Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 38

ఇంద్రమిత్ర అక్కడ తాను చేసేపని ఏదీ ఇక లేదని నిర్ణయించుకున్న  తరువాత బయటకు నడచి డోర్స్ లాక్ చేసాడు. అప్పటికీ సమయము రాత్రి తొమ్మిది గంతలు అవుతోంది. ఇంద్రమిత్ర వుంటున్న అపార్ట్ మెంట్స్ బిల్ల్దిమ్గ్ ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్. రాత్రి ఎనిమిది గంటలు అవుతూ వుండగానే అందరూ షాప్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఎనిమిదిన్నరకల్లా అక్కడ చీమ చిటుక్కుమన్నా వినిపించే నిస్చాబ్దం పేరుకుపోతుంది. గ్రౌండ్ ప్లోర్ లో  వాచ్ మన్ తప్ప బిల్డింగ్ మొత్తం నిర్జనంగా వుంటుంది. ఇంద్రమిత్ర నిశ్చబ్దంగా వున్న కారిడార్ లోంచి లిప్ట్ వైపు నడిచాడు. కారిడార్ చివరన నలబై కాండిల్స్ బల్బ్ ఒకటి గుడ్డిగా వెలుగుతోంది. నడుస్తున్నప్పుడు కారిడార్ లో బూట్ల శబ్దం ప్రతి ద్వనించసాగింది. నడుస్తున్నా ఇంద్రమిత్ర చటుక్కున ఆగాడు. కారిడార్ లో తన బూట్ల శబ్దంతోపాటు  మరో వ్యక్తి నడుస్తున్న అడుగుల శబ్దం అతని చెవులకు సోకింది. ఇంద్రమిత్ర ఠక్కున ఆగి వెనక్కి తిరిగి చూశాడు.
పోడవాటి కారిడార్  నిర్మానుష్యంగా కనిపించింది. కారిడార్ చివరనుంచి  టపటప రెక్కలు ఆడిస్తున్నా గబ్బిలం వేగంగా దూసుకు వచ్చి ఇంద్రమిత్ర తలమీద ఠక్కున కొట్టి గాలిలో రెండుసార్లు గిరికీలు  కొట్టి కీచుకుని అరుస్తూ పారిపోయింది.
ఈ హటాత్ పరిణామానికి ఇంద్రమిత్ర ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు. తిరిగి అంతలోనే తెరుచుకుంటూ లిప్ట్  వైపు నడచి బటన్ పేస్ చేశాడు. ఎలక్రానిక్ ఇండికేటర్ లిప్ట్ ప్లోర్ లో శూచిస్తోంది. రెండుసార్లు బటన్ ప్రెస్ చేసిన తర్వత లిప్ట్ కదిలిన శబ్దంతోపాటు ఎవరివో అడుగులు చప్పుడు ఇంద్రమిత్ర చెవులకు సోకింది. సందేహం లేదు.ఎవరివో శబ్దం ఇంద్రమిత్ర చెవులు రిక్కించి విన్నాడు. ఎవరో స్టేయిర్ కేస్ ఎక్కుతున్న విషయం అతడికి అర్దమయింది. సరిగ్గా అదే సమయంలో కారిడార్ లో వెలుగుతున్నా లైట్ ఆరిపోయింది. లిస్టు పైకి వస్తున్నా శబ్దంకూడా వినిపించలేదు. ఇంద్రమిత్ర పిట్టగోడ దగ్గరకి వెళ్ళి తొంగి చూశాడు. బిల్డింగ్ మొత్తం గదాంధకారంలో వున్న విషయం అర్ధం చేసుకున్నాడు. ఈసారి స్టేయిర్ కేక్ నుంచి వస్తున్నా అడుగుల శబ్దం మరింత స్పష్టంగా వినిపించసాగింది. వాళ్ళు ఎవరోగాని, చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని పైకి వస్తున్నారు ఇంద్రమిత్ర.
"సర్కార్.... సర్కార్"
అంటూ అరిచాడు. అతడి అరుపు నిశ్చబ్దంగా వున్న భవనం గోడలమధ్య ప్రతిద్వనించింది.
సర్కార్ సెక్యూరిటీ మనిషి. రాత్రిపూట లిప్ట్ కూడా అతడే ఆపరేట్ చేస్తుంటాడు. మెట్లమీద నుంచి వచ్చేది సర్కార్ కనక అయితే తన అరుపుకు సమాధానం చెప్పేవాడు.
ఇంద్రమిత్ర మనసు ఏదో కీడు శకింఛసాగింది. అతడు వేగంగా తన అపార్ట్ మెంట్ వైపు పరుగుతీశాడు.  చేతిలోని బ్రీఫ్ క్రింద వుంచి వణుకుతున్న చేతులతో ప్యాంటు జేబుల్లోంచి కీస్ బయటకి తీశాడు. భయంతో  అతడి నుదుట చెమట పేరుకుకుంటోంది. తాళం తెరవడానికి ప్రయతనస్తుండగా అతడి చేతిలోని కీ బంచ్ స్లీప్ అయి శబ్దం చేస్తూ క్రింద పడింది. ఇంద్రమిత్ర క్రిందకి వంగి తడిమి చోశాడు.
మెట్లవైపు నుంచి అడుగుల శబ్దం మరింత స్పష్టంగా వినిపించసాగింది.
ఇంద్రమిత్ర వనుకున్న చేతుల్లో కీస్ కోసం తడమసాగాడు. బంచ్ చేతికి చిక్కగానే డోర్ ఓపెన్ చేశాడు బ్రీఫ్ చేతిలోకి తీసుకుని లోపలకి పరుగు తీశాడు. తిరిగి డోర్ లాక్ చేశాడు. అక్కడ్నుంచి తనుండే కన్సల్ టేషన్ రూమ్ వైపు మూవ్ అయాడు. రిపెక్షన్ రూమ్ కీ, కన్సల్ టేషన్ రూమ్ కీ మధ్య ఓ తలుపు వుంది. ఆ తలుపుకు కూడా తాళం వేసే ఏర్పాటు  వుంది. ఇంద్రమిత్ర కన్సల్ టేషన్ రూమ్ లోకి వెళ్ళి తర్వాత రెండో తలుపు కూడా లక్ చేశాడు. తర్వాత టేబుల్ పక్కగా వున్న లాంప్ వెలిగించాడు ప్రయత్నించాడు. ఇంకా పవర్ రాకపోవడంతో లైటు వెలగలేదు. వెంటనే అతడు చేతులతో టెలిఫోన్ ని దగ్గరికి జరుపుకున్నాడు. వేళ్ళతో తడుపుతూ మొదటి బటన్ నొక్కాడు. తరువాత చివరి వరసలో మధ్య బటన్ రెండుసార్లు ప్రెస్ చేశాడు. వెంటనే ఆ ఏరియాకు చెందిన పోలీస్ స్టేషన్ న్లో ఫోన్ రింగయింది. ఎవరో లిప్ట్ చేసినశబ్దంఅతని చెవులకు సోకింది.
అవతల్నించి "హలో!" అని వినపడగానే అన్నాడు. ఇంద్రమిత్ర.
"నేను డాక్టర్ ఇంద్రమిత్రని మాట్లాడుతున్నాను. అర్జంట్ గా సర్కిల్ పెర్నండేజ్ గారికి యివ్వండి. ప్లీజ్! దీసిజ్ ఎమర్జన్సీ."
అవతలి వ్యక్తి చెప్పాడు నింపాదిగా_
"పెర్నాండేజ్ గారు లేరు.మీ కేస్ తకిల్ చేస్తున్నా ఎస్సై చిదంబరంగారు. సీటులో వున్నారు. ఆయనతో మాట్లాడకండి."
చిదంబరానికి తనంటే ఏమాత్రం పడడు. ఈ సమయంలో ఫెర్నాండెజ్ లేకపోవడం తన దురదృష్టం. ఇంద్రమిత్ర ఆలోచిస్తుండగానే చిదంబరం కంఠం ముద్దగా వినపడింది. అతడు బాగా తాగి వున్నదని అర్దమవుతోంది. చిదంబరం అడుగాడు_
"ఎవరు? ఇంద్రమిత్ర ఏంటి ఫోన్ చేశారా?"
ఇంద్రమిత్ర చెప్పాడు_
"ఎవరో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ప్లీజ్! వెంటనేరండి.
చిదంబరం పెద్దగా నవ్వుతూ అన్నాడు_
"మిమ్మల్ని చంపలనుకునేది ఎవరు డాక్టర్ గారూ! మీకు శత్రువులు ఎవరూ లేరనుకుంటా."
"నేను చెప్పింది నిజం! మీరు వెంటనే యిక్కడికి రండి."
"మీరే ఇక్కడికి వచ్చి కంప్లెంట్ రాసివ్వండి. అప్పుడు కాని స్తేబుల్స్ ని పంపిస్తాను."
బయట గుమ్మం గద్దర అగంతుకులు ఆగిన శబ్దం ఇంద్రమిత్రాకు వినిపించింది. అతడు కంగారుగా అన్నాడు_
"లేదు! అంత సమయంలేదు. వాళ్ళు తాళంతీసి లోపలకి వచ్చేస్తున్నారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS