Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 53

దాని మీద వేదప్లాటి కలర్స్ గల జర్కిన్ తొడుక్కున్నాడు. నుదుటి మీదికి లాక్కున్న ఫెల్ట్ హ్యాట, పైకి లేచిన జర్కిన్ కాలర్స్ అతడు ముఖం కనపడకుండా మరుగుపరిచాయి.
జర్కిన్ మనిషి పేరు ఇక్బాల్.
ప్రోఫేషనల్ కిల్లర్.
డ్రయివింగ్ సీట్ లో కూర్చున్నా వ్యక్తి పాషా.
ఇద్దరూ అన్నా దమ్ములు.
పాషా కంటే ఇక్బాల్ రెండేళ్ళు పెద్ద.
మొదట్లో ఇక్బాల్ సింగల్ హాండేడగా కిల్లింగ్ ఆపరేషన్స్  చేపెట్టేవాడు.
తర్వాత పాషా అతడితో చేతులు కలిపాడు.
ఇద్దరూ తమ ఆపరేషన్ పూర్తీ అయ్యాక వాళ్ళు ప్రతిఫలాన్ని ఫిప్టీ ఫిఫ్టీ చేసుకుంటారు.
వ్యాన్ ఆగిన తర్వత రెండు నిమిషాలసేపు ఇక్బాల్ ఎదురుగా కనిపిస్తున్నా కాటేజ్ వైపు చూస్తూ కూర్చున్నాడు.
తర్వత తనకు ఎదురుగా వున్న చెక్కపెట్టె ఓపెన్ చేశాడు.
దాన్లోంచి బయటకి తీశాడు పవర్ పూల్ బైనాక్యూలర్స్.
బైనాక్యూలర్స్ కంటిముందు పెట్టుకుని చూశాడు.
అతడికి రిస్తార్స్ దగ్గరగా కనబడుతున్నాయి.
ఇక్బాల్ ఓసారి తనకు వచ్చిన ఇన్ ఫర్ మేషన్ మననం చేసుకున్నాడు.
ఇంద్రమిత్ర బుక్ చేసుకున్న కాటేజ్ నెంబర్ అరవైమూడు.
కాని ఇపుడు అరవై మూడో నెంబర్ కాటేజ్ క్లోజ్ చెఇ వుండి. విండో కర్తెన్స్ వెనక ఏమయిఉనా కదలికలు కనబడుతయా అని ఎదురుచూశాడు.
లోపల ఎవరూ లేరు అనుకున్న తర్వాత డ్రయివింగ్ సీట్ లో కూర్చున్నా పాషాతో చెప్పాడు.
"వాడు లేడు. వ్యాన్ ముందుకు కదిలింది.
గోల్డెన్ వ్యాలీ రిస్తార్స్ కి ఎడమవైపున ఎత్తయిన విశాలమయిన మట్టిగుట్ట వుంది.
చిన్నసైజు కొండలాగా వున్న ఆ గుట్ట మీదుగా ఎత్తయిన ఓ మెటల్ రోడ్డు అవతలివైపుకి పోతోంది.
మారుతి వ్యాన్ సరిగ్గా గుట్టమీదికి ఎక్కినా తర్వాత రోడ్డుపక్కగా ఆగింది.
అక్కడ్నుంచి చూస్తే రిస్తార్స్, వాటి చుట్టుప్రక్కల ప్రదేశం, వాటి వెనకవైపున దట్టంగా పెరిగిన అడవిలాంటి తోటా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా అక్కడ్నుంచి ఘాట్ చేసి తప్పించుకోవడం చాలా ఈజీ.
తమనెవరూ గమనించలేదని నిర్దారించుకున్న తర్వాత ఇక్బాల్ వ్యాన్ కుడి వైపు విండో క్రిందకి దించాడు.
కళ్ళముందు బైన్యాక్యూలర్స్ పెట్టుకుని చూడసాగాడు.
అదే సమయంలో__
డ్రైవింగ్ సీట్లో వున్న పాషా క్రిందకి దిగి జేబులోంచి ఇంపోర్డ్ సిగిరెట్ పాకెట్ బయటకితీసి ఓ సిగరెట ని వెలిగించాడు.
అయితే పాషా, ఇక్బాల్ లకు తమను మరొక వ్యక్తి నిశితంగా పరిశీలిస్తున్నడనే విషయం తెలియదు.
వాళ్ళను పరిశేలిస్తున్నా వ్యక్తి ప్రయివేట్ డిటెక్టివ్ ఇస్మాయిల్!
ఇంద్రమిత్రని రిస్తార్ట్స్ కి వెళ్ళమని చెప్పిన ఇస్మాయిల్ అతడిని అనుక్షణం రహస్యంగా వెంటాడుతున్నడ.
ఇంద్రమిత్రని చంపటానికి ఎవరో ప్లాన్ చేశారు.
ఇంద్రమిత్ర తాను వుండే ప్రదేశం గనక చేంజ్ చేస్తే, ఆ వ్యక్తులు అతను వెళ్ళినచోటుకి అతడ్ని చంపటానికి తప్పక వస్తారు.
ఈ విషయం గ్రహించిన ఇస్మాయిల్_
పాషా బ్రదర్స్ రాకముందే అక్కడ తిష్టవేసి అనుమానాస్పరంగా తిరుగుతున్నా వ్యక్తులను గమనించసాగాడు.
ఓ తెలుపురంగు మారుతి వ్యాన్ రిసార్ట్స్ వున్న ప్రదేశానికి రావటం అతడు గమనించాడు.
అయితే___
వ్యాన్ లోని మనుషులు రిసార్ట్స్ లోకి ప్రవేశించకుండా, ఎదురుగా వున్న గుట్టమీదకి రావటంతో_
ఇస్మాయిల్ అనుమానం బలపడింది.
ఇస్మాయిల్ తాను ఎక్కి కూర్చున్నా చింతచెట్టు తాలూకు గుబురైన కొమ్మలను కొంచెం పక్కకి తప్పించాడు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS