"ఇంకోసారి -" అని ప్రారంభించింది మంజరి. సిగరెట్ యాష్ ట్రేలో పడేసి సోఫాలో జారగిలబడుతూ, "ఎవడో బంతిలాగా వుండే మార్వాడీ వొకడూ, యింకో యూరోపియన్ నా దగ్గరకొచ్చారక్కా. ఆ మార్వాడీ నడుముకున్న బెల్టులోంచి ఓ డైమండ్ నెక్లెస్ బయటికి తీశాడు. చాలా బావుందది. మార్కెట్ లో కొంటె డెబ్బయ్ డెబ్బయ్యయిదు వేలకు తక్కువుండదు. నలభై యిచ్చి తీసుకోమన్నాడు. నాకవసరం లేదన్నాను. అది దొంగసొమ్ము కాదనీ, ఆ యూరపియన్ భార్యదనీ, చాలా అవసరమొచ్చి అమ్ముకొంటున్నాడనీ, మార్వాడీ చెప్పాడు. ఆగమంటే రెండు రోజులపాటు డబ్బుకోసం కూడా ఆగుతామన్నారు.....కొందామని చాలా ఊగులాడాను....కానీ, ఏదో అనుమానం లోపల పురుగులా తొలుస్తోంది. చాలా నెమ్మదిగా వారిని శాంతపరచి పొమ్మన్నాను.... అది స్మగుల్డ్ నెక్లెస్... చిత్రమేమిటంటే- మూడు రోజుల తరవాత, అదే నెక్లెసును నా కోస్తార్ వేసుకోగా చూశాను"
"అలాంటి చోట మనం ఉండటం చాలా కష్టం మంజూ!" అన్నది కళ్యాణి.
"కష్టమేగానీ, ఆ డేంజర్ లో ఉన్న థ్రిల్లింగ్ ను ఎంజాయ్ చెయ్యాలంటే అదొక్కటే అదొక్కటే మార్గం; నాకలాంటి బతుకు బ్రతకాలని ఉన్నది కళ్యాణీ! జీవితంలో, వేగం, వెరైటీ, డిసప్పాయింట్ మెంట్ ఎచీవ్ మెంట్ - చాలా ఫోర్స్ బుల్ గా ఉండాలి. లేకపోతే రుచీ పచీ ఉండదు ఏమంటా వక్కాయ్" అన్నది మంజరి.
కళ్యాణి ఏమీ అనలేదు.
"మనం కలిసి కూచుని ఇంతసేపు మాట్లాడి ఎన్నిరోజులయిందో అక్కా నేను బోంబేనుండి కొద్దిగా "పాంపిన్" పట్టుకొచ్చాను, చూద్దువుగాని"
మంజరి బెల్ నొక్కింది. కొద్దిగా తెర తొలగించి తాయారు వచ్చింది.
"చూడమ్మా తాయీ! మధ్యాహ్నం నువ్వు ఫ్రిజ్ డోర్ లో ఉంచావే!"
తాయారు అయిదు నిమిషాల్లో ట్రేతో వచ్చింది.
"వసంత వాళ్ళొ చ్చారా?"
"రాలేదండమ్మాయిగారూ?" అన్నది తాయారు.
"ఎవర్నీ రావద్దను. అరగంటయ్యాక భోజనం పట్టుకురా."
ఇంకేదన్నా చెబుతుందేమోనని, ఓ పావు నిమిషమాగి - మరీ వెళ్ళిపోయింది తాయారు.
మంజరి గ్లాసులు నింపింది.
కళ్యాణి 'సిప్' చేసి, పెదవులు జేబుగుడ్డతో అద్దుకొంది.
కిటికీల్లోంచి చల్లని గాలి ఈడ్చి కొడుతున్నది.
"వానొచ్చేటట్లుంది మంజూ!"
"రానివ్"
మంజరి సిగరెట్ వెలిగించి, గాజు తలుపులు బిగించింది.
"నువ్వేమనుకో అక్కాయ్! బ్రతికిన నాలుగురోజులు జాలిగా బ్రతకాలి. ఎడా పెడా సంపాదించాలి. చిల్ల పెంకులకింద విరజిమ్మాలి. నిర్ధాక్షిణ్యంగా డబ్బు పిండి పారెయ్యాలి. పాపం, పుణ్యం, దయా దాక్షిణ్యం, ఇవన్నీ అర్ధంలేని మాటలు... హాయిగా తిని, ఇష్టం వచ్చింది తాగి, నచ్చిన వాడితో గంటల్ని సెకండ్ల కింద మార్చేసుకొని గడిపెయ్యాలి. అవునా అక్కా?"
కళ్యాణి, మరో గుక్కపీల్చి గ్లాసును ట్రేలో ఉంచింది. అద్దంలోంచి, ఆకాశం ఆ కొసనుండి, వెలుగుతో చీలికలయిపోవడం కనిపిస్తోంది. "టవ్ టవ్" మంటూ వర్షపుచినుకులు అద్దాన్ని తడుతున్నాయి.
మంజరి సన్నగా నిట్టూర్చి, సిగరెట్ ను దూరంగా గిరాటెట్టింది.
"మనం కావాలనుకొన్నవన్నీ దూరమయి, అవసరంలేనివి, మనచుట్టూ పేరుకుపోతున్నాయి కళ్యాణీ. అదేమిటి! ఇష్ట మొచ్చింది తింటే వొళ్ళు పాడయిపోతుందని భయం. తృప్తిగా పుచ్చుకొంటే, గొంతు పాడయిపోతుందని భయం. నచ్చిన వాడు సరే- అసలా ఆలోచన వస్తేనే, అసహ్యంతో మనస్సు విలవిలలాడిపోతుంది. వెక్కసమయ్యేంత శరీర సుఖం అనుభవించాం. రొమాన్స్ అనేది యాక్షన్ కిందికిమారిపోయింది. నిజమనేది మర్చిపోయాం"
బయటవాన హెచ్చింది. కిటికీ అద్దాల మీద నీళ్ళు ధారాపాతంగా పడుతున్నాయి. అప్పుడప్పుడు గుండెలు కదుపిళ్ళు పడేలా ఉరుములు.
"ఏదో నాకు తెలేడం లేదు...నేను చెప్పలేకపోతున్నాను....అదేదో లోపించింది మనకు. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరో మన గుండెల్లోనించి, ఏదో కావాలని ఎలుగెత్తి అరుస్తున్నట్లుంటుంది. అసంతృప్తితో, అశాంతితో వొళ్ళంతా సల సలలాడిపోతుంది. వీటన్నింటికీ దూరంగా జరిగి, నిద్రపోదామంటే - శాపం పెట్టినట్లుగా కునుకురాదు. రోజూ, ఇన్ని మాత్రలు మింగి అలా రెప్పలు వాల్చవలసిందే తప్ప - అందుకనే - ఉన్న నాలుగు రోజులూ, ఇన్ని మాత్రలు మింగి అలా రెప్పలు వాల్చవలసిందే తప్ప- అందుకనే-ఉన్న నాలుగు రోజులూ,జీవితాన్ని పిండుకొని అనుభవిం చాలంటాను. ఇంకా కొత్త- అదేమిటి అక్కాయ్ అలా చూస్తావేమిటి? అరె?"
కళ్యాణి చూస్తున్న దిక్కుకే, మంజరి కూడా చూసింది. కిటికీ అద్దానికి అవతల వేపున, ఓ ముఖం కనిపించింది. వాననీరు, ఆ ముఖం మీదుగా చారికలు చారికలుగా ప్రవహిస్తున్నవి. ఆ కళ్ళు నిశితంగా చూస్తున్నాయి.
మంజరి కెవ్వుమని అరిచి కళ్ళు మూసుకొంది.
మరుక్షణంలోనే వెనుక తలుపులు రెండూ తెరుచుకొన్నాయి.
తాయారు కూడా, అద్దానికానుకొని వున్న ఆ ముఖాన్ని చూసింది. దాని గుండెలు జివ్వు జివ్వుమన్నాయి. అదేదో చెయ్యబోయింది. ఆ ముఖం అద్దం వెనుకనుండి మాయమయింది. కళ్యాణి కొంత సేపటికి కోలు కొన్నది గానీ, మంజరి తేరుకోవడానికి ఇంకా చాలాసేపు పట్టింది. కళ్ళు తెరిచి ఓ సారి కిటికీకేసి చూసి, చుట్టూ అందర్నీ కలియ చూసి, సన్నగా నిట్టూర్చింది మంజరి.
"ఇక నేను వెడతాను మంజూ!" అని కళ్యాణి లేచింది.
మంజరి చాలా నీరసపడిపోయింది. ఆవిడముఖం, లంకణాల రోగిముఖంలా పాలిపోయింది. భయచ్చాయలు ఆమె కళ్ళల్లో అర్రాడుతున్నాయి. పెదవులు తడుపుకొని, ఓ గుటకమింగి, పమిటతోనే ముఖం అద్దుకొన్నది మంజరి!
కళ్యాణి లేచి నుంచున్నది.
"అదేమిటక్కాయ్! నువ్వీదశలో నన్నొదిలిపోవడం భావ్యమేనా? నా మనస్సేమీ బావోలేదు. ఏదో భయం నన్ను పట్టుకొంది.....ఊఁ హు. వీల్లేదు. ఇక్కడే ఉండిపోవాలి" అని పట్టుపట్టింది మంజరి.
"కాదమ్మా! నేను వెడతాను."
మంజరి ఓ క్షణం కళ్యాణి కళ్ళల్లోకి చూసింది.
"ఆ ముఖం - ఆ ముఖం నీకు తెలుసా కళ్యాణీ?" అన్నది మంజరి భయ భయంగా.
"ఎవరు? అతనా? నాకా? అని నవ్వింది కళ్యాణి "లేదమ్మా మంజూ! నేనెక్కడా చూడలేదు. అతనెవరో కూడా నాకు తెలీదు."
"మరలా ఆశ్చర్యపోయావేం అక్కాయ్? నువ్వెక్కడన్నా చూసి ఉంటావేమోననుకొన్నానే!' అన్నది మంజరి.
కళ్యాణి అదోలా నవ్వింది.
"నువ్వెంత పిచ్చిదానివే మంజూ! అర్ధరాత్రివేళ, మనమెన్నడూ చూడని ముఖం కిటికీలో కనిపిస్తే - ఎవరైనా భయపడరా? ఆ సమయాన నిన్ను చూస్తే అతనెవరో నీకు తెలుసునేమోననిపించింది. తెలిసిన వాడైనప్పుడు, మామూలు దోవన రావచ్చుగా. వాడేదో దొంగతనం కోసమే వచ్చి ఉండాలి....ఏదైనా నువ్వు జాగ్రత్తగా ఉండు మంజూ! మరి - మనం రేపు కలుసుకొందాం" అని బయలుదేరింది కళ్యాణి.
"పోక తప్పదంటావా అక్కాయ్"
"ఊఁ "
మంజరి కేదో ఆలోచన వచ్చింది. కింది పెదవిని సున్నితంగా కొరుక్కుంటూ "పోనీ" ఓ నిమిషం ఉండు అక్కాయ్! నేనూ వచ్చేస్తాను. ఇద్దరం కలిసి, మీ ఇంటికే వెడదాం" అన్నది మంజరి.
కళ్యాణి పెద్దగా నిట్టూర్చి, తలుపులు జారగిలబడిపోయింది.
"నువ్వూ వస్తావా?" అన్నది కళ్యాణి. కాస్సేపటి దాకా, ఆవిడ కళ్ళు మూసుకొని ఆలోచించింది, తరవాత తల అడ్డంగా తిప్పుతూ, "వొద్దమ్మా? నామాట విను, రేపు మనం కలుసుకొందాం. నువ్వొక్క దానివీ పడుకోకు. అన్ని రోజులు మనవిగావు....అవును గాని మంజూ? ఆ ముఖాన్ని నువ్వు చూసే ఉంటే - ఎప్పుడు చూశావో, ఎక్కడ చూశావో చెప్పగలవా?" అన్నది కళ్యాణి.
"ఆఁ " అన్నది మంజరి.
కళ్యాణి, ఆత్రుతగా, మంజరి కేసి చూసింది.
"ఎక్కడమ్మాయ్ మంజూ!"
"ఆ మాట చెప్పొచ్చునో లేదో నాకు తెలీదు..."అని మెల్లగా గొణిగింది మంజరి. తరవాత జుట్టులోకి వేళ్ళుపోనిచ్చి, కుదుళ్ళను బలంగా కదుపుకొన్నది మంజరి, నువ్వడిగావు గనక చెబుతున్నా నక్కాయ్. అతను నాకు తెలుసు. బాంబేలో ఉండగా - ఎవరో నాదగ్గర కొచ్చారనీ, ఇంతడబ్బు పడేసి ఫలానా ప్రశ్నలకు ఆన్సర్లు తెలుసుకోమన్నాడనీ, ఇంతకుముందే మనం చెప్పుకొన్నామే - "మంజరి వాక్యం పూర్తి చెయ్యకముందే కళ్యాణి కళ్ళు చావు భయంతో నిండిపోయాయి. మహోద్రేకంతో ఆవిడ కంపించి పోతున్నట్లనిపించింది.
"మనం రేపు కలుసుకొందాం మంజూ! ఉదయం ఇంకేపనిపెట్టుకోకు. ఎనిమిదీ, ఎనిమిదిన్నరకల్లా వచ్చే సెయ్యి" అన్నది కళ్యాణి.
ఆవిడ మెట్లు దిగడం సజావుగా లేదు. ఎవరో బలవంతాన కిందికి తోస్తున్నట్లుగా, దిగుతున్నది. ఇంకాస్సేపటికి నీళ్ళను చిందకొడుతూ కళ్యాణి కారుపోవడం మంజరి చూసింది!
ఆవిడ తలంతా హోరుతో నిండిపోయింది. రకరకాల ఆలోచనలు వొకదానితో వొకటి కలిసిపోయి చిరాకెత్తిస్తున్నాయి. అరగంట కిందటి ఆనందమంతా ధ్వంసమయిపోయింది. చెప్పరానంత బెంగా, దిగులు, ముసురుకొని, ఊపిరాడకుండా నొక్కిపారేస్తున్నట్లనిపించింది మంజరికి.
మరి కాస్సేపటికల్లా, చలపతి, రాజమణీ వచ్చారు. వాళ్ళోస్తున్నారని, మంజరికి అల్లంతదూరంనుండే తెలుసు.
'అధ్బుతం' ఆశ్చర్యం, నాజన్మలో ఇలాంటి పిక్చర్ చూడలేదు బాబూ!" అంటోంది రాజమణి.
'ఈ దెబ్బతో హిందీ స్టార్సంతా పోలోమంటూ ఖాతాలు క్లోజ్ చెయ్యాలిసిందేనండీ రాజమణిగారూ! సౌతిండియా దెబ్బంటే ఏమిటనుకొన్నారు! మంజరి - హిందీ మార్కెట్ ను బీట్ చేసిపారేసింది!' అన్నాడు చలపతి ఉత్సాహంగా.
"భోం చేసావా అమ్మాయ్?"
మంజరి పలకలేదు.
'హాట్సాఫ్ మంజరీ!' అన్నాడు చలపతి, ఆవిడకు దూరంగా ఉన్న కుర్చీలో కూచుంటూ." నేను న్యూస్ అయితే చదువుతున్న మాట నిజమేగానీ, పిక్చర్ అంత ట్రమెండస్ గా ఉంటుందని అనుకో లేదు. నువ్వు దానికి ప్రాణం పోశావు మంజూ! ఈ మాట నేనడడం కాదు - ప్రెస్ గాలరీ మొత్తం ఇలానే అన్నది. ఒకతను - ఆర్ముగం అనుకొంటాను - నిన్ను మార్లిన్ మాన్రోతో పోల్చాడు.
"అలాగా!" అన్నది మంజరి చాలా తాపీగా.
"ఆవిడ ఇంగ్లీషు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకొన్న స్టార్ అటగా మంజరీ! ఆర్ముగమే కాదమ్మా - వాడి వెనక్కాతల ఇంకెవరో కూచుని ఉండే - వాడేదో 'టెంపుల్ టెంపుల్' అన్నాడమ్మాయ్?" అని రాజమణి అందుకొన్నది.
'యస్ మేడమ్! షెర్లీ టెంపుల్ అని ఇంకో బ్రహ్మాండమైన హాలీవుడ్ స్టార్ ఉండేది. ఆవిడతో నిన్ను పోల్చటమంటే మజాకాదు. ఇదేదో మొఖమాటం కోసం అన్నమాటలు కావు. నిజంగా మీ యాక్షన్ అంత గొప్పగానూ ఉంది.'
"చాలామంది ఇదే మాటలన్నారమ్మాయ్?" అన్నది రాజమణి. "నువ్వప్పుడు పడిన కష్టాలన్నీ తలచుకొంటే ఎందుకొచ్చిన పీడాకారం బాబూ అనిపించింది గానీ - మరి ఏ శ్రమా పడందే ఇంతమంది మెచ్చుకొంటారా?"
"నువ్వొప్పుకుంటే మనమోపని చేదాం మంజరీ!" అన్నాడు చలపతి.
అతను 'నువ్వు' అనడమూ, 'మంజరి' అనడమూ, దగ్గరకొచ్చేందుకు ప్రయత్నించడమూ, ఆవిడ గమనించింది. అతన్ని హడలగొట్టి దూరంగా తరిమెయ్యడం నిమిషాల్లో పని. కానీ - అలా చెయ్యడానికి మంజరికే ప్రాణం వొప్పలేదు.
"ఏమిటది?" అన్నది మంజరి.
"నువ్వు భోజనాలు వడ్డించవే తాయారూ!" అని కేకేసింది రాజమణి.
"నేను వెళ్ళనా?" అంటూ చలపతి లేచాడు.
"ఉండండి బాబూ! అందరం కలిసి కూచుని భోజనం చేదాం." అని ఏర్పాటు చేసింది రాజమణి.
ఈ 'మతలబు' మంజరికి తెలీదనుకోవడం భ్రమ! రాజమణీ చలపతీ, అంత దూరం నుండి తన పిక్చరును గురించి, పొగుడుకొంటూ వస్తున్నప్పుడే - ఏదో ఉన్నదనుకొన్నది మంజరి. అప్పటికప్పుడే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుదామనుకొంది. అంతకు ముందు కళ్యాణి చెప్పిన మాటలు, చెవుల్లో గింగురుమంటున్నాయి. బుసబుసా పొంగుతున్న అసహ్యాన్ని లోలోపలే అణిచేసుకొని, చాలా మామూలుగా ప్రవర్తించింది మంజరి!
అందరూ భోజనాల కుపక్రమించారు.
"ఇందాక మీరేదో పని చేదామన్నారే- ఏమిటిబాబూ అది-" అని ఉప్పు అందించింది రాజమణి.
"ఈ కూర మా చెడ్డ రుచిగా చేశావు తాయారూ!" అని సర్టిఫికెట్ తాయారు మొఖాన పారేశాడు చలపతి. ఏమిటంటే రాజమణిగారూ! మనకిప్పుడు హిందీ ఫీల్డును గురించిన చింతలేదు. ఆ ఇండస్ట్రీ ఇవ్వాళో రేపో మన కాళ్ళముందు సాష్టాంగపడి తీరుతుంది. 'ఎందుకని?' అని అడక్కండి, ఈ పిక్చర్ అలాంటిది. ఇరవై తుక్కు పిక్చర్లు ఇవ్వని కీర్తిని, ఈ నర్తకి పిక్చరు మనకు తెచ్చిపెట్టింది.
"కానీ బాబూ! దీని వలన మనకొచ్చిన డబ్బు చాలా తక్కువే గదా! పడిన శ్రమకు తగిన ఫలితం లేనప్పుడు మనం మాత్రం, ఆ ఇండస్ట్రీలో ఎందుకుండాలంటారు?" అన్నది రాజమణి.
"మీరన్నది పూర్తినిజంకాదు. మీకింకా సినిమా ఇండస్ట్రీని గురించి ఏమీ తెలీదని, దీన్ని బట్టి నేననుకొంటున్నాను. సినిమాలో డబ్బు రావడమన్నది - చేసిన పనినిబట్టి ఉండదు; నీకున్న కీర్తినిబట్టి ఉంటుంది. ఓ మామూలు కారెక్టరును ఓ ఎన్ ష్ట్రాకిచ్చి, రెండొందలు చేతిలో పెడతారు. పని చెయ్యడంలో ఇద్దరూ ఒకటే! 'ఇదేంపాప' మనకండి. అదంతే! అలాగే - ఈ ఫస్ట్ పిక్చర్ వల్ల మంజరిగారికి గిట్టింది చాలా స్వల్పమేనంటున్నారు మీరు. పీడాబోయింది. ఈసారి దీనికి ముబ్బడిగా తీసుకొని గానీ, మేం కాంట్రాక్టుమీద సంతకం చెయ్యం. సరా?" అన్నాడు చలపతి.
"అంత రేటు మేం భరించలేమని ఏ ప్రోడ్యూసరూ రాడనుకోండి! అప్పుడేమిటి మరి?" అన్నది రాజమణి.
చలపతి కొలమారేంతగా నవ్వాడు. ఆ ఉదుట తగ్గడంకోసం, గ్లాసు మంచినీళ్ళు తాగి, గిర్రున త్రేన్చాడు.
"అది గాదమ్మా! ఈ ప్రొడ్యూసర్లున్నారే! మనల్ని ఉద్దరించడానికి బుక్ చెయ్యరు. మనం ఉంటే పది రూపాయలొస్తాయన్న నమ్మకం వారి కుండాలి. అప్పుడే, పాటికి పదిసార్లు మనచుట్టూ తిరుగుతారు. వేషమిస్తారు, మనం చెప్పినట్టల్లా వింటారు. మీరన్నట్టుగా - ఏ హిందీ ప్రోడ్యూసరూ, మంజరిని బుక్ చెయ్యదనుకోండి. అందువల్ల నష్టపోయేది వాడేగానీ మనంకాదు. బింకానికి పోయి, లక్షలు వొదులుకొనేంత తెలివి తక్కువ సన్యాసి - పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తాడనే మనం అనుకోకూడదు. అదీ గాక - మనమైనా ఎప్ నార్మల్ రేట్స్ చెప్పడం లేదు. హిందీ టాప్ రాంక్ స్టార్స్ తీసుకొంటున్న రేటే మనకూ ఇవ్వమంటున్నాం. వాళ్ళయితే నీకు కాల్ షీట్సివ్వరు. మనమలాకాదు. ప్రొడ్యూసర్ కు ఇబ్బంది లేకుండా మనం ఎడ్జస్టు చేసుకుంటాం. అదీ సంగతి...ఇదిగో....తాయారూ! ఇంకో గ్లాసు సూపు పట్రా" అని కేకేశాడు చలపతి.
రాజమణి సాభిప్రాయంగా తలపంకించి మంజరి కేసి చూసింది. 'ఆవిడవన్నీ వింటున్నదో లేదోనన్న అనుమానం రాజమణిక్కలిగింది. ఎందుకంటే, ఈ సంభాషణతో, ఎంతమాత్రం నిమిత్తం లేకుండా, ఓ కార్ణంముక్కను, ఫోర్కుకు గుచ్చి మెల్లగా కొరుక్కుతింటోంది మంజరి.'
'ఇన్నిటికీ అసలు సంగతి నేను చెప్పనేలేదు' అన్నాడు చలపతి.
"ఏదీ? నేను చచ్చిపోతే - మధ్యలో మీ మాటలను నేను అడ్డొస్తుంటినిగా - మీరేమో- అదేదో పనిచేస్తే బాగుంటుందన్నారు. ఏపని చేస్తే బావుంటుందో, దాన్నెలా చెయ్యాలో మీరే చెప్పుకురండి మనకు గనక నచ్చిందా - అమ్మాయి చేసి పారేస్తుంది, లేదనుకోండి - మనం నష్టపోయేదేమీ ఉండదు." అన్నది రాజమణి.
"ఏమిటంటే-" అని ప్రారంభించాడు చలపతి, 'ఫారెన్ ఎంబసీస్ మన దేశంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళ ఆఫీసులన్నీ ఢిల్లీలో ఉంటాయి. ఇవిగాక - పెద్ద పెద్ద సిటీల్లో, వీరి కాన్సలేట్స్ ఉంటాయి. ఈ కాన్సలేట్ జనరల్ ను మనం పెట్టుకోవాలి'
'ఎందుకండీ?' అన్నది రాజమణి.
'ఆ పాయింటుకే వస్తున్నాను ... అంతర్జాతీయ సౌభాతృత్వ సంఘంవారు - సాంస్కృతిక వినిమయి కార్యక్రమం క్రింద, ఒక దేశంలోని కళాకారులు, మరో దేశంలో కొంతకాలంపాటు పర్యటనలు జరపడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగా కొన్ని కల్చరల్ డెలిగేషన్స్ మన దేశం నుండి ఫారెన్ వెళ్ళొచ్చాయి. ఆ డెలిగేషన్ లో ఎవరెవరు ఉండాలో నిర్ణయించేది సెంట్రల్ ప్రభుత్వమే అయినా - ఎంబాసిడర్ ల సలహాలు కూడా వింటారు. కాన్సలేట్ జనరల్ స్ట్రాంగ్ రికమెండేషన్ ఉంటే, ఎంబాసిడర్ చచ్చినట్లు వింటాడు. అతను సెంట్రల్ కు నచ్చ చెప్పొచ్చుకూడాను. అలాంటి ఛాన్స్ దొరికిందనుకోండి-' అని మంజరికేసి చూశాడు చలపతి.
మంజరి యధాప్రకారం తనపనేదో తను చేసుకుపోతోంది.
'ఫారెన్ వెళ్లేందుకు మనం ఇంకోరిని దేబిరించడమెందుకండీ! మనమంతా గతిలేక చస్తున్నామా? మనంతట మనమే పోదాం కావలిస్తే' అన్నది రాజమణి.
"పోలేమని నేనొక్కనాటికీ అనను. కానీ, ఓ విదేశీ ప్రభుత్వం మన గడపదగ్గర కొచ్చి బొట్టు కాటుకా పెట్టి, మనల్ని పిలవటం వేరూ! మనంతట మనమే చేతిచమురు వదిలించుకొని ఇతర దేశాలకు వెళ్ళడం వేరూనూ" అన్నాడు చలపతి.
మంజరి గొంతు సరిచేసుకొని చలపతివేపు చూసింది:
'మీరిలా - అరచేతిలో వైకుంఠం చూపించే కబుర్లుచెప్పకండి. నేను మాటల మనిషిని కాను. ఎందుకూ కొరగాని చెత్తవాగుడును నేను ఛస్తే భరించలేను. ఇప్పుడు మీరన్నవాటిల్లో ఏపనీ మీ వాళ్ళ కాదని నాకు తెలుసు. అయినప్పుడు ఎందుకలా అవాకులూ చెవాకులూ పేలడం. పిచ్చిముండ గనక రాజమణి - నోరలా వెళ్ళబెట్టి వింటోంది గానీ---'
మంజరి వాక్యాన్ని అక్కడితో ఆపింది.
ఈ మాటల వెనక దాక్కున్న మనస్థత్వాన్ని చలపతి పసిగట్టేశాడు. తనను రెచ్చగొట్టి, తనచేత ఈ పనులన్నీ చేయించుకొందుకే మంజరి ఇలా - నిష్ఠూరంగా మాట్లాడిందని అతనికి గట్టిగా తెలుసు. ఐతే "ఈ పని చెయ్యి బాబూ!" అని మామూలుగా అడగడానికి మంజరికన్న అభిజాత్యం అడ్డొచ్చింది గనక, ఇలా డొంకబాటన వచ్చిందని చలపతికి తెలుసు. తనకిదో మంచి అవకాశమే! మంజరికీ తమకూ మధ్యగల ఎడాన్ని, ఈ సందర్భంలో తను తగ్గించుకోవచ్చు. భగవంతుడి గీతలెక్కువ, అంతేననుకో, అన్నది మంజరి.
"ఏం బాబూ! మాట్లాడవేం?" అన్నది రాజమణి.
'మిమ్మల్నెలా నమ్మించడమో ఆలోచిస్తున్నాను. అసలు మనకీ ఆలోచన వచ్చి ఇంకా గంటన్నా కాలేదు. ఇప్పటికిప్పుడే 'నన్ను ఇంగ్లండు పంపించండో' అంటే నావల్ల కాదు. మనం దానికోసం ప్రయత్నించాలి. అంతో ఇంతో ఖర్చుచేయాలి, అవసరమయితే ఢిల్లీలో ఓ నెలరోజులు మకాం పెట్టాలి. ఏవో తంటాలు పడాలి. ఇన్ని జరిగితేగానీ, వ్యవహారం పూర్తికాదు. వీటికి మనం సిద్దంగా ఉన్నాయో లేదో కూడా తేల్చుకోవాలి. ముందాసంగతి చెప్పండి!' అన్నాడు చలపతి.
"డబ్బుసంగతి సరే! నీయిష్టం వచ్చినంత వాడుకో, అయినప్పటికీ ఆపని నీవల్ల కాదని, నేను స్టాంపు మీద రాసిస్తాను. ఇంధ -- ఇదిగో చెక్ బుక్. నీ కెంతకావాలో రాసుకో. నేను సంతకం చేస్తాను" అన్నది మంజరి కోపమూ, నవ్వూకలగలిపి.
చలపతి బల్లమీద చరిచాడు.
"దీన్ని నేనో చాలెంజ్ కింద తీసు కొంటానన్నాను మంజరీ! నేను చేపట్టిన పనులేవీ ఇంతవరకు ఫెయిల్ కాలేదు. ఇదీకాదు. నాగ్రహచారం బాగుండక- నేనీపని చెయ్యలేకపోయే పక్షంలో ఈ పరిశ్రమ నుండి తప్పుకొని, సన్యాసం పుచ్చుకొంటాను" అన్నాడు చలపతి.
"దట్స్ గుడ్" అన్నది మంజరి.
చలపతి ఇంకో మాటకూడా అందామనుకొన్నాడు- "చెయ్యకపోతే సన్యాసినవుతాను సరే; ఒకవేళ చేస్తే - అప్పుడేమిటిట?" అని అందామనుకొన్నాడు కానీ,అంతదూరం వేల్లాదం అతనికే ఆరోగ్యమనిపించలేదు. "మొత్తానికి మా మంజరి ఇంగ్లాడు వెళ్లడం ఖాయమేనన్న మాట" అన్నది రాజమణి.
"ఇంగ్లాడు కాదు- పోతే అమెరికా వెళ్ళాలి. అక్కణ్ణించీ, యూరోపియన్ కంట్రీస్ చూసుకొంటూ, జపాన్,బర్మా,ఇండోనేషియాలమీదగా ఇండియాకు రావాలి" అన్నాడు చలపతి.
"పోన్లెండి,మీ ధర్మమా అంటూ కలలుగనడానికి మంచి సబ్జెక్ట్ సజేస్టు చేశారు. థాంక్స్" అన్నది మంజరి.బయటసన్నగా తుంపర, మళ్ళా మెరుపులు ప్రారంభమయ్యాయి. దాంతో ఇందాకటి సంఘటన మనస్సులో మెదిలి, కుదిలించుకు పోయింది మంజరి.
"పొద్దు పోయిందక్కా, వెళ్ళి పడుకోరాదూ !" అని రాజమణిని పంపేసింది మంజరి. చలపతి తనుకూడా లేచాడు.
"ఉండండి, పోదురుగాని, మీతో కాస్త పని ఉంది. ముందా తలుపు దగ్గరకు వెసిరండి !" అన్నది మంజరి.
రాజమణి వెళ్ళినవేపు చూసి, తలుపు దగ్గరగా నొక్కి గడియవేశాడు చలపతి.
మంజరి ఓ సోపాలో జారగిలపడుకొంది. చలపతిని ఎదురుగా కూచోమంది. తనో సిగెరెట్ అంటించింది. చలపతికొకటిచ్చి వెలిగించమంది. ఇదంతా దేనికో తేలిక, చలపతి మళ్ళి గుల్లాలుపడుతున్నాడు.
"పర్వాలేదు. అంటించుకో" అని భారవాసాయిచ్చింది మంజరి.
అయినా చలపతి సిగరేట్ వెలిగించలేదు.
"అన్నట్టు- వసంతేదీ?" నేనిందాకే అడుగుదామనుకొన్నానుగానీ, ఏదో మాటల మద్యలో మరిచిపోయాను" అన్నది మంజరి.
చలపతి పలకలేదు.
"మీరు ముగ్గురూ కలిసిరాలేదా?"
"వచ్చాం" అన్నాడు చలపతి.
"మరి?"
"మధ్యలోనే రామకోటి కనిపించాడు. వసంత దిగివెళ్ళిపోయింది.... ఇదేమి కొత్తసంగతి కాదె!" అన్నాడు చలపతి.
"మీకు కానీ,నేనిప్పుడే వింటున్నాను" అన్నది మంజరి.
"రమారమిగా ఎణ్నిర్డం పైచిల్లరనుండీ ఇదిలానే జరుగుతుంది. దీన్నికూడా బహుశా నువ్వే కారణం కావచ్చు. ఆ హిందీ పిక్చర్ వ్యవహారం లేక పోయినట్లయితే- నువ్విక్కడే ఉండేదానివి. వసంతకేమీ పాలుపోయింది కాదు. నువ్వున్నప్పుడు "సరే"నన్న వారు కూడా, తరువాత వీల్లెదనడం సాగించారు" అన్నాడు చలపతి.
"అందుకని మీరు ఏర్పాటు చేశారన్నమాట" అన్నది మంజరి.
'నేను చేయడం కాదు మంజరీ! అసలీ వ్యవాహారంలో నేను నిమిత్తమాత్రుణ్ని. రాజమణి అస్తమానూ, నాచేవికింద సణగసాగింది. వసంత గొడవ సరేసరి. దీనికితోడు ఆ శర్మగారోకడు. ఎవరెవర్నో తీసుకొచ్చి వసంతకు పరిచయం చేయడం, వారు పడిస్తామనడం, ఈ పిల్లవాళ్ళతో, హొటళ్ళల్లో ఉండిపోవడం,- ఇదీ త్మటు. ఇలా కలిపేసి, ఆ శర్మ ఏమన్నా డబ్బులువడుక్కునే వాడేమో నాకు తెలీదు గానీ - పనిమాత్రం జరగలేదు. ఆఖరకు రామకోటి కలిశాడు. ఇలా ఇలా సంగతిని చెప్పాను. మనిషిని చూడనివ్వమన్నాడు. వసంతను వాడికి పరిచయం చేసింది నేనే! ఒకవేళ నేనీపని చెయ్యకపోతే, వసంత తనే స్వయంగా వెళ్ళిరామకోటి కలుసుకునేది. ఎందుకంటే- రామకోటికి ఈ ఇండస్ట్రీమీద నుంచి ఇన్ ప్లూయన్స్ ఉన్నదని, వసంతకు తెలుసు. ఆ పలుకుబడిని వసంతకోసం రామకోటి ఉపయోగించాడు. తను బుక్ చెయ్యడానికికొచ్చిన ప్రతి కంపినీతోనూ,రామకోటి, మన వసంత లాగా- ఆ మాటకొస్తే, ఆవిడకన్నా బాగా పాడగలిగిన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. కాని, రామకోటివంటి కామెడియన్ ఇంకోడు లేడు. అంచాత 'దేవుడా'అంటూ ప్రొడ్యూసర్లు, వసంతను కూడా బుక్ చేస్తున్నారు."
"వెరీ గుడ్" అన్నది మంజరి.
బయట ఆకాశం మండిపోతున్నట్టు ఒకటే మెరుపులు.
కొద్ది నిమిషాలు ఎవ్వరూ పలుకలేదు.
"నేనా పోనా" అన్నాడు చలపతి ఆ నిశబ్దాన్ని భరించలేక.
"నిద్రోస్తుందా?"
"లేదు"
"అయితే ఉండండి!" అన్నది మంజరి.
కళ్ళు మూసుకొని, సన్నగా తనలో తనే ఏదో గోణుక్కోన్నది మంజరి.
"నెనో విషయమడుగుతాను: నిజం చెప్పుతారా ?" అన్నది మంజరి.
"నీకు చెప్పానా మంజరీ?" అన్నాడు చలపతి.
జారాగిలాపడుకొన్నదల్లా సోపాలో లేచి కూచుని, సిగరెట్ అంటించింది మంజరి.
"మనం- కాసేపు నిజమైనా మనుషులుగా మాట్లాడుకొందాం చలపతిగారూ! ఇద్దరు శుష్కలమై అడంబరాలను వదిలేశాం. నగ్నంగా నిలబడి సత్యాలను ముచ్చటిద్దాం. మన వ్యక్తిత్వాల ప్రభావం వీటిమీదకి రాకుండా చూసుకొందాం- సరేనా? చెప్పానా?" అన్నది మంజరి.
"మనం సంకోచాలు పెట్టుకోవద్దు. ఈ కాస్సేపూ అయ్యాక మళ్ళా మన మామూలు వేషాలు మనం వేసుకొందాం. నాటకం దాని మానాన దాన్ని పోనివ్వండి. అప్పుడప్పుడైనా మనమిలా క్షాళనం చేసుకోకపోతే- బ్రతుకులు మరీ పాడుబడిన కొంపలమాదిరి అయిపోతాయి" అన్నది మంజరి.
"ఔను" అన్నాడు చలపతి.
"నా మీద, మీకుగానీ, రాజమణి వసంతలకు గానీ సదభిప్రాయం లేదని నాకు తెలుసు,"
"అబద్దం!" అన్నాడు చలపతి.
"ఇస్!" అంటూ మంజరి తలపట్టుకొంది. "నేనింత చెప్పినా నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఎలానండీ! మీరు బుకాయించకండి, ఈ కొద్ది నిమిషాలపాటు ఆత్మవంచన చేసుకోకండి! రెండు బ్రతుకులు మనం బ్రతకొద్దు.నిజంగా-మనమేమిటో, మన అసలు రూపాలేమిటో చెప్పుకొందాం. ఇప్పాటి మాటలు, మనం ఇప్పుడే మరచిపొదాం. వీటి బ్రాభావం, మన తరువాత బ్రతుకుల మీదకురాదు. రాకూడదు... ఊఁ... ఇప్పుడు చెప్పండి - కారణమేమిటంటారు?"
"నువ్వేమనుకొంటున్నావు?" అన్నాడు చలపతి;
"ముందు మీ గురించి నేనేమనుకొంటున్నదీ చెబుతాను" అన్నది మంజరి.
ఓ నిమిషం కళ్ళు మూసుకొని, తనలో తను నవ్వుకొని, గొంతు సరిచేసుకొని ప్రారభించింది.
"మీరుత్త దురదృష్టవంతులని, నష్టజాతకులని నా అభిప్రాయం. మట్టిని బంగారం చేసి దాంతో బొమ్మను మలిచి, ఆ బోమ్మకు ప్రాణం పోస్తారు. తీరా ప్రాణం పోశాక, అ బొమ్మ మీ చెప్పుచేతుల్లో ఉండాలనుకొంటారు. కానీ ఉండడు. అలా ఉండనందుకు మళ్ళా బోలేడంత బాధ పడతారు. పోనీ -మిమ్మల్ని కాదన్నదిగదాని- మీరు బోమ్మను విడిచిపెడతారా అంతే అదీ లేదు. ఏదో మూలాన ఆ బొమ్మమీద మీకు ప్రాణం కొట్టుకు లాడిపోతూ ఉంటుంది. బొమ్మచేసే పనులు సహించనూ లేరు, అలాగని గట్టిగా నాలుగుతన్ని అదుపు చేయనూ లేరు. అదోరకంగా మీ బలహినతే ననుకొంటాను. ఏదో చిరాకులో ఉండి, మిమ్మల్నో మాటన్నప్పుడు,మీ ముఖం కేసి చూడటానికి నేనింత సిగ్గుపడతానో ఆ భగవంతుడికే తెలియాలి. పశువులాగా ప్రవర్తించినందుకు నన్ను నేనే శపించుకొన్న సందర్బాలు అనేకం. మీరు వెళ్ళాక, భోరుమని ఎడువని ఇన్సి డెంట్ను చాలా తక్కిఉవ. పోనీ అంతలా - అలాగా - రాక్షసి లాగా కాకుండా చాలా మామూలగా ఎందుకు మాట్లాడలేకపోతున్నానో, ఎందుకు ప్రవర్తించలేకపోతున్నానో, నా కిప్పటికీ స్పష్టంగా తెలీదు."
"పోనీ, అస్పష్టంగా నీకు తెలిసిందేమిటో చెప్పు అన్నాడు చలపతి.
"అతి పరిచయం వలన, నీవంటే భయం లేకపోవడం అనుకొంటాను. నా డబ్బుమీద నువ్వు ఆధారపడి ఉండటమనుకొంటాను. నేనేమన్నా,నన్ను నువ్వు విడిచి పోవన్న ధైర్యం నాలోలోపల ఎక్కడా గట్టిగా పలుకుతుండటం ఇంకో కారణం కావచ్చు - మొత్తానికి; ఓ రకమైనా పలచదనం, చులకన భావం ఉన్న మాట ఖాయం. ఒక్కోసారి నాకే మనిపిస్తుందంటో ఇన్ని మాటలుపడి కూడా చలపతిగా రిక్కడెండదుకుంటున్నారా- అనుకొంటాను. బ్రతకలేకకాదు. యువార్ కింగ్ మేకర్; తలలుతీసి, మార్చి మళ్ళా అతికించటం మీకు చిటికలోపని.... ఇదీ నేననుకొంటున్నది.... మరి - మీ సంగతేమిటి?"అన్నది మంజరి.
"ఏమీలేదు" నువ్వు కొండమీద దున్నదానివి. నేను కింద ఉన్న మనిషిని. ఆ భేదం - మనమెంత చేరుపుకొందామన్నా మాసిపోయేది కాదు. ఎందుకంటున్నానంటే దరిద్రుణ్నన్న భావం నన్నూ, డబ్బుగలదాని నన్న భావం నిన్నూ వదలదు. ఎంత విదిలంచుకొందమన్నా రక్తంలో జలించిపోయిన, ఈ గుణాలు వదిలిపోవు. కానీ- నాకు మనిషిమీద నమ్మకముంది. అతనిలోని మానవత, ఎప్పుడో ఒకప్పుడు వెలివి వస్తుందన్న ఆశను నేనోదులుకోలేను. అది కారణంగానే నిన్ను నేను వోదిలిపోవడం లేదు. ఈ డబ్బు హరించిపోయి, ఈ అందం తరిగిపోయి, ఈ దేశంలో నిన్ను తలిచేనాధుడే లేనప్పుడు, నేనోక్కణ్ని నీకు దిక్కువుతానన్న నమ్మకం కూడా నాకున్నది" అన్నాడు చలపతి.
"మరల్ వాళ్ళ సంగతో?" అన్నది మంజరి.
'నాకు బాగా తెలియదు. తెలిసినంత వరకూ చెప్పాలంటే - వాళ్ళు చాలా మామూలుమనుషులు. సగటు మనిషిలో ఉండే, కోరికలు, ఆశలు, వారిలోనూ ఉన్నాయి. నీగోడవ లేవో నీవుచూసుకోగా తప్పులేనిది. వారలా అనుకోవడం తప్పా? వసంతకు నీకు మల్లేనే- ఆలిండియా ఆర్టిస్టుకావాలన్న ఉబలటం జాస్తిగా ఉంది. అందుకుగాను- తను మంచివనుకొంటున్న పద్దతులేవో అవలంభిస్తున్నది. అవిణ్ను తప్ప పట్టేహక్కు నీకులేదు' అన్నాడు చలపతి.
"వసంతను నీడకు రమ్మనది నేనుగదా! దానికి పడి పిక్చర్లిప్పించింది నేను చేసిన ద్రోహామేముందీ? నన్ను గురించి అక్కడక్కడా కాని మాతలంతూ,తిరిగీ నా ముఖం చూడడానికి అది సిగ్గుపడలేదంటే నా కాశ్చర్యంగా ఉంది" అన్నది మంజరి.
చలపతి నవ్వాడు.
"ఏదైనా తనదాకా వస్తేగానీ తేలిదంటారు. ఈ నిమిషం వరకూ, నీ ఎదుటబడి వసంత నిన్నొక్క మటనలేదు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి నువ్విలా మధనపడిపోతున్నావు అవునా? మరి నా సంగతోక్కసారిచూడు. తూర్పు పడమరలు తెలీని దాన్ని ఇంత స్టాయికి తీసుకొచ్చాను. నన్ను కుక్కకన్నా హీనంగా చూసిన సంఘటనలనేకమున్నాయి. అలా అవమానించడానికీ, నీకు నేను చేసిన ద్రోహుమేమిలేదు. కానీ నువ్వు చేశావు. ఎందుకని? అది నీ స్వభావం కూడా కాదు.డబ్బు నీ స్టాయినీ, నీ స్వభావాన్నీ మార్చి వేసింది. నీ కల్లాకు మాయ తెరలను కప్పింది. ఆ తెరలున్నంత కాలం అలానే ప్రవర్తిస్తావు. ఒక్క నువ్వనే కాదు-నేనైనా అంతే-రేపు వసంతైనా అంతే! కాబట్టి అమ్మాయీ! దీన్నిగురించి ఆలోచించకు, బుర్ర చేడగోట్టుకోకు" అని సలహా ఇచ్చాడు చలపతి.
'అందులోనూ ఫారెన్ వెళ్ళ బోటున్నానేమో!" అని పూర్తి చేసింది మంజరి.
"అయిపోయింది. మనమిక మామూలు మనుషులమయి పొదాం. నా వేషం నేను తోడుక్కుంటాను" అన్నాడు చలపతి నవ్వుతూ.
మంజరి కూడా నవ్వి, వొళ్ళు విరుచుకొంది.
"కాని నా అనుమానమేమిటంటే- మనం నిజంగా వేషాలు విప్పావా అని. విప్పినట్టు నటించామేమోనని నేననుకొంటున్నాను" అన్నది మంజరి.
"అదేదో నీకే తెలియాలి మంజరీ! అసలీ గొడవను ప్రారభించిందే నువ్వు.నువ్వే మాత్రం నిజం చేబుతావో తెలుసుకొందామనే, ముందు అవకాశం నీకిచ్చాను" అన్నాడు చలపతి.
'నేను చెప్పిన విషయాలు మీరు నమ్మలేదు కదూ?'
'నువ్వు చెప్పింది నిజమయినప్పుడు నేను నమ్మానా లేదా అన్న ప్రసక్తికే తావులేదు. నిజం చెప్పిన దానివయితే మనమింకా వేషాలు విప్పలేదేమో నన్న శంక నీకు వచ్చేదే కాదనుకొంటాను, అయినా -అవన్నీ ఎందుకమ్మా! ఆ కళ్యాణి-వేరే ఊసుపోక ఏదో రాజభేట్టి ఉంటుంది. దాన్ని బట్టుకొని నువ్వు లిగం వేస్తున్నావు. నేను మొత్తుకొనే దెందుకంటే, కళ్యాణి చెప్పింది గదాని,ఇతర్లను నిగ్గదీసే ముందు,కళ్యాణి నిజం చెప్పిందో లేదో నివ్వెందుకాలోచించవో నాకు భోధపడదు.'
"నాకు అబద్దం చెప్పాల్సిన అవసరం కళ్యాణి కెందుకుంటుంది?"
"ఒక నిజం నీదాకా రాకుండా దాయడం కోసం ఇంకో, అబద్దాన్ని చెప్పోచ్చుగా! కళ్యాణి నీతోచెప్పినవన్నీ నిజాలని నువ్వనుకోకు. అన్ని విషయాలూ, దాచుకోకుండా చెప్పిందనీనువ్వనుకోకు. ప్రతి మనిషికీ ఇంకోరితో చెప్పడానికి వీల్లేని రహస్యాలు కిన్ని ఉంటాయి. అవి- వారితో అలా నశించిపోవలసిందే! అలాంటివే కళ్యాణికి ఉండవచ్చు గదా!" అన్నాడు చలపతి.
"కళ్యాణి నానుండి ఏమన్నా దాచుకొన్నదంటారా?"
"ఇంత సేపూ నేను వాగి�
