Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 50

గర్ల్ ప్రెండ్స్ తో కాని, లైఫ్ పార్ట్ నర్  తో కానీ అక్కడకి వచ్చి ఓ వరం రోజులపాటు హాయిగా గడిపి వెళ్ళవచ్చు.
పైగా ప్రైవసీగా వుండటానికి వీలుగా కాటేజ్ కి కాటేజ్ కి మధ్య కనీసం వందగజాల దూరం వుండేట్టు నిర్మించారు.
పైగా కాటేజ్ న్ వెనక వైపు దట్టమయిన అడవి.
సరదాగా కాలక్షేపం చేయదల్చుకున్నవారు అడవిలోకి వెళ్ళి తిరిగిరావచ్చు.
అడవిలో అక్కడక్కడా మంచెలమీద కట్టిన గుడిసెల్లోకి ప్రవేశించి టైపాస్ చేయవచ్చు.
రూమ్ బోయ్ ఇంద్రమిత్ర సామాను తెచ్చి గదిలో వుంచాడు. ఇంద్రమిత్ర విండోస్ ఓపెన్ చేశాడు.
చల్లటి స్వచ్చమయిన గాలి వేగంగా లోపలకి వీచింది. అతని మనసుకు ఎంతో ప్రశాతంగా అనిపించింది.
లిమ్గీ కట్టుకుని స్నానం చేశాక ఇంటర్ కమ్ లో టిఫెన్ కి ఆర్డర్ చెప్పాడు.
పది నిమిషాల్లో వేడివేడి మినపట్ల అతనికి సర్వ్ అయ్యాయి.
టిఫిన్ చేయడం ముగించాక ఓసారి పరిసర ప్రదేశాలు తిరిగి చూసిరావాలని అతనికి అనిపించింది.
వెంటనే ఇంద్రమిత్ర ప్యాంటూ షర్ట్ వేసుకుని, దొరు లాక్ చేసి బయటపడ్డాడు. కాటేజ న్ మధ్య కాసేపు తిరిగిన తర్వాత అతనికి అడవి వైపు వెళ్ళాలనిపించింది.
ఆ ఆలోచన వచ్చిందే తడువుగా అతడు అటు వైపు నడిచాడు.
ఏపుగా పెరిగిన వృక్షలా మధ్య రిసార్ట్స్ వాళ్ళు కట్టిన మంచెలు చూస్తూ నడిచాడు.
దాదాపు ఓ కిలోమీటరు దూరం అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎదురుగా కనబడుతున్న పొదల వెనక ఏదో కదిలినట్లు అనిపించింది. ఇంద్రమిత్ర ఠక్కున ఆగాడు.
ఎపులో సింహమో లేకపోతే ఏ క్రూరమృగమో పోదవేనకలేదు కదా?
అనుకుంటుండగా పోడ వెనక నించి ఓ అందమయిన అమ్మాయి బయటకి వచ్చింది.
ఆమె చేతిలో కెమేరా ఒకటి వేలాడుతోంది.
సూర్యకిరణాలు ఆమె వెనక వైపునుంచి పడుతూ వుండడంవల్ల ఇంద్రమిత్రకు ఆమె ముఖం వెంటనే స్పష్టంగా కనిపించలేదు.
ఆమె మాత్రం అతని వైపు చూసి సర్ ప్రైజింగ్ గా__
"ఇంద్రమిత్రా _మీరా?"
అంటూ అరిచింది.
ఇంద్రమిత్ర అప్పటికీ ఆమె గొంతు గుర్తించాడు. ఆమె గ్రీష్మ.
అకస్మాత్తుగా అనుకోకుండా గ్రీష్మ ఎదురుకావడంతో ఒక్కసారి అతనికి థ్రిల్లింగ్ గా అనిపించింది.
అంతకుముందు ఇంద్రమిత్ర దగ్గరకి వచ్చిన ప్రతి సారీ గ్రీష్మ ఏదో ఒక మోడ్రన్ డ్రస్ లో వుండేది.
ఇపుడు ఆమె తెల్లరంగు చీర, అదే రంగు జాకెట్ వేసుకుని వుంది.
అంతక్రితమే అభ్యంగన స్నానం చేసిందేమో జుట్టు ప్రీగా వదిలేసింది.
గాలివాటుకు ఎగిరివచ్చి పడిన గడ్డిపూలు, అడవి ఆకులూ ఆమె జుట్టుకు పట్టుకుని వేలాడుతున్నాయి.
పైగా ఆమె నిలబడిన చోట పూల మొక్కలు ఏపుగా పెరిగి సీతాకోక చిలుకలు అక్కడ పరిభ్రమిస్తున్నాయి.         అడవి మద్యలో అచ్చం వన కన్యలా వుంది గ్రీష్మ.
తన వైపే కన్నార్పకుండా చూస్తున్నా ఇంద్రమిత్రని నవ్వుతూ అడిగింది గ్రీష్మ_
"ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను గ్రీష్మనే. అప్పుడప్పుడూ ఏం తావుచానపుడు ఈ ప్లేస్ కి వచ్చి ఫోటోలు తీసుకుని వెళుతుంటాను. ఫోటో గ్రఫీ హబీ. అవునూ మీరేంటి యిక్కడ?"
ట్రాన్స్ లోంచి బయటపడినట్లు చెప్పాడు ఇంద్రమిత్ర__
"సిటీలో రొటిన్ లైఫ్ మీద విసుగుపుట్టి ఓ సారి వూరికి దూరంగా రావలనిపించింది. అందుకే వచ్చేశాను."
గ్రేష్మ తాను నిలబడిన చోటునుంచి కదిలింది. ఆమె తన చేతిలోని కెమేరా అతనికి యిచ్చి చెప్పింది__


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS