీ ఇవి నాలోలేకపోవడం దురదృష్టం!'' అన్నది మారిలిన్.
''మీరు ప్రపంచ ప్రసిద్ద నటిమణులు గదా - అన్నది మంజరి.
''చస్ దాన్ని గురించి కాదు నేననడం, బ్రతుకుని గురించి అన్నది మన్రోయ ఉద్రేకంగా' నాకూ కోపమనీ' చిరాకు పరాకు లేక్కువని, అహంకారి ననీ అంటారు. నిజమే ! కానీ, నేనిలా కావడానికి కారణాలేవో, ఈ ప్రపంచానికి అవసరం లేకపోయింది. నా ఎనిమిదో ఏట, నేను చీకటి గదిలో 'రెప్' చేయబడ్డాను. మంచులో, వానలో, చీకట్లో, ఆకలితో, భయంతో,దైన్యంతో నా చిన్న్తనమంతా గడిచి పోయింది. నేను మనసారా కవాలనుకోన్నావా రు, నాకూ దూరమయ్యారు. నేను ద్వేషించే  వారికి శరీర మిచ్చాను. దీనికోసం, నరుక్కుని, రక్తం కాలువలు కట్టేటట్లు చేశాను. చేస్తున్నాను. నేను తంతున్న కొద్దీ డబ్బు, కీర్తీ, నా కాళ్ళముందుకు దోర్లుకోస్తున్నాయి' అన్నది మన్రో.
''మీకు జీవితం మీద ఆశ లేదా?'' అన్నది మంజరి.
మన్రో పలకలేదు.
''నేనేమీ చెప్పలేను. నాకేమీ తెలీదు'' అన్నది మన్రో.
మంజరి ట్రాపిక్ మార్చాలని ప్రయతించింది.
''నాకు ఆశలేదు'' అన్నది హఠాత్తుగా మారిలిన్. ''బ్రతుకు, ఇప్పటికీ నన్నుగా చేస్తున్నదనుకొంటాను. ఈ డబ్బు కీర్తీ, నాగరికత ఇవన్నీ నాకు కావలసిన దాన్ని సాధించ లేకపోయాయి. చేతికి చిక్కినట్టే చిక్కి, ఫలితం జారిపోవడం నా బతుకులో చాలా సార్లు జరిగింది. ఈ అఘాతాలు నన్ను కుంగ దీస్తున్నాయి''   
''మీకు సాధారణంగా  ఆడవాళ్ళంటే గిట్టరట కదూ? మరి నేనంటే మీ కెందుకింత ఆపేక్ష ?'' అన్నది మంజరి నవ్వుతూ.
'' మీ గురించి నిన్ననే ఏదో పత్రికలో చదివాను. చిన్నతనంలో మీరు కష్టపడ్డారనీ,చాలా ఏళ్లపాటు నాటకాలాడి ' ఇండియన్ మార్లిన్' అంటారని కూడా రాశాడు. ఈ చివరి వాక్యం నాకు నచ్చింది. మిమ్మల్ని మీదేశంలో 'ఇండియన్ మార్లిన్' అంటారని కూడా రాశాడు. ఈ చివరి వాక్యం నాకు  నచ్చింది. మిమ్మల్ని కలుసుకోవడాన, చాలా ఉత్సాహపడ్డాను''.
''చూశారుగా! ఇప్పుడు చెప్పండీ!''.    
''ఆ కోలమిస్ట్టు పూర్తి నిజం రాయలేదనిపించింది. బహుశా అతనికి మీ గురించి ఎక్కువగా తెలియదేమో! సంగ్రహంగా రాశాడు. ఆతను రాసిందానికన్నా మీరెక్కువ బాగున్నారు...... నేనిక 'అరికన్ మంజరి' అని పేరు పెట్టుకొంటాను'' అన్నది మన్రో పకపక లాడిపోతూ... ''రండి! ఎటన్న్ట పోదాం '' అని లేచిందావిడ.
''ఒద్దు. మీతో ఇంకా విశదంగా మాట్లాడాలి. మీ మాటలు వింటుంటే, నా హృదయంలో పాలవెల్లువ పొడిచినట్లునిపిస్తుంది. బయటకెళ్ళి, చెట్ల్లనూ, పిట్టల్నిఎప్పుడన్నా చూడొచ్చు. కానీ - మీతో గడపగలుగుతున్న ఈ క్షణాలు మళ్లారావు.''
'' ఇన్నీటికీ అసలు సంగతి నీకు చెప్పలేదు. అంటూ ప్రారంభించింది మన్రో''.   
ఆడవాళ్ళంటే నాకు అసహ్యంకాదు. ఎదిరించి, తెగించి మొండికెత్తి బతకలేరు. జావలగా మంచులాగా జారిపోతారు. ముఖ్యంగా ఈ లక్షణం నాకు సరిపడదు. చాలా మంది ఆడవాళ్లు సాఫియైన జీవితం కావాలనుకొంటారు. నేనంతటి స్తబ్దతను భరించలేను. ఉరుకులు, పరుగులతో, ఉన్నతోన్నత పర్వత్రాగం నుండి అగాధంలోకి దూకే మహాప్రవహంవంటి బ్రతుకు నాక్కావాలి. '' ప్రశాంతం లేదులే'' దంటూ తెకతెకలాడి పోతానే తప్ప, నిజంగా - బ్రతుకొక గమ్యాన్ని చేరి, అక్కడే నిలబడిపోతే ఆ నిశ్చలత్వాన్ని భరించగలనా?  లేదనుకొంటాను. కానీ ప్రశాంతికోసం, ఆత్మ గొల్లుమని గోల గెత్తడం మాత్రం మానదు., అగంతే!''
మంజరి కనురెప్పలు, నీటి పొరల్లో తడసి బరువెక్కాయి.
''మనం చెయ్యని తప్పులకు మనం శిక్షఅనుభవించవలసి రావడంకన్నా జీవితంలో విషాదం ఉండబోదు.   అలాంటివి నేను చాలా అనుభవించాను.... '' సెవెన్ ఇయర్ ఇచ్'' పిక్చర్లో, ఓచోట, గౌన్ పైకెత్తి కదానాయిక నడుస్తుంది?.''
'' అవును జ్ఞాపకం ఉంది!. అన్నది మంజరి.   
'' ఆ పిక్చర్ ఔట్డోర్ ఘూటింగ్ సమయంలో, '' జోడిమాగియో'' కూడా ఉన్నాడు. అందరూ ఆసీన్ చూసి అనంగించారు ఒక్క నా 'జో' తప్ప అతనికోసం నేనెంత ఆరాట పడ్డానో తలసుకొంటే - మనుషులింతగా - పశువులకన్నా అధమాధములుగా ఎందుకు ప్రవర్తిస్తారో తెలీదు. నన్నింకొకరు చూడకూడదనీ, నాతో మాట్లాడకూడదనీ 'జో' అస్తమానం గోనుగుతుండేవాడు. నా వడత్తికనిబంధన సరిపడదు. అసలందుక్కూడా కాదు- నా శరీరం మీద,  తన కంత అధికారమున్నదని, జో అనుకోవడం నాకిష్టం లేదు. ఆతను పోయినందుకు నేను చాలా రోజులపాటు బాధపడ్డాను. కాని నన్ను నేను మోసగించుకోలేదు నా వ్వక్తిత్వాన్ని అమ్ముకోనూలేదు. అంతకు ముందేప్పుడో చాలా రోజుల కిందటి సంగతనుకో - నాకింకా సినిమాల్లో అట్టే ప్రమేయం దొరకని కాలమది. కొలంబియా ప్రసిడెంట్ హిరకోహన్ ' షేంక్' అనే నాహితైషిఫొన్ చేసి నన్ను పంపించాడు. కోహన్ తలసుకొంటే నా కేంతయినా సాయం చేయగలడు. ఆతను  నన్ను చూస్తునే, ఉద్రేకంతో ఊగిపోయాడు. అతని కొక విలాస నౌక ఉన్నది. అందులో నాకొక పార్టీ ఇస్తాను రమ్మనాడు. నేనందుకోప్పుకొంటే మొత్తం కొలంబియా కంపనీని కోనేసి  ఉందునేమోమరి ! '' నాకిలాంటి పార్టీలమీద మోజు '' లేదని మర్యాదగా  చెప్పి వచ్చేశాను.... నేను నీతి కోసం గాంధీ సంఘటనను  చెబుతుంటి. మనుషుల తత్త్వం అర్ధం చేసుకోవడానికి ఉపయోగ పడతాయే అంటున్నాను.... ఇలా ఎన్నో జరిగాయి......''  అన్నది మన్రో, ఆవిడ పెదవులు వణుకుతున్నాయి.
మంజరి గుండెలు గుబ గుబలాడాయి.
ప్రపంచ ప్రజల సమోవాకాలను అనుక్షణం అందుకోనే, ఈ జగదేకసుందరి  జీవితంలో - ఎంతటి విషాదం పేరుకొని పోయి ఉన్నదో చాలామందికి తెలీదు.
''నువ్వు చాలా గడసరి దానివి!'' అన్నది మన్రో . అంతలోనే మామూలు స్థాయికివస్తూ ''  నీవు మాట్లాడుతున్న కొద్ధీ ఇంకా ఇంకా ఏవో చెప్పుకోవాలనిపిస్తుంది......నీకు ఇండియన్ భోజనం కావాలా? అసలేమీ వద్దా ? అదేం కుదరదుగానీ...... గుడ్లు, కాయలూ, తీసుకో...... '' అని బలవంతం చేసింది మన్రో.
హఠాత్తుగా, సంభాషణను ఆపి ఇలా తిండిని గురించి మన్రో ఎందుకు మాట్లాడిందో మంజరికి అర్ధం కాలేదు. చప్పు చప్పున ఇంత తిన్నాను.  మన్రో అమెనో క్లబ్బుకుతెసుకోచ్చింది. ఎక్కువ మంది లేని గుర్తిన్చాలేదు. ఒకరిద్దరోచ్చి, మన్రోను డాన్సుకు పిలిచారు. తరువాత హిచ్ కాక్ ది ' రెర్ విండో' కొంచం చూసి, చాలా పోద్దుపోయిఇంటికోచ్చారు.
'' మీకు సాధారణంగా పక్కమీద పడుకోగానే నిద్దరోస్తుంది?.. అన్నది మంజరి!.
మారిలిన్ తేలు కుట్టినట్లు ఉలిక్కి పడింది. చేతిలో ఉన్న గౌను జారిపోయింది.
'' మీకు సరిగ్గా నిద్రపట్టదన్నమాట?.  అన్నది మన్రో గొణుగుతూ.
''లేదు''
''సరే !'' అన్నది మన్రో.
ఆమె గొంతు పొడారిపోయింది. పెదవులు ఎండిపోయాయి. కళ్ళలో మునుపటి కాంతి, ఉత్సాహంగా లేవు.
'' మనం మిగతా విషయాలు రేపు మాట్లాడుకొందాం........ ఆ పక్కమీద పడుకోండి....  నేనిక్కడ పడుకొంటాను.. ఇంకో పది నిమిషాల్లో డాక్టర్ ఆర్నాల్డ్ వస్తున్నాడు. ఆతను మీకూ, నాకూ, నిద్రపట్టే మందిచ్చి పోతాడు.....'' అన్నది మన్రో.
'' నేను సాదారణంగా'' గార్డినాల్ వాడతాను'' అన్నది మంజరి.
'' అవి టాబ్లెట్'' ఇది ఇంజక్షన్ . ''పెంటతాల్'' అంటారు దిన్నీ తీసుకోన్నాక గానీ, ఆమందు వాడటంలో గల పరమానందం అర్ధం కాదు..... మీకు స్వర్గంలో నమ్మకముందో లేదో నాకు తెలాదు గానీ, ఈ మందు తీసుకొంటే, ఆ స్వర్గ సౌఖ్యాలన్నీ మీ అనుభుతిలో కొస్తాయి..... అరె .... చిత్రమేనే ! ఇది మీ దేశంలో వాడక పోవడమేమిటి?. అన్నది మన్రో.     
''వాడతారేమో నాకు తెలీదు. నేను మాత్రం ఈ పేరు వినడం ఇదే మొదటిసారి!''
డాక్టర్ ఆర్నాల్డు, పోట్టిగా  బొద్దుగా ఉంటాడు.
ముందుగా మంజరికీ, ఆ తరువాత మన్రోకూ ఇంజెక్షన్ చేసి తలుపు దగ్గరగా నొక్కి వెళ్ళిపోయాడు. ఇద్దరూ, అప్సరసల్లా వెల్లకితలా తిరిగి పడుకొన్నారు. వారి ముఖాలు ప్రశాంతంగా, చిరునవ్వు లోలుకుతూ ఉన్నాయి. వారిమీద విద్యుద్దీపపు  కాంతులు కురిసి మెరసి, గోడలను కొట్టుకుని, వీడలకింద మారిపోతున్నాయి.   
'' మీరు చేప్పే మాటలు వింటుంటే. నాలోంచి ఎవరో నాకు భోద చేస్తూన్నట్లుగా ఉంది.  మీతో మాట్లాడటం, నిజంగా వో గోప్ప అనుభవం''  అన్నది మంజరి ఆ మరునాడు మన్రోతో.
మన్రో చాలా భాధగా నవ్వింది.
'' మీరు కూడా, లోకమనుకొంటున్నంత సుఖంగా లేరనుకొంటాను''.
''ఔను'' అన్నది మన్రో, కాస్సేపయ్యాక '' దీనిక్కారణం, జీవితంతో రాజీ పడకపోవడం. మనం మన స్వభావానికి విరుద్దమైన మార్గంలో పడినపుడు, ఇలాంటి విషాదం సంభవిస్తుంది. కానీ లోకం అలా అనుకోదు. మనం చెల్లించిన మూల్యం సంగతి లోకం పట్టించుకోదు. ఎందుకంటున్నానంటే ఆత్మవంచన, వక్తిత్వాన్ని మరుగులో ఉంచడం, కపటం, దగహా, ఇలాంటివేమీ లేనిదే బ్రతుకులో పైకి రావడం కష్టం. మీ అనుభవం ఇందుకు బిన్నం కావచ్చు''.
    ''కాదు'' అన్నది మంజరి క్షణం కూడా ఆలోచించకుండా '' కానీ మనం పైకివచ్చామని చాలామంది  అనుకొంటున్నారు. మనం సుఖంగా లేమంటే, ఎవ్వరూ నమ్ముతారనుకోను. గట్టిగా  మనం కాదన్న రోజున, ఇదంతా పోజు అని సులభంగా తేల్చిపారేస్తారు. కానీ - ఇలా ఏ  అయ్యేందుకు కారణమేమిటో, ఇలా జరక్కుండా ఉండేందుకు  ఏం చెయ్యాలో తెలిస్తే బావుండును''.
మన్రో అసంతృప్తితో అటూ ఇటూ మెసిలిపోయీంది.
'' నా కప్పుడప్పుడు, బ్రతుకుమీద విపరీతమైన ద్వేషం కలుగుతుంటుంది. ఈ శరీరంలో ఇమడలేక 'జీవుడు' గిల గిల లాడిపోతున్న దనిపిస్తుంది. కానీ, దాన్ని పూర్తిగా నమలలేను.... ఉన్నదానితో
 ఉన్నదానితో  బ్రతకలేం, క్రొత్తదేంకావాలో తెలీదు. అదీ మన విషాదానికి ప్రధాన కారణమనిపిస్తుంది.... అవునుగానీ మంజరీ ! మనం అరవిడిచి చాలా చెప్పుకుంటున్నాం.... నా బ్రతుకులో భగ్నప్రేమలు చాలా ఉన్నాయి. అవి నన్ను నిలువునా దాహించాయి.  ఇప్పుడు నాకేమని పిస్తుందంటే, స్త్రీ తన సంపూర్ణ వ్వక్తిత్వాన్ని ప్రదర్శించి నపుడు, పురుషుడు సహించలేని ! మనం - అడవాళ్ళం - వారికి కావలసిన విధంగా మరుకొంటు వస్తే తప్ప, మన ఇస్తామంటూ బయటపడినరోజున, సంఘర్షణలు, కీచులాటలు తప్పవు.... వింటున్నావా?'' అన్నది మారిలిన్.
''శ్రద్దగా'' అన్నది మంజర'' మిమల్ని ఇంకోసంగతి అడగాలనుకొంటున్నాను.''
'ఏమిటన్నట్లు' చూసింది మన్రో.
''మన జీవితానికీ, సంపాదనకీ, లంకె కుదరదనుకొంటాను.... మీ అభిప్రాయం
చెప్పండి.!''
''కుదరదు'' అన్నది మన్రో.
''ఏంచేత?.కారణం నాకు తెలీదు. కానీ కుదరని, నా అనుభవం రుజువు చేసింది. అయితే, జేన్ రస్సెల్, అభిప్రాయం అందుకు భిన్నంగా ఉన్నది. అవిడ సినిమాల్లో పనిచేస్తున్నది.  సంసారయాత్ర సుఖంగా గడుపుతుంది'' అన్నది మన్రో.
''అయితే'' సుఖంగా ' అన్నముక్క మినహాయించ వలసి ఉంటుంది, లేదా, జేన్గాన, అవిడభర్త గానీ, వక్తిత్వాన్ని కొంత మేరకైనా, కోల్పోయైనా ఉండాలి.....'' అన్నది మంజరి పకపక నవ్వుతూ '' అయీనా ఇలాంటి వ్వవహారాలలో అనుభవం లేనిదాన్ని, ఈ సబ్జెక్టు మీద నా అభిప్రాయాలు, అంత ఖచ్సితమైనవికావు''
మన్రో కూడా నవ్వింది.
తదేకంగా, మంజరికేసి చుస్తూ తనలో  తను, ఏదో గోణుక్కున్నది మరిలిన్. తరువాత మంజర గాడంగా ఆలింగనం చేసుకుని, పెదవులను చుంభించింది మన్రో.
''ఇప్పటికే మీ కార్యక్రమంలో, నా గురించి చాలా మర్పులు చేసుకోన వలసివచ్చింది... మీ గురించి ఇక్కడివారు చాలా ప్రచారం చేశారు. ఎందరో మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికీ ఎదురు చూస్తుంటారు. మనం మళ్ళా కలుసుకొందాం'' అన్నది మన్రో, కావల్సినంత వదలకుండానే.
'' అప్పుడే విడిపోవడం దురదుష్టం ''
''మీరు ఈ దేశంనుండి   వెళ్ళేలోగా ఇంకోసారి  కలుసుకొందాం.... నాకూ మిమల్ని విడిచి పోవాలని లేదు. కానీ, మన ఇష్టప్రకారం ఏం జరిగింది గనుక, ఇది జరగలేదనుకోవడానికి!   ఉన్నంతలోనే,  సుఖం, తృప్తి మీకే దేశంలో కావలసిందేమన్నా ఉంటే చెప్పు. నాకు చెతనయినంత వరకూ చేస్తాను. నా వల్ల కానిది అర్ధర్ తో చేప్పి చేయిస్తాను.... '' అన్నది మన్రో.
''ఆర్ధర్ ... ఆర్ధర్... ఈ పేరు ఎక్కడో విన్నాను'' అన్నది మంజరి మెల్లిగా.
'' గొప్ప నాటక కర్త పూర్తి పేరు ఆర్ధర్ మిల్లర్. అతని నాటకాలకోసం, నేను ప్రాణాలివ్వమన్నా ఇస్తాను... కొద్ది రోజుల్లో అతనూ, నేనూ వివాహ మడబోతున్నాం. ఈ సంగతి నా నోటి మీదుగా ..... చెప్పడం మొట్టమొదటి సారిగా విన్నది మరే!''
''చాలా రహస్యమా?''
'' ఓ రకంగా రహస్యమే ! ఆర్ద్ర్క్ష్ర్ మేరీ గ్రేసులు ఇంకా డ్రైవర్స్ తీసుకోలేదు. న్యాయసంభంధమైన ఈ చిక్కులు తొలిగాక, మేం పెళ్ళాడదలుచుకొన్నాం'' అన్నది మన్రో.
మంజరి ఎదో అడగబోయి, అంతలోనే గతుక్కుమని మానివేసింది!.
'' నాకిక్కడ పరిశ్రమను గురించి, నటినటుల్ని గురించీ తెలుసుకుందామని ఉంది. నా ప్రయాణం కూడా  అందుకే ! ఇండియా వెళ్ళేప్పుడు, దూర పాచ్య దేశాల మీదుగా పోతాను''
''చాలా చోట్ల నాకు తెలిసినవారున్నారు.  మీరు జపాన్ వెడతారా?.... ''సాకీబూ'' ను కలుసుకోండి. ఆతను జపాన్ లోని మూడు ఓడల కంపెనీలకుయజమాని పలుకుబడి ఉన్నవాడు. బర్మాలో హ-కి-మ్ నాకు ఆప్తుడు. నేనతని గెస్ట్ గా మూడు వారాలున్నాను. నూనె కంపెనీల యజమాని ఇలాగే.....''
అంతలోనే ఫోన్ మోగింది. ఒకే వొక విషయం మాట్లాడి, ఉల్లాసంతో ఫోన్ పెట్టేసింది మన్రో.
'' మీకోసం స్టువర్టు కారు పంపుతున్నాను. ఆర్ధర్ కూడా వస్తున్నాడు.  మీ కతన్ని పరిచయం చేస్తాను.... 16 వ తేదీన మీకు ''గౌబుల్'' డిన్నర్ ఇస్తున్నదట. అక్కడ కలుసుకొందాం'' అన్నది మన్రో.
ఆ రోజు రాత్రి చలపతికి ఉత్తరం రాస్తూ '' మన్రోను ఆలింగనం చేసుకోన్నపుడు, నన్ను నేను మరచిపోయాను. ఆ కౌగిలింత కోసం ప్రపంచంలోని, కోట్లాది ప్రజలు, అక్షరాలా కలలు గంటారని నాకు తెలుసు.  ఆ కౌగిలింత  ఖరీదు కొన్ని వేల డాలర్స్ ఉంటుందేమో! అయినా అది లభించదు.... నువ్వు నిజమనుకో, అబద్దమనుకో చలపతీ! ఆ క్షణాన నువ్వేనా మనోవీధిలో కనిపించావు. అచ్చంగా- నీలానే, మన్రో కూడా, పెదవులు కలిపింది. నా కిక్క్డడ ఉపిరాడటం లేదు. కార్యక్రమాల వత్తిడి నన్ను కుంగదీస్తుంది. నా న్యూస్ పడిన
పత్రికలన్నీజతచేసి ఉంచు. అలాగే ఫోటోలు పడినవి కూడానూ కేవలం తెలుగు ప్రెస్ వే కాకుండా, ఆలిండియా
వైడ్ చూడటం అవసరం.  శర్మనూ, వసంతనూ కనిపెట్టి చూస్తూ ఉండండి. లోగడ నేను పంపిన ఫొటోలు అందాయా? ఈ పది రోజులల్లోనూ, నాకు రెండు సార్లు కలలో కనిపించావు నువ్వు.  త్వరగా రావాలనుకొంటున్నాను..... మీ ఫోటో నావెంట తచ్చుకోనందుకు ఇపుడేంత విచారిస్తున్నారో చేప్పలేను. శలవు.... '' అని ముగించిందావిడ.
''చస్తాడు వేదవ. ఈడ ఉత్తరాన్ని ఓ వెయ్యిమందికైనా చుపెడతాడు. అదోరోగం'' అనుకొన్నది మంజరి.
సువిశాలమైన అరికా దేశాన్ని ఆ కోసనుండి ఈ కొసదాకా చూడటానికి ఓ జీవితకాలం చాలదు. ఇక దేశీయుల జీవన విధానాన్నికళాసంస్కృతులనూ, అవగాహన చేసుకోవడానికి ఏళ్లు పుళ్ళు చాలవు. అయినప్పటికీ, ఇలావచ్చి, అలపోయే ప్రతివారూ, అదేశపు సంస్కృతిని గురించీ, ప్రజల జీవిత  విధానం గురించీ, ఆకాశ మంతేత్తున పోగిడి పోవడం  రివాజు.  ఈ దేశంవారు ఇంకోదేశం పోయినా ఇదేతంతు! మనం ఎగిరి చేస్తున్న అనేక తప్పుల్ల్లో ఇదొకటి!
'బిల్ మోర్' సిటీలో మంజరికి పౌరసన్మానం జరిగింది. అది స్తువర్ట్ స్వస్థలం. ఆనాటి సభకు అయిదారు వందలమంది హాజరయ్యారు.  అదప్పటికి చాలా పెద్ద సంఖ్యట. న్యూయార్క్ నుండి, ఓ గాయక బృందం వచ్చి పది నిమిషాలపాటు, గోలగా పాడి వెళ్ళిపోయారు. చాలామంది చప్పట్లు కొట్టడం చూస్తే వారు బాగా పాడతారని  అర్ధమవుతున్నది. కానీ, ఏం పాడిందీ మంజరికి అర్ధం కాలేదు. అంతకన్నా న్యూసెన్స్ ఆ ట్యూను. పాట వింటున్నంతసేపూ, రక్తం, పంపుతో లాగేస్తూన్నట్లునిపించింది గానీ, మనస్సుకు హాయిగా లేదు. అయినా, ఇవేవీ తను పైకనడానికి లేదు. ఈ పాటను తనుకూడా మెచ్సుకోవాలి. కనీసం మెచ్చుకొన్నట్లు కనిపించాలి.
లాంచనంగా అనవలసిన నాలుగు ముక్కలూ అంటున్నప్పుడు, మంజరి స్వాధీనం తప్పిపోయే ప్రమాదం సంభవించింది. అయినా ప్రతిబలవంతంమీద ఆవిడ నిగ్రహించుకో గలిగింది!.  
'గౌబుల్' డిన్నరిచ్చినమాట నిజమే! దానికి చాలామంది ప్రొడ్యూసర్లు, ఆర్టిస్ట్లులూ వచ్చినమాట నిజామే ! మంజరి చాలసేపు మన్రోకోసం వెదికింది.  ఆ సంగతి తెలిసినవాడల్లే స్టువర్ట్ రహస్యం కాస్తా చేప్పేశాడు.
''మన్రోకూ'' ఫ్యాక్స్ సంస్థకూ మధ్యవ్వవహరాలేమీ బాగాలేవు. కాంట్రాక్టు ప్రకారం నడిచి తీరాలంటారు. ఫాక్స్ సంస్థకూ మధ్యవ్వవహారాలేమీ బాగాలేవు. కాంట్రాక్టు ప్రకారం నడిచి తీరాలంటారు. ఫాక్స్ అధినేతలు, మమ్మల్ని నాశనం చేసి వొదిలిపెడతానన్నద మన్రో. మిల్లర్ రాజీ కుదుర్చుతున్నాడు. బహుశా ఫాక్స్ సంస్థ లొంగిరాక తప్పదనుకొంటాను'' అన్నాడు స్టువర్టు.
''ఎంచేత'' అన్నది మంజరి.
''మన్రోలాంటి నటిని వధులుకొవడానికి ఫాక్స్ యజమానులు బుద్ది హీనులు కారు. కాకపోతే - ఆమెనుండి ఎక్కువ లాభంపిండెందుకు చూస్తారు. ఎవరైనా అంతే ! కానీ ఓ సంగతుంది. మార్లిన్ కైనా అంత పట్టుదల పనికి రాదు. తనక్కావలసింది డబ్బయినప్పుడు, లేని పోని షరతులన్నీ  పెట్టడమేమిటి?''
''దోరణిని మార్చడం మంచిదనుకోన్నది.
'' పిక్చర్ పేరేమిటి ?''.
''బిలియనీర్! గ్రెగరీపెక్ హీరో, మన్రో హీరోయిన్ అనుకొన్నారు ముందుగా కధ మార్చామన్నది మన్రో. ఆ దరిమిలా హీరోను మార్చమన్నది. ఇప్పుడు ఫిలిం పేరే మార్చమంటున్న. ఇల్లాగ తనకిష్టం  వచ్చినట్లు మార్చుకొంటూ పోతే - అంతమనేది ఎప్పటికి?'' అన్నాడు స్టువర్ట్!.
మంజరి ఆ వార్త వినప్పటినుండీ భాదపడింది. అప్పుడుగానీ, ఆ తరువాత అమోరికా దేశం విడిచి పెట్టేప్పుడుగానీ, మన్రోను ఇంకోసారి చుడాలని అనుకోన్నది. కానీ ఆమెకోరిక తీరనేలేదు.
''మన్రో చాలామంచిది కదూ?'' అన్నదొకసారి మంజరి టైలర్ తో.
''పిచ్చిది. అంతే! అంతకన్నా మార్లిన్ గురించి నేను చెప్పగలిగిందేమీ లేదు''.
అన్నది టైలర్ బుసలు కోడుతూ.
కాస్సేపాగి మళ్ళీ అన్నది.
''తను చాలా తెలివైన దాన్నని మార్లిన్ అనుకొంటున్నదేమో నాకు తెలీదు.  అవిన్నుమోసం చేయడమంత సులభం ఇంకోటి లేదు. 'జో' ఆమెను విడిచి పెట్టడానిక, చాలా జాగ్రత్తగా పధకం అల్లడు.  ప్రాంక్ 'సినాట్రా' కలసి ముందుగా ఓ చవటను మన్రో దగ్గరకు పంపించి, ఆమెను కబుర్లలోకి దింపారు. ఇద్దరూ మాట్లాడుతూ ఉనప్పుడు 'జో' 'సినాట్రా'లు అక్కడ తయారయ్యారు. అనుకొన్న ప్లాను ప్రకారం, ఆతను వీరినిచూస్తునే పారిపోయాడు. కావలసిన పనేదో జరిగిపోయింది. 'మన్రో' భర్తకు ద్రోహం చేసినట్లు తెలిపోయింది. దానికి 'సినాట్రా' సాక్షంకూడా ఉన్నది. 'జో' విడాకుల కోసం కోర్టుకెక్కాడు'' అన్నది టైలర్.
'' తనూ కోర్టుకొచ్చి నిజం చెప్పలేక పోయిందా ?'' అన్నది మంజరి.
''లేదు అప్పట్లో మన్రో ఆరోగ్యం బావోలేదు. ఆవిడ కొద్ది రోజుల్లో తల్లి కాబోతున్నది....''
''తనకు పిల్లలున్నట్లు మార్లిన్ నాతో చెప్పలేదు'' అన్నది మంజరి.
''ఇప్పుడు లేదు!''
మంజరి ఇంకేమీ అనలేదు.
ఇంకో మూడు రోజుల్లో తను అరికా నుండి వెళ్లిపోతుందనా మార్లిన్ నుండి జాబువచ్చింది.
''నిన్ను చూడాలని, నా ప్రతిరక్తంతోనూ కోరుతున్నానంటే నమ్ము, కానీ నేను పరిస్థితులకు బానిసమై పోయాను. నా జీవిత సూత్రాలు నా చేతుల్లో లేవు. ఓ రాత్రి నీతో గడిపినట్లు టైలర్ నాకు రాసింది. ఇండో అరికన్ కల్చరల్ డెవలప్ మేంట్ సోసైటీ వారు. నిన్ను బుక్ చేశారని విని చాలా సంతోషించాను. స్టువర్ట్ చాలా సమర్దుడు. ఆతనుఅనుకొన్నదాన్నితప్పకుండా చేస్తాడు. నేను లండన్ నుంచి కదలడానికి ఇంకోవారం దాకా వీలుపడదు. నీ ప్రోగ్రాం షీట్ నాదగ్గర లేదు. వీలుంటే నిన్ను లండన్లో కలుసుకొంటాను. నీకు నా ముద్దులు.
అరికానుండి బయలదేరబోయేముందు, ఆ దేశంలోని భారతీయులు చాలామంది మంజరికి విందులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలుగువారిని చూసినప్పుడు, మంజరి ప్రాణం లేచివచ్చింది.
''నిన్నెక్కడో చూశాను!'' అన్నాడొక పొడుగ్గాఉన్నవ్వక్తి గుంటూరు జిల్లా భాషలో
''మాది గుంటూరు ....'' అన్నది మంజరి. కళ్ళంతచేసుకొని.
''నేను ఏ.సి.కాలేజీలో చదివాను! నువ్వు ..... అరే - నువ్వు నాకు బాగా తెలుసు. నీ పేరు మంజరి కాదు......'' అన్నాడు వెంకట సుబ్బారావు.
మంజరి తత్తరలాడింది.
అయినా తొణకలేదు.
''నాపెరదే! మనిషి పోలిన మనుషులుంటారులెండి''.
''ఆ గడ్డంమీద పుట్టుమచ్చ నాకు బాగా గుర్తు. నేను కొత్తపేట నాగార్జున లాడ్జిలో ఉంటుండేవాణ్ణి''.
మంజరి కా పాతసంగతులన్నీ జ్ఞప్తికొచ్చాయి. ఓ రాత్రి ఈ వెంకట సుబ్బారావు, ఇంకో ఇద్దరూ వచ్చి, నాగమణితో మాట్లాడి తనను కొత్తపేట తీసుకుపోవడం, అక్కడింకో ఇద్దరుడటం, తను కాదనటం వాళ్ళు తంతామనడం, గోల కావడం పోలీసులు రావడం.
అంతా కళ్ళముందే మెదిలింది!
''మిరిక్కడేం చేస్తున్నారు?''
''చదువుకొందామని వచ్చాను. చాదువయ్యాక ఇక్కడే ఉద్యోగం దొరికింది. ఇహ ఇండియాకు పోలేదు. ఆవిడ నా భార్యయ ప్రమీలారావ్. ఇద్దరు పిల్లలు''.
అర దేశంలోని ఆకరు సమావేశంలో మంజరి ఇచ్చిన ఉపన్యాసం  చారిత్రాత్మకమైనది. దాన్ని మంజరీ, స్టువర్ట్, కూచుని తయారు చేశారు. ప్రక్యాత ప్రాచ్యవిద్యావేత్త హరిమన్ ఈ ఉపన్యాసపు తొలిపాఠాన్నిరాశాడు. దాన్ని సినిమాటిక్ గా తయారా చేయడానికి, స్టువర్ట్ శ్రమించాడు. నట్లుపోకుండా చదవడానికి మంజరి అయిదారు రిహార్సల్స్ చేయవలసి వచ్చింది.
''అధ్యాత్మిక విభూతిని అఖిల ప్రపంచానికి భారతదేశం అందించిందనడం ఎంత సత్యమో, ఆధునిక ప్రపంచాన్ని అరికా తీర్చిదిద్దిందనడమూ అంతే సత్యం. బహ్యిధృష్టికి, తత్వశాస్త్రానిక , సైన్స్ కూ ఎక్కడా పొంతన కనిపించనప్పటికీ, ఈ రెండు మార్గాలూ చేరేదివొక్కచోటికే ! ఐన్ స్టీన్ అంతటివాడు, '' భగవంతున్ని చేరుకోవడానికి, తపస్సూ, సైన్స్ రెండూ మంచిమర్గాలే'' అన్నాడు. ఈ రెండు మార్గాలకూ, మన రెండు  దేశాలూ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. నేనిక్కడికి రావడమంటే - మంజరి రావడంలేదు.... వక్తిగతంగా నేను చాలా చిన్నదాన్ని. కానీ నా దేశం గోప్పది. అంతటి గొప్ప దేశంలో జన్మించడం నా పూర్వజన్మ సుకృతవిశేషం! ఇండో అరికన్ సంస్కృతిక సంభందాలు, నా రాకతో బలపడుతున్నాయని స్టువర్టు అన్నాడు. నా ఈ అల్పమైన జీవితం , ఈ మహత్తర కార్యసాఫల్యత కోసం వినియోగ పడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇకనుండి మన ఉభయదేశాల మధ్య ఇంతకన్నా సన్నిహితమైన సంబంధాలు ఏర్పడాలని నేను కోరుతున్నాను. గొప్ప ప్రజాస్వామిక దేశాలైన ఇండియా, అరికాలు అఖిల ప్రపంచానికి మార్గదర్శకం కావాలని నేను గడంగా వాంఛిస్తుంన్నాను. ఇక్కడనుండి వేళ్ళడం నాకేంతమాత్రం ఇష్టంలేదు. ఈ దేశంలో ఉన్నంతకాలం నన్ను మీలో ఒక వ్వక్తిగా చూశారు.  నా దేశాన్ని మరిపించారు. నా పట్ల మీకుగల అమేయమైన అభిమానానికి ఇంతకన్నా మంచి ఉదాహరణం చూపలేను. నవ చైతన్యంతో, తొణికిసలాడే అక్కడి  ప్రజలు,  పచ్చని పంటపొలాలు, ప్రజలలోని స్నేహశీలత, స్నేహరక్తి, ఆప్యాయత, మానవత, నన్ను ముగ్ధం చేశాయి. మహాత్తరమైన మీ దేశానికి రాగలిగినందుకు, మీతో కొంతకాలంపైటు కలసి మెలసి ఉండగలిగినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఈ అనుభవం, జన్మజన్మలకూ, నేనెంతో పదిలంగా దాసుకొంటాను''.
ఇంకో అరగంటలో విమానం బయలుదేరుతుందనగా, స్టువర్టు ఓ కవరు ఆమె చేతికిచ్చి సన్నగా నొక్కాడు.
మంజరి కళ్ళు చిలికించి చుసింది.
''కారు తలూకు కాగితాలు..... అదే - మీరుకొన్న కారుకు సంబంధించినవి.  మీరు ఇండియా  వెళ్ళిన, అయిదు రోజులకల్లా, కారు, బాంబే చేరుతుంది. మీకు సక్సేనా '' చెప్పాడనుకొంటాను. అన్ని సంగతులూ వెళ్ళంగానే మీరీ కాగితాలను అతని పేరుమార్చి ఇవ్వండి. నేను పై  నెలలో ఇండియా వొస్తున్నాను''.''
''అది సరే! నేనడిగినవి'' అని మెడతడుముకొన్నది మంజరి.
''అవి కారుతో సహా వస్తాయి. పంపించాను. ఎంత  హీనంగా చూసుకొన్నా, అక్కడి మార్కేట్ ధరల ప్రకారం, 60, 65 లక్షల దాకా రావాలి. మిగిలినవాటిని నాతో     తీసుకోస్తాను! ఇంగ్లాండ్ లో, బెంజిమన్, మిమల్ని కల్సుకొంటాడు, తీసుకో, అతనేదన్నా బహుమతిస్తే కాదనకు తీసుకోయ అదీ సంగతి''.
మంజరి కళ్ళు మిలమిలలాడాయి.
                                                               31
ప్రాచ్యు, ప్రాశ్చత్య దేశాల పర్యటన నుండి మంజరి రావడానికింకో వారం రోజులు వ్వవధి ఉన్నదనగానే, చలపతి, శర్మ కలసి పెద్ద ఎత్తున '' స్వాగత సమితి'' నొకదాన్ని ఎర్పాటు చేశారు. నిజానికి సమితితో వారికేలాంటి ప్రత్యక్ష సంబంధమూ లేదు, మద్రాసు నగరంలోని ఫిలిం జర్నలిస్టులు కొందరు కలగలసి, ఈ పేరుతో మంజరికి స్వాగతం చెప్పడం బావుంటుంది, శర్మగారే ముందు పురమాయించారు. అందుకయిన ఖర్చులేవో, ఆ దరిమిలా మనం వసూలు చేదామన్నాడు. ఇలా ప్రారంభమైన ఆ సమితి, రాను రాను మద్రాసులోని ఫిలిం పరిశ్రమ, నంతటిని, ఆ కట్టుకొన్నది.  ఈ పర్యటనతో, మంజరి స్థాయి పెరుగుతుందనీ, అప్పుడావిడ  రేటు నక్షత్రమండలాలకు దాటిపొతుందనీ ఊహించిన, మధ్యరకం ప్రొడ్యుసర్లు - ఆమెను మంచి చేసుకొవడానికి, ఇంతకన్నాసమయం దొరకదని, లంగోటీలు బిగించి రంగంలోకి దిగారు. రావుగారూ, మూర్తిగారూ సరేసరి,ఇండో అరికన్ కల్చరల్  డెవలప్ మెంటు సొసైటీ వారూ, ఉబయ దేశాల సంయుక్త నిర్మాణంగా ఒక చిత్రాన్ని తీబోతున్నట్లు, అందులో భారతదేశం తరపున మంజరి కధా నాయికగా బుక్ అయినట్లు, ఇక్కడి పత్రికలూ, పెద్ద పెద్ద శీర్షికలతో వార్తలు ప్రచురించాయి. స్థానిక అరికన్ కూడా ఇది 'అబద్దం' అనలేదు. కానీ నిజమని కూడా వారు వొప్పుకోలేకపోయారు.  లేకపోతే అటువంటి ప్రతిపాదన వొకటి ఉన్నమాట నిజమేననీ, అదెంతవరకూ కార్యరూపం దాల్చిందీ తాము చెప్పలేమని వారన్నారు. ఏది ఏమైనప్పటికి అమెతో రవంత మంచిగా ఉండటమే మంచిదనిపించింది వారికి! అవిడ తలచుకుంటే - ఆసియాలో మంచివేషం దొరక్కపోదు. ఇంతపని ఆవిడతో ఉన్నప్పుడు, పోయి పలుకరించడానికేం వచ్చిందంట? రేపావిడ ఏమీ చేయకపోవచ్చు.  అయినా ! మంచిగా ఉండటంలో తప్పేమీ లేదుగదా !
మూర్తి, రావు గారలు కదలడంతో, వారి ముఠాలుకూడా తార్లుకొచ్చాయి. చలపతిగారికి, అకరు నిమిషంలోఇంకో బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది.
'' ఈ సందర్బములోనే మనం పత్రికల చేత సప్లిమెంట్స్ వేయిస్తే కాదూ?'' అన్నాడు చలపతి.
తనకిలాంటి అలోచన  రా�


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS