Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 40

"అదే కనక జరిగితే లాబ్ రిపోర్ట్ లో అసలు విషయం తెల్తుంది. డూప్లికేట్ కీస్ తయారు చేయటానికి సాధారణంగా సబ్బు మీద గాని, ఒండ్రుమట్టితో గాని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీది గాని ప్రింట్ తీసుకుంటారు. ప్రతిసారీ నకు ఫోన్ చేసి టైం వేస్ట్ చేయటానికి ప్రయత్నించవద్దు. ఈ సారి నేనే మీకు ఫోన్ చేస్తాను."
చిదంబరం వెళ్ళిపోయాడు.
ఇక తాను చిదంబరానికి ఫోన్ చేయటం అనవసరం అతడి తమ్ముడ్ని చంపినా హంతకుడిని మెంటల్ హాస్పిటల్ కు పంపిన తనమీద చిదంబరానికి గొంతు వరకూ కోసం వుంది. తనరక్షణకు తాను వేరే మార్గం తుక్కోవడం మంచిది.
ఈ ఆలోచన రాగానే ఇంద్రమిత్ర టెలిఫోన్ దైరేల్తారీ ఓపెన్ చేశాడు. ఎల్లో పేజెస్ తెరిచాడు. ప్రవేయిట్ ఇన్ వెస్టిగేటర్స్ సెక్యూరిటీ కన్ సల్టెంట్స్ అనే సాబ్ హెడ్డింగ్ క్రింద వున్నా అడ్రసులు ఓ క్గితం తాళం వేసి చేసుకున్నాడు.  
                     *    *    *    *
ఆ మర్నాడు ఉదయం పడి గంటలప్పుడు ఇంద్రమిత్ర డ్రైవ్ చేస్తున్న స్కూటర్ ఓల్ట్ సిటీలోని పాతకాలపు నాలుగు అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది.
ఇంద్రమిత్ర స్కూటర్ ని రోడ్ వారగా పార్క్ చేశాడు ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ వేపు చూశాడు చాలా సంవత్సరాలుగా వైట్ వాష్ చేయకపోవడంతో బిల్డింగ్ రంగు వెలసిపోయి అందావిహీనంగా కనపడుతోంది. అక్కడక్కడ పెచ్చులు పూడిపోయి వున్నాయి. రెండు నిమిషాలు అతడు తటపటాయిస్తూ నిలబడ్డాడు. తర్వాత అడుగు ముందుకు వేశాడు. పురాతన భవనపు మెట్లు ఎక్కుతూ పెంట హౌస్ మీదికి చేసృకున్నాడు. పెంట హౌస్ గుమ్మం పక్కగా 'ఇస్మాయిల్' ప్రయివేట్ ఇన్విష్టిగేటర్ అనే నేం ప్లేట్ వేలాడుతోంది. లోపలకి వచ్చేముందు కాలింగ్ బెల్ నొక్కండి' అనే అక్షరాలు కాలింగ్ బెల్ క్రింద వ్రాసి వున్నాయి. డాక్టర్ ఇంద్రమిత్ర కాలింగ్ బెల్ ప్రెస్ వ్రాశాడు. డోర్ నెట్టాడు.లోపలి వేపు గడియవేసి వుండక పోవడంతో డోర్ తెరుచుకుంది.
ముందు వేపు చిన్న గది. అందులో పాతకాలపు సోఫాలతో ఓ సితోవ్ట్ వుంది. స్పిమ్గ్ డోర్స్ లోంచి వెనక గది కనబడతోంది.ఇంద్రమిత్ర స్పిమ్గ్ డోర్స్ తెరుచుకుని లోపలి గదిలోకి ప్రవేశించాడు. లిపల గది రకరకాల సామాన్లతో నిండిపోయి వుంది. ఓ పక్కగా పాత పేపర్లు, ఇంగ్లీష్ వీక్లీలు దావుమ్తర్లుగా పెట్టి వున్నాయి.కొన్ని బాడీ బిల్డింగ్ మ్యాగజైన్, పాపులర్ సైన్స్ వీక్లీలు, పెంటహౌస్పత్రికలూ పక్కనే సావుపాలో పడి ఉన్నాయి. గోడలనిండా సాలెగూళ్ళు వ్రేలాడుతున్నాయి. ఆ గదిలో ఇంద్రమిత్రకు ఇస్మాయిల్ కనిపించలేదు. ఇంద్రమిత్రకు ఏం చేయాలో అర్ధంకాలేదు. అతడు వెనక్కి తిరిగి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతుండగా లోపలకి వచ్చాడు. ఓ లావుపాటి మనిషి. ఎటాచ్డ్ బాత్ రూమ్ లోంచి ముఖం తుడుచుకుంటూ వచ్చిన ఆ మనిషి ఇంద్ర మిత్రాకు షేక్ హేండ్ యిచ్చి చెప్పాడు_
"న పేరు ఇస్మాయిల్."
