Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 54

అక్కడికి బైనాక్యూలర్స్ లేన్సేస్  లోంచి వ్యాన్ డ్రైవింగ్ సీట్ నుండి క్రిందకి దిగిన షాషా కనిపించాడు.
షాషాని చూసిన వెంటనే ఇస్మాయిల్ గుండే లయతప్పి కొట్టుకోసాగింది.
మొదట ఇస్మాయిల్ ఇంద్రమిత్రని చంపటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగుతాడనుకున్నాడు.
కానీ __
కిరాయి హంతుకలను ఏర్పాటు చేస్తాడని ఇస్మాయిల్ ఏమాత్రం వూహించలేదు.
నేరప్రపంచంలోకి షాషా, ఇక్బాల్ లకు 'కిల్లర్స్ బ్రదర్స్' అనే నిక్ నేం వుంది.
వాళ్ళిద్దరూ కరుడుగట్టిన హంతుకులు.
ఒక్కసారిగనుక వాళ్ళ కిల్లింగ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే' తమ పని పూర్తయ్యేంతవరకూ వదలిపెట్టరు.
ఇంద్రమిత్ర అత్యంత దారుణమైన ప్రమాదంలో ఇరుక్కున్నాడనే విషయం ఇస్మాయిల్ కి అర్ధమైంది.
   
                    *    *    *    *   
మారుతీ వ్యాన్ రివ్యూ సీట్లో కూర్చునివున్న ఇక్బాల్ బై నాక్యూలార్స్ లోంచి గోల్డెన్ రిస్టార్స్ మొత్తం ప్రదేశం క్లుప్తంగా పరిశీలించాడు.
అవిదాదాపు ఏభై కాటేజేస్.
50 వ నెంబరు టో కాటేజ్ ప్రారంభం అవుతుంది.
సరిగ్గా మొదటినుంచి 19 వ కాటేజీ ఇంద్రమిత్ర  పేర్నబుక్ అయింది.
ఇంద్రమిత్ర కాటేజ్ కి వెనుకవైపుమరో వరుస కాటేజ్ లు వున్నాయి.
రెండు వరసలకూ మధ్య పాతిక అడుగుల వెడల్పున రోడ్డు.
ఓవైపు స్విమ్మీంగ్ పూల్!
మరోవైపు ప్రకృతి చికిత్సాలయం.
ఇంకోవైపు స్టీమ్ బాత్ నెంబర్.
దానిప్రక్కన కేఫేటోరియా......
ప్రతిప్రదేశాన్నీ , దాని పరిసర ప్రాంతాలకూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఇక్భాల్_
రిస్టార్స్ వెనుకవైపు కి దృష్టిని సారించాడు.
రిస్టార్స్ కి వచ్చినవాళ్ళు సరదాగా వెనుకవైపున వున్న అడవిలాంటిప్రదేశంలోకి వెళ్ళవచ్చుననే ఊహ అతడిని అటువైపు దృష్టి సారింపచేసింది.
దాదాపు పావుగంట తర్వాత అతడి కృషి ఫలించింది.
అడ్డదిడ్డంగా అల్లుకున్న కొమ్మల్లోంచి అతడికి యిద్దరు మనుషులు కనిపించారు.
వాళ్ళు __
ఇంద్రమిత్ర ....
గ్రీష్మ.....
అతడు ఇంద్రమిత్రే అని కన్ ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్పాడు ఇక్బాల్_
"వాడు వెనక వైపు అడవిలో వున్నాడు. వడి వెంట వడి గర్ల్ ప్రెండ్ కూడా వుంది.
ఇక్కడ్నుంచి రేంజ్ సరిపోదు. ఇంకాస్తా దిగువకు వెళదాం."
ఇక్బాల్ తల వూపి వ్యాన్ ముందుకు పోనిచ్చాడు.  
                        *    *    *    *
పది నిమిషాల తర్వాత-
గ్రీష్మ వైపు కెమేరా ఎయిమ్ చేస్తున్నా ఇంద్రమిత్రకు ఎబి అడుగుల దూరంలో_
ఏపుగా పెరిగిన అడవి మొక్కలమధ్య నక్కి కూర్చున్నాడు ఇక్బాల్.
దూరంగా రోడ్డుమీద పార్క్ చేసిన వ్యాన్ లో కూర్చుని  ఇక్బాల్ కోసం ఎదురుచూస్తున్నాడు పాషా.
అప్పటికి ఇక్బాల్ అడవిలోకి వెళ్ళి యిరవై నిమిషాలయింది.
పాషా అసహనంగా నోట్లో వెలుగుతున్నా సిగరెట నేలకు విసిరి కొట్టి ఇక్బాల్ వైపు అడుగులు వ్శాడు.  
                                                 *    *    *    *   
గ్రీష్మ తనను ఎక్స్ పోజ్ చేస్తున్నా ఇంద్రమిత్ర వైపు చూసి మనసు లోనే నవ్వుకుంది.
ఆమెకి తెలుసు ఇంద్రమిత్ర తనంటేపడిచస్తాడని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS