అతనోసారి నుదుటిమీద చమటను తుడుచుకొని సిగరెట్ వెలిగించాడు. ఎవరో వచ్చి భుజంమీద చెయ్యివేశారు. అలవాటు ప్రకారం చలపతి నమస్కారం చేశాడు.
"మీరు మంజరి తాలూకు వారేగదూ?" అన్నాడు పెద్దమనిషి.
"అవు"నన్నట్టు తలాడించాడు చలపతి.
"మీతో మాట్లాడాలి మనం ఓ అరగంట సేపు ఎటన్నావెడదామంటారా? పోనీ మా ఆఫీసుకు వస్తానంటే నాకభ్యంతరం లేదు. లేదా మీయింటికి రమ్మన్నా వస్తాను" అననదతను.
అతన్నెప్పుడో చూశాడు చలపతి. కానీ ఎప్పుడు చూసిందీ, ఎక్కడచూసిందీ అతనికి జ్ఞాపకం రాలేదు. అయినా ఆ పెద్దమనిషి సినిమావాడే ననిపించింది. సినిమా వాళ్ళను గుర్తించడంలో చలపతి పోలీసు కుక్కలకన్నా
నైపుణ్యంగా వ్యవహరించగలడు.
"ఈ వేళప్పుడు మీ ఆఫీసుకు రావడం కుదరదు వస్తాయంటున్నారు గనక మాయింటికే వెడదాం పదండి. అయితే యింకో అరగంటదాకా ఆగాలి. మాకారు ఇంకెవర్నో దిగబెట్టడానికి వెళ్ళింది" అన్నాడు చలపతి.
"ఫర్వాలేదు నాకారులో వెడదాం!" అన్నాడతను.
చలపతికి ప్రాణం తెరిపిన బడినట్లయింది. అతడు గట్టిగా నిట్టూర్చి "వన్ మినిట్" అంటూ మంజరి దగ్గరకొచ్చాడు. ఆమె యింకా మాట్లాడుతూనే వుంది. జనం క్రమ క్రమంగా పలచబడిపోతున్నారు. పత్రికలవాళ్ళు ఇంకా అక్కడే తారట్లాడుతున్నారు.
"అయ్యా శర్మగారూ! రేపు సాయంత్రం మర్చిపోరుగదూ? మూర్తిగారూ! ఇంకోసారి పిలుస్తున్నారు. మీరు తప్పకుండా పార్టీకి రావాలి. లాస్ట్ టైం కూడా మీరు రాలేదు. ఏమండీ భగవాన్ రావు గారూ, మర్చిపోరుగదూ? రేపు రాకపోయారంటే మీతో మాట్లాడను....హలో తంగవేలు! డోస్టు ఫర గేట్ టుమారోస్ ఎంగేజ్ మెంట్....ఓ కె. ఛీరియో...."
మంజరి చొరవను చూసి చలపతి దిగ్బ్రాంతుడయ్యాడు. ఈ పంపిణీ మీద పెరుగుతూ పోతే.,, మంజరిని తను అందుకోవడం కల్లోని మాట. ఈ క్షణాన తను లేకపోయినా ఆవిడకేలోటూలేదు, ఇంతలో ఎంతగా మారిపోయింది మంజరి!
"అయ్యా మరి శలవు, మీతో చాలా సంగతులు మనవి చేయాలి. ఇప్పుడు టైం లేదు. రేపు ఎటూ కలుసుకొంటున్నాం గనక తీరిగ్గా మాట్లాడుకొందాం. అవతల ఎవరో ప్రొడ్యూసర్ మా కోసం చూస్తున్నాడు" అన్నాడు చలపతి.
మంజరి మరోసారి అందరికి నమస్కరించింది.
"ఆయన సినిమా ప్రొడ్యూసరను కొంటాను. మనింటికనుకొన్నాడు జాగ్రత్త" అని ఉప్పు అందించాడు చలపతి.
"సరే"నన్నట్టు తలపంకించింది మంజరి.
ఆ పెద్దమనిషి కార్లో ముగ్గురూ ఇంటికొచ్చారు, మంజరి డ్రెస్ మార్చుకొచ్చేలోగా చలపతి చాలా విషయాలు కూపీ తీశాడు "మన్నించాలి" అంటూ మంజరి కూడా రంగంలోకి ప్రవేశించింది.
"కూచో" అన్నాడు చలపతి "వీరిపేరు మొదలియార్, నేను లోగడ చెప్పింది వీరిని గురించే. కొత్తగా ఓ ప్రొడక్షన్ ప్రారంభించారు. కధ, డైలాగ్స్ రెడీగా వున్నాయి. కొన్ని పాటలు కూడా రికార్డు చేశారు. నిన్నటిదాకా, అందులోవున్న సెకండ్ హీరోయిన్ వేషం ఇంకెవరికో ఇవ్వాలనుకొంటున్నారు. ఆ వేషం మనకిద్దామని వారి ఉద్దేశం."
మంజరికి వెంటనే "సరే" అందామనిపించింది. కానీ అనలేదు ఎందుచేతనంటే చలపతి ధోరణిలో "లీడింగ్" లేదు. అతను కేవలం విషయం మాత్రమే చెప్పి వూరుకొన్నాడు. ఆ తరువాత తను అనవలసిన మాట లేవో సూచనగా అందించినప్పుడు, తను ఔననో కాదనో అనాలి. అదేమీ లేనప్పుడు తను మెదలకుండా ఊరుకోవలసిందే!
"అలాగాండీ!" అన్నది మంజరి కళ్ళు టప టపలాడిస్తూ.
"మీరు రెండు వెర్షన్లు తీస్తున్నారా?" అన్నాడు చలపతి.
"లేదు, ముందుగా టామీల్లో తీస్తాను. తరువాత తెలుగులోకి డబ్ చేదామనుకొంటున్నాను. ఇంకో పార్ట్నర్ వస్తామంటున్నాడు. అతను కూడా కలిస్తే, రెండు వెర్షన్లూ, సైమల్ టేనియస్ గా తీస్తాను అలా జరిగితే దాని రేట్లు మాట్లాడుకొందామనుకోండి. ముందుగా టామిల్ వెర్షన్లు మీరెంత డిమాండ్ చేస్తున్నారో చెప్పండి" అన్నాడు మొదలియార్, మంజరి కేసి చూస్తూ.
మంజరి నవ్వి చలపతిని చూసింది.
"ఏదైనా మీకు మాటివ్వడానికి భయంగా వుందందే! ఇప్పటికే అయిదారు పిక్చర్లు చేతిలో వున్నాయి. అందరూ జనవరి, ఫిబ్రవరుల్లో పూర్తి చేయాలనుకొంటున్నారు. కాల్ షీట్స్ సర్ధగాలమా, లేదా అన్నదో సమస్య పోనీ ఎలాదో ఎడ్జెస్టు చేదామనుకోండి - శ్రమకు తగిన ఫలితం వుంటుందో లేదో కూడా మనం చూసుకోవాలి గదా!" అన్నాడు చలపతి.
"అదే చెప్పండి?" అన్నాడు మొదలియార్.
"మీ ఉద్దేశమేమిటి" అన్నది మంజరి, ఏమీ అనకపోతే బావుండదని.
"వేషం మంచిది. రోమాంటిక్ కారెక్టర్. వాంప్ టచ్స్ లేవు కానీ సొసైటీ లేడీ. రెండు చోట్ల క్లబ్ సీనులున్నాయి. అక్కడ డాన్సు చేయాలి. వీటిని ఫారిన్ పంపి, కలర్ చేదామని వుంది. డిసప్పాయింట్ మెంట్ లేదు, సారో నెస్ లేదు...మీకు సరిపోతుంది టామిల్ లో మీకు తొలిసారిగా అవకాశమిచ్చినవాణ్ని నే నవ్వాలని ణా కోరిక" అన్నాడు మొదలియార్.
థాంక్స్ అన్నది మంజరి.
చలపతి కళ్ళేర్రజేసి చూశాడు. తరువాత మొదలియార్ కో సిగరెట్ ఆఫర్ చేస్తూ "క్షమించాలి" అన్నాడు చలపతి. "మీరు మూడోవారు. కానీ, ఈ తరహా వేషమిచ్చిన వారిలో మీరే మొదటి వారనుకోండి...నాదొక్కటే పాయంట్, ఓ పిక్చర్లో ఫస్టు హీరోయిన్ గా మంజరి బుక్ అయింది - యస్. టామిల్. పిక్చర్ లోనే ఇంకో దాంట్లో, పాధాస్ రోల్ వేయడానికి ఎగ్రిమెంట్ కుదుర్చుకొన్నాం. అలాంటప్పుడు మీ పిక్చర్లో సెకండ్ హీరోయిన్ గా వేస్తే మార్కెట్ ఎలా ఉంటుందన్నదే మా సమస్య."
"ఏదైనా ఈ అమ్మాయి నా పటంలో ఉండాలి. మీరేమడుగుతారో అడగండి" అన్నాడు మొదలియార్.
చలపతి కిదో గొడ్డు ముడిలాగా కనిపించింది. తను ఎంత అడిగినా తక్కువే అడిగినట్లవుతుందేమోనని, అతని భయం. అతని ఉద్దేశమేదో బయటికి లాగందే తనో అంకె చెప్పడం కన్నా పొరబాటు ఉండబోదని అతను గ్రహించాడు. మంజరికూడా అందుకు దోవలు వెదకసాగింది.
"మీరీ అమ్మాయిమీద ఎంత ఖర్చు చెయ్యదల్చుకున్నారో చెప్పండి?" అన్నాడు చలపతి.
"ఏదో అంకె నానోట పలికించిందాకా మీరడగ దల్చలేదనుకొంటాను. నేను మంజరికి అయిదువేలిస్తాను, కావాలంటే, రేపేమనం ఎగ్రిమెంట్స్ రాసుకోవచ్చు."
చలపతి నవ్వి తల అడ్డంగా తిప్పేశాడు.
"కుదరదు లెండి. ఈ విషయం డ్రాప్ చేసి ఇంకేదన్నా మాట్లాడుకుందాం" అన్నాడు చలపతి.
"కుదుర్చుకోవాలన్నప్పుడు, రెండు వేలు ఆటైనా ఇతినా ఇబ్బందిలేదు. మీరు చెప్పమన్నారు గనక చెప్పాను. మీ రడిగేదేదో అడగండి మరి!"
"అవతల నేను తీసుకొన్నంతైనా లేకపోతే, వేషం వేయడంలో అర్ధంలేదు. పదివేలు వారిదగ్గర పుచ్చుకొంటూ అందులో సగంమొత్తానికి మీ కంపెనీతో ఎగ్రిమెంట్ కమిట్ కావడం ధర్మంకాదు. మీకు ముమ్మాటికీ, ఇష్టమైతే ఆ పదివేలూ మీరూ ఇవ్వండి" అన్నది మంజరి.
"ఆఖరి మాటగా అడుగుతున్నాను ఎనిమిదిస్తాను. మీరు వేషం వేసినా సరే మానుకొన్నాసరే! ఎ సంగతీ నాకు ఫోన్ చేయండి. మరి నేను వస్తాను" అన్నాడు మొదలియార్ లేస్తూ.
మంజరీ చలపతి కూడా లేచారు.
"అబ్బబ్బా! గీసి గీసి బేరం చేస్తారేమండీ! రేపు మీ వాటాకో పదిలక్షలు వస్తే నాకేమీ ఇవ్వరు గదా!" ఆనంది మంజరి.
"వస్తుందన్న నమ్మకంతోనే ఉందాం. మీనోటి చలవన, అందులొ సగభాగం వచ్చినా, మీకో కారు ప్రజంట్ చేస్తాను" అన్నాడు మొదలియార్ నవ్వుతూ.
"మొదలియార్ గారు అసాధ్యుడు మంజరీ! మన కెక్కడా చిక్కరు" అన్నాడు చలపతి.
