Previous Page Next Page 
ప్రజ్ఞాప్రభాకారము పేజి 56

                                         3౦
 
                                              నాడీగ్రంధములు

    తంజావూరిలో పరిశీలించిన గ్రంధముల విషయమున జరపవలసిన తర్వాతి కార్యములను జరపుటకు మద్రాసులో మేము గొంత పని చేయవలసియుండుటచే మూఁడు నాల్గు నెలలు మేము మద్రాసులో నే యుంటిమి. అప్పుడు మద్రాసు గవర్నరుగా పెంట్లండు దొరగా రుండిరి. ఆయన నెవరో ఇంగ్లండు వారో, జర్మనీవారో ప్రేరేచి రఁట!' తంజావూరి విలువ కట్టుటకు గ్రంధముల పరిశీలనము జరుప వలసెను. మమ్మందుకు తంజావూరు పంపిరి.

    ఈ రహస్యము పైకి పొక్కినది. ప్రజలు గందర గోళము చేసిరి.గవర్నరుగారు తమ తంత్రము కట్టిపెట్టిరి. ఒక విధముగా మే మక్కడికి వెళ్ళి జరపిన పరిశీలనము వ్యర్ధమయినది. కాని యానాఁడు మేము వ్రాసిన విమర్శములు గొన్ని యటుతర్వాత తంజావూరి కేటలాగులు ప్రకటించువా రుపయోగించుకొనిరి. మేము విలువ కట్టుటకే వలయు నంశములను బ్రధానముగాగూర్చితిమి. కాని గ్రంధాంశపర్యాలోచానకుఁ గాదు. కాన మా లిస్టులలో ఆ యావిషయములు పర్వాప్తముగా సేకరింప లేదు గాని పుస్తకముల నన్నింటిని సరిగా గుర్తించితిమి గణించితిమి. గవర్నరు గారిపనివ్యర్ధమయిన తర్వాత మా లిస్టులనన్నింటిని తంజావూరి లైబ్రరీ కిచ్చి వేసితిమి. ఆలెక్కకట్టుపనిలోనేనుమద్రాసులో నుండి ఆరోగ్య విషయమున గ్రంధపరిశీలన విషయమున, యోగసాధన విషయమునఁ జాల నభ్యు దయము చెందితిని. ప్రతి దినము నేను మిత్రులతోఁ గలసి యోగా భ్యాసము చేయుచుంటిని.

    ఆ నాళ్ళలో ధ్రువనాడీ పరిశోధన మధికముగా జరగెను. అందు శ్రీవారి జాతకము పరిశీలించుట జరగెను. ఇంక  ననేక  మిత్రుల  జాతకము పరిశీలనము జరగెను. ఆ యుత్సాహమున నా జాతకమును బరిశీలింపించుకొంటిని. ద్రువనాడీ సత్యాచార్య ప్రణీత మని యం దున్నది. సత్యా చార్యుఁ డు పంచ సిద్ధాంతి కాది గ్రంధకర్త యనియు, క్రీ. 4- వ శతాబ్ది వాఁడనియు యిందలి భాషా శైలీ లక్షణదులను జూడఁగా నది సత్య మనిపించదు.

    ఈ నాడీగ్రంధములు సంస్కృత ద్రవిడ భాషలలో నరవ దేశముననే యధికముగాఁ గలవు. ఆంధ్రదేశమునఁ గూడ నాంధ్ర భాషలో వేముల వాడ భీమన రచితముగా నొక నాడీ గ్రంధ మున్నది. కాని యది సీసమాలికగా వేములవాడ భీమకవి రచన మని విశ్వసింపఁ దగనిదిగానే యున్నది. దానిని ప్రాచ్య లిఖిత పుస్తకశాలకు నేనే సేకరించితిని. అది ప్రస్తుత కాలమున నుపయోగపడునది కాదు.ఇక సంస్కృత ద్రవిడ గ్రంధములలో ధ్రువ నాడీ యని, సత్యసంహిత యని, శుక్ర నాడీయని నాల్గు గ్రంధముల నే నెఱుఁగుదును. అవి యెవరో ప్రాచీన మహర్షులు, తత్కల్పులు రచించినవిగా నున్నవి. ధ్రువనాడీ సత్యసంహితలు సత్యాచార్యు రచన లనఁ గా నేనే మనుకొంటి ననఁగా సత్యాచార్యుని యంశమున నిటీవల జనించినవా రెవరో పూర్వానుస్మృతి కలిగి వానిని రచించి యుందు రని.

    ఇక్కడ వక్తవ్యము చాలఁ గలదు. ఈతఁడు శివాంశమున జనించినాఁ డనీ (అప్పయ దీక్షితాదులు), ఈతఁడు గుడిగంట యంశమున జన్మించి (వేదాంత దేశికులు ) నాఁడనీ  యిత్యాది విధములఁ బలువురను ప్రాచీన మహనీయులను గూర్చి ప్రామాణికులే నిర్ణయించి పలుకు  చుండుట కలదు. ఆయా దేవతల ఖండావతారములుగా వారిని నిర్ణయించుట సంగతము. ఆయా మహామహులు లోకమున నేవేవో యపూర్వాద్భు తార్ధములను వెలయించుటకై యవతరించుట కలదు. దేశ కాలాదుల యసౌకర్యముబట్టి యాయా కార్యములను వా రప్పుడప్పుడే యాయా యవతారములలోనే నిర్వర్తింప వీలుకడక పోవచ్చును. శుద్ధసంకల్పులు గనుక వారు వా రాయా కార్యములను గొన్ని జన్మముల నెత్తి నిర్విర్తింప వలసిన వారగుచుందురు. శంకర, జిన, బుద్దాదుల కార్యములట్లే యొక జన్మమున నిర్వాహము చెంద వయ్యెను.

    అతి ప్రాచీనులయి జ్యోతిషమున నద్భుత గ్రంధములు రచించిన సత్యాచార్యాదులు  మరల మరల జన్మించుచు లోక వృత్తమును గొన్ని కొన్ని షష్టులకు రచించుచు వచ్చుచుండి రని నా విశ్వాసము. తర్వాతి తర్వాతి జన్మములవారి వారి గ్రంధములకే నాడీ గ్రంధము లని పేరు. అవి కొన్ని కొన్ని షష్టులకే రచితము లయి యుండు ననియు నావిశ్వాసము. వారువారాయాజన్మములలో జ్యౌతిష ప్రజ్ఞ కే పారమార్ధ్యము గల్పించుకొనుటచే భాషాపాండిత్యమునకై యంతగాప్రాకులాడ రయిరి. వారి గ్రంధముల లోనిభాషనిర్దుష్టముగాదు. ప్రౌఢములుగాలేకపోలేదు. రుచిగల, యరద విశేషముల గల జాతక భాగములఁ జెప్పుచో శ్లేషాద్యలంకారములతో  నతి రసవంతమగు భాషతో నాయా గ్రంధ భాగము లున్నవి. అందు శబ్దజాలము క్రొత్తగా నేఁడు పుట్టుచున్నను మనుష్యులను  గూర్చి వారి వర్తనముల గూర్చి పేళ్ళ గూర్చి కూడ నండును. ఈ నాఁడు క్రొత్త వెలసిన, వెలయు చున్న రేడియో, రేడియం, ఎక్సురే, కాస్మిక్రే, ఆటంబాంబు మొదలగు వానిని గూర్చి కూడ నందుం డును.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS