ఆమెకి అప్పటికీ పదివరకూ సినిమాలున్నాయి. నందిని మరణంతో అవన్నీ ఆగిపోయాయి.
అయితే అప్పుడప్పుడూ నందిని తాలుకూ డూప్ సన్నీ వేశాలతో నటిస్తూ వుంటుంది.
ఆమెకూ, నందినికి కొన్ని దగ్గర పోలికలు వున్నాయి. దాంతో నందినిని హెరాయిన్ గా బుక్ చేసుకున్న నిర్మాతలు మేనకవైపు తమ దృష్టి మళ్ళించారు.
నందిని బదులుగా మేనకను హీరోయిన్ గా పెట్టి మిగిలిన సినిమాని పూర్తీ చేశారు.
మేనకకు ఒక్కసారిగా అదృష్టం తలుపు తట్టింది.
పైగా నందిని ప్లేస్ లో మేనకను వుంచి రిలీజ్ చేసిన సినిమాల్లో సగానికి పైగా హిట్ అయ్యాయి. మిగిలిన వాటిల్లో రెండు ప్లాఫ్.
రెండు ఎవరేజ్ సినిమా ఇండస్ట్రీలో సెంటి మెంట్స్ కు ఇంపార్టెంట్ ఎక్కువ.
మేనకను బుక్ చేసుకుంటే సినిమా హిట్ అనే సెంటి మెంట్ నిర్మాతల్లో పాకిపోయింది.
ఫలితంగా మేనక బిజీ స్టార్ట్ అయింది.
మేనక ఇప్పుడు తమిళ, సినిమాతోపాటు హిందీ సినిమాలు కూడా చేస్తోంది.
నార్త్ ఇండియానుంచి వచ్చే సినిమా పత్రికలూ మేనక ఫలానా డైరెక్టర్తో తిరుగుతోందనీ, ఫలానా హీరోతో మేకప్ రూమ్ లో గడిపిందనీ, ఫలానా ఇండస్ట్రియలిస్ట్ ని రహస్యంగా పెళ్ళి చేసుకుందనీ వార్తలు వెలువడ్డాయి.
తెలుగు తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చే ప్రతి పత్రికా ఆమె మీద గాసిక్స్ రాసేది.
మేనక ఇంద్రమిత్రని కలసిన మొదటి రోజున ఫాన్ పరాగ్ నములుతూ చెప్పింది_
"మీకు ఓ విషయం తెల్సా?"
నాతో పరిచయం వున్న ప్రతి మగవాడితోనూ నాకు సంబంధం వుంది.
సెక్స్ లేకపోతే నాకు నిద్ర పట్టదు.
నాకు రోజూ ఓ క్రొత్త మగవాడి పొందు కావాలి.
అయినా నా దాహం తీరటంలేదు. ఏదో అసంతృప్తి నన్ను వెంటాడుతోంది."
ఇంద్రమిత్ర అడిగాడు_
"అసలింతవరకూ మీ మానసిక సమస్య ఏమిటి? మీరు నన్నెందుకు కలుసుకోవాలనుకున్నారు?"
"మీ ఫోటో అదేదో మ్యాగజైన్ లో చోశాను. రోమాంట్టిగ్గా అనిపించారు.
వెంటనే మిమ్మల్ని స్వంతం చేసుకోవాలనిపించింది_అందుకే మిమ్ములను కలిశాను.
నాకు మీరు కావాలి. చెప్పండి మీ ఫీజెంత?"
ఇంద్రమిత్రకు ఒక విషయం అర్దమైంది.
నిజానికి మేనక కోరుకుంటుంది శారీరక సుఖ్న్ని కాదు_ తనను ప్రేమించే మనిషిని.
అలాంటి మనిషి యిమ్తవరకూ తారసపడలేదు. పైగా ఆమె ప్రమను డబ్బుతో కొనలనుకుంటోంది.
ప్రేమ మార్కెట లో దొరికే వస్తువు కాదనీ, ఎదుటి మనిషి ప్రేమని తనంతట తానుగా ఇవ్వాలనీ ఆమెకు తేలేదు.
డబ్బుతో ఆస్తుల్ని, అంతస్థుల్నీపెంచుకోగలిగిన మేనక అదే డబ్బుతో ప్రేమను కూడా స్వంతం చేసుకోవాలనీ భ్రమలో వుంది.ఆమెకు మెల్లిగా నిజం విప్పిచెప్పాలి.
ఆమెకు వాస్తవం తెలియచేయాలి.
అప్పటివరకూ మేనక ప్రవర్తన ఇల్గే వుంటుంది.
ఇంద్రమిత్ర రిసీవర్ అందుకున్నాడు.
అవతలి వైపునుంచి భరద్వాజ మాట్లాడుతున్నాడు.
ఇంద్రమిత్రకు ఉన్న అతి కొద్దిమంది స్నేహితులలో భరద్వాజ ఒకడు.
అటువైపు నుంచి భరద్వాజ చెప్పాడు.