"పోనీండి" ఆనంది మంజరి. చలపతి కేసి సన్నగా కన్నుగీటుతూ. "వారు -మనమే కావాలని పనిమాలా వచ్చి అడుగుతున్నారు గనక, కాదనడం భావ్యంగా వుండదు అన్నది. మంజరి మొదలియార్ వేపు తిరుగుతూ. చూడండీ! మీరింతగా అడుగుతున్నారు గనక, మీమాట ప్రకారమే కానివ్వండి,. అయితే ఓ చిన్నషరతు ఉంది. నాచెల్లెలొకమ్మాయి ఉంది. అద్భుతంగా పాడుతుంది. నేను పాడవలసిన పాటలన్నీ దానిచేత పాడిస్తానంటే, ఎనిమిది వేలకే వొప్పుకుంటాను. అందుగ్గాను, ఆ అమ్మాయికి వేరే పే చెయ్యండి"
"అంటే -ఇంకో విధంగా పదివేలు నానుండి తీసుకొంటున్నారన్నమాట" అన్నాడు మొదలియార్ నవ్వి.
"అలాకాదు నను ఎనిమిది వేలకే బుక్ చేస్తున్నారు. అదనంగా ఓ ప్లేబాక్ ఆర్టిస్టును తొలిసారిగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను" అన్నది మంజరి.
"బాగా పాడుతుందా?"
"ఎక్సలెంట్!" ఆనంది మంజరి.
"ఎవరన్నా బుక్ చేశారా?"
"ఆఫర్సున్నాయనుకోండి,. ఎగ్రిమెంట్ చేసిందిమాత్రం మీరే!" అన్నది మంజరి.
"పాట విన్నదాకా నేనేమీ గ్యారంటీ ఇవ్వను. పిలిపించండి చూద్దాం, పాట నచ్చితే మీరన్నదే ఖాయం" అన్నాడు మొదలియార్, తన మార్జిన్ తన కుంచుకొంటూ.
"ఓ యస్, ఐ ఎగ్రీడ్" అన్నది మంజరి. అతని ముఖంలో ఏదో లోపించింది.
"వసంతను పిలిపించబోతున్నావా" అన్నది మంజరి.
"మరే! మీ ఉద్దేశమేమిటి?" అన్నది మంజరి.
"అవతల ఆ పెద్దమనిషికి మాటిచ్చాక నా ఉద్దేశ్యంతో ఏమీ లేదు మంజరీ! అయినా నువ్వేదో లాంఛనంగా అడగడమే తప్ప, నా ఉద్దేశాల ప్రకారం నడవాలన్న ఉద్దేశ్యం నీకు లేదని నాకు తెలుసు" అన్నాడు చలపతి.
"ఏమోబాబూ! ఈ మధ్య మీరు పందెపు కోడిపుంజులాగా మారిపోతున్నారు. పోట్లాడటమే తప్ప మీ కింకో పని లేదని, ఎవరన్నా అనుకుని పోతారేమోనని నా భయం. మీకా బెంగలేదు. వసంతను పిలిపించడం మీ కిష్టం కాకపోతే ఆ మాట స్పష్టంగా అనరాదా!" ఆన్నది మంజరి.
"రేపా పెద్దమనిషి కేమని చెబుతావమ్మా?" అన్నాడు చలపతి.
"మీ ధర్మాన, నాకా విద్యలో కాస్త ప్రవేశముంది. లెండి నేను ఆమెకు కబురు పెట్టాననీ ఈలోగా రెండు కంపెనీల్లో నెల జీతాల మీద కుదరడం వల్ల ఆవిడకు వీలు చిక్కలేదనీ అనేస్తాను వసంతకైనా ఇప్పుడు అవకాశం లేదు. మనమే బలవంతంగా కల్పించాం"
"మనమని, నన్నుకూడా కలపకు నువ్వే కలిగించావు" అన్నాడు చలపతి.
మంజరి నవ్వింది.
"అవునుగదూ! ఈ మధ్య మనం విడిపోయాం. మీరు వేరు నేను వేరూనూ, నేనేమిటో నాకు అంతో ఇంతో తెలుసు, కానీ మీరెవరో నాకు బోధపడకుండా వుంది." అన్నది మంజరి.
చలపతి పకపకా నవ్వాడు.
"బ్యూటిఫుల్ డైలాగ్ మంజూ! వెరీ పవర్ ఫుల్ డైలాగ్" అన్నాడతను.
చలపతి ధోరణిలోని మార్పును మంజరి గమనించింది.
"ఏమండీ! ఒక్కోసారి మనమే డైలాగ్ కూడా మార్చుకోవచ్చునటగా నిజమేనా?" "దానికింకా టైముంది. తప్పకుండా మార్చుకోవచ్చు. అలా మార్చుకొంటాం కూడాను. సాధారణంగా కవి రాసిన చెత్తంతా ఆర్టిస్టులనరు. వాళ్ళకు నచ్చిన డైలాగ్సు అంటారు. అయితే., ఈ పప్పుల్ని అందరూ ఉడికించలేరు. టాప్ రాంక్ ఆర్టిస్టులే ఉడికిస్తారు." అన్నాడు చలపతి.
"మరయితే, కవీ, డైరెక్టరూ ఊరుకొంటారా? పేచీ పెట్టరా?"
"ఛస్తే ఆ పని చెయ్యరు ఒకరిద్దరు డైరెక్టర్లు తప్ప తెలుగు ఫీల్డులో ఆర్టిస్టుల్ని కమాండు చేయగల నాధుడే లేడు మంజరీ! గట్టిగా మాట్లాడితే సగంలో వేషం కడిగేసుకొని వెళ్ళిపోతారేమో నని భయం. ధ్వంసమయ్యేది ప్రొడ్యూసరూ, ఫలానా డైరెక్టర్, ఆర్టిస్టులతో పేచీలు పెట్టుకొంటాడన్న పేరొస్తే అతను గింజుకుచచ్చినా ఒక్క పిక్చరు కూడా దొరకదు. ఆ డైరెక్టరుంటే, యాక్ట్ చెయ్యమని ఆర్టిస్టులు స్పష్టంగా చెబుతారు. అందరూకాదు. చాలా కొద్దిమంది వేళ్ళమీద లెక్కపెట్టవచ్చుననుకో...ఇహ మిగతావారు వాళ్ళ దయా ధర్మాల కోసం పాకులాడుతుంటారు....."
"ప్చ్" అని చప్పరించేసింది మంజరి.
చలపతి "బ్యూటీ" అన్నాడు.
"చలపతి నవ్వాడు.
"ఏం తెలివిరా నాయనా!" అనుకొన్నది మంజరి.
"నేనేమో అనుకొన్నాను గానీ, మనుషుల్తో మాట్లాడ్డం కత్తి మీద సాము చేయడం లాగా ఉంటుందండీ! నరాలన్నీ పీక్కు పోతాయనుకోండి బాబూ! ఈ గొడవలతో ప్రాణం హైరానా పడిపోయింది. జ్వరం వచ్చినట్టుగా ఉంది....నేవెళ్ళి పడుకొంటాను. ఎవరన్నా వస్తే మీరే మాట్లాడి పంపేయండి"
చలపతి సమాధానం కోసం చూడకుండానే మంజరి మెడ మీది కొచ్చింది. తాయారు ఫాను వేసి, పొగలు చిమ్మే కాఫీ తెచ్చి బల్లమీద పెట్టి, రెప్ప వాల్చకుండా మంజరి కేసి, చూడసాగింది.
"అదేమిటే?" ఆనంది మంజరి.
"ఇందాకటి పిక్చర్లో మీ వేషం గుర్తుకొచ్చిందండమ్మాయి గారూ! ఎంత బ్రహ్మాండంగా చేసినారుండి! జనం యిరగాబడుతూ సూత్తారనుకోండి....ఇంక మీరు పైకి ఎల్లినట్లే. మిగతావాళ్ళంతా మీముందు బలాదూర్...."
మంజరి వినడం లేదని తెలిశాక గానీ తాయారు మానలేదు. నిజంగానే మంజరి వినడంలేదు. ఆవిడ ఆలోచనలన్నీ, ఇందాకటి సంఘటనల చుట్టూ తిరుగుతున్నాయి. తన నటనా, దాన్ని నలుగురూ మెచ్చుకోవడం, తనకోసం ప్రొడ్యూసర్లూ వెంటపడటం, వేలమీద బేరాలు సాగడం - ఇవన్నీ మంజరికి అమితమైన తృప్తినిచ్చాయి. శరీరం తేలికపడి గాలిలోకి తెలిపోతున్నట్టుగా ఫీలయింది. ఆవిడ కిలాంటి జీవితమే కావాలి. -కాదు- ఇంతకన్నా మంచి జీవితం కావాలి. తన పేరుమీదుగా నాలుగు బ్యాంకుల్లో ఎకౌంట్సుండాలి. నాలుగు కార్లుండాలి. బ్రహ్మాండమైన పాలెస్ ఉండాలి.. నాలుగు టెలిఫోన్ లైసెన్సులుండాలి. తనకో ప్రొడక్షన్ కంపెనీ ఉండాలి. నాలుగు టెలిఫోన్ ప్రొడ్యూసర్లు, తన గడపలలో పడిగాపులు పడుతూ ఉండాలి. చిన్న ఆర్టిస్టులు, రచయితలు, టెక్నిషియన్లు రికమెండేషన్ల కోసం, తనను ప్రాదేయపడాలి. తన వంద రూపాయల నోటుకు, పది రూపాయల కన్నా మించి విలువ ఉండకుండా ఉండాలి......ఇవన్నీ తను సాధించవలసిందే. తను తప్పకుండా సాధించగలనని కూడా మంజరి అనుకొంది. ఆ లక్ష్యాన్ని చేరడానికి, తనిప్పుడే ప్రయాణం ప్రారంభించింది! ఈ ప్రయాణంలో, తనకు తోడ్పడే వాటిని ఆదరిస్తుంది. అనవసరమైన వాటిని సర్దిస్తుంది. వేటిని ఆదరించాలో, వేటిని విసర్జించాలో తనకు తెలుసు....
"పోనీ నేను వెళ్ళనా?"
మంజరి ఆలోచనలన్నీ చెదిరిపోయాయి. ఓక్షణం కలవరపడి చూసింది. జయా ఫిలింస్ ప్రసాద్, నవ్వుతూ ఎదురుగా కనిపించాడు.
"మీరా?" అన్నది మంజరి. సోఫాలో ఓ పక్కకు సర్దుకుంటూ.
ప్రసాద్ ఆమెకు ఎదురుగా కూచున్నాడు.
"వొంట్లో బావుండలేదని, పడుకొన్నావనీ చెప్పాడే చలపతి?" అన్నాడు ప్రసాద్.
"నిజంగా బావుండలేదనుకోండి, మీరీ రాత్రి నన్ను వొంటరిగా వొదిలి వెడతారా? వెళ్ళరని నాకు తెలుసు. అయినప్పుడు నాబాగోగులు మీకెందుకు చెప్పండి?" అన్నది మంజరి నవ్వుతూ.
ఆ నవ్వు సమ్మోహనాస్త్రం బాబులాగా పనిచేసింది. ఆ వాక్యాలు అతనిలోని పురుషత్వాన్ని రేక్కొలిపాయి.
"నేను వెళ్ళడం కోసం రాలేదు." అన్నాడు ప్రసాదు.
"వెడతారని అనుకోలేదు." అన్నది మంజరి పకపకా నవ్వుతూ."మీ సంగతి నాకు తెలీదు గనకనా మోసపోవడానికి? ఏం చేశారోనాకు చెప్పడం లేదుగానీ నన్ను మాత్రం పూర్తిగా మైకంలో ముంచేశారు."
ఆ మానవున్ని పూర్తిగా మైకం కమ్మేసింది.
"దోవలోకొచ్చాడు!" అనుకొంది మంజరి.
నేనేదో అనుకొన్నానుగానీ, నువ్వు బ్రహ్మాండంగా యాక్ట్ చేశావు మంజూ. మొదట్నించీ నేమీద నాకా నమ్మకముంది. నా మాట దక్కించావు" అన్నాడు ప్రసాదు.
"ఇదంతా మీదయ, మీ చలవ. కొత్తదాన్నని ఆలోచించకుండా మంచి పోర్షనిచ్చారు. నా శక్తి వంచనలేకుండా కృషి చేశాను. మీ చేయూత లేకపోతే, నేనెక్కడ ఉండేదాన్నో నాకు తెలుసు" అన్నది మంజరి.
ప్రసాద్ ఒక్కక్షణం ఆగి చిరు చిరుగా నవ్వాడు. అతని కళ్ళల్లోకి తోడేలు చూపు వస్తోంది.
"అయితే నాకేం బహుమతి ఇస్తావ్ మంజూ?" అన్నాడు తను మంజరిని ఆపాదమస్తకం చూస్తూ.
"బహుమతా?" అన్నది మంజరి నవ్వి" ఇవ్వడానికి నా దగ్గరేమీ లేదు. ఉన్నదేదో మీకెప్పుడో అర్పించాను. భగవంతుడు, నాకేదన్నా గొప్ప వరం ప్రసాదిస్తే దాన్ని మీకోసం నేనిస్తాను. అంతకన్నా నేనేమివ్వగాలను చెప్పండి?"
ప్రసాద్ ఇక స్థిమితంగా కూచోలేకపోయాడు. చేయిచాపి, మంజరి చేతినందుకొని, ఆ ఊపుతో, మంజరి ప్రక్కకొచ్చి కూచున్నాడు. ఆవిడ కళ్ళుమూసుకొని, మెడ రిక్కించింది. ప్రసాద్ ఆమె చెంపల్ని అరచేతులతో అదిమి కళ్ళను ముద్దుపెట్టుకొన్నాడు.
"నీ కళ్ళు ఎంత బావుంటాయి మంజూ! నువ్వు కాంతారా చూస్తే నేను భరించలేను. నీ చూపులు బాణాల్లా పొడిచి పొడిచి నన్ను చంపేస్తాయి." అన్నాడు ప్రసాదు.
"అయితే నా దగ్గరకు రాకండి. వెళ్లిపోండి" అన్నది మంజరి.
"వెళ్ళనా? నిజంగా?"
"ఓ యస్"
"చేతులు తియ్యి, పోతాను"
మంజరి అతని చుట్టూ చేతులువేసి బిగించింది. క్షణక్షణానికీ అవి, మరింత గట్టిగా హత్తుకు పోతున్నాయి.
"పోనివ్వు" అన్నాడు ప్రసాద్, కొద్దిగా పెనుగులాడుతూ.
"నేను చేతులు తియ్యను, చాతనయితే తప్పుకు వెళ్ళండి లేదా నేను పోమ్మన్నదాకా ఇలానే, ఈ బంధిఖానాలో ఉండిపొండి"
"నన్ను చంపేస్తున్నావు మంజూ!" అన్నాడు ప్రసాద్ ఆమె చెవిలో.
"అబద్దం ఆ పనిచేస్తుంది మీరే!" అన్నది మంజరి అంతకన్నా సన్నగా.
అతన్నొక్కసారి నిలువునా హత్తుకొని, మెడకింద పెదవులతో కితకితలు పెట్టి వదిలేసింది మంజరి.
"వీలు చిక్కింది గదాని వెళ్ళేరు జాగ్రత్త! అసలు నేనే వద్దామనుకొన్నాను. మరో అరగంటలో. మీరు రాకపోతే వచ్చేసి ఉందును కూడాను.....నో నో. మాటలూ వద్దూ, పాడూవద్దు. నేను మధ్యాహ్నమే అన్నీ రెడీ చేశాను. మీ బ్రాండే -రెండు బాటిల్స్ తెప్పించాను. సోడాలూ ఉన్నాయి. రేపటి నుండి, మళ్లా రొటీన్ పనులున్నాయి. ఆ తుక్కు బ్రతుక్కు దూరంగా ఈ రాత్రల్లా మనం ఇక్కడే ఉంటున్నాం....ఇవిగాక ఇంకేమన్నా కావాలా?" అన్నది మంజరి.
"ఇవన్నీ అనవసరమని నేననుకొంటుంటే, ఇంకేమన్నా కావాలా అంటావేం మంజూ? నాకు నువ్వు కావాలి, నువ్వొక్కదానివీ చాలు. ఇంకేమీ వొద్దు" అన్నాడు ప్రసాద్.
"బాబూ! నేనెక్కడికి పారిపోవడం లేదండీ! నేనుంటాను సరేలెండి నాకు తోడుగా ఇవికూడా ఉంటే, ఇంకా బావుంటుంది. ప్లీజ్ నన్నీ రాత్రి మీరేమీ కాదనకండి. నేనేం చేసినా మీ రూరుకోండి. నే చెప్పినట్టల్లా వినండి....ఈ రాత్రి నాకేదో పిచ్చెక్కినట్లుగా ఉంది..... నన్నేదో ఇంద్రజాలంతో ముంచేసి, ఏమీ తెలీనినంగనాచిలాగా నిలబడతారేం? అదుగో - అలా నా కేసి చూశారంటే, నన్ను దయ్యాలు పట్టుకొంటాయి. ఆనక నన్ను నెపపెట్టి లాభంలేదు."
ప్రసాద్ నిలువునా కరిగిపోయాడు మంజరి పక్కనే ఉన్న బటన్ నొక్కింది. పెద్ద పళ్ళెంలో రెండు సీసాలు సోడాలు గ్లాసులు పట్టుకొచ్చింది తాయారు. వాటిని బల్లమీద ఉంచుతూ " నమస్కారం బాబయ్యా!" అన్నది తాయారు.
ప్రసాద్ తల పంకించాడు.
"ఏం బాబయ్యా! రోజుకోపాలన్నా అమ్మగారికి అగుపియ్యరాదా? ఆమెగారు, అస్తమానూ, మీ ఊసే నాకాడ అంటా ఉంటుందండీ! పిక్చరూ, పిక్చరూ, అంటూ నన్ను తోల్తదండీ! మీరేమో అవుపియ్యరాయే! కాస్తంత నా తిప్పట తగ్గించండి బాబయ్యా!" అన్నది తాయారు.
"అది లాభంలేదు లేవే తాయారు! ఆయన్ని మనమే మెడ దిగకుండా చెయ్యాలి. గదిలో పెట్టి తాళం వేస్తేనేగానీ అయ్యగారి తిక్క కుదరదు., ఆ పని నీవల్ల కాదు, నేనే చెయ్యాలి."
తాయారు వెళ్ళిపోయింది. మంజరి తనే గ్లాసులోకి వొంపి ప్రసాద్ కందించింది.
"నీకు?"
"కొంపతీసి ఇదంతా మీరొక్కరే తీసుకొంటారేమిటి? కాస్త నాకూ మిగల్చండి.
రెండు గ్లాసులు కావాలని, మీరంటే తప్ప -ఒకటే సరిపోతుందనుకొంటాను."
ప్రసాద్ ఒగుక్క తాగి, ఇన్ని జీడిపప్పు తిని హావిట్ అన్నాడు. మంజరితో.
మంజరి గ్లాసు ఖాళీ చేసింది. ప్రసాద్ జేబులోంచి ఓ సిగరెట్ తీసి, వయ్యారంగా పెదవుల కంటించింది. ప్రసాద్ లైటర్ తో దాన్ని వెలిగించాడు. మంజరి గుండెల నిండుగా పొగ పీల్చి, "ఉఫ్" మణి ప్రసాద్ ముఖం మీదికి ఊదింది.
"సిల్లీ గరల్" అన్నాడు ప్రసాద్,. తనూ వో సిగరెట్ అంటిస్తూ.
ఓ సీసా పూర్తిగా అయిపోయింది. రెండో సీసా సగం కూడా అయిపోయింది. ప్రసాద్ కళ్ళు జ్యోతుల్ల మెరుస్తున్నాయి. మంజరి నైట్ గౌనులో మిలమిలా మెరిసిపోతూంది. రోజియో గ్రాఫ్ లోంచి, వెస్టరన్ మ్యూజిక్ మైల్డ్ వినిపిస్తోంది. పైన ఫాన్ సోమరిగా తిరుగుతోంది. లావెండర్ వాసన గదంతా నిండిపోయింది.
"నిద్రొస్తోంది" అన్నాడు ప్రసాద్.
"వొద్దు, మేలుకొని ఉండాలి. ఇందాక నేను చెప్పినట్లు వింటానన్నారు. నేను నిద్ర పొమ్మనందే పోతానంటారేం?" అన్నది మంజరి, అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి గోముగా దువ్వుతూ.
ప్రసాద్ ఆమె కళ్ళల్లోకి చూసి తలవొంచుకొన్నాడు.
"ఇలాగా -అచ్చంగా ఇలాగే - నీవొళ్ళో పడుకొని చచ్చిపోవాలని ఉంది."
మంజరి చట్టున అతని నోరు మూసింది.
"ఆమాట అనవలసింది నేనుగానీ, మీరుకాదు" అన్నది మంజరి, అతను కనురెప్పల్ని పెదవులతో తడుపుతూ.
ప్రసాద్ పలకలేదు.
మంజరి ఓ క్షణం ఆగి, సన్నగా నిట్టూర్చి "నేనో సంగతి అడగనా?" అన్నది.
"ఊఁ ?"
"మీ నా మధ్య, ఈ కాంట్రాక్టులూ, ఎగ్రిమెంట్లూ, ముళ్ళతొడుగుల్లా అడ్డు పడుతున్నాయండీ! మీరు ప్రొడ్యూసరుగానూ, నేను ఆర్టిస్టుగానూ ఉన్నప్పుడు, అవి అవసరమేననుకోండి. అదృష్టవశాత్తూ మనం అంతకన్నా
దగ్గరకొచ్చాం. ఆ పాత సంబంధాలు పీడకలగా మర్చిపోకుండా, ఇవి మన మధ్య ఉండటం మరీ దారుణం, మనం వాటిని రద్దు చేసుకొందాం" అన్నది మంజరి.
ప్రసాద్ ఆమె ముఖాన్ని జాగ్రత్తగా వెదికి "అవసరమా?" అన్నాడు.
"అని నేననుకొంటున్నాను....ఈ కాగితాలు చూసినప్పుడల్లా నాకు జెర్రులు పాకినట్లనిపిస్తుంది. మీరేమీ అనుకోనంటే మనం వాటిని రేపే రద్దు చేసుకొందాం."
"అవి మనకు అడ్డోస్తున్నదెక్కడ మంజూ?" అన్నాడు ప్రసాద్.
"అవి నా పెట్టెలో ఉన్నాయన్న జ్ఞాపకం నన్ను పొడిచి పొడిచి చంపేస్తోంది. అదీగాక -ఇంకే కంపెనీ వారదిగినా మిమ్మల్ని పర్మిషన్ కోసం వేధించాలి - డియర్! మనసులు కలవడమే కష్టం. అవి కలిశాక మిగతావన్నీ కేవలం శుద్ద వేస్టు."
"చూద్దాం" అన్నాడు ప్రసాద్.
మంజరి పలకలేదు.
కాసేపయ్యాక, అతను కళ్ళెత్తి చూశాడు. మంజరి కళ్ళు నీటితో నిండిపోయాయి. ప్రసాద్ ఉలిక్కి పడి లేచి కూచున్నాడు.
"ఏమిటది మంజూ?"
"నేనేదో అనుకొన్నాను గానీ - నా అంత పిచ్చిముండ మరొక రుండరండీ! అందరూ తెలివైన వాళ్ళే నేను తప్పు, పోనీండి. నా జాతకం అలాంటిది!" అన్నది మంజరి.
ఆమె గొంతు బొంగురుపోయింది కూడానూ!
"ఇప్పుడేమయిందనీ కళ్ళంట నీళ్ళు పెట్టుకోవడం? అలాగే రేపు కానిద్దాం....అనవసరంగా లేని పోనివి ఊహించుకొని, ఈ స్వర్గాన్ని పాడు చెయ్యకు మంజూ! నీకేం కావాలో చెప్పు. అవన్నీ చెయ్యడానికి నేను సిద్దంగా ఉన్నాను" అన్నాడు ప్రసాద్, ఆమె భుజాలమీద చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ.
"నాకా? నాకా?" నాకేమీ వద్దు. ఏమీ వద్దు, నిజంగా ఏమీ వద్దు -ఇలా -మీరు - శాశ్వతంగా -నా ప్రక్కనే ఉండటం కావాలి. అంతకు మించి ఏమీ వద్దు.
"తప్పకుండా మంజూ! మనం కలకాలం ఇలాగే ఉందాం ఇలాగే ఉంటాం" అన్నాడు ప్రసాద్.
మంజరి ఇంకోసారి, అతన్ని ఆపాదమస్తకం హత్తుకొంది.
లైట్లు ఆరిపోయాయి.
14
ఉదయం కాఫీ తాగేటప్పుడు, చలపతి ఆ రోజు చేయవలసిన పనులన్నీ మంజరికి జ్ఞాపకం చేశాడు.
"సాయంత్రం పత్రికల వాళ్ళోస్తున్నారు. ఎంత మందొస్తారో చెప్పలేను. మనం మాత్రం ఏర్పాట్లు బాగా చెయ్యాలి" అన్నాడు చలపతి.
"అలాగే" అన్నది మంజరి.
"మనం ఏదన్నా హోటలు వాళ్ళకు ఆర్డరివ్వడం మంచిదనుకొంటాను. చేసేదేదో గ్రాండ్ గా చెయ్యాలి. పదిరూపాయలు వెదజల్లి వంద రూపాయలు ఏరు కోవడంలోనే ఉంది తెలివి."
"అలాగే చేద్దాం!" అన్నది మంజరి, పరధ్యానంగా. ఆవిడ దృష్టి సాయంత్రం పార్టీ మీద లేదు, జయా ఫిలింస్ వారి కాంట్రాక్టు మీద ఉంది. దాన్ని ఏదో విధంగా రద్దు చేయించాలని ఆవిడనుకొంది. అందుకు అవతల పార్టీని వొప్పించింది. కానీ, దీనివల్ల కలిగే ఫలితాలను తను ఆలోచించలేదు. ఏదో వో నిర్ణయం చేయడంలో అర్ధమేమిటట? అదీ గాక, తనీ విషయం చలపతితో ఇంత వరకూ అనలేదు. అతనభిప్రాయం కూడా తెలుసు కోవడం మంచిది.
"నాకేమీ తెలీదు నీ ఇష్టం!" అన్నాడు చలపతి. పగ్గాలు వదిలేసిన రౌతులాగా.
మంజరికి కోపమొచ్చింది గానీ, బయటపడనివ్వలేదు. ఉద్రేకాలను ఎప్పుడు అణచుకోవాలో, ఎప్పుడు బయట పెట్టాలో మంజరికి బాగా తెలుసు.
తన జవాబుతో మంజరి తలకిందులయిపోతుందని చలపతి భావించే ఉంటే అతను పూర్తిగా పొరపాటు పడినట్లే లెక్క.
మంజరి తలకిందులు కాలేదు సరికదా,. కనీసం నొసలు కూడా చిట్లించలేదు. పైగా చిన్నగా ఓ నవ్వు కూడా నవ్వింది.
"నన్నిలా నట్టడవిలో వదిలేసి "నాకేమీ తెలీదంటే" ఎలా నండీ? ఈ వైరాఘ్యం మొదట్నించి ఉంటే అదోదారి. సగం దాకా ఎక్కాక నిచ్చెన లాగేస్తానంటే, నేననగలిగిందేమీ లేదు" అన్నది మంజరి.
అప్పటికి చలపతి పలకలేదు.
"ఇవ్వాళేదో" నీ ఇష్టం" అంటూ వేలెత్తి చూపుతున్నావన్నారు గానీ లోగడ చేసినవన్నీ నా ఇష్ట ప్రకారమే చేశారా? నా కిష్టం లేని పనులు, నాచాత కట్టుకుపోయినన్ని చేయించారు. అవన్నీ నోరు మూసుకొని నేనూ చేశాను....అలా చూస్తారేం? నేనన్నది అబద్దమా?" అన్నది మంజరి.
చలపతి మెట్లుదిగి నేలమీది కొచ్చాడు.
రాత్రి ప్రసాద్ వచ్చినప్పుడే నువ్విటువంటిదేదో చేస్తావనుకొన్నాను. ఇన్నిటికీ అతనొప్పుకొన్నాడా?"
"ఆఁ" అన్నది మంజరి.
"అతనొప్పుకొని ఉండడు. నువ్వే బలవంతాన వొప్పించి ఉంటావు. ఇటువంటి అభిప్రాయం నీకున్నప్పుడు కాస్తంత ముందుగా నాతో సంప్రదించి ఉండవలసింది!" అన్నాడు చలపతికి తనకసినంతా వెళ్ళబోసుకుంటూ.
"ఇప్పుడు సంప్రదిస్తున్నాగా, చెప్పరాదా?" అన్నది మంజరి.
"అసలా కంపెనీలో -ఏకంపెనీలో నైనా సరే, జీతలమీద కుధరడమే నా కిష్టంలేదు. అలా కుదిరిందాకా నా ప్రాణాలు తోడేశావు. ఇప్పుడేమో దాన్ని రద్దు చేయించమంటున్నావు. ఎలా నామ్మా నీతో చావడం?" అన్నాడు చలపతి.
మంజరి పలకలేదు.
"నన్నడిగితే" అని ప్రారంభించాడు చలపతి. "ఇప్పట్లో కంపెనీని వదలడం మంచిది కాదనే అంటాను. ఫలానా కంపెనీలో ఫలానా ఆర్టిస్టు ఉన్నదన్నప్పుడు, మార్కెట్ డిమాండ్ వేరు, ఖాళీగా ఉన్న దన్నప్పుడు, అనుకొన్నంతగా అంబ పలకదు. అలవ సులవ ధరలకు అడుగుతుంటారు. కాబట్టి.-"
"నన్నక్కడే ఉండమంటారు" అని పూర్తి చేసింది మంజరి.
"మరే"
"అదేం వీలుపడదు లెండి. ముందు వెళ్ళి ఆ విషయం చూసిరండి. ప్రసాద్ మనకోసం ఎదురు చూస్తుంటాడు. వస్తూ వస్తూ మొదలియార్ గార్ని కూడా కలుసుకొనిరండి!" అన్నది మంజరి.
"నె చెప్పే సలహాను పాటించాలని అనుకోనప్పుడు, నన్నడగడమెందుకు మంజరీ?" అన్నాడు చలపతి.
"అడక్కుండానే మీరనదలచిందేమిటో నాకు తెలిసే ఉపాయం లేదుగనక."
చలపతి ఇంకో మాటను మాట్లాడకుండా లేచాడు.
"వేగిరండి. మళ్లా టీ పార్టీ వ్యవహారాలు చూడాలి.!"
"అలాగే" అని వెళ్ళిపోయాడు చలపతి.
చాలాసేపు మంజరి అక్కడే కూచుండి పోయింది. ఆవిడ బుర్రలో కందిరీగలు రొదపెడుతున్నాయి. తను సాహసించి చేస్తున్న ఈ పని ఎలా పరిణమిస్తుందో మంజరి తేల్చుకోలేక పోతోంది. ఆవేళప్పుడు కూడా ఆవిడకు చిరుచెమటలు పోశాయి.
స్వతహాగా మంజరికి పేపర్లు చదివే అలవాటులేదు. న్యూస్ పేపర్లు చదవడం అసలే గిట్టదు. అందులోని వార్తలేమీ మంజరికి రుచించవు. అయినా, అన్ని పత్రికలూ ఆవిడ తెప్పిస్తున్నది. ముఖ్యంగా ఇతర భాషల్లోని సినిమా పత్రికలన్నీ ఆవిడకొస్తాయి. వాటిల్లో తన బొమ్మగానీ, తనను గురించిన న్యూస్ గానీ ఉంటే ఆ కట్టింగ్స్ జాగ్రత్త పరచమని చలపతికి చెబుతుంది. లేకపోతే అదీలేదు. వారం రోజుల కిందట మంజరి ఇంకో పనికూడా చేసింది. కళ్యాణి పోరుపడలేక అయిదారువందల రూపాయల పుస్తకాలు కొన్నది. వాటన్నింటినీ చక్కగా బీరువాలో సర్ధించింది.
"ఇవన్నీ నేను చదవను కాస్సేపు పుస్తకం పట్టుకొంటే గుడ్లుపీక్కుపోతాయి" అన్నది మంజరి.
"నేనూ చదవను., అయినా మా ఇంట్లో మూడు బీరువాలనిండా పుస్తకాలున్నాయి. ఎందుకుంచానని అడక్కు. అవి అలా ఉండాలి. అంతే! వాటి ఉపయోగం చాలా ఉంది" అని సలహా ఇచ్చింది కళ్యాణి.
ఆ ఉపయోగమేమిటో ఆ రోజు సాయంత్రంగానీ బయటపడలేదు. పత్రికలవాళ్ళకిచ్చిన పార్టీలో - అసలూ పార్టీ ఏర్పాట్లే బ్రహ్మాండంగా ఉన్నాయి. లోపలి అరేంజిమెంట్స్ తాయారు చూస్తుంటే మంజరి చలపతీ పక్క పక్కగా నిలబడి అతిధులకు స్వాగతం చెప్పారు. చలపతి, ఆయా వ్యక్తుల స్థాయిలనుబట్టి 'విష్' చేస్తుంటే మంజరి కూడా దాని కనుగుణంగానే ప్రవర్తించింది. కాస్సేపు పిచ్చాపాటీ మాటలయ్యాక, చలపతి అసలు విషయం ఎత్తాడు.
"గిరీశం అన్నట్టుగా మనవాళ్ళు, ఏ ఆచారాన్నయినా అర్ధంలేకుండా ప్రారంభించరు. చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదించడం మన సాంప్రదాయం. మా మంజరి, పెద్దలైన మీ అందరి ఆశీర్వాదాలు కోరుతున్నది. ఈ యుగంలో పత్రికలకున్న స్థానమేమిటో ఆర్టిస్టులకు ఆయువుపట్టు పత్రికలూ. మంజరి -మీ అందరి దయవల్లా ఇప్పుడిప్పుడే వెలుగులో కోస్తున్న తార, ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్తునివ్వవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ ఈ పార్టీని ప్రారంభిద్దాం" అన్నాడు చలపతి.
ముందుగా ప్రసాదూ, కాస్త ఆలస్యంగా మెహతాకూడా ఆ పార్టీకి వచ్చారు. వారిద్దరూ ప్రక్కప్రక్కగా కూచుని ఉండటం చూశాక, మంజరికి వెంకటేస్వర్లూ, కాల్ షీట్స్ కాన్సిల్ చేసుకొని మధ్యాహ్నమే వచ్చింది. పార్టీలో ఎలా మెలగవలసిందీ, సాధారణంగా, పత్రికల వాళ్ళడిగే ప్రశ్నలూ, వాటి కివ్వవలసిన జవాబులూ కూడా కళ్యాణి చెప్పింది.
ఇంకేమన్నా వస్తే నేనున్నాను. చలపతిగారున్నారు. మరేమీ పర్వాలేదన్నది కళ్యాణి.
అనుభవజ్ఞులైన వీరిద్దరి ఆధ్వర్యాన పార్టీ బ్రహ్మాండంగా జరిగింది. మంజరినికూడా మాట్లాడమని కళ్యాణి బలవంతం చేసింది. మంజరి ససేమిరా వొప్పుకోలేదు. అప్పటికి ఊరుకొన్నా, అయిదారు నిమిషాలకల్లా, ఆమాట కాస్తా కళ్యాణి బహిరంగంగానే అనేసింది, మంజరికిక తప్పలేదు.
"ఈ సంతోష సమయంలో నేనేమీ మాట్లాడాలన్నా మాటలు తడబడుతున్నాయి. నేను ఆహ్వానించినంతనే వచ్చిన మీకందరికి నా ధన్యవాదాలు. అసలీ పరిశ్రమకు నన్ను పరిచయం చేసిన మా చలపతి గారికి, సాహసంతో మంచి వేశామిచ్చిన ప్రసాదుగారికీ, నన్నెంతగానో ఆదర�
