Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 9

రెండుసార్లు కాలింగ్ బెల్ ప్రెస్ చేయగానే తలుపు తెరిచింది ఐరిస్. ఎదిరుగ్గా ఇంద్రమిత్ర కనిపించగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఇంద్రమిత్ర ఆమె ప్లాట్ కి రావటం అదే మొదటిసారి. ఆమె ఆశ్చర్యంలోంచి తేరుకునేలోపే అన్నాడు ఇంద్రమిత్ర.
"ఈ పక్కనే నా ప్రెండుతో పనివుండి వచ్చాను అతడు మరో గంటదాక రాదట. నేను కాసేపుండి వెళ్ళిపోతాను"
ఐరిస్ తలవూపి పక్కకి జరిగింది. ఇంద్రమిత్ర లోపలకి  వచ్చాడు. పక్కనే వున్న కిటికీలోంచి బయటకి చూశాడు. తనను వెంటాడిన మనుషులు యింకా రోడ్డుమీద నిలబడి దిక్కులు చూస్తుండటం అతడికి స్త్రీట్ లైట్ల వెలుగులో కనిపించింది.
ఐరిస్ చెప్పింది_
"సర్! ఈలోపు పేపర్స్ చూస్తుండండి. నేను ఛాయ్ పట్టుకు వస్తాను."
ఇంద్రమిత్ర తలవూపాడు.
కిచెన్ లోకి అడుగుపెట్టిన ఐరిస్ టీకేటిల్ స్టౌమీద పెట్టింది. యాంత్రికంగా పనిచేస్తున్న ఆమె ఇంద్రమిత్ర గురించే ఆలోచించసాగింది. ఆమెకు ఇంద్రమిత్ర పరిచయం అయినా సంఘటన గుర్తుకువచ్చింది.
కృష్ణజిల్లాలో ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆమెకు చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించారు.
అప్పటికీ ఐరిస్ పదిహేను సంవత్సరాల వయస్సు వుంటుంది. దాదాపు రెండు సంవత్సరాలపాటు మేనమామ యింట్లో వుంది ఐరిస్. ఓ రోజు బస యాక్సిడెంట్ లో మేనమామ చనిపోవడంతో, ఐరిస్ కి హైదరాబాద్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, తనకు ఈకష్టాలు వుండవని, స్వంత ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బ్రతక వచ్చునని చెప్పింది.ఆమె మాటలు నమ్మిన ఐరిస్ ఆమెతో కలసి హైదరాబాద్ వచ్చేసింది. ఆ తర్వాత తెలిసింది  తాను బ్రోతల్ హౌస్ కి అమ్ముడయిన విషయం. అక్కడ దాదాపు ఆరునెలలు కాలం గడిపిన తర్వాత పోలీస్ రైడింగ్ లో పట్టుబడిన ఐరిస్ ని బావుస్తాస్ స్కూల్ కి పంపించారు.బోస్టన్ స్కూల్లో సంవత్సరం కాలం గడిపిన తర్వాత బాధలు భరించలేని ఐరిస్ అవకాశం చూసుకుని పారిపోయింది. ఆ తర్వాత ఆకలికి తాళలేక ఓ చిన్న దొంగతనం చేసిపట్టుబడిన ఐరిస్ మరోసారి బోస్టన్ స్కూల్ కి పంపించారు. అంతకు ముందు ఓ సారి పారిపోయిన ఐరిస్ మీద స్కూల్ వార్డెన్ విపరీతమయిన కసిపెంచుకుంది. ఐరిస్ ని ప్రతిరోజూ చావాబాదుతూ వుండేది. అకారణంగా చీకట్లో బందిస్తూ వుండేది. సరిగ్గా అలాంటి సమయంలో బోస్టన్ స్కూల్ కి వచ్చాడు ఇంద్రమిత్ర. ఆ రోజు ఇంద్రమిత్ర తనతోపాటు వుంటున్న మిగిలిన ముప్ఫయ్ మందినీ ఇంటర్యూ చేశాడు, వాళ్ళల్లోంచి తనను ఎన్నుకున్నాడు.
బాల నేరస్తుల్లోంచి ఒకరిని సెలక్ట్ చేసుకుని వాళ్ళకు మానసికంగా ట్రీట్ చేసి మంచి నడవడిక అతడివుద్దేశ్యమట! దానికి అతడికి మేజిస్ట్రేట్ పర్మిషన్ కూడా వుందిట.
కేటిల్ లోంచి నీళ్ళు మరుగుతున్న శబ్దం వినిపించటంలో కొంచెం ఛాయ్ పౌడర్ వేసింది ఐరిస్. ఛాయ్ వాసన ఘుమఘుమలాడుతూ ముక్కుపుటాలకు సోకింది ఐరిస్ ఆలోచనలు మళ్ళీ గతంలోకి తొంగిచూశాయి.
సినిమాల్లో తప్ప మాములుగా అంత అందమైన ఇంటిని చూడటం ఐరిస్ అదే మొదటిసారి!
ఆ రోజు ఆమెకు బాగా గిర్తుమ్ది.
బోస్టన్ స్కూల్ నుంచి ఇంద్రమిత్ర ఏపార్ట మెంట్ కి వచ్చిన రోజు.
వాల్ టి వాల్ కారేట్స్, ఖరీదైన ఫర్నిచర్, థౌజండ్ వాట్స్ స్టీరియో వైడ్ స్క్రీన్ కలర్ టి.వి, ప్రీజ్, వీటితో పాటుగా వాతావరణానాన్ని చల్లబరుస్తున్న ఎయిర్ కండిషనర్. అలాంటిచోటు అడుగు పెట్టడం ఐరిస్ అదే మొదటిసారి. తాను ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే అన్నాడు ఇంద్రమిత్ర_
"వెళ్ళి స్నానంచేసిరా!"
ఐరిస్ తలవూపి బాత్రూంలోకి నడిచింది. ట్యాబు లో స్నానం ఆమె థ్రీలింగ్ గా ఆలోచించింది. అతడు తనను బోస్టన్ స్కూల్ నించి ఎందుకు తెచ్చివుంటాడో ఆలోచించింది. ఇంతలో ఆడవాళ్ళు దుస్తులుకొని ఆడవాళ్ళు వుపయోగించే వస్తువులుగాని లేవు. పైగా మనిషి మంచి పర్సనాలిటితో అచ్చం సినిమా హీరోలా వున్నాడు. పైగా బ్రహ్మచారి జీవితం గడుపుతున్నాడు తనను అతడు ఎందుకని తెచ్చివుంటాడో ఓ వుద్దేశ్యానికి వుండే తన శరీరం మీద నీటి బిందువులు కలువ వూపుమీది మంచు బిందువుల్లా తళతళ మెరుస్తున్నాయి.
తాను బాత్  రూమ్ లోంచి నడుచుకుంటూ అతడి దగ్గరకి వచ్చి నిలబడింది. సరిగ్గా అప్పేడే అతడు కూడా స్నానానికి రడీ అవుతున్నట్టుంది. కేవలం వంటిమీద టవల్ తో అటువైపు తిరిగి నిలబడి వున్నాడు అతడి విశాలమైన భుఉజాలు కండపట్టి మాలీగా కనబడుతున్నాయి. నడుం సింహపు నడుంలా సన్నగా వుంది. కాలి పిక్కలు బలంగా మెరుస్తున్నాయి. తనకు నిజంగానే అతడిపట్ల ఆకర్షణ కలిగింది. దాంతో వేరే ఆలోచన లేకుండా తాను వేనుగ్గా వెళ్ళి అమాంతం అతడ్ని రెండు చేతులతో వాటేసుకుంది. జరిగింది అర్ధమయ్యేలోపు అతడి టవల్ జారి పడిపోయింది. అతడు కంగారుగా తనవైపు తిరిగాడు. అతడి పర్సనాలిటిని పరిశీలిస్తూ తను మరింత హత్తుకుంది.
"ఏయ్ ఏంటది?" అంటూ అతడు తనను వెనక్కు తోసేశాడు. తాను వేల్లకిల్లా బెడ్ మీద పడిపోయింది. అతడు వేల్లకిల్లా పడివున్న తనవైపు చూడకుండా వుండేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడన్న విషయం అర్ధం అవుతోంది. తన మొలకు చుట్టుకున్న టవల్ వూడిపోయిన  విషయం  అతడు ఇంకా గ్రహించలేదు. నేలమీద పడిన టవల్ ను అందుకున్న ఇంద్రమిత్ర దాన్ని తన శరీరం కుప్పేలా బలంగా విసిరాడు. కొంతదూరం సూటిగా దూసుకువచ్చిన టవల్ ప్యాన్ గాలికి గురితప్పి నేలమీద పడిపోయింది. వెల్లాకిల్లా పడివున్న తన చేతుల మీద శరీరాన్ని పైకిలేపి ఇంద్రమిత్ర కోపంగా అటువైపు కదలి టవల్ అందుకుని వెళ్ళి తనమీదకి విసరబోయాడు. అపుడు అంది తాను.
"ఇతరుల తప్పులు చెప్పే గురివిందకు తన క్రింద నలుపు మాత్రం తెలీదట" అని౯ పగలబడి నవ్వసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS