Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 42

"చిదంబరానికీ, మీకూ మధ్య పర్సనల్ గ్రద్జ్ ఏదన్నా వుందా?"
ఇంద్రమిత్ర చిదంబరం తమ్ముడి హత్య గురించీ, తను హంతకుణ్ణి ఉరికంబానికి బదులు పిచ్చాసుపత్రికి పంపిన ఇన్సిడెంట్ గురించీ చెప్పిన తర్వాత అన్నాడు "తన తమ్ముడ్ని చంపినా సైకిక్ కిల్లర్ని శిక్షపడకుండా అడ్డుకున్నందుకు యిప్పుడు నా మీద పగ తీర్చుకుంటున్నాడు చిదంబరం.'
ఇస్మాయిల్ చెప్పాడు_
"అయితే మీరు గోల్డెన్ వ్యాలీ రిస్తార్స్ కి వెళ్ళే విషయం గురించి చిదంబరానికి తెలియచేయండి. అలాగే ఫెర్నాండెజ్ కూడా చెప్పండి. మీ పేషెంట్స్ అందరకీ ఫోన్ చేసి వివరించండి. మీరుండే అపార్ట్ మెంట్ వాచ్ మెన్ కూ, లిప్ట్ బోయ్ కీ, చెత్త తీసేవాడికీ, పేపర్ బోయ్ కీ, మిల్క్ పాకెట్స్ యిచ్చేవాడికి, మీ స్నేహితులకు పొరిగింటివాడికి మీ ప్రయాణ వివరాలు తెలియకండి. ఇకపోతే గోల్డెన్ వ్యాలీ రిస్తార్స్ మేనేజర్ నకు బెస్ట్ ప్రెండ్, నేను వాడికి రింగ్ చేస్తాను. మీకు ఏ నెంబరు కాటేజీ ఎలాబ్ అయిందో ఫోన్ చేసి చెబుతాను."
ఇంద్రమిత్ర ఏదో అనబోయాడు.
ఇస్మాయిల్ అడ్డుపడుతూ అన్నాడు_
"ఇక మీరు ణ ప్లాన్ కి అబ్యంతరం చెప్పవద్దు,. రెండు రోజుల్లో మిమ్మల్ని చంపదల్చుకున్న వ్యక్తివరో తేలిపోతాడు."
ఇంద్రమిత్ర తల వూపాడు_
"ఇక ణ ఫిఇజు... రాజుకు వందల రూపాయలు. ఇదికాక కేసి పూర్తయ్యాక చివర్న పదివేల రూపాయలు. రెమ్యునేషన్ యివ్వా వలసుంటుంది."
ఇంద్ర మిత్ర జేబులోంచి చెక్ బుక్ తీసి ఇస్మాయిల్ ని అడిగాడు_
"ముందొక అయిదు వేలు... అడ్వాన్స్ తీసుకోండి. కేసు పూర్తీ అయ్యాక బ్యాలెన్స్ ఎమౌంట్ యిస్తాను."
ఇస్మాయిల్ తల ఊపి చెప్పాడు_
బేరర్ చెక్ యివ్వండి"
ఇంద్రమిత్ర అయిదు వేళ రూపాయలకు సరిపడా చెక్ ఇస్మాయిల్ పేరన రాసి యిచ్చాడు.   
                        *    *    *    *   
అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఇంద్ర మిత్ర తన అపార్ట్ మెంట్ లో రెస్ట్ తీసుకుంటూ వుండగా ఫోన్ మోగింది. రిసీవర్ చెవికి అనించుకున్న ఇంద్రమిత్రకు అవతలివైపు నుంచి ఇస్మాయిల్ గొంతు వినిపించింది.
"డాక్టర్! మీకు అరవైమూడో నెంబరు కాటేజీ బుక్ అయింది. మీరు రేపు ఉదయం అయిదు గంటలకు ఇక్కడ్నుంచి బయలుదేరండి. నేను ఫోన్ పెట్టేసిన మరుక్షణం మీ ప్రెండ్స్ కి, పేషెంట్స్ కి, మీ టూర్ వివరాలు తెలియచేయండి. మీ అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయినట్లు కూడా చెప్పండి. గోల్డెన్ రిస్తార్స్ ఫోన్ నెంబర్ త్రిబుల్ నిన్ త్రిబుల్ సిక్స్."
అవతలనుంచి ఇస్మాయిల్ రిసేవర్ పెట్టేశాడు.
తర్వాత ఇంద్రమిత్ర తన పేషెంట్స్ కీ, ప్రెండ్స్ కీ, రింగ్ చేసి తన టూర్ వివరాలు చెబుతూ చివర్న అన్నాడు_
"నా కాటేజీ నెంబరు అరవై మూడు. ఒకవేళ అర్జంట్ మెసేజ్ ఏదన్నా వుంటే గోల్డెన్ రిస్తార్స్ కి ఫోన్ చేయండి. నేను రెండు రోజులు అక్కడే వుంటాను."
ఇంద్రమిత్ర చిట్టచివరి కాల్ చేస్తుండగా లోపలకి వచ్చాడు లిప్ట్ బోయ్. అతని చేతిలో క్యారియర్ వుంది. దగ్గర్లో వున్న హొటల్ నుంచి లిప్ట్ బోయ్ రోజూ క్యారియర్ తెచ్చిపెడతాడు. ఇంద్రమిత్ర అతనికి తన టూర్ వివరాలు చెప్పాక అన్నాడు "ఓ సారి వాచ్ మెన్ ను రమ్మను."
పదినిమిషాల తర్వాత అపార్ట్ మెంట్స్ వాచ్ మెన్ ఇంద్రమిత్ర ముందు నిలబడ్డాడు. అతనితో ఇంద్రమిత్ర తను రిలాక్త్స్ వెళుతున్న విషయం చెప్పక అన్నాడు_
"నీకు మన వీధి చివర్న వున్న గ్యారేజీ తెల్సా?"
వాచ్ మెన్ తెలుసన్నట్లు తల వూపాడు. "నా ప్రంట్ రైట్ సైడ్ డోర్ సరిగ్గా లాక్ అవడం లేదు. వెళ్ళి చూపించు_ వెంటనే రిపేర్ చేయమను."
వాచ్ మెన్ తల వూపాడు.
ఇంద్రమిత్ర అతనికి కారు కీస్ అందించాడు.
కదల బోతున్నా వాచ్ మెన్ తో చెప్పాడు ఇంద్రమిత్ర_
"ఒకవేళ సర్వీసింగ్ లేట్ అయినా ఫర్వాలేదు. నేను స్కూటరు మీద బయటకి వెళతాను. పని పూర్తీ అయ్యాక నువ్వు కారు శుబ్రం చేసి సెల్లార్ లో పార్క్ చెయ్యి."
వాచ్ మెన్ వెళ్ళిపోయాడు. తర్వాత ఇంద్రమిత్ర మీల్స్ క్యారియర్ ఓపెన్ చేస్తుండగా ఫోన్ మోగింది.
అవతల్నించి మాట్లాడుతుంది ఇస్మాయిల్.
"డాక్టర్ సాబ్! నేనో విషయం చెప్పటం మర్చిపోయాను. మీ పేషెంట్స్ మీతో మాట్లాడిన సంభాషణలు టేప్ చేసి కనక మీకు వుంటే మీరు ఓసారి విని చూడండి ఎవరి మీదనైనా మీకు అనుమానం వస్తే వెంటనే నాకు రింగ్ చేయండి."
ఇస్మాయిల్ ఫోన్ పెట్టేశాడు.
మరో గంట తర్వత__
ఇంద్రమిత్ర ఆ రోజు కొచెం ముందుగా క్లినిక్ కి వచ్చాడు. ఇంకా అప్పటికీ పేషెంట్స్ రావడానికి చాలా టైముంది. మెయిన్ దొరు లోపల వైపు బోల్డ్ వేశాక ఆఫీస్ గదిలోకి ఏమ్తరయ్యాడు. తన దగ్గరున్న కీ బంచ్ లోని ఓ తాళం చెవి సహాయంతో స్టీల్ అల్మారా తెరిచాడు. అల్మారా లోపల పేషెంట్లు తళుకు ఆడియో టేసులు ఆల్ఫా బేటిక్ ఆర్డర్లో పెట్టి వున్నాయి. ఇంద్రమిత్ర ముందుగా అర్జునరావు కు చ్మేడిన టేప్ బయటకి తీశాడు.
అర్జునరావు గత పది సంవత్సరాల నుంచీ మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. పైగా స్వంత భార్య, పిల్లల మీద, భార్య తమ్ముడి మీద హత్యా ప్రయత్నం చేశాడు. అయితే అర్జునరావు దాడి చేసింది స్వంత మనుషుల మెడ కాబట్టి విషయం పోలీసుల వరకూ వెళ్ళలేదు.
అర్జునరావు భార్య అర్జునరావుని ఆరు నెలల క్రితం ఇంద్రమిత్ర దగ్గరకి తీసుకొచ్చింది. వారానికి కౌన్సిలింగ్ చొప్పున ఇప్పటికీ అర్జునరావు పాతికసార్లు వరకూ ఇంద్రమిత్రని కలిశాడు. ఇంద్రమిత్ర అర్జునరావు తాలూకు ఆడియో టేప్ ని రికార్డ లో వుంచి ప్లే బటన్ ప్రెస్ చేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS