మంజరి పలుకలేదు. ఆమె కళ్ళలో పడే పడే నీటు ఊటలు ఉబుకుతున్నాయి. దుఃఖభారంతో పెదవులు ఆదరతున్నాయి. మానుషి వివాసయైపోతూ ఉంది. రెండుకణతలనూనొక్కుకుంటూ ఉంది. గుండెలు భగ్గుమని మండిపోతున్నాయి. కడుపులోంచి అన్ని అవరంద్రాలనూ తెంచుకొని ఎడుపు బయటకి పోంగుకొస్తుంది. నరాలు ఉబికాయి.ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నది.
"తాయారును పిలుస్తావా చలపతీ!"
'ఆ' అన్నాడు చలపతి "ఎందుకూ?"
"నేను కాస్సేపు నిద్రపోవాలి. స్టిమితంగా- నిశబ్దంగా -, నిద్రపోవాలి. ఏవన్నా తీసుకుని-"
'వద్దు' అన్నాడు చలపతి ఏదోకసి కడుతున్నవాడిలాగా లేనిపోని బెడదలు మెడకు చుట్టుకొవద్దు. జరగనిదేదో జరిగిందని -మీ ధోరణి బట్టి నేననుకొంటున్నాను. ఈ ఫలితం ఎంతదాకా ఈడుస్తుందో ఎవ్వరికీ తెలీదు అంచాత..."
ఆరు కావడానికింకా కొన్ని నిమిషాల వ్యవధానం ఉన్నదనగా రోదచేసుకొంటూ ఓ పోలీసువాను వచ్చి మంజరి గేటుముందు ఆగింది.
ముందుగా దాన్ని చలపతి చూశాడు.
"ఆరోగో పోలీసులు" అన్నాడతను చాలా తాఫిగా.
అని మంజరిని పరిశీలనగా చూశాడు, ఆవిడ నిలువునా కంపించిపోతున్నది.
"ఓంకో రెండు మూడు నిమిషాల్లో వారిక్కడకొస్తారు. పోలీసుల చేతిలో చిక్కకుండానే ఉండాలి గానీ వాళ్ళు పెట్టె యాతన పగవాడిక్కూడా వద్దు. అన్నీ నువ్వు చూసుకొంటూ వుంటే కిందికేడతాను" అని లేచాడు చలపతి.
మంజరి ముఖం తిరిగిపోయింది.
ఆవిడ కళ్ళు మూసుకొని,తూలిపడబోయి, చలపతిని పట్టుకొని నిలబడగలిగింది.
"నన్నీ దశలో వొదిలిపోవడం నీకు తగిలినట్లనిపించింది.
"ఎలాగైనా నువ్వు యజమానురాలివి, నేను నీదగ్గర పనిచేసేవాణ్ని.నీ అనుమతిలేకుండా ఏమీ చెయ్యడమూ ధర్మంకాదు. అందుకని అడిగాను.... ఇంకో నిమిషంలో పోలీసులోస్తున్నారు. నివ్వు గదిలోకెళ్ళు. కళ్ళుతుడుచుకో, నువ్వు నిద్ర పోతున్నావన్నమాట. తెలిసిందా?"
మజారి లోపలి కేడుతున్నప్పుడే, మెట్లమీదుగా, చప్పుడు చేసుకొంటూ నలుగిరు పోలీసు అధికారులు పైకొచ్చారు.
"మన్నించాలి, మీకు డిస్టర్బెన్స్ -" అన్నాడోకతను.
"పర్వాలేదు రండి,అలా కూచోండి"
కూచున్నాక 'నా పేరు సుందరం' అని భారీగా ఉన్న మనిషి తనను తను పరిచయం చేసుకొన్నాడు. "వీళ్ళందరూ నా సహోద్యోగులు... ఈ రోజు తెల్లవారు జామున, జరిగిన సంఘటన మీకు తెలీసే ఉంటుంది. దాని వివరాలు ఇంకేమన్నా దొరుకుతాయేమోనని మీ దగ్గరకొచ్చాం. మీపేరు-చలపతి గారేనా?... గుడ్,మజారిగార్ని పిలిపిస్తే-" అన్నాడు సుందరం.
"ఆమెగారు స్నానం చేస్తున్నారనుకొంటాను. ఇంకో పదినిమిషాల్లోగానీ రావడం జరగదు నేను మీకు సహాయపడగలిగితే చెప్పండి. తప్పకుండా చేస్తాను" అన్నాడు చలపతి రవంత బిగ్గరగా.
అతని అభిప్రాయమేమిటంటే మంజరి, ఆ ఎడుపుమొఖంతో గాకుండా రవంత టాయిలేట్టయి ప్రెష్ గా రావడానికి అవకాశమిద్దామని.
"మీకు తెలిసిన వివరాలు చెప్పండి"అన్నాడు సుందరం, చేకర్రతో సోఫా మీద సున్నితంగా తాటిస్తూ.
"ఎ విషయంలో?" అన్నాడు చలపతి.
"అదే కళ్యాణిని గురించి"
"నారు మాకు చాలా కాలంనుండి తెలుసు. మంచి ఆర్టిస్టు. ఇంకోవో వివరాలు కావాలంటున్నారు. ఏం జరిగిందండీ?" అన్నాడు చలపతి.
సుందరం చాలా నిశితంగా చలపతి ముఖంలోకి చూశాడు.
"కళ్యాణి తెల్లవారు జామున చనిపోయింది"అన్నాడు సుందరం.
"అర్రే!"
చలపతి నిశ్చేష్టుడయినట్లు కనిపించాడు.
ఎలానండి? నేనావిణ్ను ఆఖరిసారి చూసినపుడు చాలా మామూలుగా ఇన్నారే! అయినా గుండె జబ్బున్న మనుషికి చావు క్షణాల్లో వస్తుంది.
