అయితే చిన్నప్పట్నుంచి సంప్రదాయ వాతావరణంలో పెరగటంతో భర్తని వదులుకోవడం పాపమనుకుంది.
అంతేకాక నిరంజన్ చేసే దుర్మార్గులు తనకు తెలిసీ బయట పెట్టక పోవటంతో ఆమెలో సంఘర్షణ ప్రారంభమయింది.
అందుకే తనకు తెలిసిన నిజాలు నేతో చెప్పుకుని స్వాంతన పోందాలనుకుంది.
అందుకే నిన్ను కలసింది.
గ్రీష్మకు తనంటే ఇష్టంలేదని గ్రహించిన వెంబడించేవాళ్ళు.
మీ దగ్గరకి వచ్చిన పేషెంట్స్ తాలూకు అనుభవాలు రికార్డ్ చేసే అలవాటు మీకు వుండనే విషయం నిరంజన్ గ్రహించాడు.
ఆమె తాను చేసిన నేరాలను గురించి మీకు చెప్పి వుంటుందని నిరంజన్ అనుమనించాడు.
అందుకే మీ మీద హత్యాప్రేయత్నాలు చేశాడు.
మీ ఆఫీస్ రికార్డ్స్ లో తన వివరాలు వుంటాయేమో అని వెతికించాడు.
ఇకపోతే నాకు ఫెర్నాండెజ్ గురించి బాగా తెలుసు. అతనికి డిపార్ట్ మెంట్ లో మంచిపేరు లేదు.
చాలా సంవత్సారాలనుంచి అతడు నిరంజన్ హీల్స్ చేస్తున్నాడని డిపార్ట్ మెంట్ లోని ఆఫిషయల్స్ ఇన్ఫర్మేషన్ అందింది.
అతన్ని అబ్జర్వ్ చేస్తుండమని నాకు స్పెషల్ గా ఆర్డర్స్ పాస్ అయ్యాయి.
నా మీద ఫెర్నాండెజ్ అనుమానం రాకుండా వుమ్డెందుకు నేను మిమ్మల్నే అనుమానిస్తున్నట్లు నాటకం ఆడాను.
ఫెర్నాండెజ్ కూడా చాలా తెలివిగా ప్రవర్తించాడు. కాని నిజం నిప్పులాంటిది కదా!
ఫెర్నాండెజ్ కి కనీసం యావజ్జీవ కారాగారశిక్ష పడుతుంది.
గ్రీష్మ, ఫెర్నాండెజ్ ల స్టేట్ మెంట్, ఇతర విట్నెస్ ల్ ఆధారంగా నిరంజన్ ఉరిశిక్ష ఖాయం.
చిదంబరం చెప్పటం ముగించాడు.
గ్రీష్మ అన్నది__
"రెండు రోజులక్రితమె నాకు విడాకులు మంజూరయ్యాయి."
ఏదో అనుమానం వచ్చినట్లుగా అన్నాడు గ్రీష్మ తో ఇంద్రమిత్ర_
"అవునూ నేను గోల్డెన్ రిస్తార్స్ కి వస్తున్నట్టు నీకు తెలుసు?"
గ్రీష్మ చెప్పింది_
"నాకు విడాకులు మంజూరు కాగానే మీకు అసలు విషయం చెప్పేసి మీ ప్రేమను యాక్సెప్ట్ చేద్దామనుకున్నాను.
మీరు చెప్పక పోయినా మీరు నన్ను లవ్ చేస్తున్నారనీ.... మరొక మగాడి భార్యని అవడం వల్ల చెప్పలేకపోతున్నారనీ నాకు తెలుసు.
డ్రైవర్స్ రాగానే మీకోసం ప్రయత్నించాను. మీరు గోల్డెన్ రిస్తార్స్ కి వెళుతున్నట్టు మీ అపార్టు మెంట్స్ లిప్టు బోయ్ చెప్పాడు."
ముగింపుగా చిదంబరం అన్నాడు_
"మొత్తానికి కధ సుఖంతమయింది. విష్ యూ హ్యాపీ మారేడ్ లైఫ్."
ఇద్దరూ చిదంబరం దగ్గర వీడ్కోలు తీసుకున్నారు.
* * * *
సరిగ్గా వరం రోజుల తర్వాత పెళ్ళిళ్ళ రిజిస్తార్స్ అఫేస్ లో ఇంద్రమిత్ర, గ్రీష్మ దండలు మార్చుకున్నారు.
యాసై నుంచి సర్కిల్ గా ప్రమోట్ అయినా చిదంబరం సాక్షి సంతకం చేశాడు.
__:శుభం:__
