"ఆ అగ్నిపూల వృక్షం వుంది చూశావా_ మానుకు అనుకుని నిలబడతాను ఓ స్నాప్ తీస్తారా?"
ఇంద్రమిత్ర తల ఆడించాడు.
ఆమె వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి, అగ్నిపూలవృక్షం మానుకు అనుకుని నిలబడింది.
ఇంద్రమిత్ర కెమేరా వ్యూఫైండర్ లోంచి ఆమెని చూశాడు.
బ్యాక్ గ్రౌండ్ లో ఎర్రటి పూలమొక్కలు, వాటి మధ్య తెల్లటి చీర కట్టుకున్న గ్రీష్మ, రాశిగా పోసిన కెంపుల మధ్య స్వచ్చమయిన వజ్రంలా కనిపిస్తోంది.
ఇంద్రమిత్ర ఆమెవైపే చూస్తూ లెన్స్ జం చేశాడు.
ఇపుడు గ్రీష్మ ముఖం ఒక్కటే దగ్గరగా కనబడుతోంది. ఇంద్రమిత్ర మరికాస్త జాం చేశాడు.
ఇపుడు ఆమె కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి.
సప్తసముద్రాల్లోని అగాధల్ని తమలో లీనం చేసుకున్నా రెండు నీలి వజ్రంల్లాంటి కళ్ళు.
ఆ కళ్ళు మధ్య ప్రజ్వలించే సూర్యబింబంలాంటి ఎర్రటి కుంకుమ బొట్టు.
ఇంద్రమిత్ర కెమేరా కొంచెం టిల్ట్ చేశాడు.
నిడువయిన కోటేరులాంటి నాసిక.... నాసిక ఎడమవైపున వజ్రపు ముక్కుపుడక....
డానికి దిగువున తేనేపట్టులోని తియ్యదనాన్ని, విరహంలోని వేడినీ, మోహంతో మరిగే రక్తపు ఎరుపుదనాన్ని సంతరించుకున్నా గులాబీ రేకుల్లాంటి రెండు ఎర్రటి పెదవులు అతనికి కనిపించాయి.
వైకుంఠంలో పవళించే విష్ణుమూర్తిని దర్శించేందుకు ఏడు ద్వారాలను దాటి వెళ్ళాలట.
ఏడు ద్వారాలూ దాటినా తర్వాత అసలైన విశ్వరూప సాక్షాత్కారం కనబడుతుందిట.
అలా ఆమె ఒక్కొక్క అవయవం ఒక్కొక్క స్వర్గద్వారంలా ఇంద్రమిత్రకు కనిపించింది.
స్లీవ్ లెస్ జాకెట్ లోవున్న ఆమె కుడిచేతిని పైకినడుం కాస్త పక్కకు వంచి చెట్టుకు అనుకుని నిలబడి, పూవులతో నిండిన చెట్టుకొమ్మని పట్టుకుంది.
ఆ భంగిమలో అతడు నునుపుగా, మృదువుగా వుండి సూర్యకాంతి పడడం వాళ్ళా ప్రతిఫలిస్తున్నా ఆమె బాహూమూలాల్ని దర్శించాడు. ఆ తరువాత చూపు మరికొచెం కిందకి పోనిచ్చాడు.
స్వర్గద్వారాలలో నాలుగో ద్వారం తెరుచుకుంది.
లోనక్ జాకెట్ లోంచి సగం కనిపిస్తున్నా నిండైన స్ఖిరభండాలాంటిఆమె ఎద పొంగులు అతడ్ని ముగ్దుడ్నిచేశాయి.
మేలిమి వజ్రాలను, మతకత మాణిక్యాలను నుమ్డుగా పోసిన లంకే బిందెలను గొలుసులతో బంధించినట్లు తెల్లటి బ్రాలో ఆమె అందాలు నిక్షిప్తమయ్యాయి.
ఇంద్రమిత్రకు తాను ఎక్కడో విన్న విషయం ఒకటి గుర్తుకు వచ్చింది.
అమూల్యమయిన నిధులతో నిండిన లంకే బిందెలు భూమిలో పాతిపెట్టినప్పటికి అవి భూమిలోని దొర్లుకుంటూ తాము చేరవాలిన మనిషి దగ్గరకి చేరుకుంటాయట.
అదే విధంగా గ్రేష్మ కూడా తనకు స్వంతమవుతుందేమో.
అంతలో అతడి ఆలోచనలకు అంతరాయం చెబుతూ. లేత మావి చిగురు కడుపరాతిని, గొంతునిండుగా తేనే ఆరగించి మత్తెకించిన కోకిల కూపినట్లు ఆమె కంఠస్వరం వినిపించింది.
"ఏంటి ఆలోచిస్తున్నారు?"
ఇంద్రమిత్ర ఉలిక్కిపడి చెప్పాడు.
"ఏం లేదు. లెన్స్ ఎడ్జేస్ట్ చేస్తున్నానంతే!"
జవాబుగా గ్రీష్మ నవ్వింది.
ఇంద్రమిత్ర కెమేరాలోంచి తన దృష్టిని క్రిందకిమళ్ళించాడు. ఎదలోయ్ల మధ్య నుంచి ఆమె నునుపయిన పొట్టమీదుగా క్రిందకి దిగాడు.
ఇక్కడ అతడకి అరోద్వారం తెరుచుకుంది.
అనేక రోజులుగా నిరాహార దీక్షలో వున్న ఉద్యమకారుడికి అకస్మాత్తుగా అన్నం తినిపిస్తే అతడు ప్రాణాలు వదలటం ఖాయం.
అందుకే అతడికి ముందుగా నిమ్మరసంలో నాలుకతడిపి ఆ తర్వాత పరిపూర్ణంగా బోజనం చేయడానికి అనుమతిస్తారు.
