చేతిలో నల్లగా మెరుస్తున్నా రివ్ల్వర్ తో ఫెర్నాండెజ్ తనవైపు ఆశ్చర్యంగా చూస్తున్నా ముగ్గురి దగ్గరికీ వచ్చి ఇస్మాయిల్ ని ఉద్దేశించి చెప్పాడు__
"నేను అనుక్షణం వీడిమీద కన్నేసి వుంచాను. వీడికి ఇక్బాల్ కి పాషా కు పాత పగవుంది. అందుకే అవసరం లేకపోయినా వాళ్ళిద్దర్నీ కాల్చి చంపేశాడు."
అప్పటివరకూ మౌనంగా వున్న ఇంద్రమిత్ర చెప్పాడు__
"లేదు! ఇస్మాయిల్ ని నేనే అప్పాయింట్ చేశాను.నామీద హత్యా ప్రయత్నాలు జరుగుతుండటంతో ఒక ప్రయివేట్ డిటెక్టివ్ ని ఎంగేజ్ చేయాలనుకున్నాను."
అ మాటకు ఫెర్నాండెజ్ సాలోచనగా ఇస్మాయిల్ తో అన్నాడు__
"మీకు ఒకసారిపోలీస్ స్టేషన్ కి రావాల్సి వుంటుంది."
ఇస్మాయిల్ తల వూపాడు.
తన చేతిలోని రివాల్వర్ స్తేస్తి క్యాచ్ వెనక్కి లాగి లాక్ చేశాడు.
తర్వాత రివాల్వర్ షర్ట్ లోపలివైపున వున్న హొల్ స్టర్ లో అమర్చుకున్నాడు.
ఇస్మాయిల్ ని నిరాయుధుడిగా మారిన మరుక్షణం ఫెర్నాండెజ్ తన చేతిలోని రివాల్వర్ బ్యారల్ ఇస్మాయిల్ ఛాతీకి ఆన్చి ట్రిగ్గర్ వెనక్కి లాగాడు.
చెవులు గింగురుమనిపించే శబ్దంతో రివాల్వర్ పేలింది.
రక్తం పాంటేన్ లా ఎగజిమ్మింది.
ఇస్మాయిల్ నోటి నించి వెలువడిన చిన్న గురకతో వెల్లికిలా, నిర్జీవంగా పడిపోయాడు.
ఇస్మాయిల్ అకస్మాత్తుగా ఫెర్నాండెజ్ చేతిలో చావడంతో ఇంద్రమిత్ర ద్రిగ్బాంతికి లోనయ్యాడు.
ఫెర్నాండెజ్ నేల కూలిన ఇస్మాయిల్ నుదిటిన ఎయిమ్ చేసి మరోసారి ఫైర్ చేశాడు.
తర్వాత తనవైపే ఆశ్చర్యంగా చూస్తున్నా ఇంద్రమిత్రవేపు రివాల్వర్ ఎయిమ్ చేశాడు.
సరిగ్గా అప్పుడు రియాక్ట్ అయ్యాడు ఇంద్రమిత్ర.
కుడికాలు పైకిలేపి సూటిగా ఫెర్నాండెజ్ కాళ్ళ మధ్య బలంగా ఒక్కతన్ను తన్నాడు.
ఫెర్నాండెజ్ ఒక్కసారిగా ప్రాణం పోతున్నట్టనిపించింది.
అతడు ఒక చేత్తో తొడల మధ్య నొక్కుకుంటూ కెవ్వున అరుస్తూ పడిపోయాడు.
అతడి చేతిలోని రివాల్వర్ మరోసారి నిప్పులు కక్కింది.
అయితే బుల్లెట్ గురితప్పి ఎదురుగా కనిపిస్తున్నా పున్నాగ వృక్షపు మనులో దిగపడింది.
ఫెర్నాండెజ్ నేలమీద పడిపోయాడో గాని చేతిలోని రివాల్వర్ ఉడుములా పట్టుకున్నాడు.
దాన్ని మూడోసారి ఇంద్రమిత్రవైపు ఎయమ్ చేశాడు.
సరిగ్గా ట్రిగ్గర్ లాగా బోతుండగా వినపడింది చిదంబరం కంఠస్వరం.
"ఫెర్నాండెజ్! యువర్ అండర్ అరెస్ట్."
చిదంబరం కంఠస్వరం గుర్తించిన ఫెర్నాండెజ్ తల త్రిప్పి చూశాడు.
అక్కడ అరడజనుమంది పోలీసులతో నిలబడి వున్నాడు చిదంబరం.
వాళ్ళ చేతుల్లోని ఆయుధాలు ఫెర్నాండెజ్ వైపు ఎయిమ్ చేయబడి వున్నాయి.
తాను ఏమాత్రం తెలివితక్కువుగా ప్రవర్తించినా వాళ్ళ చేతుల్లో చావటం ఖాయం.
ఈ విషయం అర్ధం చేవ్సుకున్న ఫెర్నాండెజ్ తన చేతిలోని వెపన్ వదిలేశాడు.
* * * *
పోలీసు కంట్రోల్ రూం___
చిదంబరానికి షేక్ హ్యండ్ ఇస్తూ చెప్పాడు ఇంద్రమిత్ర_
"సారీ! నేను మిమ్మల్ని అపార్దం చేసుకున్నాను."
అతని పక్కనే నిలబడి వున్న గ్రీష్మ అంది__
"అసలు అంతా నావల్లే జరిగింది."
ఇంద్రమిత్ర గ్రీష్మ వైపు ఆశ్చర్యంగా చూశాడు.
అతని ఫీలింగ్స్ అర్ధంచేసుకున్నా చిదంబరం అన్నాడు_
"మీ మీద హత్యప్రయత్నం చేసింది గ్రీష్మ భర్త.
ఇంద్రమిత్ర మరింత ఆశ్చర్యపోయాడు.
చిదంబరం చెప్పటం కొనసాగించాడు.
గ్రీష్మ భర్త పేరు నిరంజన్. చాలా రోజుల క్రితం ఒక ఫంక్షన్ లో నిరంజన్ గ్రీష్మాని చూశాడు.
ఆమెని మల్టీ మిలినీయర్ తనంతట తను గ్రీష్మ ని చేసుకుంటాననడంతో వాళ్ళు ఓకే. అన్నారు.
పెళ్ళయిన తర్వాత గ్రీష్మ కు భర్త ఒక మాఫియా లీదరనీ తెలిసింది.
అనేక హత్యలతో అతనికి సంభంధం వుందని మానసికంగా దూరంగా వుంచింది.
