Previous Page Next Page 
ప్రజ్ఞాప్రభాకారము పేజి 58

    ఈ నాడీగ్రంధము లాయా జాతకుల హృదయములలో దాగియుండినరహస్యార్దముల గూడఁ గొన్ని కొన్ని పట్టులం దద్భుతముగా వివరించుట కలదు. అవి నాడీరచయితకును, జాతకు నకునే తెలియ వలెను గాని గ్రంధ పాఠకుఁ డగు నాడీస్వామికిఁ గూడ తెలియవు. ధ్రువనాడిలో నిట్టి వానిని గొన్నింటిని బేర్కొందును.

    'జలగండ మవాప్నోతి మృతప్రాయోపజీవనః' అని నా జాతకమునఁ గలదు. నేను మఱచితిని గాని యది జరగిన విషయమే! మా దొడ్డిలో పిల్లలము కొందఱ మాడుకొనుచుంటిమి.  నూతిలో వెదురుగడలు దింపి వానిని బట్టుకొని పైకి లాగుచుంటిము. నేను వేసినగడ నీటిలో అడుగున బురదలో లోనికిఁ జొచ్చుకొన్నది. దాని పై యంచు ఒరమిఁద  నున్న నా కందకుండెను. లోనికి తలవాంచి యెట్లే నందుకొన జూచుచుంటిని. ప్రక్క పిల్లవాఁడు నా ముడ్డి పైకెత్తెను. నేను నూతిలోఁ బడిపోయితిని. పిల్ల లందఱు పటాపంచలై పాఱిపోయిరి. మా నాయనగా రూర లేరు.మా యమ్మగారు నింటిలో నేదో పని చేసికొనుచుండిరి. నూతిలో పెద్దధ్వని గలుగుట ప్రక్కయింటి యాతఁ  డాలకించి దొడ్డిలోనికి వచ్చి చూడఁ గా పిల్ల లందఱు పాఱిపోవుచుండిరి. ఒక పిల్ల వానిఁ బట్టుకొని గట్టిగా నడుగఁ గా నేను నూతిలోఁ బడుట చెప్పెను. ఆతఁ డు పర్వెత్తుకొని వచ్చి చూచుతఱికి నాల్గు మూఁడు నిమిషము లాయెను. నే నొక మునుక వేసి తేలి నూతిలో నూగిసలాడుచున్న గడను పట్టుకొని మరల మునుక వేయక తేలియుంటిని. ఆతఁ డొరల మిఁదుగా దిగివచ్చి నన్నుఁ బట్టుకొని మా యమ్మగారి కప్పుజెప్పెను. ఈ విషయ మా నాడిలో నున్నది.

    అట్లే పందొమ్మిదవ యేట అవనిగడ్డ దగ్గఱ బండి యేటి లోనికి దిగుచుండఁ గా బోల్తా  కొట్టి చచ్చి బ్రదికితిని." వాహనాత్పతనం చైవ తిన్మూలాచ్చ మహాద్విపత్" అని యందు కలదు. ఇట్టివి ప్రతి జాతకములోను వింత వింతలుగా నుండుట నే నెఱుఁ గుదును.

    నే నెఱిఁగిన మఱొక గొప్పవింత. మద్రాసులో నొకా నొక గొప్పయింట నొక పిల్లవాని కేదో కడుపులో తీవ్రమయిన యనారోగ్యము. అది కుదుర్పరానిది. బ్రదికిన నొక వేళ శస్త్రచికిత్సతో బ్రదుక వచ్చు నని యాస. ఆ కుఱ్ఱ వాఁడు జీవించునో లేదో గుర్తించుటకు ధ్రువనాడీ కారున కత్యధిక ధన మిచ్చి యింటికి రప్పించి గ్రంధము నక్కడే యుమ్చి చదివించుచుండిరి. ఆ కుఱ్ఱవాని జాతకము సరిగానే యందుఁ గలదు. ఆతని యనారోగ్యపు నిర్వచన మెల్ల సరిగానే యందుఁ గలదు. ఆ జాతకపు  టాకు తుదిపట్టు చదువుచుండిరి. అంతలో ఆపరేష౯ చేయుటకు డాక్టరు రంగా చార్యులు గారు విచ్చేసిరి. ఆ సమయమునకు సరిగా 'శస్త్ర వైద్యేవ జీవతి' యన్న వాక్యము నాడిలో వచ్చెను. తరువాతి యాకు నిఁక చదువవలెను. డాక్టరుగారు వచ్చుటచే నంతట నాపిరి. అందఱ కును ఆ కుఱ్ఱవాఁడు శస్త్రవైద్యముచే జీవించును అనియే యర్ధము స్ఫురించెను. డాక్టరు శస్ర్తోప క్రమ మునకు సిద్దపడుచుండెను. నాడీగ్రంధమునఁ జదువుచున్న పట్టున గుర్తించి కట్టిపెట్టి గృహస్వామి యినుప పెట్టెలో తళము వేసి తాళముచెవి నాడికారున కిచ్చెను. మర్నాడు వచ్చి కడమ గ్రంధమును కదువుట కేర్పాటు జరగెను. తొందరగా నాడీకారుఁడు శేషాచార్యుఁ డింటికి వచ్చి వేసెను. ఈ విషయ మెల్ల మాతోను జెప్పెను. మేమును నాతఁడు జీవించు ననియే యనుకొంటిమి.

    మర్నాడు శేషాచార్యుఁ డుదయమున వారింటికి వెళ్ళెను. ఆపరేష౯ జరుగుచుండఁ గానే ఆ బాలుఁడు మృతుఁ డౌట తెలియవచ్చెను. అక్కడి పండితులు నివ్వెఱచెందుచుండిరి. ఈతనిని నాడీ తెఱవు మనిరి. తెఱవఁగా నా జాతకమున తుదిశ్లోక మదియే. తర్వాతి యాకులో వేఱొక జాతకము ముపక్రాంత మయ్యెను. పర్యాలోచింపఁ గా- శస్త్ర విద్యే = శస్త్రవైద్యమున (వైద్యము జరగు కాలమున) నజీవతి = చనిపోవును అని యర్దమగుట, అట్టగుటచేతనే జాతకపుఁ బైభాగము లేకుండు  ట తెలియనయ్యెను. అందఱును దైవవంచనకు ఖిన్ను లయిరి. ఇట్టి వానిని ధ్రువనాడీ చమత్కారముల నెన్నింటి నేని పేర్కొన నెఱుఁగుదును.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS