Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 43

రికార్డ్ లోంచి అర్జునరావు, ఇంద్రమిత్రలా దంభాష్ణ వినపడసాగింది.
"మీరు మీ భార్య మెడ దడి చేశారు అవునా?"
"అవును. కత్తితో దాడి చేశాను."
"ఎందుకు చేశారు?"
"అలా చేయాలని చెప్పారు కనక చేశాను."
"మిమ్మల్ని మీ భార్య మీద దడి చేయమని ఎవరు చెప్పారు?"
"దేవుడు. దేవుడు చెప్పాడు. అందుకే కత్తితో నా పెళ్ళాన్ని చంపాలనుకున్నాను. కాని స్వర్గానికి వెళ్ళే అదృష్టం లేదు కనక అది బ్రతికి బయటడింది."
అర్జునరావు తరచూ హొలుగేషస్న్ కి గురవుతూ వుంటాడు. అతని కళ్ళ ముందు ఏవో రూపాలు కనబడుతూ వుంటాయి. చెవుల్లో ఎవరో ఏదో చెపుతున్నట్లు అనిపిస్తూ వుంటుంది. ఆ మాటలు, రూపాలు దేవుడికి సంబంధించినవిగా అర్జునరావు భావిస్తున్నాడు.
"అదిసరే_ మీ బామ్మర్ది ని మీరు ఎందుకు చంపబోయారు?"
"వాడు డ్రామాలు వేస్తుంటాడు. అందరూ చూస్తుండగా స్టేజి మీద ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకున్నాడు.
"నటించేటప్పుడు అవన్ని సహజం."
"లేదు అలా చేయడం తప్పు అని దేవుడు చెప్పాడు అందుకే వాడ్ని ఖతం చేయాలనుకున్నాను అదృష్టం బాగుంది వాడు ప్రాణాలతో బయటపట్టాడు. మళ్ళీ దేవుడు వాడిని శిక్షందల్చుకున్నప్పుడు నాతో చెపుతాడు. అప్పుడు నేను వాడిని చంపేస్తాను."
"దేవుడు మీతో ఎప్పుడు మాట్లాడుతూ వుంటాడా?"
"ఎప్పుడుపడితే అప్పుడు మాట్లాడుతూ వుంటాదు. అంతేకాదు_ నేను ఈ ప్రపచం మొత్తంలో కీ స్వచ్చమయిన మనసున్నవాడినట. అందుకే_దేవుడు నాతో మాట్లాడుతున్నానని చెప్పాడు. చంపేదే చంపించేది అన్నీ ఆయనే. మీరు భగవద్గిత చదవలేదా? నేను కేవలం క్లిష్టంగా తోచింది. అయితే అర్జునరావుని మామూలు మనిషిగా మార్చటానికి ఇంద్రమిత్రకు ఎంతో కాలం పట్టలేదు.
ఇంద్రమిత్ర అర్జునరావు క్యాసెట్ రికార్డ్ లోంచి తీసేశాడు. ఈ సారి అవతారం తాలూకు టేప్ అన్ చేశాడు.
అవతారం తెలుగు సినిమా ఇమ్ద్రస్తి లో పెద్ద పేరున్న కమెడియన్, ప్రస్తుతం అవతారానికి ఏబై సంవత్సరాల వయస్సు వుంటుంది. అయినా అతడు యిమ్తవరకూ పెళ్ళిచేసుకోలేదు.
కారణం అవతారం హొమోసెక్స్ వల్. తరుచుగా అవతారం శ్రీ లంకా వెళుతూ వుంటాడు. శ్రీ లంక దేశంలో మేల్  ప్రాస్టిట్యూషన్ ఎక్కువుగా వుంది.పది  సంవత్సరాల పిల్లల దగ్గర్నుంచీ  అరవై సంవత్సరాల వాళ్ళవరకూ అడా , మగా ఆ వృత్తిలో కనిపిస్తారు. హొమోసెక్స్ వాలిటితో పాటు సైకో ప్రవృత్తి కూడా అలవాటు చేసుకున్నాడు. అవతారం. హైదరాబాద్ నగరంలో అవతారానికి మేల్  ప్రాస్టిట్యూట్స్  ని సప్లయ్ చేసే బ్రోకర్ ఒకడు వున్నాడు. తన దగ్గరకి వచ్చే కుర్రాళ్ళని అవతారం వాళ్ళ బట్టలు వూడదిసీ తోలుబెల్టుతో చర్మం పూడిపోయేలా కొట్టి ఆ తర్వాత వాళ్ళతో తృప్తి బడే శాడిజానికి అలవాటుపడ్డాడు.
తేరమీద నవ్వులు కురిపించే అవతారం యిలాంటి మనిషి అంటే జనం నమ్మటం కష్టం గతంలో అతడ్ని పోలీసులు సెక్స్ ఎబ్యూజ్ కింద చాలాసార్లు అరెస్ట్ చేశారు. డబ్బు, పలుకబడి వున్న అవతారం పోలీసుల నుంచి బయటపడగలిగాడు. తనని మొదటిసారి కలసినప్పుడు అవతారంతో జరిపిన ఇంటర్వ్యూ తాలూకు టేప్ తీసి చేశాడు ఇంద్రమిత్ర. రికార్డర్ లోంచి యిద్దరి సంబాషణ వినిపించసాగింది.
"మీకు ఈ అలావాటు ఎలా అయింది?"
"నేను ఏదో తరగతి చదివేటపుడు మా స్కూలు హాస్టల్ వార్డెన్ నాకు యీ అలవాటు చేశాడు. ఆ తర్వత నేను నా మిత్రుల దగ్గర నా కోర్కె తీర్చుకునేవాడ్ని.
"మీ దగ్గర డబ్బు, పలికబడి వున్నాయి కనక పోలీసు కేసుల్నించి బయటపడగలుగుతున్నారు. కానీ మీ దగ్గరకి వచ్చే వాళ్ళని బెల్టుతోకొట్టి హింసించటం అమానుషం కదా?"
"నాలో రెండు పర్సనాలిటీలు వున్నాయి డాక్టర్. నా మనసు నువ్వు చేస్తున్న పని తప్పు అంటుంది.అతినా మరో వైపు నాకు అదే పని చేయాలనిపిస్తుంది. అంతేకాదు ఎదుటి మనిషి బెల్టులతో రక్తం ఓడుతూ, గిలగిల తన్నుకుంటే నాలో సేక్సవల్ ఆలోచనలు కలుగుతున్నాయి. మరొకసారి నేను హింసించే మనిషిని చంపేయాలనిపిస్తూ వుంటుంది, నా భావనల్ని అదుపులో పెట్టుకోవడానికి విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవు కత్తితో చాలాసార్లు శరీరం మీద గయలు కూడా చేసుకున్నాను."
అపకరంలో సేఫ్ టక్చర్స్ సంభందించిన ఇన్ స్తిమ్క్ డెవలప్ అవుతోంది. అది చాలా ప్రమాదకరమైన స్థితి.
తర్వాత ఇంద్రమిత్ర అడిగాడు_
"మిమ్మల్ని మీరు టార్చర్ చేసుకోవడం వల్ల ప్రయోజనంలేదు.మీరు ఆత్మహత్య చేసుకోవడం వల్ల సాధించేది శూన్యం. మీరు చనిపోయాక మీ పేరు పేపర్లు ప్రకటిస్తాయి. సంతాపసభలు జరుగుతాయి టి.వి.ఛానల్స్ లో మీ పేరు మార్మోగిపోతుంది."
"అదే_ అదే నాకు కావలసింది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS