Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 49

                                                              27
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు, అనుకొన్న దానికన్నా ఇంకో మూడు రోజులు అదనంగా జరిగాయి. ఉత్సవాల సమయంలోనూ, అవి అయిపోయిన వారందాకనూ, ప్రముఖులైన వారెవ్వరికీ తీరుబాటు లేకుండా పోయింది.
మంజరి సంగతి సరేసరి, ఆవిడ తనఅతిధుల్ని ''అన్ని విధాలా'' సంతృప్తి పరచిందనడంలో సందేహం లేదు. ఇటు శర్మగారు కూడా జర్నలిస్టులతో చెప్పి బ్రహ్మాండంగా కాపుకాయించారు. చివరిరోజున దేశ దేశాల ఫిలిం ప్రముకులు, బారతీయుల ఆదరభిమానాలను గురించీ, అతిధి సత్కారాల్లో వారికున్న ఆసక్తిని గురించీ, ఆకాశానికెత్తుతూ మాట్లాడారు. స్టువర్టు, మద్రాసు సినీ పరిశ్రమ వారికి కృతజ్ఞతలు చేబుతూ ప్రత్యేకంగా మంజరి పేరును పేర్కొన్నాడు.
''రెండవ ప్రపంచ యుద్దం తరువాత దేశ కాలాలకున్న విలువల్లో చాలా మర్పులొచ్కాయి. మానవజాతి మునుపెన్నడూ ఎరుగని నూతన వాతావరణంలో అడుగు పెట్టింది. ''ఇది - నాదేశం''  ''ఇది నా సంస్కృతి''- 'ఇది నా ప్రత్యేకత' అని మడిగట్టుకూర్చోవడం ఈనాడు సాధ్యంకాదు. రాజకీయంగా, అంతర్జాతీయంగా స్థాయిలో సఖ్యాన్ని సాధించడానికి ఐక్యరాజ్యసమితి పాటు పడుతున్నట్టే కళా సంస్కృతిక రంగాలకు సంబందించి కూడా - అదే పంపిణి మీద వొక అంతర్జాతీయ వ్వవస్థ నెలకొనడం అవసరం. వివిధ దేశాల లోని సామాన్య మానవుడు ఇనాడేదుర్కొంటునన్న సమస్యలన్నీ దాదాపుగా వొకేరకంగా ఉన్నాయి. దరిద్రం, ఆకలి, నిరుద్యోగం, వ్వాధులు, మొదలైన అరిష్టాలు అందర్నీ ఒకే విధంగా పిడిస్తున్నాయి. వీటిని తొలగించేందుకు, కళా కారులంగా మనం చేయవలసిన ది ఎంతో ఉంది. రాజకీయాలలో ప్రమేయం లేని విధంగా మనం ''ఐక్య చలన చిత్రమండలి'' లేదా అలాంటిదో ఇంకోటి గానీ ఏర్పాటు చేసుకొందాం. వివిధ దేశాల కళాకారులు, దర్శకులు, నిర్మాతలు కలసి, మానవతను పునరుద్దరించగల చిత్రాలను నిర్మించడం వాంఛనీయం. అందుకు ఈ సమావేశం పునాది కాగలదని మనం ఆశిద్దాం'' అంటూ స్టువర్టు తన ఉపన్యాసాన్ ముగించాడు.
ఉత్సవాలు ముగిశాక, మంజరి ప్రత్యేకంగా, వొకవిందును ఏర్పాటు చేసింది. ఇందులో, అంతర్జాతీయ ఫిలిం ప్రముఖులే కాకుండా, భారత చలనచిత్ర రంగంలోనివారు ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వారందరితోనూ మంజరి స్వయంగా పరిచయం చేసుకొన్నది.  కొందరితో - రెండు మూడు నిమిషాలు ఎకాంతంగా కూడా మాట్లాడింది.
''మొన్న పార్లమెంట్ లో, ప్రతిపక్షాలకు  మీరిచ్చిన సమాధానాలు చదివాను. బ్రహ్మాండంగా ఉన్నాయి'' అవి వొకమంత్రి గారితో అన్నది మంజరి.
ఒక ప్రముఖ రాజకీయ నాయకున్నీ చాటుకు పిలచి-
'' మీ వారు చందా అడిగిన రోజున నా దగ్గర 20 వేలకన్నా ఎక్కువ లేవు. తరువాత కనిపించమన్నాను. మళ్ళారానేలేదు'' అన్నది.
ఈ పంపిణీ మీద, వొకరితో అన్నమాట, ఇంకోకరితో అనకుండా నెట్టుకొచ్చిందావిడ. వారందరూ కాకపోయినా, సగంమందైనా మంజరి తనమనిషేనన్న విశ్వాసాన్ని కుదుర్చుకున్నారు. ఒకానొక ప్రముఖుడు - పేరెందుకు లెండి -ఢిల్లీకి వచ్చినప్పుడు తనను తప్పకుండా కలుసుకోమన్నాడు.
''మీరు ప్రత్యేకంగా నన్ను బొట్టు కాటుకా పెట్టి పిలవ నవసరంలేదు. ఢిల్లీకి వచ్కానంటే మీ ఇంట్లోనే మకాం వేస్తాను. మీ రొద్దన్నా సరే ! అన్నది మంజరి నవ్వుతూ.
''బై అల్ మిన్స్'' అన్నాడతను.
మంజరి ఆమాట అనేవేళకు, ఆవిడ ఢిల్లీ వెళ్ళాలనుకోలేదు. అందరితో మంచిగా మాట్లాడినట్టే ఆ ఢిల్లీ వాడితోను మాట్లాడింది. ఆ తరువాత మూడు రోజులకే ఆవిడకే ప్రయాణం వచ్సిపడ్డది.
''అందాకా నేనుకూడా ఎందుకండీ?'' అన్నది మంజరి, ఆ ప్రయాణం ఇష్టం లేనిదానికి మల్లే.
''అలాకాదు, స్టువర్ట్ నేరుగా ఢిల్లీ పోతున్నాడు. అతని విమానంలోనే నీకూ వొక సీటు బుక్ చేశాను. ఆతను ఢిల్లీలో రెండు రోజులుంటాట్ట.  బొంబాయి మీదుగా వెళ్ళిపోతాట్టా.... బొంబాయిలో అతని కేప్రోగ్రాము లేదు. ఆ సంగతి కూడా కనుకొన్నాను''. అన్నాడు శర్మ.
''నేనిలా వస్తున్నానని స్టువర్టుకు తెలుసా?''
''లేదు అతనింకో గంటలో బయలుదేరొచ్చు. నువ్వో అరగంట తర్వాత ఢిల్లీకి వస్తున్నట్లు ఫోను చెయ్యి..... ఇంకేం అనకు. అదే మంచి పద్దతి'' అన్నాడు శర్మ.
                                                                    28
దాదాపుగా మూడు మాసాలు గడిచాయి, ఓ నేలరోజుల పాటు మంజరి స్టువర్టు నుండి ఆహ్వానం కోసం చాలా టెన్షన్ తో ఎదురు చూసింది. ఆతను రాసిన రెండు  జాబుల్లోను, మామూలు క్షేమ సమాచారాలు తప్ప, ఇంకో విశేష మేమీ లేదు.
మంజరి విసుగెత్తిపోయింది. దీనికి తోడుగా ఆరోగ్యం కూడా సరిగాలేదు. తను మాములుగా వాడే బిళ్ళలు వాడినందువల్ల ఫలితం కనిపించలేదు.
అందుకని, ఈ విషయాల్లో  నిపుణుడైన డాక్టర్ని కలుసుకుంటే ఆతను పెద్ద తతంగం చెప్పాడు. దాని కొప్పుకోవడం కంటే,  పోనీ ఏ 'చికిత్స' లేకుండానే ఉండిపోదామా అనుకొన్న దావిడ. కానీ అలోచించి చూస్తే అదంత మంచి పద్దతిగా అనిపించలేదు. తనింకా ఇంకా విమాయాన విధుల్లోకి పోవాలనుకొంటున్నది. ఇప్పటికిప్పుడే ఇలాంటి బందనాల్లో చిక్కుకోవడం క్షేమం కాదు. తను ఎక్కదలచుకొన్న మెట్లన్నీ ఎక్కాక, జీవితంలో స్థిరపడ్డాక ఇలాంటి విషయాలను గురించి,  తాపీగా అప్పుడాలోచించుకోవచ్చు.
తన'ప్రతిభ' ప్రస్తుతానికి జేగంటలాగా మోగిపోతున్నది. అటు నిర్మాతలూ, ఇటు ప్రేక్షకులు కూడా తన కోసం పడి చస్తున్నారు నిజమే గానీ, ఆ మోజు ఎంతకాలం ఉంటుదన్న్డదే ప్రశ్న.  తన ముందు తరంవారు, తను వొచ్చాక పాతపడి పోయారు. ఇవ్వాళ్ళ వారిని అనుకొనే దిక్కులేదు. రేపు తననైనా అంతే. ఆ దశలో తను చేయగలిగిందంటూ ఏమీ ఉండదు. బహుశా చేయాలన్న ఉత్సాహం, కోరికా కూడా ఉండకపోవచ్చు. ఆ నిద్రాణ స్థీతి దాపరించక ముందే, తను కొండ శిఖరాన్నెక్కాలి. ఆ తరువాత విచారించే ఏ ప్రయోజనమూ ఉండదు.
ఆ ఉద్దేశంతోనే తన భారీ ప్రాజెక్టు ప్రారంభించింది. మద్రాసు మరే ఆర్టిస్ట్ చేయ్యడానికి సాహసించని పని తను చేసింది. ఇందులో తను విజయాన్నే సాధించిందో, అపజయాన్నిసాధించిందో, ఇప్పుడప్పుడే చెప్పలేదు. స్టువర్టు నుండి వచ్చే సమాదానం మీద, ఈ పని తాలూకు జయాపజయాలు ఆదారపడి ఉంటాయి.  ఆతను తనను మోసం చేసింది, లేనిదీ చెప్పలేని స్థితిలో తానిప్పుడు ఉన్నది. మద్రాసులోనే కాదు, ఢిల్లీలో ఉన్నప్పుడూ, అదిరిమిలా బొంబాయి దాక అతనితో ప్రయాణం చేసినప్పుడుకూడా, స్టువర్టు తనకోసం అవురావుర మన్నాడు. తనను తప్పకుండా  తమ దేశానికి ఆహ్వానిస్తానన్నాడు. ప్రభుత్వంలో తనకు తెలిసినవారు చాలామంది ఉన్నారనీ, ఇదొక పెద్దపని కానేకాదనీ, స్పష్టంగా చెప్పాడు. తను అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం మండలిని ఏర్పాటు చేయాలనడం ఏదో లాంచనంగా అన్నది కాదనీ, కనీసం ఇండియా అరికా దేశాలు సంయుక్తంగా ఒక చిత్రాన్ని నిర్మించినా మా బాగన్న ఉద్దేశంతోనే అలా అన్నారని చెప్పాడు స్టువర్టు. ఉభయ దేశాలకు అన్యయించే కధా వస్తువును గురించి తను ఆలోచిస్తూన్నానన్నాడు. అతని దోరణి చూశాక, అనుమానించడానికే ఆస్కారం లేకపోయింది!.
అవును మరి!
ఇంతవరకు జరిగిందేమి లేదు. ఈ పేరు మీదుగా, దాదాపు పదిహేను పదహారు వేలదాకా ఖర్చయింది. ఈ పనికోసమే ఊడి పోయిన శర్మను తెచ్చి కొంపలో ఉంచుకోన్నది. వాడూ ఆ వసంత కలసి, రూపాయలను చిల్లపెంకుల కింద మర్చేస్తున్నారు.  ఇక చలపతిగాడు సరేసరి ! ఎంత హీనంగా చూసుకొన్నా, వాడో వేయి, పదిహేను వందలన్నా పిక్కి ఉంటాడు. అదీగాక ఈ పంకతో తన మీద బోలిడంత అధికారాన్ని చేలాయిస్తూన్నాడు. వీన్ని దూరంగా తోసేయ్యడానికి లేదు. దగ్గరకు రానిస్తే మనుషుల్ని నమిలి మింగేస్తున్నాడు.
ఈ దిక్కుమాలిన గొడవల్లో పడి, తను చాలా కాల్ షీట్స్ కాన్సిల్ చేసింది. ఆ కంపెనీలవారు గొల్లుమని గోలపెడుతున్నారు. అదేదో అరవ కంపెనీవాడు - తన మీద దావా వేస్తానంటు నోటీసు  పంపించాడు. మెహతాతో చెప్పించి వాణ్ణి చల్లపచేటప్పటికి తాతలు దిగొచ్చారు. బొంబాయి వాళ్ళ గసరే సరే సరి! వీటన్నింటిమధ్యా పడి తను నలిగిపోతున్నది.  ఓ క్షణం ప్రశాంతంగా గడుపుదామంటే లేదు. ఇవన్నీ కాక -
ఒకసారి శర్మ  ఆదరాబాదరా ఇన్ని పత్రికలు తీసుకొని రోజుకుంటూ వచ్చాడు. అతని ముఖం మాడిపొయినట్లుగా ఉంది. కళ్ళు పొడి పొల్లాడు తున్నాయి. నాలుకతో పెదవులు తడుపుకొంటూ సోపాలో కులబడిపోయాడు.
'ఏదో' జరిగిం'దనుకొన్నది మంజరి.
'ఏమి' టని ఆవిడ అడగలేదు.
శర్మగారే పేపరును ఆమె మీదికి విసిరాడు.
మొదట పేజిలోని హెడ్డింగును చుస్తూనే మంజరి ముఖం మబ్బు కమ్మినట్లయి పోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి  ఆవిడ చేసిన ప్రయత్నం ఫలించలేదు.
''నటి మంజరి కామలీలలు!''
''ఎ.బి.సి.డి -1234 నెంబరు కారులో అర్థరాత్రి గుసగుసలు గుంటూరు పొగాకు కంపెనీ డబ్బు కాజేసిన వైనం''
అదీ శీర్శిక!
దానికింద ఇదే ధోరణిలో రెండున్నర కాలములదాకా ఎదేదో రాసివుంది ! ఫలానా వాడితో కారులో పోతున్నట్లు గురువారం అర్థ రాత్రి రెండు గంటలప్పుడు బీచిలో ఇంకెవరితోనో ఉండగా పోలీసులు పట్టుకొన్నట్లు, నాలుగు వందలిచ్చి  వదిలిచ్చుకొన్నట్లు, ఆ పోలీసు నెంబరూ వగైరాలన్నీ రాశాడు. ఇదేమిటో మంజరికి బోధపడలేదు. కానీ ఇలాంటి పత్రికలు కొన్ని ఉన్నాయనీ, అవి ఈ తరహా విషయాలను అచ్చేసి అమ్ముడవుతూ ఉంటాయనీ మంజరి విన్నది. అప్పుడేప్పుడో, చలపతిగాడు ఈ పత్రికల వాళ్ళకు ఏదో ముట్టచెప్పి రావుగారి మీదా, మూర్తిగారి మీదా రాయిద్దామని కూడా సలహా ఇచ్చాడు. అప్పుడు తనే వద్దని వారించింది!  మనుషులమీద కసి తిర్సుకోవలసిందే గానీ, దాని కిలాంటి క్షుద్రమైన మార్గాలు పనికి రావనీ, సింహంతో  పోట్లాడేటప్పుడు, సింహంలాగానే ఉండాలి తప్ప, గుంట చిక్కులు కల్పించకూడదనీ, తను చలపతికి సలహా ఇచ్చింది. అయినప్పుడు ఈ ఛండాలమంతా ఏమిటట?

మంజరి దిగాజారిపోతున్న ముచ్చెమటలను తుడుచుకొన్నది. ప్రాణం అలసిపోయినట్లుగా డీలాపడి పోయింది.
''ఇదంతా ఏమిటంటారు శర్మాజీ'' అనగలిగింది మంజరి.
''నేను అదే ఆలోచిస్తున్నాను మేడమ్ ? మనమంటే గిట్టని వాళ్ళెవరో ఈ పని చేసి ఉంటారని నా అనుమానం'' అన్నాడు శర్మ.
''మనకేవరితోనూ విరోధంలేదు. మూర్తిగారు, రావుగారు కూడా మనతో ఇప్పుడు హితంగానే ఉంటున్నారు. ఆఖరికి మనం, ఛీ అని వెళ్ళగొట్టిన చంద్రం కూడా మొన్నకనిపించి దణ్ణం పెట్టి మరి వెళ్లాడు. అతనితోబాటు విజయకుడా వచ్చింది ఆపిల్ల'' అని శర్మ కేసి చూస్తూ ఆగిపోయింది మంజరి.
శర్మగారు మధ్యలోనే తల అడ్డంగా తిప్పేశారు.
''ఏమో మేడమ్! నేనలాగని అనుకోను. మనం మాత్రం, మనకు గిట్టని వారితో అఫ్యాయంగా మాట్లాడుతున్నమా లేదా? మనం చాటునా మాటునా చేసే ప్రయత్నాలు చేయకుండా మానుకున్నమా? లేదే! అలాగే మనచుట్ ఉన్నవారే మనకు విషం తలచి ఉండవచ్చు''
మంజరి, వింటున్నదల్లా తాచుపాము లాగా ఖస్సుమని లేచిందొక్క సారిగా,
''నా సంగతి చాలా మందికి తెలియదనుకొంటాను శర్మగారు, రేపిపాటికి వాణ్ణి, వాడి పత్రికనూ నడిసముద్రంలో పాతేయించగలను. ఉపకారం చెయ్యమంటే చెయ్యలేం గానీ, మనిషిని నాశనం చేయడనికేం శర్మాజీ!'' అన్నది మంజరి.
శర్మ - చాలా తాపీగా నవ్వాడు.
''నీ కలా, చిటికీ మాటికీ కోపం పెరిగిపోతుంటే నిభాయించడం కష్టం. వళ్ళు తెలియని కోపంలో నివ్వొక్కోసారి అనకూడని మాటలన్ని అనేసి, పీకలమీదకి తెచ్చుకొంటూ ఉంటావు. నువ్వు డబ్బు న్న దానివి గనుక, నీడబ్బును చూసి అందరూ హడలుకు చావాలనికోరడంలో సబబున్నది. కానీ అలా చావ్వలసిన అవసరం అందరికీ ఉండదు. పదివేలు పారేసి నువ్వా పత్రికవాణ్ణి చంపిచగలవు ఇంకో పదివేలు పారేస్తే కేసులేకుండా చేసుకోగలవేమో నాకు తెలీదు కానీ''
మధ్యనుండే నవ్వడం ప్రారంభించిన మంజరి, రాను రాను శర్మ ఉద్వేగాన్ని చూసి, తనుకూడా విరగబడి నవ్వసాగింది. ఒక దశలో ఆవిడ నవ్వలేక, రెండు చేతులతోనూ, పొట్టను అదుముకొన్నది కూడాను. శర్మ కీ ధోరణి బోత్తిగా అర్థం కలేదు మంజరికి పిచ్చిగానీ ఎత్తలేదుకదా! అనుకొన్నాడు శర్మ. ఎందుకంటే ఈవిడ నిమిషానికో రంగు మారుస్తూ ఉంది. గడియకోమాట మాట్లాడుతూ ఉంది. ఎలా ఈవిడతో చావడం?
''ఎలాగైనా శర్మగారూ!'' అంటూ ప్రారంభించింది మంజరి.
'' మీ స్వభిమానం పోనిచ్చారు కదండీ బాబూ? ఆ వేదవ అవాకులూ, చేవాకులూ రాస్తే రాశాడు గాని, నేను వాణ్ణి సముద్రంలో పాతేస్తానంటే కోపరం వచ్చిందా మీకు?.... ఇదివరకోసారి, కోపంవచ్సినప్పుడు, మీరు చాలా ముద్దోస్తుంటారని చెప్పా జ్ఞాపకం ఉందా? ఎదో కొంపములిగిపోయి నట్లు గిలగిల్లాడి పోవడం,  ఇదంతా చూశాక, కాస్సేపు మిమ్మల్ని ఏడిపింతామనిపించింది.... ఏడిపించేశాను....... నా సరదా మాత్రం బాగా తీరిపొయిందనుకోండి !....... ఏమిటి శర్మా - మరీ అంతసీరియస్ గా తీసుకొంటావెం ప్రతిదీనూ?'' అని లాలించింది మంజరి.
ఈ దెబ్బతో శర్మ మరింత కుదేలైపోయాడు. ఇందాకటి కోపం నిజమా ? ఈ లాలింపు నిజమా ?
''ఇదంతా అబద్దమని మనమో స్టేట్తెమేంట్ ఇస్తే  బావుంటుందా?'' అని సలహాగా అడిగింది మంజరి!.
''ఏమి వొద్దు అలా చేయడంవల్ల మనం లేనిపోని ఇంపార్టేన్స్ ఇచ్చిన వాళ్ళమవుతాం.  అంచాత ఇగ్నోర్ చేసేస్తే తిరిపోతుంది!''
''వాడు చివర్ని 'సశేషం' అని తగలేశాడు.  మీరు చూశారా ? ఇంకా ఏమేం చండాలాలు రాస్తాడోననిపిస్తూ ఉంది నాకు! పోనీ - వాడికేమన్నా కావలసి ఉంటే రారాదా, అడిగి తీసుకోరాదా? ఈ పత్రికల్లో రాసుకొంటే ఏమొస్తుందయ్యా శర్మ?'' అన్నది మంజరి అంతలోనే చిరచిరలాడుతూ.
 ఏమొస్తుందదో శర్మ చెప్పలేదు. మంజరి మళ్ళా అడగనులేదు. కానీ వొక మాటమాత్రం అన్నది.
'' ఆ గుంటూరు పొగాకు కంపనీ వాడున్నడే - వాడెవాడో వస్తే బావుండును శర్మగారు? అన్నది మంజరి.
''ఎందుకు?'' అన్నాడు శర్మ.
''ఎందుకేమిటండి నబొంద, ఆ ఆసామి బాగా డబ్బున్నవాడల్లే ఉంది. వాడికి నామీద మోజు ఉండొచ్చు. అలంటిఅప్పుడు వొచ్చి-''
అని ఫక్కున నవ్విందావిడ.
శర్మ పలకలేదు. అతనిక్కడ లేడనుకొన్నది మంజరి. బుద్ది పూర్వకంగానే అవిడ విషయాన్ని మర్సివేసింది.
మరో అరగంటకల్లా '' అర్ముగం మూవిటోన్'' వారు షూటింగంటూ వచ్చి కూర్చున్నారు. మంజరి ఆ గొడవల్లో పడిపోయింది. వారేమో ఇవ్వవలసింది చాలా ఉంది. డబ్బయితే 'అదిగో ఇదిగో' అంటూ తిప్పుతారు.కాల్ షీట్స్ మాత్రం తీసుకొంటారు. తన అంచనా ప్రకారం ఇంకొక్కటే సీన్ ఉంది. అందులో పనయిపోతే, తన ముఖం చూడరు. తనకు డబ్బు కూడా రాదు.
ఆ సంగతే నిర్మోహమాటంగా అడిగేసింది మంజరి!
''ఆడాడాడా!'' అంటూ నేత్తిల నోరూ కొట్టుకొన్నాడు ప్రొడ్యూసరు.
''ఏమి'' టని అడిగింది మంజరి.
డైరెక్టర్ చెప్పుకోచ్చాడు.
''ముందుగా అనుకొన్న కధ ప్రకారమయితే, మీరన్నట్లు ఈ వొక్క సీనుకోనూ కధ అయిపోవలసిందేనండీ అమ్మాయిగారూ కానీ - సపొర్టు క్యారక్టర్ వేసే సంబంద మొదలియార్ మెన్న కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంతో కధ యావత్తు దేవుడా అంటూ మర్చుకోవలసి వచ్చింది. లోగడ - మనం - చివర కోస్తాయనుకొన్న సీన్లు, ఇప్పుడు కధ ప్రరంభంలో ఉంటుయన్నమాట. ఇంకా బోలెడంత కధ ముందుగానే ఉందండీ !'' అని సంజాయిషి  చెప్పుకొన్నాడు డైరెక్టర్.
''మీ రేగంగలో దుకినా నాకు సంబందం లేదు. నా డబ్బు మాటేమిటి?'' అని నిక్కచ్చి చేసింది మంజరి.
'' బాంక్ సెలవు గనుక డ్రా చెయ్యలేదనుకొంటాను... పోనీ వో పని చేస్తారా ? ఇందాక నాకేదో అవసరముంటే మూడు వేలకో చెక్కు పుచ్సుకొన్నాను. మీరు డబ్బుకోసం మరీ అంత పర్టికులర్ గా ఉంటే - దాన్ని మీకు ఎండార్స్ చేస్తాను తీసుకోండి అన్నాడతను.
మంజరి కాస్సేపు ఆలోచించి నిశ్శబ్దంగా బయలుదేరింది.
పది నిమిషాలనుకొన్నపని, రాత్రి పది గంటలదాకా పట్టింది. అప్పటికి తను కాదు. మర్రో అని గోలెట్టినా లాభం లేకపోయింది. ఆ దిక్కుమాలిన సీనులో తనే ఉండాలిట. డమ్మీని బెట్టి జరుపుకోవచ్చునని చెప్పినా వినరు. అంతగా అవసరమయితే రెండు మూడు షాట్స్ విడిగా తీసుకొని మాచ్ చేసుకోవచ్చునని కూడా చెప్పింది. అవన్నీ ''నిజం నిజం''  చస్తుంది ఇంకొకడూ - ఇల్లాగా ప్రాణాలు పిండేశారు. చన్నీళ్ళులో తను దిగి ఎంతకాలమయిందో ! పోని - గోరువెచ్చని నీరన్నా అకొలనులో పోయమంది తను తడిబట్టలతో నానుతూ ఉండాలిసొచ్సింది ! పనయిందాకా, అందరూ 'అమ్మ -తల్లీ - బుజ్జీ ' అని సున్నితంగా మాట్లాడారు. పావుతక్కువ పదింటికి ఆఖరు షాట్ 'ఓకే'' అయింది.
డ్రెస్ మార్సుకొని, డైరెక్టర్ కోసం వెదికింది మంజరి !
''లేరండి ! మీరు డ్రెస్ చేంజ్ చేసుకొంటున్నప్పుడే పోయడండీ!'' అన్నాడు స్టూడియో కుర్రవాడు.
''అదేమిట్రా ? నాకు డబ్బివ్వందే పోనన్న వాడు ఎలా ఉడాయించాడట'' అన్న్దదావిడ చిర చిరలాడుతూ.
''నాకు తెలియదండీ అమ్మా'' అని తప్పుకెళ్ళాడు వాడు.
''అందుకే పైసాపడందే నేను అడుగు బయటికి పెట్టను.... ఇప్పటికి పోతే పోయినట్లా? రేపన్నించీ ఈ వెదవల్ని ముక్కు నేలకానించి డేకించక పోతే నా పేరు మంజరేకాదు. చూసుకోండి తడాక!''
దోవలో ఉండగా డ్రైవర్ అసలు రహస్యం కాస్తా కక్కేశాడు.
''ఈ పిక్చర్లో ఇదే ఆఖరి సినటండీ అమ్మాయిగారూ ! ఇక మీతో వుండదని అనుకొంటున్నారు ?'' అన్నాడు డ్రైవర్.
మంజరి భగ్గున మండిపోయింది. 'వానిటిబాగ్' తెరచి చూసింది. సిసాసలో అడుగున ఉగ్గిన్నేడు నల్లనిద్రవం ఉన్నది. అదికాస్తా గుటుక్కున తాగేసి సీసాను రొడ్డుపక్కకు విసిరేసి సిగరెట్ వెలిగింసింది మంజరి !
''ఇంటికాండీ?'' అన్నాడు డ్రైవర్.
''కాదు ఎటన్నాపోనీయ్. చాలా దూరం తీసుకుపో.... మంచి స్పీడ్ లో తోలెయ్. కారు గుల్లగుల్లయి పోవాలి. నెత్తురు చర్మాన్ని తొలుచుకొని బైటికి చిమ్ముకురావాలి. అలాతోలు.... నీకొచ్చిన భయంలేదు....తెల్లవార్లూ, మళ్ళా నేను వొద్దన్న దాకా, అలా, తోలుతూనే ఉండు'' అన్నది మంజరి.
డ్రైవర్ పాలకలేదు.
అద్దంలోంచి ఆవిడ బొమ్మకేసి చూసి, మెల్లగా ఏదో గొణుక్కున్నాడు.
                                                      29
ఇది జరిగిన మూడో రోజున మంజరి డాక్టర్ను కలుసుకొన్నది. ఆయన గారు, అధమం నాలుగు వారాలైనా తన నర్సింగ్ హోంలో ఉండాలన్నారు.
''అది వీలుపడదు'' అన్నది మంజరి.
''మరెలా?'' అన్నాడు డాక్టర్.
''అంతకాలం హాస్పిటల్లో ఉంటే జనం ఎన్నన్నా అనుకొంటారు డాక్టర్ గారూ? అందుకని, ఆచేసే ట్రీట్ మెంటేదో ఇంటి దగ్గరే చెయ్యరాదా?'' అన్నదావిడ.
డాక్టర్ చాలాసేపు ఆలోచించి ''వీలుపడదేమో?'' అన్నాడు మెల్లిగా'' పాతరోగులు  చాలామంది వస్తుంటారు. కొత్తకేసులు కూడా బోలెడన్ని వస్తుంటాయి.... మరి .... మీకేసం పదే పదే రావడం పడదేమో!''
మంజరి అతన్ని ఎగాదిగా చూసి, తల పంకించింది. ''నా పని అయిందాకా మీరీ వ్యాపకాలన్నీ కాస్త తగ్గించుకోవాలి డాక్టర్ గారూ ! మరీ - అందరిలాగా నన్ను చూడకండి! పది కేసులు చేసి పది పదులు వంద తీసుకొనే దానికన్నా, మాంచి కేసు వొక్కటి జీల్ చేస్తే చాలదా? ఎందుకొచ్చిన లయిలాసా బాబూ ఇదంతా?'' అన్నదావిడ పైగా.
''సరే'' అన్నట్లుగా ఆతను తలూపి వెళ్ళిపోయాడు.
ఆతను వెళ్ళాడని రుడిచేసుకొన్నాక, మంజరి ఆతను వెళ్ళిన వేపుగా కండ్రించి ఉమ్మింది!.
''దగుల్బాజీ వేధవ! తనేదో గొప్పవాడయినట్లు, రోగులు తండోపతండాలుగా వచ్చి  పడుతున్నట్లు నాముందు పోజు పెడతాడు. ఇటువంటి పనులకు తప్ప వీడి దగ్గర కొచ్చేవారెవ్వరు లేరని అందరకూ తెలుసు.''
ఆవిడ బెడ్ మీద ఉండగానే మరుసటి సంచిక కూడా వచ్చింది. ఈ దఫా దాన్ని చలపతి తీసుకొచ్చాడు.
''నువ్వీ సమయంలో ఎక్స్టట్ కాకూడదు మంజూ ! బ్లడ్ డిశ్చార్జి ఎక్కువైతే లేనిపోని ట్రబుల్స్, పేస్ చెయ్యాలి సొస్తుంది. కానీ - మరి - నీకీ సంగంతి చెప్పకుండా  దాచం భావ్యం కాదు'' అంటూ ప్రారంభించాడు చలపతి.
''ఫర్వాలేదు..... ఎమిటది?'' అన్నది మంజరి లేవడానికి ప్రయత్నిస్తూ.
చలపతి ఆమెను సర్దిపడుకో బెట్టాడు.
ఆతను చెప్పకుండా ఏదో దాచిపెడుతున్నాడని వసంత గ్రహించింది. పనున్నదానిలాగా పక్కకు తప్పుకొంది.''ఈ శర్మగాడు, ఆంబోతుకుమల్లే తిని తిరగడమే తప్ప, ఇలాంటి సంగతులు కూడా పట్టించుకోకపోతే ఎలా మంజూ ! ఈ పత్రికవాడు, గత సంచిక తరువాయి అని వేశాడు నువ్వు చూశావా? అన్నాడు చలపతి.
''ఏదీ?'' అని చెయ్యి చాపింది మంజరి.
ఈ సారి వ్యాసంతో పాటుగా మంజరి బోమ్మకూడా అచ్చయింది. బొమ్మకింద ' మదజరఫీడిత మంజరి'' అని రాశాడు. వ్యాసం మధ్యలో మంజరి ఎవరికోసమో తెప తెప లాడిపోయినట్లూ, వాడు నిరాకరించినట్లూ, చివరికి వాడికో వెయ్యి రూపాయలు ఎదురిచ్చి, ఏ.బి.సి.డి,1234 నెంబరు కార్లోనే వాడితో సరససల్లాపాలు సాగించినట్లూ రాశాడు, వాడి పేరు సింగార మొదలియార్ అనీ, మంచి అందగాడనీ, చాలా మంది ఆడవాళ్లు - ముఖ్యంగా డబ్బు అందం పుష్కలంగా ఉన్నవాళ్ళు - సింగార మొదలియార్ కోసం పడి చస్తూ ఉంటారని ఈ పత్రికవాడు రాశాడు. చివర 'మరికొన్ని విశేషాలు వచ్చే సంచికలో' అని కూడా రాశాడు.
నీరసంగా ఉండటంవల్ల నేమో, మంజరి మునుపటిలాగా భగ్గుమని మండలేక పోయింది. ఆవిడ కోపమంతా కరిగిపోయి, కన్నీటి రూపంలో వెలికి వచ్చింది.
తనకు శారీర సౌఖ్యమంటే ఎంత ఎవగింపో చాలామందికి తెలియదనుకోన్నది మంజరి. ఒకవేళ చెప్పినా అర్ధం చేసుకోరనీ, కనీసం చేసుకోవడానికయినా ప్రయత్నించరనీ అవిడ గోలపెట్టింది. ఇందుక్కారణం తన వృత్తేననీ, ఇంతకాలంగా తను సినిమాల్లో కధనాయిక వేషాలే వేయడంవల్లా, ఆ కధానాయికలకు ప్రేమించుకోవడం తప్ప ఇంకో పనేది లేకపోఅవడంవల్లా - మామూలు జేవితంలో కూడా ఆ పాత్రధారులు అలాగే ఉంటారని ప్రజలు అనుకోవడంలోన్యాయం లేదనీ మంజరి వాపోయింది.
"దిక్కుమాలిన ప్రెస్టేజీని చూచి నోరు నొక్కుకోవలసి వస్తోంది గానీ, నాకు శరీర సౌఖ్యం మీద - గుంటూరు కోళ్ళగూడెంలో ఉన్నప్పుడే అసహ్యంవేసిందని, ఓ స్టేట్ మెంట్ ఇచ్చేద్దును" అన్నదావిడ రాజమణితో, "కానీ అది లాభంలేదు. అలా మనం అనకూడదు. అన్నా పత్రికలేవీ అచ్చెయ్యవు" అని గొణిగింది మంజరి.
రాజమణి ఓ గ్లాసెడు పళ్ళరసం ఇచ్చి, మెదదాకా శాలువా కప్పి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్లిందాకా కళ్ళుమూసుకొన్న మంజరి బల్లమీద పడున్న పత్రికను తీసి ఇంకోసారి చడువుకొన్నది. చాలా సేపటిదాకా ఈ సింగార మొదలియార్, ఎవరో ఆవిడకు తట్టలేదు. కానీ పేరు తనకు కొత్తకాదు. ఎప్పుడో ఎక్కడో విన్నది. అలాగని చాలా వెనకటి కాలంలో విన్న పేరుకూడా కాదు. అంతా ఈ మధ్యనే-
మంజరి కళ్ళు విప్పారాయి. ఇంకోసారి పత్రికకేసి చూసి, దాన్ని బల్లమీద పడేసింది. రెండున్నర మాసాల కిందట తను నైట్ షూటింగ్ నుండి వస్తున్నది. డ్రైవర్ను తనే పొమ్మన్నది కూడాను. షూటింగయ్యాక, రంగన్నా కడుక్కోకుండానే కారు దగ్గరకొచ్చింది. తను తలుపు తీస్తున్నప్పుడే వెనకనించి ఎవరో వచ్చి, నడుంచుట్టూ చేతులు చుట్టేశారు. మంజరి ప్రాణాలు లేచిపోయాయి. పెద్దగా అరవబోయింది. వాడు దవడలు నొక్కిపెట్టి, ముద్దు పెట్టుకొని, జుట్టు చిందరవందరగా చేసి చెట్లలోకి పారిపోయాడు. చీకట్లో వాడెలా ఉంటావో కూడా తను చూడలేదు. కారు తీసుకొని ఇవతలి కొచ్చాక, స్టూడియో మేనేజర్ కనిపించి "సింగారం అటుగాని వచ్చాడా" అనడిగాడు. తను 'రాలే'దన్నది. వాడు సినిమా పిచ్చోడనీ, అంతో ఇంతో ఉన్నోడనీ, మతి చలించి పోయిందనీ, సినిమా వాళ్ళ వెంట పడుతూ ఉంటాడనీ చెప్పాడు స్టూడియో మేనేజర్, అవసరమనుకొంటే తను ఇంటిదాకా వస్తానని కూడా అన్నాడు. తనే 'అక్కరలే'దన్నది. ఆ సంఘటనకు మంజరి అట్టే ప్రాముఖ్యంనేనీ ఇవ్వలేదు. కాకపోతే, ఆ రాత్రి, ఆ మర్నాడు కాస్తగా భయపడింది -వాడు మళ్లా వెంట పడతాడేమోనని. ఆ పైత్యపు వెధవ తనను కావలించుకొన్నందుకు కాదుగానీ, అటువంటి దశలో ఎవరన్నా చూడటమే తటస్థపడితే, తన పరువు ప్రతిష్టలు ఏమవుతాయన్న బెంగతో కునారిల్లి పోయింది.
