తద్గృంధక ర్తల నాఁటి కీ విషయములు భవిష్యద్విషయములే యయినను నా గ్రంధములలో నాయా భాగములఁ జదివి వెళ్ళడించి నంతవఱకు భూతమును, దరు వాతిది భవిష్య త్తును నగుట గాన వచ్చును. ఆయా గ్రంధములు చదివిన నాఁటి దాఁక విషయములు జాతకునకు చక్క సరిపడునవిగా నంత దాఁక తు. చ తప్పకుండ జరిగినవిగా నుండుటచే దానిని బట్టి తర్వాతి గ్రంధబాగమును విశ్వసించి జాతకుఁడు గయికొనును. తర్వాత నదితప్పిపో నారంభించును. క్రమముగా నన్ని విషయములు విస్పష్టముగాఁ దప్పిపోవుచుండును. ధ్రువ నాడిలో నట్లు జాతకము తప్పి పోవునట్లు గుర్తించి యడుగఁగా నపుడు సరిపోయినదిగా నింకొక తాటియాకు దొరకును. అది పూర్వపుటాకు కంటె కొంత హెచ్చు భాగములు సిరిపోయి నదిగా నుండును. కొన్నాళ్ళ కిదియు తప్పి పోవును. ఇట్లు ఆనాడి, తత్పాఠకుఁ డు, జాతకుఁ డు ఉన్నంత దాఁక చదువుచునే యున్నచో జాతకము సరిదిద్దుకొనుచునే యుండ వచ్చును. కాని రే పిట్లు జరగఁ గల దని సునిశ్చితముగా నే నాది గ్రంధము గాని చెప్పుట నే నెఱుఁగను. ప్రత్యుత తద్విరుద్ధముగా జరగుటయు నెఱుఁగుదును.
పర్యాలోచించి చూడఁగా నొక్కొకప్పుడా గ్రంధ మాయా వేళకు కనుకూలముగా నిర్మిత మగుచుండు నేమోయని తోఁచును. ధ్రువనాడిలో జాతకము తప్పినపు డెల్ల క్రొత్త జాతకము దొరకు చుండుట యిట్టిదే . కాన యా నాడి నుపయోగించు గ్రంధ స్వామి దానిని సృష్టించుచుండెనని కొంద ఱందురు. నాడి తప్పునప్పు డెల్లఁ దద్గ్రం స్వామిని కొందఱు తస్కరుఁడు, తప్పుడు సృష్టి చేసె నని నిందించు చుందురు. దానిని జదివినందు కాతఁడు కొంత సొమ్ముగయి కొనుచున్నాఁడు గాన యక్రమముగాఁ నాతఁ డా నిందకు బాల్పడ వలసి వచ్చుచుండును. అంతేకాని నిజముగా నా గ్రంధ స్వామి దానిని సృష్టింపఁ జాలఁ డగుట నేను బాఠముగా నెఱుఁగుదును. ఆతని దృష్టి కా యక్షరము లట్లు కానవచ్చె నని కాని యాతని తల కట్లు శ్లోకపరంపర తోఁ చె నని కాని వాకొనుట యుక్తము.
ధ్రువనాడీస్వామియగుశేషాచార్యునివిషయముననీయర్ధముయధార్ధము. అస్మదాదుల మనేకుల మా గ్రంధమున నుండి యా నాఁడు జాతకముల వ్రాయించు కొంటిమి. అబ్బురము చెందుచు ముత్రు లనేకులకు జాతకములు వ్రాయించితిమి. వ్రాయు నప్పుడు విడువకుండ సన్నిధినే యుంటిని. ఇంత యేల? అస్మదాచార్యపాదాల జాతకము నందుండి పఠించునపుడు, వ్రాయించునపుడును నేను సన్నిధినే యుంటిని. ఇంకను గొందఱు మిత్రులుండిరి. ఆ గ్రంధము గల శేషాచార్యుఁడు శ్రీ వారియెడ నప్పు డద్బుతభక్తి గల శిష్యుఁడు వారి జాతకము నంతవఱకు రాక్ష రాక్షరము సత్యముగా నుండెను.
అందులో నాకు విడ్డూరము గొల్పిన విషయములు గొన్ని యున్నవి.
" బ్రహ్మస్వరూపో భగవాన్ దర్శనం చక్వచిత్ క్వచిత్
ఆసర్శనం క్వచిచ్చేతి తత శ్చంచలబుద్దిమాన్ "
అని నల్వదవయేటి వృత్తంతము వర్ణిత మయి యుండెను. ఇది చదువుచో నేను దగ్గఱ నుంటిని. ప్రతి పదము ప్రామాణిక మగునో కాదో యని శ్రీ వారు పరీక్షించు చుండిరి. ఈ శ్లోకము చదువునపుడు కొంత యాగి యోచించి నవ్వి 'సరిగా వాక్రుచ్చినాఁడు. మిఁద చదువుఁ డు' అనిరి.
అప్పుడీ శ్లోకమున కర్ధ మేమో బ్రహ్మదర్శనము లభించుట యనఁగా నెట్టిదో, అప్పుడే మి జరిగినదో వివరించి తెలుప వేఁడెద నని చివరిదాఁక ప్రశ్నము సాగును గాని నాలుక దాఁటి బైటికి రాదయ్యెను. ప్రశ్నింప వలె నని చాల తంటాల పడితిని గాని ప్రశ్నింప నా చేతఁ గాలేదు.' జీర్ణ మంగే సుభాషితమ్' అన్నట్టుగా నీ ప్రశ్నార్ధము నా లోనే నిలిచి పోయినది గాని పయికి రానే లేదు. నేనీ యోగ మార్గమున చేరిన పదియేండ్లకు అనఁగా 1926- వ సంవత్సరమున నా యను భవమున నొక యద్భుతానంద మయ విషయము జరగెను. దాని నెఱుగుదునంతేకాన1936 దాఁక అనఁగా మఱి పదియేండ్లదాఁకఁ గాని దాని వివరణ మెల్ల తెలియరాదయ్యెను. దానినాయాసందర్భము లందు వివరింతును.
