"డోర్ రీపెర్ చేయడం పూర్తయింది సార్. కారు సెల్లార్ లో పార్క్ చేశాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.
* * * *
ఆ మర్నాడు ఉదయం___
అయిదు గంటలకి నిద్రలేచాడు ఇంద్రమిత్ర.
ఆరోజే అతడు గోల్డెన్ రిస్తార్ట్స్ కి వెళ్ళవలసిన రోజు.
అరుగంటలకల్లా ప్రయాణానికి రెడీ అయి ఓ మీడియం సైజు షోల్డర్ బ్యాగ్, సూట్ కేస్ లతో సెల్లార్ లో పార్క్ చేసి వున్న కారు వైపు వచ్చాడు.
సరిగ్గా ఇంద్రమిత్ర డోర్ హ్యాండిల్ మీద చెయ్యి వేసినపుడు వినపడింది.
"ఇంద్రమిత్ర ఆగూ!" అంటూ.
ఇంద్రమిత్ర తనను పేరుపెట్టి పిలిచిన వ్యక్తికోసం చూశాడు. అతడికి ఎవరూ కనిపించలేదు.
అంతలో కారుక్రింద నుంచి రెండు కాళ్ళు కన్పించాయి.
ఇంద్రమిత్ర వంగి చూశాడు.
అక్కడ ప్రయివేట్ డిటెక్టివ్ ఇస్మాయిల్ కారు అడుగు భాగంలో వేల్లకిలా పడుకుని పని చేస్తున్నాడు.
అతడు ఇంద్రమిత్రని గమనించి చెప్పాడు_
"ఓన్ మినిట్!"
ఇంద్రమిత్ర వెయిట్ చేశాడు.
సరిగ్గా నిముషం తర్వత ఇస్మాయిల్ బయటికొచ్చాడు.
అతడి చేతిలో ఎనిమిది అంగుళాల పొడవు, నాలుగంగుళాల వెడల్పు రెండంగుళాల మందం వున్న ప్లాస్టిక్ బక్స్ వుంది. దాన్ని ఇంద్రమిత్రకు చూపిస్తూ చెప్పాడు ఇస్మాయిల్.
"పవర్ పుల్ దితనేతర్ జిలితిక్ స్టిక్స్ సహాయంతో నిర్మించారు.
మీ లగేజి పెట్టుకోవడానికి డిక్కీ తలుపు తెరిచినా,లేదా ఇగ్నిషన్ తిప్పినా కారుతోపాటు మీరుకూడా పేలియుండేవాళ్ళు. కాని ఎందుకనో హంతకులకు మీరు ఏమాత్రం బ్రతకడం యిష్టంలేదు."
ఆ మాటతో ఇంద్రమిత్ర ముఖం భయంతో తెల్లగా పాలిపోయింది.
"లాండ్ మైక్స్ పెల్చతానికి ఉపఎగిమ్చే టెక్నాలజీ కొంచెం మార్చి మిమ్మల్ని బ్లాస్ట్ చేయటానికి ప్లాన్ చేశారు. మరి మీరేమో మీకు ఎవరూ శత్రువులు లేరంటున్నారు."
ఇంద్రమిత్ర అడిగాడు___
"నన్ను.... ఎవరు చంపాలనుకుంటున్నారో నిజంగా నాకు తెలియదు.
అందుకే నేను మిమ్ముల్ని కాంటాక్ట్ చేసింది. ఇంతవరకూ ఇవ్వాళ న ప్రయనం మానుకోవాల వద్దా?"
"మీరు ప్రయాణం మానుకోవద్దు. కాకపోతే రిస్క్ తీసుకుని మీ కారులో అమర్చిన డిటనేటర్ డిప్యూజ్ చేసినందుకు మీరు ఓ రెండు వేలరూపాయల ఫీజు యిచ్చుకోవాల్సి వుంటుంది.
ఇంద్ర మిత్ర మౌనంగా ప్యాంటు జేబులోకి చెయ్యి పోనిచ్చి రెండు వేలు తీసి ఇస్మాయిల్ కి యిచ్చాడు.
ఇస్మాయిల్ ఇంద్రమిత్ర యిచ్చిన నోట్లు రెండుసార్లు లెక్కపెట్టాడు.
వాటిని జేబులో పెట్టుకుంటూ చెప్పాడు__
"ఇక మీరు బయలుదేరవచ్చు. నా ఉద్దేశ్యం ప్రకారం ఈ రోజు ఈవినింగ్ మీమీద మర్డర్ చేస్తున్నా సీక్రెట్ కిల్లర్ ఎవరో కానీ పెట్టగల్గుతాను."
ఇంద్రమిత్ర తన లగేజిని కారులో పడేశాడు.
ఇంజన్ స్టార్ట్ చేసి కారు రోడ్డు మీదికి ఎక్కించారు.
ఇంద్రమిత్ర కారు బయల్దేరగానే ఇస్మాయిల్ పక్కనే పార్కు చేసి వున్న ఫ్యేట్ స్టార్ట్ చేసి ఇంద్రమిత్ర డ్రైవ్ చేసిన దిశగా ప్రయాణించ సాగాడు.
* * * *
గోల్డెన్ రీస్టార్ట్ చాలా అందమైన ప్రదేశంలో నిర్మించారు. చొట్టూ కొండలు మద్యలో విశాలమయిన చెరువు.
చెరువు గట్టున కాటేజేస్. కాటేజేస్ తొంభైశాతం వరకూ జనంతో నిండి వున్నాయి.
పార్కింగ్ ప్లేస్ లో ఖరీదైన కార్లు పార్కుచేసి వున్నాయి.
డబ్బున్న మనుషులు పూర్తిగా ఎంజాయ్ చేయడానికి వీలయిన ప్రదేశం అది.