అంతే!
ఆ తరువాత ఆ గొడవే మరచిపోయింది.
మళ్ళీ ఇప్పుడు గాని -అదీ ఈ పేపరు చూడటం వల్ల - వాడి పేరు తనకు జ్ఞాపకం రాలేదు. వాడికోసం తను అంగలార్చిందనీ, తన పంచ ప్రాణాలు కొట్టుకుపోయాయనీ, ఈ పేపరు వాడు రాశాడు. పైగా వాడు చక్కగా ఉంటాడనీ, చాలామంది ఆడవాళ్ళు వాడి కోసం పడి చస్తుంటారనీ వీడంటున్నాడు. నిజమే నేమో మరి! కానీ తన విషయంలో అది అబద్దం. తనకు మగవాళ్ళంటే ఉన్న జుగుప్స ఇంతా అంతా కాదు. పైగా తన శరీరం ఆశించే వాళ్ళు పురుగులకన్నా హీనంగా తనక్కనపడతారు. ఆ పురుగులకోసం అవి - ఎంత అందంగా ఉండనీ - తను డబ్బు ఖర్చు పెట్టాననడం అబద్దం, అబద్దం, అబద్దం. మగవాళ్ళను గురించీ, శరీర సౌఖ్యాలను గురించీ తనకున్న అభిప్రాయాలేమిటో -దాచకుండా బయట పెట్టిన మరుక్షణం, తనమీదికి కుక్కలను ఉసికొల్పి ముక్కలకింద చీల్పించి పారేస్తారు. లేదా రాళ్ళతో కొట్టి నడివీధిలో చంపి పారేస్తారు. అందుకే తన ఆంతర్యమేమిటో తనెప్పుడూ బయట పెట్టలేదు. ఇక ముందుకూడా బయట పెట్టదలచుకోలేదు.
"సింగార మొదలియార్" అనే ఈ నవ మన్మధాకారుడేవడో వాణ్ని గురించి ఈ పత్రికలో రాయవలసిన అవసరం ఏమొచ్చిందో శర్మ కూపీలు తీసి సమాచారం పట్టుకొచ్చాడు.
"వీడిది తిరుచనాపల్లి. తండ్రికి ఏదో వ్యాపారముంది. అంతో ఇంతో ఆర్జన ఉన్న కుటుంబం. నలుగురు ఆడపిల్లల తర్వాత వీడు పుట్టాడు. అంచాత కాస్త గారాబం అధికం. చదువు వంటపట్టలేదు తల్లి చాటునా, మాటునా అయిదూ పదీ అందిస్తూండేది. వాడా డబ్బంతా, జులాయి వెధవల్ని చేర్చుకొని తగలేస్తూ ఉండేవాడు వచ్చిన ప్రతి సినిమా చూడటం వాడి నిత్యనైమిత్తికాల్లో ఒక భాగం రానురాను వాడికి సినిమాల్లో వేషాలెయ్యాలనిపించింది. ఎవ్వడికీ తెలియకుండా ఇంటిలోంచి నాలుగు వేలు లంకించుకొని మద్రాసు కొచ్చాడు. రెండు మాసాల్లో డబ్బయిపోయింది. వేషాలు దొరకలేదు. ఇంటికెడితే తండ్రితన్ని వెళ్ళగొట్టాడు. తల్లి ముందే నెలకింత డబ్బు పంపుతూ ఉంటుంది. అది తింటూ, స్టూడియోలచుట్టూ, స్టార్ ల ఇళ్ళ చుట్టూ తిరుగుతుంటాడు. మనిషిది ఎర్రతోలు కనుక తనను చూసి ఆడవాళ్ళు వెర్రెత్తి పోతుమ్తారని వాడికో భ్రమ వుంది. దానిక్కూడా కారణం లేకపోలేదు. వాడి దగ్గర నాలుగు వేలున్న రోజుల్లో వాడిచుట్టూ చేరినసజ్జు వాణ్ని కంతుడనీ వసంతుడనీ పొగిడేసింది. "నిన్ను చూస్తేనే స్టార్సంతా జావజావయిపోతా"రని ఉబకేసింది. డబ్బయితే అయిపోయింది. గానీ "ఉబుకు" మాత్రం తగ్గలేదు. అప్పటికీ సింగారం గాడు తనకోసం ఆడవాళ్ళు పడిఛస్తుంటారనే నమ్ముతున్నాడు.. అవును గానీ మేడమ్. మరీ బోర్ చేసి వొదులుతున్నానా?" అన్నాడు శర్మ కాలుస్తున్న సిగరెట్ ను దూరంగా విసిరేస్తూ.
"నోనో అదేంలేదు. ప్రొసీడ్!" అన్నది మంజరి ఉత్సాహంగా.
"వాణ్ని చూసి, నన్ను చూసి వెంటపడే ఆడవాళ్ళు ఈ దేశంలో ఉంటారని నేననుకోను మేడమ్" అంటూ ప్రారంభించాడు శర్మ.
"అలా కాదులెండి, మీకోసం వెంటపడే వాళ్ళున్నారన్నది రుజువయింది. మీరు వాడి సంగతి చెప్పండి!" అన్నది మంజరి.
