Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 48

ఆ రకంగా సాదూరాం మేనక ఇద్దరికీ పరిచయమయ్యే అవకాశం వుంది.
మేనక తనకున్న సహజమయిన అలవాటుతో సాదూరాం ప్రేమను కొనుక్కోవాలని వుండొచ్చు.
అందుకతడు అభ్యంతరం చెప్పి వుండకపోవచ్చు.
తనంతట తాను కోరుకోవడంతో మేనకతో అతడు గడిపి వుండవచ్చు.
ఆమె పొందుకోసం సాదూరాం తనకు పెళ్లయిందనే విషయం దాచి పెట్టి వుంది వుంటాడు.
మేనకతో కోరిక తీరిన తర్వాత అసలు విషయం చెప్పి వుండవచ్చు.
లేదా మేనకే అతడికి ఆల్రడీ పేళ్ళయిందని తెల్సుకుని వుంది వుండవచ్చు.ఇపుడు ఆకాష్ ని చంపినట్టుగానే సాదూరం ను కూడా మేనక చంపి వుండవచ్చు.
లేదా సాదూరంకు చనిపోయిన రిసేప్తనిస్ట్ ఐరిస్ కూ తమకు తెలియ కుండా సభందం ఏర్పడి వుండొచ్చు. మేనక కు ఆ విషయం తెల్సి ఇద్దర్నీ హత్య చేసిందేమో!
అసలు ఈ రెండు హత్యలూ జరిగినపుడు మేనక ఎక్కడుందో కనుక్కోవాలి.
ఇప్పుడు ఆమెని ఫోలీసులు అర్స్ట్ చేహారు. కనుక ఆమె పి.ఏ. అందుబాటలో వుంది వుండకపోవచ్చు. అయినా ఓ సారి ప్రయత్నించి చూస్తే ఏంపోయింది.
ఇలా అనుకుని ఇంద్రమిత్ర టెలిపోన్ బుక్ తెరిచాడు.
మొదట మేనక పి.ఏ రింగ్ చేశాడు.
రెండు నిమిషాలసేపు రింగ్ అయ్యాక ఓ అడ కంఠంవినిపించింది.
ఇంద్రమిత్ర మేనక పి.ఏ రామచంద్రరావు గురించి అడిగాడు.....
అవతలనుంచి మాట్లాడుతున్న మిసెస్ రామచంద్రరావు చెప్పింది.
"అయన పోలీసు కంట్రోల్ రూమ్ కి వెళ్ళారు. ఎపుడు వస్తారో తెలీదు"
వెంటనే ఇంద్రమిత్ర మేనక పర్సనల్ మేకప్ మన్ ఆచారికి సెల్ పోన్ కి రింగ్ చేశాడు.
రెండుసార్లు రింగ్ అయినా తర్వాత_
"ఆచారి స్పీకింగ్" అంటూ విన్పించింది.
ఇంద్రమిత్ర ఆచారికి తనను పరిచయం చేసుకున్నాక అడిగాడు_
"మేనకగారి గురించిన చిన్న ఇన్ ఫర్ మేషన్ కావాలి?"
ఆచారి చెప్పాడు_
"సారీ! నేను ఇప్పుడు విడ దగ్గర పని చేయడంలేదు."
"మీరు పని మానేసి ఎన్నిరోజులయింది."
"నిన్నసాయత్రం రావలసిన రెమ్యూన రేషన్ నాకు మేనక ఇచ్చేసి నన్ను ఉద్యోగంలోంచి తీసేసింది."
"నాకు వారం క్రితం మేనక మూవ్ మెంట్స్ గురించి ఇన్ ఫర్ మేషన్ కావాలి?"
"చెప్పండి"
ఇంద్రమిత్ర మొదట సాదూరాం హత్య జరిగినరోజు మేనక ఎక్కడుందో అడిగాడు.
దానికి ఆచారి__
"ఆ సమయంలో ఆ రోజు మేనక బిగ్ స్క్రీన్స్ క్రియేటర్స్ వాళ్ళ సినిమా డబ్బింగ్ చెబుతోంది.
పైగా అది ఆమె స్వంతంగా డబ్బింగ్ చెప్పే మొదటి సినిమా. ఇంతకముందు మేనకకు మరొక మనిషి డబ్బింగ్ చెప్పేది."
ఐరిస్ హత్య చేయబడిన సమయం, తేదీ చెప్పాక అడిగాడు ఇంద్రమిత్ర.
"మారిషస్ లో  డ్యూయట్ సాంగ్ ఘాటింగ్ లో వుంది. అయినా మీ రేమ్డుకిలా అడుగుతున్నారు?"
"జస్ట్ క్యూరియాసిటీ... అంతే."
అని ఫోన్ క్రేడిల్ చేశాడు ఇంద్రమిత్ర.
ఆ తర్వాత అతడు గంటలసేపు పేషెంట్స్ తో బిజీగా గడిపాక క్లినిక్ బయట పడ్డాడు.   
                      *    *    *    *   
రాత్రి ఎనిమిదిగంటల సమయం.
కాలింగ్ బెల్ మ్రోగడంతో ఇంద్రమిత్ర తలుపు తెరిచాడు. వాచ్ మన్ కారు కీస్ ఇస్తూ_


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS