Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 41

ఇంద్రమిత్ర క్షణం ఆగాడు.
అతడకి నిజమేననిపించింది వెయ్యి రూపాయిలు ఊర్కినే ముక్కు, ముఖం తెలియని వ్యక్తికి ఇచ్చేసి వెళ్ళిపోవడం కంటే కనీసం ఎంతో కొంత పని పూర్తీచేసుకునిపోతే మంచిదనిపించింది.
ఇంద్రమిత్ర వెనక్కి తిరిగాడు.
ఇస్మాయిల్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని అడిగాడు_
"అసలు నేనో ద్క్తర్ నని మీకెలా తెల్సు?"
ఇస్మాయిల్ నవ్వుతూ చెప్పాడు._
"మీరు వృత్తి గురించి మాత్రంనే కాదు_ మీ పేరు ఇంద్రమిత్ర అని తెల్సు. ఏదో మ్యాగజైన్ లో మీ ఫోటో చోశాను. మీరు పాఠకుల ప్రశ్నలకు సమాధానలు ఇస్తారనుకుంటా?! నాకు రోజూ పేపర్ చదివే అలవాటుంది మీ పర్సనల్ సేక్రటరీ ఐరిస్ మీ దగ్గరే ట్రీట్ మెంట్ పుచ్చుకున్న ఓ పేషెంట్ ఇద్దరూ హత్యకు గురయ్యారని కూడా నకు తెల్సు."
ఇస్మాయిల్ చెప్పడం ఆపి ఇంద్రమిత్రవేపు చూశాడు.
ఇంద్రమిత్ర అన్నాడు_
"అవును_నిజానికి ఆ రెండు హత్యలూ నన్ను చంపలనుకుని చేసినవి పొరపాటున వేరేవాళ్ళు మరణించారు. ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు."
ఇస్మాయిల్ అన్నాడు_
"మీకేవరైనా శత్రువులు వున్నారా?"
ఇంద్రమిత్ర తల అడ్డంగా వూపాడు.             
"పోనీ మీ పేషెంట్లలో పికోపాత్ లు కానే, కిల్లింగ్ ఇన్ స్టింక్ వున్నారుకానీ వున్నారా?"
ఇంద్రమిత్ర లేరన్నట్టు తల వూపాడు.
"పోనీహొషన్స్ కి లోనవుతున్నవాళ్ళు..."
"హొమిసైడల్ పారనాయిడ్స్....."
ఇంద్రమిత్రకు ఒక విషయం అర్దమయింది. పైకి వెర్రివాడిలా కనిపించే ఇస్మాయిల్ చాలా తెలివిగలవాడు. అప్పటిలాగా పరదాగా వున్న ఇస్మాయిల్ ముఖం తనను ప్రశ్నలు అడుగుతున్నపుడు ఒక్కసారిగా సీరియస్ గా మరిపోయింది. ఇప్పుడు అతని ముఖంలోంచి కందియన్ మాయమయి ప్రవైట్ ఇన్ వెస్టిగేటర్ ప్రత్యక్షమయ్యాదు.
ఇంద్ర మిత్ర చెప్పాడు_
"డేనియల్ అని ఓక పేషెంట్ వున్నాడు.అతడు తరచూ హేలూషియేషన్స్  కి గురవుతూ వుంటాడు. కని అతడు కిల్లర్ గా యింకా మారలేదు"
ఇస్మాయిల్ అడిగాడు_
"ఫోనీ మీకు పర్సనల్ గా కాకపోయినా, మీకుటుంబానికి చెందిన వాళ్ళకి... అంటే మీ ఫ్దర్ కి గానీ, బ్రదర్ కి గానీ శత్రువులు ఎవరన్నా వున్నారా? వాళ్ళవలన కూడా మీకు ప్రమాదం జరిగేఅవకాశముందా? నేల రోజుల క్రితం మీరు పేపర్లో చదివే వుంటారు. ఇరుగు_ పరుగున వుండే రెండు కుటుంబాలవాళ్ళు పోట్లాడుకున్నారు. అందులో ఓ కుటుంబం తాలూకు మనిషి రెండో కుటుంబానికి చెందిన పెద్దవాళ్ళని ఏం చేయలేం వాళ్ళ పిల్లలు యిద్దర్నీ మెడ పిసికి చంపేశాడు. మీ ప్యామిలేలో మెంబర్ల మీద వున్న కోపం మీ మీదకి మల్లె అవకాశం వుంది."
ఇంద్రమిత్ర చెప్పాడు_
"నాకు తెలిసినంతవరకూ పుట్టిబుద్దేరిగిన తర్వాత మా ప్యామిలీకి ఎలాంటి శత్రువులూ లేరు. మా నాన్నకి మంచి ,మనిషి అనీ, అజాతశత్రువనీ పేరుంది."
"సరే! ఇక మీ పర్సనల్ విషయానికి వద్దాం. ప్రేమించే మనిషి తాలుకూ బంధువులు మీమీద ఎటాక్ చేసే అవకాశముంది. ఇప్పుడు జరిగే హత్యల్లో చాలావరకు లైంగికపరమైనవీ, డబ్బుపరమైననీ, పావులీతికల్ ఎసాఫికేషన్స్  ఎప్పుడూ మూడో స్థానంలోనే వుంటాయి పై రెంటి కరణాలవలన జరిగే హత్యలే ఎక్కువ."
ఇంద్రమిత్ర తనకేలాంటి లవ్ ఎపైర్స్ లేవని చెప్పాడు.తర్వాత ఇస్మాయిల్ ఇంద్రమిత్రకు అనేక కోణల్లో ప్రశ్నించాడు. అనుమానించితగ్గ ఆధారం ఒక్కటి కూడా లభించలేదు. చివరిగా అన్నాడు ఇస్మాయిల్_
"మీకు నా ఎద్వాయిజ్ ఒక్కటే. మీరు నాలుగు రోజులు సెలవు తెసుకావుమ్ది అన్నట్టు మీకు స్వంతకారుందా?"
ఇంద్రమిత్ర తలూపి చెప్పాడు_
"ఉంది. కాని డ్రైవింగ్ సీట్ పక్కడోర్ ప్రాబ్లంగా వుంది. సర్వీసింగ్ కి యివ్వాలి. కొద్దిరోజుల్నుంచి స్కూటర్  మీద తిరుగుతున్నాను."
"మీ కారు వెంటనే ఇవ్వాళే సర్వీసింగ్ కి యివ్వండి. సాయంత్రానికి కల్లా డేలవరీ కావాలని చెప్పండి. సిటీకి అరవై కిలోమీటర్ల దూరంలో గోల్డెన్ వ్యాలీ రిపర్ట్వున్నాయి అవి మీలాంటి పోష్ పెపుల్స్ కోసం కట్టారు. హెల్త్ క్లబ్, స్విమింగ్ పూల్, పకృతి అశ్రమం, ఎంటర్ టైన్ మెంట్ పార్క్, పిల్లలకు డిస్కిలాండ్  అనేక సౌకర్యాలు అక్కడ వున్నాయి. అవన్నీ ఇండివిడ్యువల్ కాటేజేస్. కావాలంటే అందమయిన అమ్మాయిలు కూడ అక్కడ దొరుకుతారు. కాసేపు టైం పాస్ చేసినట్టు వుంటుంది" అని చెప్పి నవ్వాడు ఇస్మాయిల్.
ఇంద్రమిత్ర అన్నాడు_
"వరం రోజులు అంటే సెవెన్ డేస్. అన్ని రోజులు పేషెంట్స్ కి దూరంగా వుండటం అసంభవం. ప్రతిరోజూ నా అపాయింట్ మెంట్ బుక్స్ పుల్ గా నిండిపోయింది."
"పోనీ కనిసం రెండు రోజులు రెస్ట్ తీసుకోండి. ణ మనసులో ఓ పతకం రూపుదిద్దుకుంటోంది. మీరు అక్కడికెళ్ళక తప్పదు. ఈ లోపు మీ కారు రిపేరు చేయించుకోండి. రెండు రోజులకు సరిపడా బట్టలు సర్దుకోండి. మీక్కూడా ఈ బిజీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళినట్టు వుంటుంది."
ఇంద్రమిత్ర అంగీకార సూచనంగా తల వూపాడు.
"అన్నట్టు మర్చిపోయాను_ మీ కేస్ డీల్ చేస్తున్న పోలీసు అఫేసర్స్ ఎవరు?"
"సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఫెర్నాండెజ్, ఇన్స్ స్పెక్టర్ చిదంబరం. కాని మొదట్నుంచీ చిదంబరం నా పట్ల పూర్తీ వ్యతిరేకంగా వున్నాడు. ఓ సందర్బంలో నా పేషేంట్ నీ, పర్సనల్ సెక్రటరీ ఐరిస్ నీ యిద్దర్నీ నేనే చంపి వుండవచ్చని కూడా ఆరోపించాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS