Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 52

అదే విధంగా శ్రుంగారయాత్రలోని ప్రేమికుడు అమృతఖండాన్ని స్వంతం చేసుకునేముందు, అతడికి అసలు అమృతం అంతే ఎంతో శాపిమ్ల్ గా రుచిచూపడానికా అన్నట్లు నాభి స్థానం ఇంద్రమిత్రను ధన్యుణ్ణి చేసింది.
ఏదయినా పవిత్రకార్యం పెద్దఎత్తున చేసేటపుడు అందరి దేవుళ్ళకంటే ముందుగా గణపతిని పూజించటం సహజం.
సంప్రద్య బద్దంగా జరిగే వివాహవేడుకలో అసలు పెళ్ళికూతురు దిష్టి తగలకుండా తోడు పెళ్ళి కూతురుని పీతల మెడ కూర్చోపెట్టడం సంప్రదాయం.
నువ్వు చేయబోయే మన్మధ యజ్ఞంలో మొట్టమొదటి ముద్దు నాకే దక్కటం సహజం.
నేను తోటి పెళ్ళికూతురు లాంటిదాన్ని.
మన సంప్రదాయాన్ని మర్చిపోకు అన్నట్లు ఆమె లోతయిన నాభి కంటికి కనిపించని సంకేతకాలు పంపుతున్నట్టు భావిస్తూ ఒకింత సేపు తన దృష్టి అక్కడే ఆపి తనను ధన్యుణ్ణి చేసిన ఆమె సుడులు తిరిగిన లోతైన నాభిని మనస్సులోనే ప్రాణ మిల్లి ఆమె ఏదో అద్బుతం గురించి ఆలోచిస్తూ వుండగా వినపడింది గ్రీష్మ కంఠస్వరం.
"ఏంటి ఆలోచిస్తున్నారు" అంటూ_
ఆ ప్రశ్నకు అతను కంగారుగా చెప్పాడు.
"అదే దాన్నిగురిమ్చే ఆలోచిస్తున్నా."
"దేన్నీ గురించి?"
"మీ యాంగిల్ కొంచెం మార్చితే ఇంకా బావుంటుంది."
అంటూ అతడు ఆమె వైపు కదిలాడు.
ఆమె గద్దరకి వెళ్ళి చాలా సహజంగా ప్రవర్తిస్తున్నట్లు ఆమె నడుం మీద చేతులువేసి ఆమె నడుమును పక్కకు జరిపాడు.
"ఇపుడు ఈ చేతుల్ని ఎక్కడ వుంచేది" అంది గ్రీష్మ.
ఇంద్రమిత్ర ఆమె కుడుచేతిని నడుంమీద వుంచాడు. రెండో చేతికి ఓ పువ్వు అందించాడు.
"జ్కోమ్గు సరిగ్గా వుండేలా చూడండి" అన్నది గ్రీష్మ.
నిజానికి ఆమె గొంగు నేలమీద జీరాడుతోంది.
ఇంద్రమిత్ర దాన్ని ఓ అపురూపమయిన వస్తువుల అందుకుని ఆమె ఎత్తులను కప్పుతూ భుజం మీద పరుస్తుమ్డగా అతడి వెళ్ళ చిచ్వరాలు ఆమెకు తగిలాయి.
ఆ స్పర్శ కు సుడిగాలిలో చిగురుటాకులా ఆమె దేహం కంపించింది.
ఆమె ఒనుకుతున్న కంఠంతో అంది.
"నకు తెల్సు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు."
ఇంద్రమిత్ర గుండె ఒక్కసారి జల్లుమంది.
అతడు ఠక్కున గొంగు వదిలేశాను.
తనకు స్వేచ్చగా వుండడమే ఇష్టం అన్నట్లు ఆమె చీరగొంగు మళ్ళీ నేలమీదకి వాలి పోయింది. అతనికి చెప్పాలో తోచలేదు.
"మీరు ఎదుటి మనిషి మనస్సు చదవగలరు. కానీ మీ మనస్సులో వుండే భావం మాత్రం ఇతరులకు చెప్పలేని పిరికివారు. అవునా?"
అతను మౌనం వహించాడు.
ఎన్ని క్షణాలు గడిచిపోయాయో తెలియదు.
ఆమె సున్నితమయిన పెదవులు తన క్రింద పెదవిని బంధించి నపుడు అతడు ఉలిక్కిపడ్డాడు.
అతడు కదలబోయేలోపు తామరతూండ్లవంటి ఆమె రెండు చేతులూ అతడ్ని బంధించివేశాయి.
అదొక సుదీర్ఘమయిన చుంబనం.
ఇంద్రమిత్ర మెదడులో అనేకవేల ఇంద్రధనుస్సులు సాక్షాత్కరించాయి.
కోటి కోయిలలు కూశాయి.
ఇంద్రమిత్ర గ్రీష్మ మాట్లాడుతున్నా సమయంలో గోల్డెన్ రిస్తార్త్స్ కాటేజ్ ముందువైపున వున్న రోడ్డుమీద ఒక మారుతి వ్యాన్ వచ్చి ఆగింది.
డని విండోస్ కు నలుపు రంగు సం స్కీన్ సిల్క్ అతికించటం వాళ్ళా లోపల వున్న వ్యక్తులు స్పష్టంగా కనిపించటంలేదు.
మారుతి వ్యాన్ ద్రయినిమ్గ్ సీట్ లో ఒక వ్యక్తి కాక మరోకవ్యక్తి పాసింజర్స్ సీట్ లో కూర్చుని వున్నాడు.
నలుపురంగు జీన్స్ ప్యాంటులోకి రౌండ్ నెక్ పుల్ స్లవ్స్ టీ షర్ట్స్ టక్ చేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS