1916 క్రిస్ మస్ సెలవులు వచ్చినవి.నేనా సెలవు రోజులలో కుంభకోణముననే శ్రీవారి సన్నిధి నుంటిని. 30 తేది దాఁక నాకు జ్వరమే. 31 వ తేది నాకు విరేచనము లెడ తెగ కుండ కాఁజొచ్చినవి. నల్వది యేఁ బది తూరులయ్యెను. సగ్గుబియ్యపు జావను మిత్రులు మహ దేవయ్య గారు తెచ్చి యిచ్చిరి. త్రాగితిని గాని కదల శక్తి లేదు. నాఁ డుదాయము నేను వెళ్ళి తీర వలెను. శ్రీవారి కీ యసం దుర్భము తెలిసెను. రామ చంద్రయ్యరుగారు అనుముఖ్య శిష్యునిఁ బిలిచి ప్రభాకరునికి విగర్సప్లైయగుటకుట్రీట్చేయమనిరి.ఆతఁడు పండుకొన్న నేను లేచి కూర్చుండి, కూర్చున్న నేను లేచి, లేచిన నే నిటుదిరిగి, తిరిగిననేనుపర్వెత్తఁగలిగియుత్సాహశక్తిపూరితుఁడనయితిని. కొంత పర్వాతోనే నే వెళ్ళి శ్రీవారి పాదములు వ్రాసితిని. రైలు వేళగుచున్నది గాన వెంటనే స్టేషనుకు పోమ్మనిరి,' ఇఁక నుండి యానరోగ్య ముండదు. వారము వారము రా నక్కఱ లేదు. రెండు రోజులు సెలవు కలసి వచ్చిన రమ్ము, పగలు హాయిగా భోజనము చేయుము. ఉదయము, మధ్యాహ్నము లఘ్వహరము గొనుము. జీర్ణ శక్తి సరిగా నుండును. లివరు సరిపడినది. రాత్రిపూట మజ్జిగ కాక పోసికొని భుజింపుము' అనిరి. తంజావూరికి వచ్చి వేసితిని.
తదాది జ్వరము లేదు. జీర్ణ శక్తి చక్క బడినది. ఆకలి యన్నది నాఁట నుండి ససిగా తెలియ వచ్చెను. దినదిన క్రమాభివృద్ధిగా నారోగ్యము కలుగఁ జొచ్చెను. ఆనాళ్ళ నుండి నాకు అనారోగ్యవ్యధ తొలఁగి వింతవింత యను భూతులు కలుగఁ జొచ్చెను. ఒక నాఁ డుదయము రొట్టెపాలు (కాఫియాల వాటు ముప్పది యై దేండ్ల వయసు తర్వాత నే) తీసికొని ప్రాతరుపాసనము జరపుకొని ఆఫీసుకు వెళ్ళితిని. తంజావూరి లైబ్రరీ ఉదయము 8 గంటలనుండి సాయంకాల మయిదు గంటల దాఁక) అప్పుడు ప్రాతఃకాలముననే కొన్ని నియమితసనయములలో సాయంకాలము దాఁక నభ్యాసము లుండెడివి.
పదిగంటల వేళ నభ్యాసము జరపుకొని టేబిలు దగ్గఱ గ్రంధ పరిశీలనము జరుపు చుండఁ గా నా మూలాదారమున నుండి ప్రబలముగా పిచి కారితో కొట్టి నట్టు ప్రజ్ఞా బలధారాలు రేగఁ జిచ్చినవి. ఉత్సాహ నందములు పొంగి పొరలి శరీర మెల్ల వ్యాపింపఁ జొచ్చినవి. ఆధారాలు తలలో నికిఁ బోయినవి అప్పటి నా యాహ్లాదము చెప్పఁ దరము కానిది.లోపల చిచ్చుబుడి వెలిఁ గించి దాని పై పలుచని కుండ మూసినట్లు తల యూగులాడఁ జొచ్చినది. లోపల నేవో మెఱుఁగు రేకలు తిరుగఁ జొచ్చినవి. అప్పుడు పని కట్టిపెట్టి వినోదింపఁ దొడగితిని.పదినిమిషము లట్లుండెను. నా స్థితి యానంద తాండవ మాడు చున్నట్లయ్యెను. నెమ్మదిగా నది వశంగత మయ్యెను. నా యొడ లానంద మయ మయ్యెను. కొలఁది దినములకే ఆ లైబ్రరి పనిని వడిగా ముగించి వేసితిని.
* * *
౨౯
ఇల్లాలి యినిసియేష ౯
మద్రాసు పయనము. నే నింటిసామాన్లు నన్నింటిని రైలులో మద్రాసు పంపి సకుటుంబముగా తంజావూరి నుండి కుంభకోణమునకు వచ్చి నాయరోగ్యాది విషయములను శ్రీ వారి కెఱింగించితిని.
నాఁడు సాయంకాలపు యోగాభ్యాసము ముగిసిన తర్వాత నన్నుఁబిలిచి శ్రీవారు' నీ వీరాత్రి నేను సదా వర్తిల్లు చుండు యోగాలయపు గదిలో, నేను విశ్రమించు బల్ల మిఁదనీ భార్యతో శ యనించుము. నే నిప్పుడు ఇంటనే శయ నించు చుంటిని' అనిరి. నేను గడగడలాడి సిగ్గుతో అంగీకార సూచకముగా తల వాంచితిని. కాని నాకు తర్వాత చాల వెఱపు గల్గెను. అది గురు దేవులు శయనించుగది. అందు వారు విశ్రాంతి గొనుబల్ల! అందు నేను శయనంచుటా? అందును సద్వితియముగా! అని వణకితిని. ఈయాజ్ఞ నాలోనే జిర్ణించెను. వారితోనే భోజనము చేసితిని. వారి యింటిలోని యాడువా రందఱు మిత్రులతో వీధియరుగుమిఁద శయనించితి. రేయెల్ల శ్రీవారి యాజ్ఞను గూర్చి పర్యాలోచనమే! ఉదయము తెలతెలవాఱుచుండఁ గా తలుపులు తెఱచిన తోడనే లోని కరిగితిని.
శ్రీవారు ఇంటిలో విశాలమయిన మండువానిలో చంద్ర నక్షత్రాదులు నీలాకాశము గోచరించుచుండఁ గా చల్లని గాలి విచుచుండఁ గా, నొక గోల్డు మెడల్ మడత మంచము మిఁద పలుచని పడుక మిఁదను, క్రిందను చల్లినమల్లెపూవు లున్నవి. పట్టుతలగడ గలదు. తెల్లని పలుచనిపట్టు సెల్లా కప్పుకొని యుండిరి. మంచమునకు దోమ తెరక ప్పుండెను. అదను ప్రతీక్షించుచు వారు కనులు దెఱచి లేవ నుంకించునంతలో నేను చేర నరిగి పాదములు స్పృశించి నమస్కరించి తిని.' రాత్రి యెక్కడ శయనించితి' వని యడిగిరి. ఇంటిలో స్ర్తీలతో స్ర్తీయు, వాకిటియరుగు మిఁద నేనును శయనించుట తెల్పితిని. చప్పరంచి ' నా మాట పాటింపక పోతివి గదా' యనిరి. సిగ్గుతో తల వాంచితిని.' సరే! కానిలే! ఏమి విశేషము ' అనిరి.