వసంత ఆ మాటలంటున్న మంజరి వేపు చూసి, కళ్ళు చికిలించింది. శర్మ పొంగిపోయాడు.
"ఊఁ.....మళ్ళా డైవర్టుకాకండి! చెప్పండి!" అన్నది మంజరి తొందరచేస్తూ.
"మనమెంత దాకా వచ్చాం?" అన్నాడు శర్మ. నిజంగా అతడికా లింకు జ్ఞాపకంలేదు.
"వాణ్ణి చూసి, మిమ్మల్ని చూసి, వెంటపడే ఆడవాళ్ళు ఈ దేశంలో ఉంటారని, మీ రానుకోవడం లేదు - అంతదాకా చెప్పారు. ఇహ కానివ్వండి!" అని అందించింది వసంత.
    మంజరి "అలాకా"దన్నది.
"నువ్వు చెప్పింది మీ ఆయనగారి కామెంటుగానీ, అసలు సబ్జెక్టుకాదు వసూ! కధలోని ఆఖరు వాక్యమేమిటంటే -"ఇప్పటికి సింగారం గాడు, తనంటే ఆడవాళ్ళు పడి చస్తుంటారనే నమ్ముతున్నాడనో, లేదా అలాంటిదో నువ్వన్నావు శర్మాజీ!" అన్నది మంజరి.
"యస్ మేడమ్!" అన్నాడు శర్మ కొత్త సిగరెట్ ను వెలిగిస్తూ. దాన్నిబట్టే వాడెంత పిచ్చి వెధవో మనం ఊహించవచ్చు. తీరవలసిన కోరికలు అపారంగా ఉండి. అవి తీర్చుకోవడానికి వేరే మార్గమంటూ లేనప్పుడు, ఆకోరికలు అసహజమైన దోవలగుండా బయట పడుతూ ఉంటాయి.... నువ్వేమీ అనుకోనంటే వొక్కమాటంటాను మేడమ్! అననామరీ?" అన్నాడు శర్మ.
"వైనాట్?" అన్నది మంజరి.
శర్మ చెయ్యిచాపాడు.
మంజరి అతని చేతిలో తనచేయ్యి వేసి, సున్నితంగా నొక్కి "ఏమీ అనుకోను చెప్పండి!" అన్నది.
శర్మ ఏదో అనబోతున్నాడు -
మధ్యలోనే మంజరి నవ్వి, అతని పొట్టమీద వేలితో పొడిచి కితకితలు పెట్టింది.
ఏమిటన్నట్టు తలెగరేసాడు శర్మ.
"నన్ను ముట్టుకోవాలనుకొంటే, ఆ ముక్క చెప్పరాదా శర్మాజీ! దానికోసం ఇంతనాటకం ఎందుకయ్యా?" అన్నది మంజరి.
శర్మ కళ్ళింత చేసుకొని చూశాడే తప్ప, ఏమీ అనలేకపోయాడు.
"నేను సరదాగా అన్నాను శర్మగారూ! మరీ వారంరోజుల నుండీ మంచం సవారీ తీస్తున్నానేమో, ప్రాణం విలవిలలాడి పోతోంది. నేనేమన్నా నావాళ్ళు గనక, మీ నలుగుర్నీ అంటానుగానీ పరాయివాళ్ళను అంటానా, అనగలనా?....ఊఁ .....చెప్పుకురండి సూతుండవ్వలి కదా వృత్తాంతం బేమని చెప్పదొడంగే?" అన్నది మంజరి.
"అందుక్కాదు మేడమ్! నేను సరిగ్గా ఏ విషయం చెప్పదలుచుకొన్నానో, మీరూ అక్కడికే వచ్చారు.
ఇప్పుడు మీరన్నారు చూడండి, ముట్టుకో దలుచుకొంటే ఆ మాట చెప్పమనీ దానికాన్ని నాటకాలు ఆడోద్దనీ నూ -అపాయింట్ మీదనే చెబుతాను. మిమ్మల్ని తాకాలని నాకు బాగా ఉన్నదనుకోండి. ముట్టుకొంటే, మా వసంత రాజమణి, చలపతి, తాయారు ఏమన్నా అనుకొంటారన్న భయంవల్లనో, మీరే చీవాట్లు వేస్తారన్న భయంవల్లనో ఆ పని నేను చేయలేననుకోండి! మిమ్మల్ని తాకాలన్న కోర్కెలను నేను చంపుకోలేక పోయాననుకోండి. అప్పుడు నేను దొంగ దోవలు వెదుకుతాను. మీరన్నట్లుగా ఏవో నాటకాలాడి మిమ్మల్ని తాకే అవకాశాలను కల్పించుకొంటాను. దగ్గరగా ఉన్నవాణ్ణి గనక నాకిది సాధ్యం. బొబ్బిలిలో ఉన్న వాడికో శ్రీనగర్ లో ఉన్న వాడికో దిండివనంలో ఉన్న వాడికో మిమ్మల్ని తాకాలని ఉన్నదనుకోండి -"
"మీ మాటకు అడ్డోస్తున్నాను శర్మగారూ!" అన్నది మంజరి వస్తున్న నవ్వును ఆపుకొంటూ" వీళ్ళందరకూ నన్ను తాకాలని మాత్రమే ఉంటుందంటారా? నేన్నమ్మను. మీరేదో మొహమాటపడి చెప్పడం మానేస్తారుగానీ....అవునంటారా శర్మగారూ?"
"ఏమిటక్కాయ్ నువ్వుమరీనూ?" అని మోచేతితో సున్నితంగా పొడిచింది వసంత.
శర్మ అగ్గిపుల్లతో చెవులో తిప్పుకొంటూ చెప్పడం సాగించాడు -
"వాళ్ళకు దూరంగా ఉన్నవాళ్ళకు నీ ఫోటో లేగతి! నీ బొమ్మల కోసం ప్రతిరోజూ వందలాది ఉత్తరాలు రాసే నీ అభిమానులు, నువ్వుపంపిన ఫోటోలను ఎలా వాడతారో నువ్వొక్కనాడూ ఊహించి ఉండవు. ఊహిస్తే నువ్వు వొక్క కాపీకూడా పంపివుండవని నాకు తెలుసు. కొంత మంది దేవుడి పఠాలకుమల్లే గూళ్ళ�


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS