ఇంద్రమిత్ర కోపంగా అన్నాడు_
"ఏంటి నవ్వనేది?" అలా అంటూనే ఎదురుగా వున్న అడ్డం వైపు చూశాడు.
మరు క్షణం అతడికి అర్ధం అయింది. మరుక్షణం అతడు వేగంగా పక్క రూమ్ లోకి పరుగుతీశాడు. సరిగ్గా అయిదు నిమిషాల తర్వాత నైట్ ద్రాస్ వేసుకున్న ఇంద్రమిత్ర ముందు గదిలోకి వచ్చాడు. అతడి చేతిలో లిమ్గీ, షర్ట్ వున్నాయి. కాని తాను కనిపించకపోవడంతో అతడు తెల్ల ముఖం వేశాడు. అదే సమయంలో తాను అతడి మీదికి మరోసారి ఎటాక్ చేసింది. బీరువా చాటునుంచి ముందుకు దూకిన తాను అతడి పెదాలను అందుకోబోయింది. అతడు ముఖాన్ని పక్కకు తిప్పుకోవడంతో పేదలకు బదులు అతడి చెంపలు తన అధారాలకు చిక్కాయి. ముద్దు పెడుతుండగా ఇంద్రమిత్ర తన నడుంచుట్టూ లుంగీ చుట్టేశాడు. తన ప్రయత్నాలకు అభ్యమ్తరం చెబుతూ అన్నాడు.
"నికు మళ్ళీ బోస్టన్ స్కూలుకి వెళ్ళాలని వుందా?"
ఆ మాటతో తనలోని ఉత్సాహం మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోయింది.
తనలో చిలిపితనం స్థానంలో భయం చోటు చేసుకుంది. తాను భయంగా ఇంద్రమిత్రవైపు చూసింది. ఇంద్రమిత్ర అతడి వెళ్ళు తన శరీరానికి తగలకుండా వుండెందుకు ప్రయత్నిస్తూ తనకు షర్ట్ తోడిగేశాడు. తరవాత తన కళ్ళలోకి చూస్తూ అన్నాడు_
"సారీ! నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు. నీ గతజీవిత ప్రభావం ఇంకా నిన్ను వదిలినట్టులేదు, నిన్ను మామూలు మనిషిని చేయాలని, సోసైటిలో నీకోస్థానం కల్పించాలానే విద్దేశ్యంతోనే నేను నిన్ను తీసుకువచ్చాను.
ప్లీజ్ నా మాట విను."
ఆ క్షణంనుంచి ఇంద్రమిత్రలో ఒక మగాడు మాత్రమే కాక ఒక ఆత్మీయుడు కూడా కనిపించసాగాడు. ఇంద్రమిత్ర కృషి ఫలించింది.ఇప్పుడు తన మనసులో మాలిన్యం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. అంతేకాదు ఇంద్రమిత్రపట్ల ఒక రకమైన అనురాగం తనలో కలిగింది. ఈ సంగతి ఇంద్రమిత్రకు తెలుసు. అయినా అతడు ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తుంటాడు.
"ఐరిస్ ఛాయ్ ఇచ్చేదేమన్నా వుందా?" అంటూ ఇంద్రమిత్ర పిలుపు వినడంతో ఐరిస్ ఉలిక్కిపడింది.
కేటిన్ లోని ఛాయ్ రెండు కప్పులోకి పంపింది. ఓ కప్పు తాను తీసుకుని మరొకటి ఇంద్రమిత్రకు అందించింది.
తీ సిప్ చేస్తూ కిటికీలోంచి బయటకి చూశాడు ఇంద్రమిత్ర. తనను వెంబడించినవాళ్ళు ఆ ప్రాతంలో లేరని తెలియగానే ఖాళీ అయినా తీ కప్పు టీపాయ్ మీద పెట్టి ఐరిస్ దగ్గర వీడ్కోలు తీసుకుని బయటకి నడిచాడు.
* * * *
సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఫెర్నాండెజ్ తన టేబుల్ మీద పడివున్న వస్తువులవైపు ఓ సారి పరిశీలనగా చూశాడు. ఫెర్నాండెజ్ కు పక్కనే నిలబడి వున్నాడు సబ్_ఇన్స్ స్పెక్టర్ చిదబంరం.
టేబుల్ మీద వున్న వస్తువుల్లో ఫెర్నాండెజ్ చిదంబరాన్ని ఆకర్షించిన వస్తువు ఎల్లో కలర్ రెయిన్ కోట్. అది హత్య చేయబడిన సాధూరాంకు సంబంధించిన రిస్ట్ వాచ్ ఒక ఉంగరం, ఒక కాట ఐ రాయి పొదగబడిన ఉంగరం, బంగారం గొలుసు, ప్యాంటు జేబులో డబ్బులు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి ఓ పక్కగా కుప్పగా పడి వున్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్ మీది ఫోటో, ఇంటి ఆడ్రస్ వుండడంతో హతుడు ఎవరన్నదీ ఈజీగా తేలిపోయింది.
అయితే సాదూరాం తోడుకున్నా రెయిన్ కోటు పాకెట్స్ లోంచి కొన్ని ఐడెంటిఫికేషన్ కార్డులు, పది వంద రూపాయల, రెండు ఐదు వందల రూపాయలనోట్లు, ఒక డ్రైవింగ్ లైసెన్స్ బయటబడ్డాయి. డ్రైవింగ్ లైసెన్స్ మీద ఫోటోతోపాటు డాక్టర్ ఇంద్రమిత్ర సైకో ఎనలిస్ట్ అనే పేరు, ఇంద్ర మిత్ర ఆడ్రస్ ప్రింటయి వున్నాయి. దాన్ని బట్టి రెయిన్ కోటు ఇంద్రమిత్రయి వుంటుందనే నిర్ణయానికి వచ్చాడు. సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఫెర్నాండెజ్ విజిటింగ్ కార్డ్స్ మీద ఇంద్రమిత్ర కన్సల్టింగ్ టైమింగ్స్ కూడా ప్రింటయి వున్నాయి. అతడి ఆఫీస్ ఆడ్రస్ కూడా స్పష్టంగా వ్రాసి వుంది. దాన్ని తిరిగి రెబుల్ మీద వుంచుతూ ఎస్సై చిదంబరంతో అన్నాడు ఫెర్నాండెజ్.
"ఇంద్రమిత్ర రేపు ఉదయం పది గంటలకు క్లినిక్ ఓపెన్ చేస్తాడు. మనం పదిన్నరకు అతడ్డ్ని కలుద్దాం పైగా రేపు సాటర్ డే ఇంద్రమిత్ర క్లినిక్ మార్నింగ్ అవర్స్ లో మాత్రమే వుంటుంది."
చిదంబరం తల వూపాడు.
* * * *
రిసెప్షన్ డిస్క్ ముందు కూర్చున్నా ఐరిస్ దీక్షగా ఆ రోజు డెయిలీ పేపర్ లోని సినిమా పేజీ చదువుతోంది.
మరో గంటకు తర్వాత ఇంద్రమిత్ర క్లినిక్ మూసేస్తాడు. మళ్ళీ సోమవారం వరకూ తనకు రెస్ట్ .
తలుపు తెరుచుకున్న శబ్దం అవడంతో ఐరిస్ తలెత్తి చూసింది. ఎదురుగా ఫోలీసు దుస్తుల్లో వున్నఫెర్నాండెజ్, చిడంబరాల్ని చూడగానే ఆమె మ్ముఖం భయంతో తెల్లగా పాలిపోయింది. ఆమె అనుమతి కోసం అదురు చూడకుండానే సర్కిల్ ఫెర్నాండెజ్, ఎస్సై చిదబరం ఎదురుగా వున్న కుర్చీల్లో కూర్చున్నారు.
"నీ పేరు ఫెర్నాండెజ్. ఇటూ టౌన్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ని. డాక్టర్ ఇంద్రమిత్రని కలవాలి" అన్నాడు ఫెర్నాండెజ్.
ఎస్సై చిదంబరం ఆమెవైపు తినేసేలా డేగకళ్ళతో చూస్తూన్నాడు. ఇద్దరిలోకీ చిదంబరం అచ్చం తెలుగు సినిమా విలన్ లా కనిపిస్తున్నాడు. మేలితిప్పిన కోరమీసాలు, కుడి చెంపమీద కట్టిగాటు, లావుపాటి బానపోట్టకు ఎర్రజీరలు నిండిన కళ్ళతో నిశ్చబ్దంగా తన వైపు చూస్తున్నా చిదంబరం కళ్ళలోకి చూడలేక ఐరిస్ చూపులు పక్కకుతిప్పుకుంది. అతడి వంటిమీద ఫోలీసు దుస్తులు కనక లేకపోతే జనం అతడ్ని ఓ గూండాగా భ్రమించే అవకాశం వుంది.
కాల్ గర్ల్ గా తను జీవితం గడిపినపుడు ఫోలీసులంటే ఎంతో ఐరిస్ కు బాగా తెలిసివచ్చింది. ఒక వేళ వీళ్ళు తనను ఏదయినా పాత కేసుల్లో అరెస్ట్ చేయటానికి రాలేడుకదా!
ఈ ఆలోచన రాగానే ఐరిస్ గుండె వేగం పెరిగింది ఆమె శరీరం మొత్తం ముచ్చెమటలు కమ్మాయి.
