అందు సి. వి. వి. యోగమార్గమునఁ జేరిన వారి జాతకములు పదులకొలఁదిగాఁ జదువుట నే నెఱుఁగుదును. ఆ చదువుట నా సమక్షముననే జరగినది. శ్రీవారి జాతకమునఁగల విషయములే యనేకుల జాతకములం దున్నవి. శ్రీవారి జాతకమును, శిష్యులయు తదితరులయు జాతకములును గొన్నా ళ్ళయిన తర్వాతఁ దప్పిపోవుటయు, మరలఁ జూడఁ గా సరియయినవి దొరకుటయుఁ గూడ నెఱుఁగుదును. శ్రీవా రుండఁ గా నా నాడీ గ్రంధమును శ్రీ వేపా రామేశము గారి దగ్గఱ గొన్ని వందలరూప్యములకుఁ దాకట్టు వెట్టుటయు వారు దానికి ఇండెక్సు వ్రాయుంచుటయు జరగినది. ఆ నాళ్ళలోఁ గ్రొత్తగా జాతకములు చదువుట సాగలేదు. మఱియు నాతఁడా నాడీ గ్రంధమును జదువుచుండిన నాళ్లలో వెల్లడి యయిన జాతకము లనేకము లీ యిండెక్సు చేసిన గ్రంధములలోఁ గాన రాలేదు. వాని నాతఁడు దాఁచియుంచు కొనెనో, చదువునాళ్ళలోనే కల్పించి చదివెనో యని కొందఱు సంశయించిరి. నా నిశ్చయ మాతఁడు కల్పింపను గాని, దాచి యుంచుకొనను గాని నేరనివాఁడే యని.
భుజండనాడి
శ్రీవారుండగానే, ధ్రువనాడి చదువుచుండు నాళ్ళలోనే యీ నాడి బయల్పడెను. ఈ నాడి గల యాతఁడు కుంభకోణ వాస్తవ్యుఁ డే. పట్టునూలి జాతివాఁ వలసినంత ధనము గొని తొలుత శ్రీవారి జాతకము చదివెను. అది చదువునాఁటి కాతనికి తద్గ్రుంధని విధానము స్పష్టముగా నెఱుఁగ రాకే యుండె నఁట! ఆ జాతకము చదువుట వల్ల నాతనికి శ్రీవారియెడ భక్తి ప్రపత్తులేర్పడెను. శిష్యుఁ డయ్యెను. అన్వాహము శ్రీ వారిదో, శిష్యులవో, ఇతరులతో జాతకములు చుదువుట, దానివలని యా యతితో జీవితము గడపుట యాతని కేర్పడెను. ప్రధానముగా శ్రీవారియు,వారి కుంటుంబము వారియు,శిష్యులయు, వారి కుటుంబముల వారియు జాతకములు చదువుటలో నాతనికి తీరిక లేకుండెను.
కొలఁది దినములలో శ్రీవారు శరీరము విడుతురనఁగా నాతని ప్రశ్నించిరి.' ఉన్నది యున్నట్టే వ్రాయుట, చదువుట జరుపుచున్నావా? కల్పనలు సాగించుచున్నావా? అని. ఆనాఁడే ఆతఁడొక కల్పనము చేసెనఁట! శ్రీవారి ముఖ్యశిష్యులలో 'అంబష్టుఁ' డొకఁ డుండెను అనుటకు ' అమ్మట నొరువ౯' అని యుండగా నాడి కాపి వ్రాయుచున్న వాడు గోపీనాధ రా వను శ్రీవారి శిశ్యుఁ డే నాడి కారునివంటి వాఁడే వాక్సహయము చేయఁగా ' పండిత నొరువ ౯ ' అని మార్చి వ్రాసెనఁట! దక్షిణదేశమున ' అంబష్టుని' పండితుఁడనుట పరిపాటి- గడగడలాడుచు దీని నాతఁడు శ్రీవారి నివేదించెను. ఎప్పుడుగాని యిట్లు మార్పవల దని శ్రీవారు శాసించిరి. కడకు శిష్యగోష్ఠిలో నీ విషయమును దెలిపి ఇదివఱకు వ్రాసిన భాగమున నిం కే మేని మార్పులు చేసినాఁ డేమో పరిశీలిం పవలసియున్నది యని దాని కాపి లెవరెవరు వ్రాసిరో, వారివారి కపీలతో నందఱను, మూలముతో నాడి కారుని రమ్మనిరి. ఎవ్వరు నేమి కల్పనము జరపిరో యెఱుఁగరు గాన తమ నిర్దుష్టతను నిరూపించుకొనుట కందఱు వచ్చిన తర్వాత మూలమును, కాపిలను వశపఱచుకొని కట్టికట్టి యట్టుమిఁద దాచి వైచిరి.ఇక నాడీ చదువవల దనిరి.
"వ్రాయసగాఁ డేమేని మార్పు చేయవచ్చును. మాతృక వ్రాసిన వాఁడే యెఱుక చాలక యేమేని తప్పు వ్రాసియుండ వచ్చును. గ్రంధ కారుఁడే యజ్ఞఁ డై తప్పిదపు రచనము చేసియుండవచ్చును.దానికి పరమప్రామాణ్యము కల్పించుకొని మిరు చదువ రాదు. నాదగ్గఱకు మిరు వచ్చి శిష్యులగుట నాడి మూలమునఁ గాదు. నాడిఁ జూచుట మిరు నా శిష్యులయినతర్వాత నే. ఏ కారణములతో మిరు నాశిష్యులయితిరో ఆ కారణములతోనే నన్నను వర్తింపుఁడు. నా మాటలు స్వతఃప్రమాణములు గాని పరతః ప్రమాణములు గావు. నన్ను, నా కార్యములను నాడి ననుసరించి విశ్వసింపవలదు" అనిరి.