ఇంద్రమిత్రకు తన ఎదురుగ నిలబడి వున్న పొట్టిమనిషి వైపు చూశాడు.
ఇస్మాయిల్ ఐదడుగుల ఒక్క అంగుళం ఎత్తు వుంటాడు. బరువు మాత్రం నూట యాబై కిలోలు ఉండవచ్చు. బూడిద రంగు సఫారీసూట్ లో ఉన్నాడు ఇస్మాయిల్, ఆ సఫారీ సూటు కుట్టించి ఏ పడి సంవత్సరాల్లో అయి వుంటుంది.
పాతకాలపు రాక చైర్ లో కూర్చుంటూ చెప్పాడు ఇస్మాయిల్.
"చెప్పండి_ ఏంటి మీ ప్రాబ్లం?"
అప్పటికే ఇంద్ర మిత్ర ఇస్మాయిల్ ఓ ఉద్దేశ్యానికి వచ్చేశాడు. మొదటి చూపులోనే ఇస్మాయిల్ మీద ఇంద్ర మిత్రాకు అపనమ్మకం ఏర్పడి పోయింది. ఆ పొట్ట మనిషిని, ఆశుభ్రంగా వున్న అక్కడి వాతావారాన్ని పెంట హౌస్, ప్లేబోయ్ మ్యాగజైన్స్ ను చూసిన తర్వత తాను తప్పుకుని చేసినట్లు వూహించుకున్నాడు ఇంద్రమిత్ర. తను ఎల్లో పేజెస్  నుంచి సెకరించిన అరడజను ప్రయివేట్ డిటేక్టివ్ లా ఆడ్రస్ లా లోంచి ఇస్మాయిల్ ని ఎంచుకుని పొరపాటుచేశాడు.
ఈ ఆలోచన రాగానే అన్నాడు ఇంద్రమిత్ర_
"మనం మళ్ళీ కలుద్దాం. నాకు అర్జంట్ పని వుంది. సారీ ఫర్ దెఅ ఇన్ కన్విన్స్."
ఇస్మాయిల్ ఏం మాట్లాడలేదు.
ఇంద్రమిత్ర గుమ్మంవేపు కదిలాడు. అతడు స్పిమ్గ్ డోర్స్ మెడ చెయ్యి వెయ బోతుండగా వెనక నుంచి ఇస్మాయిల్ గొంతు వినిపించింది.
"డాక్టర్! వన్ మినిట్!"
ఇంద్రమిత్ర ఠక్కున ఆగి ఆశ్చర్యంగా ఇస్మాయిల్ వేపు చూశాడు. తనింతవరకూ ఇస్మాయిల్ ని పరిచయం చేసుకోలేదు. అయినా తాను డాక్టర్ నని గుర్తుపట్టాడు.
"మీరు న అపాయింట్ మేమ్ట్టేసుకున్నారు. మరి నాకు కన్ స్టేషన్ ఫీజు యివ్వకుండా వెళ్ళిపోతరా?"
ఇంద్రమిత్ర రెండు క్షణాలు ఆలోచించి అడిగాడు_
"చెప్పండి_ మీ ఫీజు ఎంత?"
"వెయ్యి రూపాయిలు."     
ఇంద్రమిత్రకు ఒక్కసారిగా కోపం ముంచుకువచ్చింది.కనీసం ఇస్మాయిల్ తో తన ప్రాబ్లం గురించి కూడా వివరించలేదు. కేవలం తాను అక్కడికి వచ్చి వెళ్ళిళ్లినందుకు ఉట్టిపుణ్యాన్ని వెయ్యిరూపాయిలు యిచ్చుకోవాల్సి వస్తోంది. తను ఇంట నిలువుదోపిడీ ఎక్కడా చూడలేదు.
ఇంద్రమిత్ర ఆగ్రహాన్ని అదుముకుంటూ పడి వంద రూపాయల నోట్లు తీసి ఇస్మాయిల్ చేతికి అందించాడు.
ఇస్మాయిల్ వాటిని నాలుగుసార్లు లెక్కపెట్టుకుని వెయ్యిరూపాయల ఉన్నాయని తృప్తిపడిన తర్వత వాటిని మడిచి షర్ట్ జేబులో వుంచుకున్నాడు. వెళ్ళబోతున్న ఇంద్రమిత్రతో అన్నాడు ఇస్మాయిల్.
డాక్టర్! నేను మీ దగ్గర వెయ్యి రూపాయిల ఫీజు తెసుకున్నాను. మీరు ఖర్చు పెట్టిన వెయ్యికి ఫలితం లేకుండా వెళ్ళి పోవడం బాగాలేదు.కనీసం మీ ప్రాబ్లం ఎంతో వివరించండి. నాకు తోచిన సలహా చెప్తాను నచ్చితే దాన్ని మీరు ఇంప్లమెంట్ చేయవచ్చు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS