Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 57

గ్రీష్మ అతనికి ఆ విషయంలో గురువు పాత్ర పోషించింది.
ఆమెకు ఒక విషయం అర్దమైంది.
ఇంద్రమిత్ర ఏకసంధాగహి_
కొద్దిరోజుల్లో అతడే తనకు పాతలు చెప్పగలడు.
ఇరవై నిమిషాల మధ్య పోరాటం తర్వత__
ఇంద్రమిత్ర తలలోంచి వుద్బవించిన చెమటబిందువు జారిపడి, ఆమె నుదటి మీద పోటమరించిన చెమట బిందువుల్లో కలసి, కణతల మీదగా ఆమె చెవుల పక్కగా జారి, జుట్టులో కలసి అంతర్దనమైంది.
తన ప్రియమయిన శిష్యుడివైపు అభిమానంతో చూసే గురువులా ఇంద్రమిత్ర వైపు ప్రేమగా, వాత్సల్యంగా చూసింది.
ఇంద్రమిత్ర చెప్పాడు__
"థాంక్స్! నాకిదే ఫస్ట్ టైమ్ ."
గ్రీష్మ అడిగింది.
"నీకు మొదట పాఠం చెప్పిన గురువుగారికి నువ్వేం దక్షణ యిచ్చావు?"
"నేను పెద్దవాడ్నయినతర్వాత ఆయనకు ట్వంటీ పోర్ క్యారెట్, డైమెండ్ స్తడేడ్ ఇంపోర్డ్  డ్ పార్కర్ పెం కొనిచ్చాను."
గ్రీష్మ అడిగింది__
"మరి నాకేం యిస్తావ్?"
ఇంద్రమిత్రకు ఏం సమధనం చెప్పాలో అర్ధంకాలేదు.
అంతలో గ్రీష్మ తన ప్రశ్నకు తానే సమాధానం అంది.
"నన్ను సొంతం చ్సుకో... నేను అతడితో కలసి జీవించలేను."
"అతడంటే ఎవరు?" అంటూ ఇంద్రమిత్ర అడగబోయాడు.
సరిగ్గా అప్పుడు పేలింది....
తన వెనక పొంచివున్నఇక్బాల్ చేతిలోని రివాల్వర్.
బుల్లెట్ ఇంద్రమిత్ర భూజాన్ని రాసుకుంటూపోయింది.
రివాల్వర్ మళ్ళీ పేలిన శబ్దం వినిపించింది.
ఈ సారి ఇక్బాల్ కీచుగా ఆర్తనాదం చేశాడు.
ఓ పక్కన పొంచి చూస్తున్న ఇస్మయిల్ పేల్చినా బుల్లెట్ నేరుగా ఇక్బాల్ గుండెలో దిగబడింది.
రెండుసార్లు గిలగిలా తన్నుకున్న ఇక్బాల్ తల వాల్చ్జేశాడు.
అప్పటికీ తేరుకున్న గ్రీష్మ చకచకా దుస్తులు ధరించింది. ఇంద్రమిత్రకూడా డ్రస్స్ స్ అయ్యాడు.
కళ్ళు తెరుచుకుని వెల్లికిలా పడున్నా ఇక్బాల్ ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు ఇస్మాయిల్.
ఇక్బాల్ మరణించినట్లు నిర్దారణ చేసుకున్నారు.
ఎదురుగా నిలబడి తనవైపు భయంగా చూస్తున్నా ఇంద్రమిత్రతో అన్నాడు_
"వీడిపేరు ఇక్బాల్! ప్రోఫేషనల్ కిల్లర్.నిన్ను చంపటానికి వీడ్ని అప్పాయింట్ చేశారు."
ఇంద్రమిత్ర ఆ ప్రయత్నంగా అన్నాడు_
"ఎవరు?"
సమాధానంగా అన్నాడు ఇస్మాయిల్_
"తెలియదు..."
గ్రీష్మ ఏదో అనబోతుండగా...
ఇస్మాయిల్ చెవులకు వినిపించింది. క్లిక్ మన్నా మెటాలిక్ సౌండ్.
రివాల్వర్ స్తేప్తీ క్యాచ్ రిలీజ్ చేస్తున్నప్పుడు వచ్చే శబ్దం అది.
క్షణంలో రియాక్టయ్యాడు ఇస్మాయిల్.
మెటాలిక్ సౌండ్ వినిపించిన వైపు ఎయిమ్ చేసి, రెండు సార్లు రివాల్వర్ ఫైర్ చేశాడు.
ఒక బుల్లెట్ పాషా నుదుటిని రంద్రం చేస్తూ తలలో దిగబడింది...
రెండో బుల్లెట్ పొట్టలోకి చొచ్చుకుపోయి వీపులోంచి బయటకి వచ్చింది.
అరిచేందుకు కూడా అవకాశం లేకుండా పాషా బొక్క బోర్లా పడిపోయాడు.
పాషాను ఉద్దేశించి చెప్పాడు ఇస్మాయిల్.
"వేడి పేరు పాషా! వేడి చావుతో కిల్లర్ చరిత్ర అంతం అయిపోయింది.
ఇస్మాయిల్ కామెంట్ కు సమాధానంగా వినిపించింది సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఫెర్నాంఫెర్నాండెజ్ కంఠస్వరం.
"నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో నీ హిస్టరీ కూడా క్లోజ్ అవుతుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS