నేను శశాంకని మర్చిపోదామని విఫలయత్నం చేస్తుండగానే నాకు మా భావనిచ్చి పెళ్ళిచేయటానికి మా ఇంట్లో నిర్ణయం తీసుకున్నారు.మా భావ, చదువు పూర్తవడానికి ఇంకా ఆర్నెల్ల సమయం వుంది. ఆ తర్వత నాకు బావకు పెళ్ళి జరుగుతుంది.మా బావ గురించి నాకు బాగా తెలుసు. మా బావ చాలా మంచి మనిషి. అలాంటి మనిషికి ఒకరు ఎంగిలి చేసిన నా శరీరాన్ని అర్పించటం కంటే దారుణం ఇంకోటిలేదు.నేను మా బావకు నమ్మకద్రోహం చేస్తున్నాను. నేను పాపం చేస్తున్నాను" ట్రాన్స్ లో వుండి చెబుతున్న శిశిర క్షణం ఆగింది.
ఇంద్రమిత్రకు ఓ వుశ్యం అర్దమయింది. శశాంకతో శారీరకంగా కలసిన ఆమెకు అపరాధ భావం వెంటాడుతోంది. మురికిపట్టిన వస్తువుల్ని నీటితో కడిగి శుభ్రం చేసినట్లు అపవిత్రమైన తన శరీరాన్ని కూడా నీటితో కడిగి పవిత్రం చేయాలనుకుంటోంది. ఆమె పదే పదే అనేకసార్లు స్నానాలు చేయటానికి అదే కారణం.
ఆమె శరీరం అపవిత్రం చెందినా, మనస్సు ఇంకా పవిత్రంగానే వుంది. ఈ విషయం శిశిరకు అర్ధమయ్యేలా చెప్పగలిగితే చాలు ఆమె మనస్సులో నాటుకున్న అపరాధ భావం తుడిచిపెట్టుకుపోతుంది. దాంతో ఆమె మామూలు మనిషివుతుంది. రెండు మూడు కౌన్సిలింగ్ తో ఆమె మామూలు మనిషిని చెయ్యవచ్చు. అంతేకాదు శశాంకకు, తనకూ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం ఆమె పొరపాటున కూడా తన భావతో చెప్పకూడదు. అది వాళ్ళవైవాహిక జీవితాన్ని రెండుగా చీల్చివేస్తుంది.
ఇంద్రమిత్ర ఆమె ట్రాన్స్ లో వుండగానే ఆమె మానసిమ్కంగా పవిత్రంగానే వుందని, మనిషికి శరీరంకంటే మనసే ముఖ్యం అనీ చెబుతూ సజెషన్స్ యిచాడు. మరో పదినిమిషాల తర్వాత ట్రాన్స్ లోంచి బయటపడిన శిశిర మనసులోనుంచి పెద్ద భారం దిగిపోయినట్టునిపించింది. ఇన్ని రోజులుగా తనలోనే గూడు కట్టుకున్న రహస్యాన్ని మరో మనిషికి చెప్పుకోవటంవల్ల వచ్చే ఫీలింగ్ అది.
శిశిర వెళ్ళిపోయిన తర్వాత మిగిలినవాళ్ళు ఒక్కొక్కరే ఇంద్రమిత్ర దగ్గరకు రాసాగారు. వాళ్ళ మానసిక సమస్యలు వినటం వాళ్ళ సమస్యలకు ఇంద్రమిత్ర ట్రీట్ మెంట్ చేయటం పూర్తయింది. పేషెంట్స్ అందరూ వెళ్ళిపోయాక ఐరిస్ లోపలకి వచ్చి ఇంద్రమిత్రకు కీస్ అందించింది.
ఇంద్రమిత్ర ఆమెను రేపు మామూలు సమయానికి రమ్మని చెప్పాడు. ఐరిస్ ఇంద్రమిత్రకు గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది.
సరిగ్గా అదే సమయంలో__
సెల్లార్ లోని పార్కింగ్ ప్లేస్ లో ఆగివున్న ఇంద్రమిత్ర కారు దగ్గరికి వచ్చాడో ఆగంతుకుడు. డూప్లి కేట్ కీస్ సహాయంతో ఇంద్రమిత్ర కారు డోర్స్ తెరిచాడు. క్యాష్ బోర్డ్ లో చెయ్యి పెట్టాడు. చిన్నలివర్ ఒకటి ఆతడి వెళ్ళకు తగిలింది.లివర్ ని వెనక్కి లాగాగానే కారు బానేట్ తెరుచుకుంది. వెంటనే అతడు ఇంజన్ పైన అమర్చివున్న స్పార్క్ ప్లగ్ తీసి దూరంగా చీకట్లోకి విసిరాడు. తిరిగి బానేట్ మూశాడు.
* * * *
అంతలో సెల్లార్ లో లిప్ట్ ఆగిన శబ్దం వినిపించింది. వెంటనే ఆ వ్యక్తి పక్కనేవున్న పిల్లర్ చాటుకు తప్పుకున్నాడు. అదే సమయంలో తెరుచుకున్న లిప్ట్ లోంచి ఇంద్రమిత్ర సెల్లార్ లోకి అడుగుపెట్టి పార్కింగ్ ప్లేస్ లో వున్న కారువైపు నడిచాడు.
అటోలోంచి దూకూతునే నలుగురిలోనూ సన్నగావున్న గూండా కీచుగా అరుస్తూ తన వెనక నిలబడి వున్న లావు గూండా మీద పడిపోయాడు.
వాళ్ళు తిరిగి లేచేలోగానే ఇంద్రమిత్ర వేగంగా మెయిన్ రోడ్ వైపు దౌడుతీయసాగాడు.
వెనుకవైపునుంచి పరుగెడుతున్న గూండాలు క్షణక్షణానికి దగ్గర ఆవసాగారు.ఆ నలుగురూలోనూ క్రూరంగా కలిపించే ఒక పొట్టి గూండా విసిరినా పాటకాకత్తి గురితప్పి ఇంద్రమిత్ర చెవిపక్కగా దూసుకుపోయి రోడ్డు క్రాస్ చేస్తున్న ఒకడి గుండెలో దిగబడింది.
ఇంద్రమిత్రకి బదులు మరోవ్యక్తి మరణించటంతో మరింత కసిగా నలుగురు గూండాలు చేంజ్ చేయ సాగారు.
ప్రాణభయంతో పరిగెడుతున్న ఇంద్రమిత్ర మెయిన్ రోడ్డుమీదకి వచ్చేశాడు. అతడు రోడ్డుమీదకి వచ్చిన సమయంలోనే అటుగా ఓ సిటీబస్ రావటం కేవలం యాద్రుచ్చకం.
ఇంద్రమిత్ర మెరుపువేగంతో సిటీబస్ ని క్యాచ్ చేశాడు.గూండాలు మెయిన్ గేటు దగ్గరకి చేరుకునే సరికి ఇంద్రమిత్రఎక్కిన బస్ కూడా వంద గజాల దూరం వెళ్ళిపోయింది. గూండాలు కూడా క్యాచ్ చేయటానికి ప్రయత్నించారు.
అంతలో ఎదురుగా వున్న సందులోంచి వచ్చిన మనిషిని పాడేమీద పెట్టుకుని ఊరేగింపుగా వస్తున్న జనం రోడ్డు మొత్తం బ్లాక్ చేసేశారు.
వాళ్ళను తప్పించుకుని అటుగా వెడుతున్న ఆటోని క్యాచ్ చేసి సిటీబస్ వెళ్ళిన రూట్ లో అయిదు నిమిషాలు వేగంగా ప్రయాణించాక, రెండు స్టాపుల అవతల ఆగివున్న సిటీబస్ వాళ్ళను ఆకర్షించింది. ఆటోలోంచి దిగి సిటీబస్ ఎక్కినా వాళ్ళకు ఇంద్రమిత్ర కనిపించలేదు. తాము బస్ మీదకి ఎటాక్ చేస్తాం అనే విషయం గ్రహించిన ఇంద్రమిత్ర తమకుస్లీస్ యిచ్చాడనే విషయం వాళ్ళకు అర్ధం అయింది.
* * * *
సిటీబస్ తాను ఎక్కువసేపు ప్రయాణించటం క్షేమం కాదు అనే విషయం అర్ధం చేసుకున్న ఇంద్రమిత్ర రెండు స్టేజీల అవతల దిగి మెయిన్ రోడ్డుకు అనుకునే వున్న సందులోకి పరుగుతీశాడు. ఆ సందు చివరలో వున్నాయ్ గ్రీన్ లండ్ టవర్స్. వాటిల్లో అయిదో అంతస్తు సింపుల్ బెడ్ రూమ్ ప్లాట్ లో నివసిస్తోంది ఐరిస్.
తాను ఐరిస్ దగ్గర కొద్దిసేపు వుంది తర్వాత వెళ్ళి పోవచ్చుననే ఆలోచన రాగానే అటు వైపు మూవ్ అయ్యాడు ఇంద్రమిత్ర.