"ఎలా చనిపోయిందన్నదే ఇప్పటి సమస్య. మీరు గుండె జబ్బు మనిషంటున్నారు, నా అవమానం ఎవరో అవిణ్ను హత్యచేసారని. డాక్టర్లు పరీక్ష చేస్తున్నారనుకోండి; చూదాం. మీకూ కళ్యాణికీ మంచి సంబంధాలున్నాయని అక్కడ పనివారు నాకు చెప్పారు.మీరేమన్నా ఉపయోగపడే సమాచారమిస్తారేమోననివచ్చాం."
మజారి, అందంగా మేకప్ చేసుకొని వచ్చింది. వస్తునే పోలీసుల్నిచూసి, ముఖం చిట్లించి, 'ఎందు' కన్నట్లు చలపతి కేసి చూసి 'నమస్కారం' అన్నది వారివేపు తిరిగి.
'ఈరోజు తెల్లావారు జామున కళ్యాణిగారు చనిపోయారట మంజరీ ! నన్నడిగితే; వారికి గుండె జబ్బున్నది గదూ మరి- ఆ సంగతే చెప్పాను. ఆమె సహజంగా మరణించలేదనీ, ఎవరో హత్యచేసి వుండాలనీ... అరె అదేమిటి మంజరీ! అలా అయి పోతున్నావేం ?' అన్నాడు చలపతి.
మంజరి ముఖం ఎలా తేలా అయిపోయింది. ఆవిడ సోఫాలో స్మృతి తప్పిన దానిలాగా పడిపోయింది.
"మాట వింటేనే ఇలా అయ్యారంటే - చాలా దగ్గరసంబంధాలు ఉంది ఉండాలన్నమాట!" అన్నాడు సుందరం.
మిగతా అధికారులు 'జే'నన్నట్టుగా తలలూపారు.
దాదాపు పడి నిమిషాలకు గానీ, మంజరి తేరుకోలేదు. తాయారు చల్లని నీరు ముఖం మీద చిలకరించింది.
"అవతల నాకు చాలా పనులున్నాయమ్మా! నాకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. కళ్యాణికీ, మీకు చాలా కాలంనుండీ మంచి సంబంధాలున్నాయని మాకు తెలుసు. అంతే - చాలా వరకు ఒకరి విషయాలు మరొకరికి తెలుసునన్నమాట. అవి మీరు చెబితే ఈ కేసు సులభమవుతుంది.మీ స్నేహితురాలిని చంపినవారికి మేము తాగిన శిక్ష విధించగలుగుతాము" అన్నాడు సుందరం.
మంజరి మాట్లాడలేదు.
"మీకు తెలిసినంతలో, కళ్యాణికేవరన్నా విరాదులుంటే చెప్పండి" అన్నాడు సుందరం.
"ఎవరూ లేరు" అన్నాడు చలపతి.
"నేను మంజరిగారి నడిగాను, వారినే చెప్పనివ్వండి" అన్నాడు సుందరం.
"కళ్యాణికీ, మంజరీకీ పరిచయం చేసినవాణ్ని నేనే! మంజరి మద్రాసు రావడానికి ముందునుండి కూడా కళ్యాణి నాకు తెలుసు. మీకు కళ్యాణిని గురించిన భోగట్టాకావాలంటే, నాకన్నా ఎక్కువ ఆవిడచెప్పలేదు. కాక- మీరడిగే ప్రశ్నలకు, మంజరి సమాధానాలు నివ్వడమే మీకు ముఖ్యమయితే- అది వేరు సంగతి" అన్నాడు చలపతి.
"మంజరి మీ కేమవుతుంది?" అన్నాడు సుందరం.
చలపతి ముఖం చిట్లించి, మంజరికేసి చూశాడు.
"ఇంకోప్పుడయితే పాత చింతకాయ పచ్చడవుతాడనేదాన్ని బాబూ! ఇప్పుడా ఉత్సాహం లేదు. నా కీయనగారు అన్నీ అవుతాడు. ఏమికాడో చెప్పగలనుగానీ, ఏమవుతాడో చెప్పడం నా వాల్లకాదు" అన్నది మంజరి.
"అతను చెప్పే జవాబులన్నీ మీరు చెప్పినట్టుగా మేమను కావువచ్చా ?"
"అఁ"
"అవసరమయితే మీరు, వారికి బదులుగా సంతకాలు పెడతారా?"
"అఁ"
"థాంక్స్"
ఆఖరిసారి మీరు కళ్యాణిని ఎప్పుడు చూశారు?" అన్నాడు సుందరం.
"అందరం కలసి హిందీ ఫిక్చర్ కెళ్ళాం.కాస్సేపు కూచున్నాక" అని ప్రారభించింది మంజరి.
'ఎంతసేపు?' అన్నాడు సుందరం.
"ఓ ముప్పావుగంట- సుమారుగా నను కొంటాను; కళ్యాణి పోతానన్నది మా కెవ్వరికీ అంత త్వరగా వెళ్ళడం ఇష్టంలేదు. అన్నాడు చలపతి. పొడి దగ్గు గొంతు సరిచేసుకొంటూ ' ఆరోగ్యం సరిగా లేదేమోననుకొన్నాను. కాదుట- ఎవర్నో కలుసుకోవాలన్నది, ఆవిడ కారు తీసుకురాలేదు. మా డ్రైవరు కూడా లేడు.నేనే డ్రైవ్ చేసుకోచ్చాను. కళ్యాణిని దిగబెట్టాటానికి నేను బయలుదేరే సమయానికి మంజరి తను కూడా వస్తానన్నది. ఆవిడకు తలనొప్పిగా వున్నదట,'సరే'నన్నాను,కళ్యాణి ని ఇంటి దగ్గర దిగవిడిచాను"
"పోర్టికోలో దించారన్నమాట"! బావుందండీ! అ తరువాత? అన్నాడు చలపతి.
"గేటు దగ్గారే ఎందుకు దించమన్నదండీ?" అన్నాడు సుందరం.
"అది అవిణ్నడగవలసిన ప్రశ్న. నేనేం సమాధానం చెప్పనండి దానికి?" అన్నాడు చలపతి.
"అవును... అఁ...తరువాత?"
"ఇద్దరం ఇంటికొచ్చాం"
"బావుంది... కానీ కళ్యాణి ఇంటి కాపలాదారు, ఆవిడ చాలా పొద్దుపోయిగానీ ఇంటికి రాలేదనీ, వచ్చేటప్పుడు తనస్వంత కారులో వచ్చిందనీ, అప్పటికి వాన వెలసిపోయిందని చెప్పాడే!" అన్నాడు సుందరం.
"అలాగా! నిజమే అయి ఉండొచ్చు"
అదేలా సాధ్యమండీ?" అన్నాడు సుందరం.
"ఎలా సాద్యామో మీరు నిర్ణయించాలి. నేను చెప్పింది మాత్రం నిజం! కాకపోతే వొకటి జరిగి వుండాలి కళ్యాణి అంతకు ముందే,అతనికోసం, అక్కడకు కారు మీద వెళ్ళిన కళ్యాణి - అ వ్యక్తి లేకపోవడంతో, మాతోబాటు సినిమాకు వచ్చి వుండాలి. దరిములా సంగతులు మీకు చెప్పనే చెప్పాను."
"ఏవమ్మా! అంతేనా జరిగింది?" అన్నాడు సుందరం, ప్రశ్నార్ధకంగా మంజరిని చూస్తూ.
"అవును"
"మంచిది మన మొకసారి కళ్యాణి యింటికి పొదాం మీరూ రండి!" అన్నాడు సుందరం.
"మంజరిరాదులెండి ఆమెకు శవాలను చూస్తే భయం?" అన్నాడు చలపతి.
బయలుదేరాలనుకొంటున్న మంజరి, అతని మాటలు విని, ఆ ఆలోచనను కట్టి ఆఖారు క్షణంలో, తన వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా కలసి మెలసి ఇన్నారు. ఈ ఆఖరు క్షణంలో, తన స్నేహితురాలి సవం చూసుకొందుకైనా మంజరిగారికి అవకాశం లేకపోవడం అన్యాయం ఇంతమంది మనముండగా భయమేమిటి? అర్ధంలేదు; అన్నాడు సుందరం. "రండీ! మీరు అక్కడకు రావడం అవసరం కూడాను."
చలపతి ఇంకేమనడానికీ లేకపోయింది.
అందరూ దిగి కింది కొచ్చారు.
వరండాలోనూ, పోర్టికోలోనూ చాలా మంది గుమికూడారు. అందులో పత్రికా విలేఖరులు కూడా ఉన్నారు. వారు మంజరిని చుట్టుముట్టి "మీ అభిప్రాయమేమిటో చెప్ప" మంటూ వత్తిడి చేయసాగారు.
"నాకంతా అయోమయంగా వుంది. నేనిప్పుడేమీ చెప్పలేను" అన్నది మంజరి.
"లేనిపోని పుకార్లు వ్యాపించనీయకండి, చెప్పదలచిందేమన్నా ఉంటే నేనే మీకు చెబుతాను. ఊహాగానాల వల్ల మాపని ఎంత చిక్కుల్లో పడుతుందో మీకు తెలిసిందే!" అన్నాడు సుందరం.
ఇంత చెప్పినా ఒక రిద్దరు ప్రెస్ ఫోటోగ్రాఫర్లు మజరిని ప్లాష్ తీశారు.వచ్చే సినిమా పత్రికల్లో ఈ పోటోవేసి,స్నేహితురాలి మరణానికి విలపిస్తున్న మంజరి "అనిగానీ" "పోలీసులతో ప్రసిద్ధ తార" అనిగానీ అడుగున రాస్తారన్నమాట.
పదిహేను నిమిషాలకల్లా కారు కళ్యాణి ఇల్లున్న వీధిలోకి వచ్చింది.ఆ కొసనుండి యీ కోసదాకా, ఇసకవేస్తే రాలనంతగా జనం క్రిక్కిరిసి వున్నారు.పోలీసులు యెంత సర్డుభాటు చేసినా, ప్రజలు మూగుకోస్తున్నారే గానీ,చెదిరిపోవడంలేదు.మేల్లాగా దోవ చేసుకొంటూ కారు కియానీ కాంపౌండులోకి వచ్చింది. అక్కడ ఉన్నత పోలీసు అధికారులతో బాటుగా, సినిమా పరిశ్రమలోని, హేమా హేమీల వంటివారు కూడా వున్నారు.ఉదయానికల్లా, కల్యాణి మరణవార్త కార్చిచ్చులా మద్రాసు నగరమంతా వ్యాపించింది. కళ్యాణిపట్ల సానుభూతి సూచకంగా, నగరంలోని అన్ని స్టూడియోలకూ, ఆ రోజు సెలవు యివ్వబడింది.
అందరి దృష్టులూ మంజరిమీదమే కేంద్రీకరించబడి వున్నాయి. కళ్యాణి హత్యకు సంబంధించిన పరమ రహస్యం మంజరి రాకతో తెలిసిపోతుందన్న నమ్మకం వున్నవారు చాలామంది, ఆమెను సమీపించి, ముందుగా సానుభూతిని ప్రకటించారు.
"మనం పైకి పొదాం రండి!" అంటూ సుందరం మేడమీదకి దారితీశాడు.
మంజరి, చలపతి,అతన్ని అనుసరించారు.
ఇంకెవ్వరూ పైకిపోకుండా పోలీసులు అడ్డగించారు.
మద్యహాలంతా చిందరవందరగా ఉంది; సోపాలమీది కవర్లు చెల్లా చేదురయ్యాయి. టెలిపోన్ స్టాండుకు బార దూరంలో కళ్యాణి వెల్లకిలా పడివున్నది. ముఖమంతా లేత నీలిరంగులోనికి మారిపోయింది. కనుగుడ్లు ఇంత లావుగా బయటకి తోసుకొచ్చాయి. నోరు కొద్దిగా తెరుచుకొని, పళ్ళు కనిపిస్తున్నాయి. ముక్కు రంధ్రాల నుండి తెల్ల ద్రవం, పై పెదవిమీదకి జారి అక్కడ గడ్డకట్టిపోయింది; నోటిమీద ముక్కు మీద గుడ్డి ఈగలు ముసురుతున్నాయి. రెండు పిడికళ్ళూ గట్టిగా బిగుసుకొని వున్నాయి.జుట్టంతా రేగి ఇంతెత్తున ఈతపొదలా తయారయింది.
మంజరి నిలువునా కూలిపోయింది. ఈ స్టితిలో ఉన్న కళ్యాణిని చూడవలసి వస్తుందని, అవిడేనాడూ ఊహించి ఎరగడు.నిశ్చలంగా,జీవరహితంగా చలువ రాళ్ళమీది కాశ్మీర్ తివాచీ మీద, వెల్లకితల పడి వున్న కళ్యాణి; ఏదో సినిమాలోని క్లయిమాక్స్ సీనులో నటిస్తున్నట్ట్లుగా ఉన్నది.విశ్వ రంగస్థలం మీద తన పాత్రను పూర్తిచేసుకొని, రంగులు కడుక్కొని కళ్యాణి వెళ్ళిపోయిందనీ, తన నిష్క్రుమణకింకా సమయం రాలేదనీ మంజరి కనిపించింది. చిత్రమేమిటంటే మంజరికి ఏడుపు రాలేదు, అంతకుమించిన అగాధమైన బరువైనా అవాచ్యమైన స్టితిలో మంజరి పడిపోయింది. చాలాసేపటి వరకూ, కన్నార్పకుండా కళ్యాణి శరీరంకేసి చూస్తూ నిలబడింది మంజరి. తరువాత వంగి కళ్యాణి చేతిని అందుకోబోయింది.
"క్షమించాలి అంటూ సుందరం వారించాడు. "హంతకుని వెలిముద్రలకోసం మేం చూస్తున్నాం. దయ చేసి వాటిని మీరు చేరవకండి."
"చాలాదారణం" అన్నాడు చలపతి డగ్గుత్తికతో "ఇంతఘోరం జరగటానికి కారణమేమిటంటారు బాబూ?"
"అదే తెలవలసివున్నది. ఇంట్లో దొంగతనం జరిగిన దాఖాలాలు లేవు. కళ్యాణి వంటి మీది నగలు కూడా అలానే వున్నాయి. ఏదీ కదిలించినట్లు రుజువులేదు. వొంటిమీద గాయాలున్నాయయేమో చూశాం. మా డాక్టరు,ఊపిరాడక చనిపోయినట్లు చెప్పాడు.ఎవరో ఆమెను బలవంతంగా చంపారు. గొంతు దగ్గరినరాలు నలిగి పోయినట్లు కనిపించాయి.ప్రాణరక్షణకోసం పెనుగులాడినట్లు తోస్తున్నది" అన్నాడు సుందరం.
"కావచ్చు" అన్నాడు చలపతి.
"ప్రాణాలుపోయికూడా ఎక్కువసేపు కాలేదు. నాలుగు, అయిదూ మద్యలో చనిపోయివుంటుందని డాక్టర్లు అభిప్రాయం..." అన్నాడు సుందరం మెల్లిగా సిగరేట్ అంటించి, చేయగలరని నమ్ముతున్నాను. మీకు తెలిసిన విషయాలను దాచకుండా చెప్పడం వలన, దోషిని త్వరగా పట్టుకోలుగుతాము. కళ్యాణికేవరన్నా విరోధులున్నారా?"
"తెలీదు" అన్నది మజారి ఓ చెంప చలపతిని చూచుకుంటూ
"ఆమె కేమయినా దురబ్యాసాలున్నాయా?"
"తెలీదు" అన్నది మంజరి.
"ఉన్నాయండీ" అన్నాడు చలపతి.
సుందరం ఎటెన్షన్ మజారి నుండి అవతలివేపుకు మళ్ళింది. చలపతిక్కావలసింది కూడా అదే! ఈ అదనులో మజారి ఉస్సురని సన్నగా నిటూర్చింది.
కళ్యాణి మత్తు పదార్దాలు వాడటం అలవాటు. ముఖ్యంగా విదేశీ పానీయలంటే ఆమె పడిచచ్చిపోయేది. వీటికోసం ఆవిడ నాకు ఆఫర్ చేయడమూ నేను చాలా కొద్ది తెచ్చేదో నాకు తెలీదు. అనేకసార్లు ఆవిడ మార్ఫియా వాడటం నాకు బాగా తెలుసు. ఇవి దురబ్యాసాలని మీరంటే నాకభ్యంతరంలేదుగానీ, ఈ మాదిరి అలవాట్లు లేనివారేవరూ ఈపరిశ్రమలో లేరనుకుంటాను"అన్నాడు చలపతి.
"మంజరిగారు ఇంకేమన్నా చెబుతారా?" అన్నాడు సుందరం.
"లేదండీ! నాకేమాత్రం కూడా తెలీదు. ఇప్పుడు చలపతీగారీ మాటలన్నీ అంటుంటే - నాకే ఆశ్చర్యంగా ఉంది!" అన్నది మంజరి.
"మీరు నిజం చెప్పడం లేదు" అంటూ చురచురా చూశాడు సుందరం.
"మీరు,కళ్యాణి కలిసి తాగినట్లు మా దగ్గర సాక్షం ఉంది.మరీ- అంత నంగానాచిలాగా నటించటం ప్రమాదం జాగ్రత్త!"
"నేననడం తాగడం గురించికాదు; మార్ఫియా వాడడం గురించి" అన్నది మంజరి రవ్వంత బెదురుగా.
సుందరం తన జేబులోంచి ఓపొట్లం బయటకి తీస్తూ "కళ్యాణి ఏ రకం సిగరెట్లు కాలుస్తుంది?" అన్నాడు.
మంజరి ఆ రకమేదో చెప్పింది.
సుందరం, పొట్లాన్ని విప్పాడు.అందులో ఆరు సిగెరెట్ పీకలూ, ఇంత నుసీ ఉన్నాయి.
చలపతిగారూ!మీకావిడ బాగా తెలుసునన్నరుగదా! ఆవిడ స్నేహితుల్లోగానీ, శత్రువుల్లోగానీ, ఈ రకం సిగరెట్లు కాల్చేవారేవారన్నా ఉన్నారా?"
చలపతి ఆ పొట్లంలోని సిగరెట్ ఫీకలను చూచి తెలియదన్నట్టు పెదవి విరిచాడు.
"అంతే - ఎవరో కొత్తవాడు వచ్చి ఉండలన్నమాట! కానీ నౌకర్లు కాపలావాళ్ళు కూడా కొత్త మనుషులు వచ్చినట్లు చెప్పలేదు. కళ్యాణి పంపుడు కుక్కలు, దయ్యల్లాగా రాత్రాల్లా ఆవరణంలో తిరుగుతాయి గదా! గతరాత్రి అరవలేదన్నారు. వచ్చిన వారెవరో దొంగాదోవనకాక, మామూలు మార్గంలో వచ్చి వుంటారనీ, వారు- అతి తరుచుగా ఈ యింటికి వచ్చి పోతూ వుండేవారనీ, వారికీ ధనేతరమైన ప్రయోజనమేదో వుంది వుండాలనీ, నేను ఊహించాను. నా ఊహా సరయిందే కావచ్చు. ఏవమ్మా! ఇలాంటి సిగరెట్లు మీరేపుడన్నా కాల్చారా?" అంటూ సిగరేట్ ఫికల పొట్లాన్ని మంజరికి చూపించాడు సుందరం.
ఆ సిగరేట్ ముక్కలను చూస్తూనే మంజరి ఉలిక్కిపడింది. అవలిస్తే పేగులు లెక్క పెట్టగలిగిన సుందరం, ఆమె తడబాటును గుర్తించి,తనలో నవ్వుకొన్నాడు.
"ఏమ్మా! కాల్చారా?"
"లేదు."
"పోన్లెండి కాల్చేవారిని చూశారా?"
"అఁ"
"ఎప్పుడు? ఎక్కడ?"
మంజరి కళ్ళు మూసుకొని ఆలోచించింది.
"లాభం లేదు బాబూ! ఎప్పుడో నేను చెప్పలేను. కానీ,అక్కడో చెప్పగలను... బొంబాయి విమానశ్రయంలో ఒక వ్యక్తి ఈ సిగరేట్ కాల్చడం నాకు జ్ఞాపకం!" మంజరి.
"అంతగట్టిగా జ్ఞాపకం పెట్టకోవలసిన అవసరమేమొచ్చిందమ్మా?"
"ఆవ్యక్తికొక కాలు లేదు. నడిచినప్పుడల్లా కోయ్యకాలు గాచ్చుకు తగిలి 'టక్ టక్' మంటూ శబ్దం చెయ్యసాగింది. దాలికి తోడు ఏ చేతికో గానీ అరువేళ్ళున్నాయి. ఇవన్నీ కలిపితే, లోమ్త విడ్డూరంగా ఉంటాయి కదా! బహూశా అందుచేతనే నేను ప్రత్యేకించి చూసి వుంటాను" అన్నది మంజరి.
"అతన్ని మళ్ళా మీ రెక్కడన్నా చూశారా?" అన్నాడు సుందరం.
"లేదు" అన్నది మంజరి.
"తెల్లవారు జామున కళ్యాణి మీకు ఫోనుచేసి ఏమని చెప్పింది?" అన్నాడు సుందరం హఠాత్తుగా.
"మాకా? లేదే!!" అన్నాడు చలపతి.
"ఆవిడ మీకు ఫోను చేసినట్లు టెలీఫోన్ ఎక్సజెంజీలో ఎంక్వయిరీ చేసి కనుక్కోన్నాను. లేదని బుకాయించకండి!" అన్నాడు సుందరం.
చలపతి కణతలు పట్టుకొని కూచుండిపోయాడు.
"మమ్మల్ని క్రమినల్స్ గా భావించడం అన్యాయం సార్! కళ్యాణి ఫోన్ చేస్తే చేసేవుండోచ్చు, కానీ మాకా సంగతి తెలీదు. నాకు మెలుకువ రాలేదు " అన్నాడు చలపతి;
"సాధారణంగా మీరు కింద భాగంలో ఉంటారనీ విన్నాను, మీగదిలో టెలీఫోన్ కూడా లేదుగదా..."
చలపతి ప్రాణం చిటచిటలాడిపోయింది. అయినా లోమ్గా కూడదనుకొన్నాడు.
"సాధారణంగా పగటిపూట కింది గదిలో ఉండేమాట నిజమే! నేనూ కాదనటం లేదే!" అన్నాడు చలపతి. 'సాధారణం' అన్నమాటను నోక్కూతూ.
సుందరం ఏమీ పలక్కుండా, అయిదారు నిమిషాలపాటు కళ్యాణి ముఖంకేసి చూస్తూ కూచున్నాడు.
అంతలోనే కిందినుండి, మరో పోలీసాఫీసరు సంబంద మొదలియార్, రోజుకుంటూ పైకి వచ్చాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. చదువుతున్నంతసేపు మంజరికేసి చలపతికేసి చూస్తూనే ఉన్నాడు. అంతా అయిపోయాక, ఉస్సురని నిట్టూర్చి కవరను ఎగరేసి పట్టుకొని, కింది పెదవిని కొరుక్కున్నాడు.
"ఎక్కడ దొరికింది సంబందం?" అన్నాడు సుందరం.
"కిందిగదిలో ఆమె గుడ్డలభీరువా ఉన్నాదిసార్! దాన్ని చూస్స్తున్నాను. ఓ పట్టుచీరకింద ఈ కవరు కనిపించింది."
"మంచిది,సరె! పని చూడు"
సంబందం సాల్యూట్ చేసి వెళ్ళిపోయాక, సుందరం ఆ ఇద్దరి కేసి గుచ్చి గుచ్చి చూశాడు. ఆ చూపుల్లో ఏవో అనుమాన రేఖలను మంజరి గుర్తించింది. అయినా తను తోనకకూడదనుకొన్నది.
"ఆఖరిసారిగా నేను మీ ఇద్దరకూ చెబుతున్నాను. కళ్యాణి చావుకు కారణం మీకు తేలుసు. హంతకుడేవరో కూడా మీకు తెలుసు. అనవసరంగా జాప్యం చేయడం మంచిదికాదు. ఆ సమయంలో హంతకుడు పారిపోవచ్చు. దయచేసి మరో రహస్యాన్ని బయటపెట్టండి!" అన్నాడు మంజరి.
"అంటే" అన్నది మంజరి.
ఆవిడకోపం వచ్చిందని చలపతి గ్రహించాడు. వేర్రికుక్కాలా వాగి నెత్తిమీదకి తెచ్చుకుంటుందేమోనని భయపడిపోయాడు. ఆలస్యం లేకుండా, మంజరికి బాసటగా నిలబడ్డాడు.
'అంతే మరేం కాదు మంజూ! హంతకుడు మనకు తెలుసునన్న భ్రమలోవారున్నారు. అది నిజం కాదని మనం చెప్పకోవలసి ఉంటుంది. సుందరంగారి అభిప్రాయం కూడా అదే!' అని వాతావరణాన్ని చల్లబరిచాడు చలపతి.
అతని సైగలను మంజరి కూడా ఆవిడ గుర్తించింది.
"అదేనండీ నేనూ అడుగుతుంట, దీనికేం చేయ్యాడమా-అని?"
"అమ్మా భడవా!" అనుకొన్నాడు సుందరం.
"కళ్యాణి మీకు బంధువా" అడిగాడు సుందరం.
మంజరికి ఆగమన్నట్టుగా కన్ను మలిపాడు చలపతి. ఈ ప్రశ్న సుందరం అంతవరకూ అడగలేదు. కవరు చూశాక అడిగాడంటే, ఈ ప్రశ్నకు సంబందించిన హంశమేదో ఆ కవరులో ఉన్నదన్నమాటే! అదేమీటో తెలుసుకొనే అవకాశం లేదు. బంధుత్వం ఉన్నదనిగానీ, లేదనిగానీ, తను స్పష్టంగా తేలకూడదు.
"మాట్లాడరేం?" అన్నాడు సుందరం మళ్ళా.
"అదే ఆలోచిస్తున్నాను సార్! ఏమిటి చెప్పటమో తోచటంలేదు. బంధుత్వం లేదని కాదు-చాలా దూరంగా, ఎక్కడో కలిసి వున్నదనుకొంటాను. అంతకన్నా ముఖ్యం స్నేహితం.దాని ముందు మాకున్న బంధుత్వం వొక లెక్కలోదికాదు. అయితే ప్రతిదానికీ వో పరిమితి ఉన్నట్లే, మా స్నేహానికి కూడా పరిమితులున్నాయి. అనేక విషయాలను గురించి, కళ్యాణితో మేము ముచ్చటించలేదు. అందులో ఆవిడ డబ్బు వ్యవాహారమొకటి ఒక్కోసారి ఎంత పైలాపచ్చీసుగా ఉండేదో, మరోసారి, డబ్బుకోసం అంతగా కట కట పడేది. ఒకటి రెండుసార్లు మంజరి ఆవిడకు డబ్బు సర్దినట్లు నాజ్ఞాపకం. చెబుతున్న దెందుకంటే, వ్యక్తులతో ఎంత గాఢ పరిచయమున్నప్పటికి కొన్ని నియమాలు ఏ నాటకీ మనం తెలుసుకోలేమని నా నమ్మకం! కళ్యాణికి మాతో తెలిసి ఉండాలనుకోవడం భావ్యంకాదని మాత్రమే నేను మనవి చేస్తున్నాను" అన్నాడు చలపతి.
"పోనీండిగానీ చలపతిగారూ! కళ్యాణి అస్టికి వారసులెవరో మీకు తెలుసా?" అన్నాడు సుందరం.
"తెలీదు."
"పోనీ. అస్థికోసం కళ్యాణిని హత్య చేయడానికి, ఆ వారసులకు అవకాశమున్నదంటారా?" చలపతి సన్నగా నవ్వాడు.
"దీనికి నేనెలా సమాధానమివ్వాలో తెలియకుండా ఉన్నది సుందరం గారూ! కళ్యాణికి ఆశలు వారసులంటూ ఉన్నారో లేదో నాకు తెలీదు. అధవా ఉన్నా, కళ్యాణిని హత్య చేస్తే తప్ప అస్థిరాని దశలో వారున్నదీ లేనిదీ నాకు అంతకన్నా తెలీదు. అయినప్పుడు నన్నా ప్రశ్ననడగడం ధర్మమే నంటారా?" అన్నాడు చలపతి.
"అఁ అనుమానం నన్ను ఉదయం నుండీ పీడిస్తున్నది చలపతిగారూ! కళ్యాణి తన ఆస్థిలోని సగభాగం మంజరికి రాసిచ్చింది. మిగతా సగభాగం, మంజరి ఇష్టం వచ్చిన ధర్మకార్యాలకు వినియోగించవచ్చునని రాసింది" అన్నాడు సుందరం.
మజారి కొయ్యాబారిపోయింది.
కళ్యాణి ఆస్థికి తను వారసురాలా?
'అరె! ఈ సంగతి నాతో ఎప్పుడూ అననుకూడా లేదే!' అన్నాడు చలపతి.
'అది నిజం కాదనుకుంటాను. మీకు తెలియకుండా కియానీ ఈపని చేసి ఉంటుందన్న విశ్వాసం నాకు లేదు.
'అది మా దురద్సృష్టం!' అన్నాడు చలపతి బిగపట్టిన గొంతుతో. 'అయినా చెప్పాలనిగానీ, చెప్పితీరాలనిగానీ లేదు. పోలీసాఫిసరుగా- వృత్తి ధర్మం క్రింద, మీరుకనిపించిన ప్రతివారినీ అనుమానించడం అబబేననుకొండి. కానీ, ఎటొచ్చి మాలాంటి వారికీ ధోరణి కాస్త యిబ్బందిగా ఉంటుంది.'
'మంచిది మీరు వెళ్ళిరండి! అవసరమయితే, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవలసి ఉంటుంది... అందుకని... ఎప్పుడని అడిగితే నేను మాత్రం ఏం చెప్పాను చలపతిగారూ! ఇది హత్యకేసు గనక, ఏ నిమిషాన్నయినా, మీ అవసరం కలగవచ్చు. అంచాత మీరు. ఇతర కార్యాక్రమాలన్నీ వొకటి రెండు రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అందాక మీరు అవసరమనుకుంటే- నలుగురు పొలీసుల్నీ మీకు సాయంగా ఉమ్దమంతాను.అలా చేయ్యనా?' అన్నాడు సుందరం!
"మేం పారిపోము పోవలసిన అవసరం కూడా మాకు లేదు. కాదు కూడదని మీరనుకుంటే, పోలీసుల్నీకాపలా ఉంచండి!" అన్నాడు చ్గలపతిఒ నవ్వుతూనే.
సుందరమూ,చలపతి, మెట్లదాకా వచ్చారు. మంజరి ఇంకా కళ్యాణిని చూస్తూనే ఉంది. "మళ్ళావద్దాం" అన్నాడు చలపతి ఇక బయలుదేరమన్నాట్టుగా.
కింది కొచ్చేసరికి, ఇందాకటికన్నా రెట్టింపు జనం చేరారు. కళ్యాణి ఇంటికి ఆటోమైలు, పోటోలు తీస్తున్నారు.కొంతమంది- సినిమా పెద్దల అభిప్రాయాలడుగుతూ వాటికి చిలవలూ పలవలూ తోడగసాగారు.
మంజరి ముఖం వాలిపోయింది. ఆవిడ కళ్ళల్లో నీటిజీర లేదు. కానీ, దుఃఖభారంతో వివాశమయినట్లు తెలిసిపోతూనే ఉన్నది. చాలామంది ఆమె దగ్గర కొచ్చి కండోలేన్సేస్ చెబుతున్నారు. అమజరికివన్నీ పట్టినట్లులేదు.
"పొదాం" అన్నది మెల్లగా.
జనాన్ని పాయలుగా చీల్చుకుంటా మంజరి కారు రోడ్డుమలుపు తిరిగింది.
"ఇంటికిపోతున్నాం!" అన్నాడు చలపతి, స్టీరింగును ఎడమవైపు కోస్తూ.
"వొద్దు నాకేదో భయంగా ఉంది. నేనా యింట్లో ఉండలేను. హౌటలుకుపొదాం పద! నాకు గాఢంగా నిద్రపోవాలని ఉంది. మళ్ళా- ఓ వారం రోజులదాకా, మెళుకువరాని సుదీర్ఘమైనా నిద్ర కావాలి నాకు" అన్నది మంజరి.
"అయినప్పుడు ఇల్లేమంటిది మంజూ! మనిష్టమొచ్చినంత కాలం ఇష్టమొచ్చినట్లుగా పడుకొన్నా అడిగే నాధుడుండడు. హొటల్ అలాకాదు" అన్నాడు చలపతి గేరు మార్చూతూ, 'ఒకదశ చేరుకోవడమే చాలాకష్టం! చేరుకొన్నాక, ఆవ్యక్తి ఏపని చేసినా న్యూస్ అవుతుంది. ఎందుకంటున్నానంటే మంజూ, ఫలానాతార, ఫలానా హొటల్లో వారం రోజులపాటు వొళ్ళూ పై తెలీకుండా, నిద్రపోయిందంటే, భారతదేశం యావత్తు గగ్గోలెత్తిపోతుంది. అయితే దాన్ని - మనం ఇంకోరకంగా, బ్లెండ్ చేసుకొనవచ్చుననుకో!' తన స్నేహితురాలైన కళ్యాణి మరణవార్త విని, మూర్చపోయిన ముగ్ద సుందరి మంజరి'అంటూ మన శర్మ ఫోటో వేసి, కింద రైటప్ రాస్తాడు."
ఇల్లోచ్చింది. ఇక్కడా చాలామంది గుమిగూడారు కొందరు కారుదగ్గరకొచ్చి, పరామర్సించారు. ఇంకొందరు మెట్లాదాకానూ వచ్చారు. చలపతి వారించకపోతే, చాలామంది మేడ మీదిక్కూడా వచ్చేవారే!
దయచేసి ఆమెను డిస్టర్బ్ చేయకండి! మంజరి సీరియస్ గా దెబ్బతిన్నారు. డాక్టర్లు ఆమెకు రెస్టుకావాలని చెప్పాకనే ఇక్కడికి తీసుకొచ్చాను' అని సర్దేశాడు చలపతి.
మంజరిని,దాదాపుగా అతను మెట్లమీదుగా మోసుకొచ్చాడు. కిందవారు పైకిరాకుండా, తాయారు గడియ పెట్టింది! వసంత ఫోన్ వేసింది.
"మీరంతా వెళ్ళండి!" అన్నాడు చలపతి.
మంజరి ఏమంటుందోనని ఓ నిమిషంచూసి, ఆవిడేమీ అనకపోవడం వల్ల, అందరూ బయటికి వెళ్ళిపోయారు.
ఆ విశాలమైన గదిలో, చలపతీ మాత్రమె ఒకరి కెదురుగా, ఇంకొకరు కూచుని ఉన్నారు. ఒకరిగుండె చప్పుడు, ఇంకోకరికి వినిపించేంత నిశ్శబ్దంగా ఉన్నదిప్పుడు. అ నిశ్శబ్దాన్ని అసలే భరించలేకపోయింది మంజరి. మనస్సంతా శూన్యంగా అయిపోయింది. అందులో కళ్యాణి రూపంకూడా స్పష్టంగా లేదు. ఏవో అదృశ్యమైన భయాలు, తనను వెన్నంటి తరుముతున్నాయనిపించిందామెకు.
"ఇదంతా కలలాగా లేదూ?" అన్నది మంజరి చివరికి.
చలపతి 'అవును' అన్నట్లయితే మంజరి ప్రాణానికి కాస్తంత రిలీఫ్ గా ఉండేది, అతనలా అనలేదు సరిగదా, ఫక్తు అందుకు వ్యతిరేకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
"నేను భూమిమీద నడిచేవాణ్ని, ఊహా లోకాల్లో విహరించడం నాకు చాతకాదు ఇది కలకుమల్లె నీకున్నదేమోగానీ, నేనలా అనుకోవడం లేదు." అన్నాడు చలపతి.
మంజరి నోరింత చేసుకొని చలపతికేసి చూసింది.
"అంతే-" అని ఆగి, భయంతో రెండుకళ్ళూ మూసుకొని, సోఫా అంచుమీదకి ముఖాన్ని అనించింది మంజరి. 'మీకు కళ్యాణి ఇలా చచ్చిపోతుందని ముందుగానే తెలుసునన్నమాట. అవునా?'
'దాదాపుగా తెలుసు'అన్నాడు చలపతి.
చాలాసేపటిదాకా మంజరి పలకలేదు. ఆవిడ తాయారును పిలిచి తగాడానికేమన్నా తెచ్చిపెట్టమన్నది. తాయారు వెళ్ళాక, కిర్చీకి జేరలబడి 'ప్చ్' అని చప్పరించేశాడు చలపతి.
కొందరికి ఎవరూ చెప్పాకుండానే విషయాలు తెలుస్తాయి. ఇంకొందరు, తెలిసినవారు చెబితేవింటారు. ఈ రెండు రకాల వారితోనూ ఎప్పుడూ భాధలేదు. మూడోరకం వారికి తెలియనూ తెలియదు, ఇంకొకరు చెప్పినా వినరు. వీరితోనే వీరితోనేమహా ప్రమాదాలు జరుగుతాయి తమకు తెలియదనీ వీరోప్పుకోరు. ఓంకోరు చెప్పినమాట వినడం చిన్నతనంగా వీరు భావిస్తారు.'
తాయారు,సీసా,గ్లాసులు,సోదాలు బల్లమీద పెట్టి వెళ్ళిపోయింది.
"నేను ఉదయం నుండీ మొత్తుకొంటున్నదంతా దుమ్ములో కలిసిపోయింది మజరీ? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నాకింకా బ్రతాకాలని ఉన్నది" అన్నాడు చలపతి లేచి నిలబడుతూ.
మంజరి ఏమీ అనలేదు. ఒక్కసారి కళ్ళేత్తి చలపతి కనిల్లోకి చూసింది. తరువాత తల దించేసుకొన్నది. లేచి నిలవడి చలపతి అడుగుముందుకు వేయలేకపోయాడు.
"నీతో వచ్చిన చావే ఇదీ" అని గొణుక్కుంటూ తిరిగికూచున్నాడు చలపతి. 'మద్రాసులో ప్రోహీబిషన్ ఉన్న సంగతి నీకు తెలుసాయే, ఏ నిమిషాన్నయినా, పోలీసులు మనల్ని పిలిపించుతారన్న సంగతి నీకు తెలుసాయే. ఇన్ని తెలిసికూడా నువ్వు తాగుతానంటున్నావంటే నిన్నేమనాలో తోచకుండా ఉంది. నిన్ను అరెస్టుచేయడానికి ఈ వొక్క సీసాయే చాలు.ఫలానా తార,మద్యం దగ్గరుంచుకొన్న నేరానికి అరెస్టుయిందన్నవార్త- నీకెంత అవమానమో నువ్వాలోచించినట్లు లేదు .'
"నాకు మనస్సేమీ భావోలేదు చలపతీ! రాత్రినుండీ నేను భీతావహా వాతావణంలో ఉన్నాను. కన్నుమూస్తే గడుసుదయ్యాలేవో, భయంకరంగా రొదలు పెడుతూ,మీదకి దూకుతునట్లనిపిస్తుంది. అందులోనూ,కళ్యాణి మరణం...."
"కాదు.హత్య" అని సవరించాడు చలపతి.
"పోనీ హత్యేననుకో" అని మంజరికి కూడా అతని సవరణను ఆమోదించింది.
"ప్రమాదం నేనెప్పుడో పసిగట్టాను. ఉదయం, మనల్ని అనిమానించకుండా ఉండేదుకే- ముఖ్యంగా నును -స్నానం చేస్తున్నావన్నాను. బహూశా అంతకు ముందు నీకా ఆలోచనలేదనుకొంటాను?"... అన్నాడు చలపతి.
"లేదు, నువ్వన్నాకనే నేను స్నానం చేశాను... నువ్వు మంచి కొచ్చినట్లయితే వారికి అనుమానం కలిగేదనుకొంటాను?"
