నీకు విషయం తెల్సా? మేనకను పావులేసులు అరెస్ట్ చేశారు."
"ఏంటీ?!"
"అవును. ఆమె తన బోయ్ ప్రెండ్ ను తుపాకీ తో కాల్చి చంపిమ్దట.
సినిమా హీరో ఆకాష్ ఆమెకీ మధ్య ఎఫైర్ నడుస్తోందట.
ఆకాష్ ఆమెను పెళ్ళి చేసుకుంటాడని ప్రామిస్ చేశాడట.
తీరా ఇవాళ ఉదయం విలేకరుల మీటింగ్ పెట్టి తన పెళ్ళి పెద్దలు కుదిర్చిన అమ్మాయితో ఫిక్సయిందని చెప్పాడట.
ఆ వార్త తెలిసిన మేనక ఆకాష్ ను రివాల్వర్ తో కాల్చి చంపిందట.
పైగా మర్డర్ చేసినపుడు ఆమె బాగా తాగివుండట.
"ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు అని జనం చెప్పుకుంటున్నారు."
అటునుంచి భరద్వాజ రిసీవర్ క్రేదిల్ చేశాడు.
ప్రేమకోసం పరితపించిన మేనక, ఆ ప్రేమ వేరొక స్రీకి దక్కుతుందనే ఊహా ఆమె భరించలేకపోయింది.
పైగా హత్య చేసినపుడు ఆమె బాగా తాగిందని తెలుస్తోంది. ఆలోచిస్తున్న ఇంద్రమిత్ర వులిక్కిపడ్డాడు.
మేనక హత్యచేయటం ఇదే మొదటిసారా లేక ఇంతకముందు ఎప్పుడన్నా హత్యలు చేసిందా?
ఈ ఊహ రాగానే అతడి దృష్టిలోకి వచ్చిన మరొక పేషెంట్ డేనియల్.
హొమిసైడల్ పారనాయిక్ అయినా డేనియల్ అల్ రెడీ హంతకుడిగా మారాడా?
ఇంద్రమిత్ర వెంటనే డేనియల్ ఆఫీస్ కి రింగ్ చేశాడు.
తన పేషెంట్ సాదూరం, తన దగ్గర పనిచేసే ఐరిస్ లు మరణించిన తేదీలు, వాళ్ళు ఏ సమయంలో హత్య చేయబడిందీ గుర్తుకు తెచ్చుకున్నాడు.
అవతలినుండి డేనియల్ సెక్రటరీ లైన్ లోకి రాగానే చెప్పాడు ఇంద్రమిత్ర_
"నేను డాక్టర్ ఇంద్రమిత్రని."
డేనియల్ పర్సనల్ సెక్రటరీ ఇంద్రమిత్ర పేరు వినగానే వినమ్రతగా చెప్పింది._
"డేనియల్ గారు సీట్లో లేరు."
"నాకో చిన్న ఇన్ ఫర్ మేషన్ కావాలి.క్రితం శుక్రవారంనాడు సాయత్రం ఆరు గంటలప్పుడు డేనియల్ గారు ఎక్కడున్నారో చెప్పగలరా?"
"ఓన్ మినిట్ ప్లీజ్."
రెండు నిమిషాల తర్వాత ___
సెక్రటరీ కంఠం లైన్ లోకి వచ్చింది.
"ఆ రోజు డేనియల్ గారు సాయంత్రంనాల్గంటనుంచీ ఏడు గంటల వరకూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ లలో వున్నారు."
"ఆర్ యూ ష్యూర్?"
"ష్యూర్!"
"ఓ.కే!మొన్న సోమవారం సాయంత్రం ఏడున్నర సమయంలో డేనియల్ గారు ఎక్కడ వున్నారు?"
"ఆన్ మినిట్ సర్."
ఇంద్రమిత్ర రెండు నిముషాలు ఎదురుచూశాక చెప్పింది సెక్రటరీ_
"అయన ఆ సమయంలోఫారిన్ డెలిగేట్స్ తో మాట్లాడుతున్నారు.
ఆ తర్వాత అయన స్వయంగా ఓ స్లయిడ్ శో కండక్ట్ చేశారు. మకంపెనీ భవిష్యత్ కార్యక్రమాలను స్లయిడ్స్ రూపంలో ఫారిన్ డెలిగేట్స్ ను చూపించారు."
రెండు క్షణాలు ఆగి అడిగింది సెక్రటరీ_
"సర్! ఎనీథింక్ ప్రాబ్లం?"
"ఏం లేదు. ఊరకనే తెలుసుకోవాలని అడిగాను. నేను ఆ విషయమై ఫోన్ చేసినట్టు డేనియల్ గారికి చెప్పకండి."
"ష్యూర్ డాక్టర్."
అవతలనుంచి ఫోన్ క్రేదిల్ చేసినట్టు శబ్దం వినిపించింది.
"సో! డేనియల్ అ సమయంలో హత్యా ప్రదేశంలో లేదని ప్రూవ్ అయింది.
కనుక ఇపుడు ఆ రెండు హత్యలూ జరిగిన సమయమ్లోమేనక ఎక్కడుందో కనుక్కోవాలి.
సాదూరాం, మేనక ఇద్దరూ తన పేషెంట్స్.
