Previous Page Next Page 
ప్రజ్ఞాప్రభాకారము పేజి 55

    ' మి దివ్యానుగ్రహమున నే నారోగ్యవంతుఁ డ నయితిని. నా కీయోగమార్గమున ధన్యత చేకూరును.నాకు శరీర మొసఁగిన మాతల్లి దండ్రులు వృద్ధులు. ఎప్పు డేమిజరుగునో? వారికి మిశిష్య తన నుగ్రహింప వేఁడుచున్నాను. వారిక్కడికి రాఁజాలరు' అంటిని.' వారివయసెంత' యనిరి.' మాతండ్రి గారి వయసు డెబ్బది దాటినది'యంటిని.' అంత వార్ధకమున నున్న వారినిగూర్చి యనుతపింతువే? చిరకాలము నీతో జీవితము గడపవలసిన నీభార్యను గూర్చి యడుగ వేమి' యనిరి.' చిన్న వయస్సులో నున్న యీయువిద నాతో నెప్పుడు పట్టిన నప్పుడు మి దర్శనమునకు రాఁ గల్గును. కాన యెప్పుడయిన మి శిష్యతానుగ్రహమున కర్హురాలు కాఁగలదు. చాల వార్ధకమున నున్నవారని,ఎప్పు డేమగునో అని, వా రీశరీరముతో నే మి శిష్యత  పడయవలె నని నాయాశ' యంటిని.' సరే కాని నేఁడు ఎనిమిది గంటలకు నీ భార్యకు ఇ౯ సియేష  ౯ జరుగును. అందుకు వలయు సన్నాహములు జరపుము, అందుకై నీ వేమియు వస్తువులు తీసికొని రా నక్కఱ లేదు. రాధాకృష్ణనితోను, మహాదేవయ్యరుతోను, చెప్పి ఫారము వగైరాలు ఫిలప్పు చేయించుము ' అని శయ్య వీడి లోని కరిగిరి.

    నే నడిగిన దాని ననుగ్రహించినట్లు త్తర మియాక యర్ధింపవలసిన దే అయినను అప్పు దర్ధింపని దాని ననుగ్రహించుట జరిగెను గదా యని వింత చెందుచు నేనును వెలికి వచ్చి కాల కృత్యములు నిర్వర్తించుకొని, యంతలోనే యోగశాలకు విచ్చేసిన మిత్రు లిర్వురకు శ్రీవారి యాజ్ఞను దెలిపితిని. వారు నవ్విరి. ఎనిమిది గంటలకు సర్వము సిద్ధమయ్యెను. నాఁడు శ్రీవారియింట వారి యారోగ్యమును గూర్చి శ్రీవారు తీవ్ర ప్రజ్ఞతో నుండిరి. ఎనిమిది గంటలకు ఇ౯సి యేష౯ జరగినది.

    మాతృశ్రీగారు యోగ సాధనోపక్రమమునకు ముందు ఇడ్డనలు, కాఫీ, ఆహారము తిసికొనుటకై తచ్చి దగ్గఱ నుంచిరి. అది తెలియక యీక్రొత్త యువిద యాభ్యాసవిధానము నారంభించెను. అయుదునిమిషములలో శరీర మెల్ల కొయ్యబాఱి కదల మెదల వీలు లేకుండ బిగిసి కొని పోయెను. దగ్గఱకు వచ్చి సచ్చిదానందస్వాములవా రాస్థితిని జూచి పిలిచిరి. కనులు తెఱవఁజాల  దయ్యెను. వారు మాతృ శ్రీగారిని లుచుకొనివచ్చిరి.చూడఁగా నా హరపదార్ధములుంచినవి యుంచినట్లే యుండెను. వెంటనే లేపి, ఒడలు పిసికి, యెఱుక తెచ్చి యాహారము గొనిపించిరి. మూఁడునా ల్గిడ్డెనలు, చెంబెడుమంచినీరు, కాఫీ త్రాగి, శక్తి రాఁగా మరల యోగ సాధనముల సాగింపించిరి. పావు గంటసేపు ప్రబలముగా సాధన జరిగెను. అంత తివ్రయే నాఁ డుండుటకు కారణము శ్రీవారి యానాఁటి  ప్రజ్ఞతీవ్రతయే యగుట నక్కడి వారు తెల్పిరి. నాఁడు మహోత్సాహముతో దంపతుల ముంటిమి.

    ఆసాయంకాలమే నేను మద్రాసు వెళ్ళవలెను. నా కోర్కి తీరలేదు. మరల శ్రీవారి దర్శించి నా కోర్కి- మా తలి దండ్రుల విషయమును ప్రశ్నించితిని. శ్రీవారు శరీరములను జిరకాలము రక్షింప ననువు పడదు. అయినను నీవు వెంటాడు చున్నావు గాన చెప్పుచున్నావు.' నీవు యోగ సిద్ధుఁ వై తేని-' దశపూర్వేషాం దశపరేషాం-మివంశ్యులకు నీ యోగవాసన లంటి వారు కడతేరఁ గలరు. పది సంవత్సరములు విడువక నాయాదేశము చొప్పున యోగా భ్యాసము చేయవలెను. అన్నివాంఛితములను నీవే నెఱవేర్చుకొనఁగల్గుదువు. ఇప్పటికి మి తల్లిదండ్రులు లక్కడనే ఉండియీనాయుప దేశించు విధానము నాచరింతురుగాక' అని తద్విధానము తెల్పిరి. నే నెంతో ఉప్పొంగితిని.

    కాని యానాఁడు తెల తెలవాఱునపుడు వారిని దర్సించి నప్పుడు భాషించిన తెఱఁ  గునకు, నే నొక్క దాని నడుగఁగా దానికి బదులు ననుగ్రహింపక యనన్వితముగా జరపిన సందర్భమునకు, మధ్యాహ్నము మరల వెంటాడి ముర్ఖతతో ప్రశ్నింపఁగా చూచినచూడ్కికి, చెప్పిన బదులుకు నే కాన్వయమును మఱి పదేండ్లకు గాని నేను గుర్తింప యోగ్యత గల వాఁడ గాఁజాల నయితిని. పదమూఁడేండ్లకు కద్భుతాముగా తద్రహస్య మెల్ల ననుభూతి పూర్వకముగా గోచరించెను. అది యాసందర్భము వచ్చినప్పుడు వివరింపఁ గలను.

    కుంభకోణముణ నుండి యే మా తల్లిదండ్రులకు శ్రీవారు యా దేశమును వ్రాసితిని. శ్రీవారిసన్నిధిని మాదంపతుల కెట్టి యనుభూతులు జరగినచో సుదూర దేశమున నున్నను మా తల్లిదండ్రులకు నట్టియనుభూతులు జరిగినవి. తర్వాత వారు మద్రాసుకు నా కాయా విషయముల తెలిపిరి. నాఁడు రాత్రి మెయిలులో దంపతులము మేము మద్రాసు వచ్చి వేసితిమి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS