"కానీ ఆ తర్వాత జనం మిమ్మల్ని మర్చిపోతాను. స్వంత మనిషి మరణిస్తేనే కొద్ది రోజుల్లో తమ రొటిన్ జీవితానికి అలవాటుపడి పోతారు. అలాంటిది ఎవరో నటుడు మరణిస్తే జనం ఇంకా తొందరగా మర్చిపోతారు."
"నేను నమ్మను."
"మీరు వెలుగులోనికి రాక ఒపూర్వం తెలుగులో మంచి కమెడియన్ గా ఎవరు వుండేవారు."
"ఆనందరావు. అతనికి జనం బ్రహ్మరధం పట్టారు. అతడు చనిపోయిన రోజున అనేక వేలమంది అతని హంత్యక్రియలు హాజరయ్యారు."
"మరి ఇప్పుడు అతడు చనిపోయిన విషయాన్ని జనం పట్టించుకుంటున్నారా?"
"ఎందుకు పట్టించుకోవడంలేదు. జనంలో అతనికి ఎప్పుడో ఎంతో క్రేజ్ వుంది."
"మీరు పోరపడుతున్నారు. జనం అతడ్ని ఎప్పుడో మర్చిపోయారు.
నేను చెప్పేది అబద్దం అయితే_
ఈ రోజు జనం ఆనందరావు పేరన సభలూ, సమావేశాలూ జరపాలి.
ఎందుకంటే___
"ఇవాళ ఆనందరావు బర్త్ డే..."
"వ్వాట్?"
"అవును. మీరు చెప్పేదేకనక నిజమయితే, ఈ రోజు జనం తండోపతండాలుగా ఆనందరావు సభలూ, సమావేశాలూ జరుపుకోవాలి.
కానీ ఏదీ?
జనం ఎప్పుడూ లైం లైట్ లో వున్న మనిషిని మాత్రమే గుర్తించుకుంటారు.
ఒక్క అనందరావే కాదు__
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి,ఇప్పుడు తెరమరుగయిన కామెడియన్స్ అనేకమంది వున్నారు. వాళ్ళు రోడ్డుమీద నడిచి వెళుతున్నా జనం పట్టించుకోరు.
అలాంటిది__
చనిపోయిన ఒక వ్యక్తి గురించి ఎంతకాలం చెప్పుకుంటారో చెప్పండి?
మరుపు అనేది మానవ లక్షణం!
అదికనక లేకపోతే పోయినవాళ్ళని తలుచుకుంటూ బ్రతికివున్న వాళ్ళు ఆత్మహత్యలు వుంటుంది.
ఇప్పటికయినా మీ ఆలోచన తప్పు అని గ్రహించండి. సూయి సైడ్ చేసుకోవాలన్న ఆలోచనలకి స్వస్తి చెప్పండి."
ఇంద్రమిత్ర టేప్ ఆఫ్ చేశాడు.
ఇప్పుడు అవతారం మారిన మనిషి.
అతడు ఓ లేడి జూనియర్ ఆర్టిస్ట్ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు.
అంతేకాదు__
అతడిలోని బ్లాక్ పర్సనాలిటీ మళ్ళీ వెలికివచ్చే అవకాశంలేదు.
ఇంద్రమిత్ర అవతారం క్యాసెట్ తీసి పక్కన వుంచాడు. తర్వాత అతడు నలుగురయిదుగురు పేషెంట్స్ తాలూకు తెప్స్ తీసి విన్నాడు. ఆ నలుగురయిడుగురూ కిల్లింగ్ ఇన్ స్టీంక్ వున్నవాళ్ళే!
ఆ ఐదుగురులోనూ అంథోనీ అనే పోలీసు ఇన్స్ పెక్టర్ కిల్లింగ్ ఇన్ స్టంట్ విపరీతంగా వున్న వ్యక్తి!
అతడ్ని ట్రిగ్గర్ హాపీ కప్ అని చెప్పకోవచ్చు.
ఉట్టిపుణ్యానా దాదాపు నలుగురు మనుషుల్నిఅంథోనీ కాల్చి చంపాడు.
అంథోనీ శ్రేయేభిలాషి అయినా వ్యక్తి అతడ్ని ఇంద్రమిత్ర దగ్గరకి పంపించాడు.
అతడికి ట్రీట్ చేయటం ప్రారంభిచాక అంథోనీలో చాలా మూర్పూ వచ్చింది.
ఇంద్రమిత్ర అంథోనీ టేప్ కూడా విన్నాడు. టేప్ లో విన వచ్చి సంభాషణలో అతడికి అనుమానంగా తోచిన సన్నివేశం ఏదీ వినబడలేదు.
తర్వాత__
ఇంద్రమిత్ర మేనక తాలూకు అదోయో టేప్ పైకితీశాడు.
