Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 37

మాధురి కోపంగా అంది_
"మిస్ యిఇనివర్స్, లావు, ఎత్తు నడుములు, కొలతలూ అ,మ్తూ మా అక్కని లొంగదీసుకుంటావా? నేను ఈ ఫోటోలు కనక ఫోలీసు స్టేషన్ లో యిచ్చి మీ మీద కంప్లెయింట్ యిస్తే ఏమౌవుతుందో తెలుసా?"
నేను బహాటంగా ఆమె వైపు చూసి చెప్పాను_
"తేలేదు"
"మీకు కనీసం ఏడేళ్ళ శిక్ష పడుతుంది. నేను ఇప్పుడే వీటిని తీసుకెళ్ళి ఫోలీసులకు చూపిస్తాను.
"వద్దు. ప్లీజ్..."
అంటూ నేను బ్రతిమలాడే ప్రయత్నంలో మాధురి చేతులు పట్టుకున్నాను.
మాధురి చేతులు విడుల్చుకుంటూ అంది-
"ఏంటి ముట్టుకుంటున్నారు? ఏదో ఒక వంకతో నన్ను తాకు దమనా నీ ప్రయత్నం?"
నేను కంగారుగా చెప్పాను_
"అబ్బే కాదండీ మిమ్మల్ని బ్రతిమిలాడుదామనీ..."
మాధురి కళ్ళల్లో ఎరుపు జీరలు.
ఆమె తన పెద్దవైన కళ్ళురెంటినీ మరింతగా పెద్దవిచేస్తూ చెప్పింది_
"బ్రతిమలడాలంటే చేతులే పట్టుకోవాక్కర్లేదు. అందుకు చలా పద్దతులు వున్నాయ్.
నేను భయపడుతూనే చెప్పాను_
"ఫోనీ చెప్పండి ఎలా బ్రతిమిలాడాలో కూడా ఇదే మొదటిసారి, అదే విధంగా మరో అమ్మాయిని బ్రతిమిలాడటం కూడా ఇదే మొదటిసారి. నన్ను క్షమించండి."
"అయితే పెదాల మీద మూడుసార్లు, నడుంమీద పద్నాలుగుసార్లు,పొట్టమీద ఏడుసార్లు చొప్పున ముద్దులు పెట్టుకొండి. అలాచేస్తే మిమ్మల్ని వదిలేస్తా."
పరద్యానంగా వింటున్న నేను_
"సరే" అని ఆ తర్వాత ఏదో అనుమానం రావడంతో హడలిపోతూ_
"ఏంటీ?" అన్నాను.
మధురి తన లిస్టు మొత్తం వివరించింది. ఈ సారి మరి కొన్ని ఎక్కువచోట్లు చేర్చింది. నేను స్థాణువైపోతూ_
"మాధురిగారూ!" అంటూ అరిచాను.
"మీకు కరేక్టగా రెండు క్షణాలు టైమ్ యిస్తున్నాను. ఈ లోపు నేను చెప్పిన పార్ట్ ల్లో ముద్దులు పెట్టుకుంటే సారి. లేకపోతే ఈ ఫోటోలు ఫోలీసులకు చూపిస్తా, పేపర్ లో వేయిస్తాదాంతో..."
మధురి చెబుతూనే వుంది.
రాధ పరువు, మర్యాదులు బజారుపాలు కాకూడదు.అల జరగాలంటే నేను మాధురిని ముద్దుపెట్టుకోక  తప్పదు. గుండెని రాయి చేసుకుని మనసులో యిష్టం లేకపోయినా నేను మూవ్ అయ్యాను. ముందుగా పెదాల నుంచి ప్రారంభించాను. సరిగ్గా ఆమె నడుంమీద ముద్దు పెట్టుకుంటూ వుండగా గదిలోకి వచ్చింది రాధ. మా ఇద్దరివంకా సీరియస్ గా చూసింది. రెడ్ హ్యండ్ డెడ్ గా దొరికిపోయిన నేను....
"అదికాదు రాదా అసలు ఏం జరిగిందంటే..." అంటూ చెప్పబోయాను.
వెంటనే రాధ, మాధురి ఫకాలున నవ్వేశారు. చివరకి వాళ్ళే చెప్పారు.... వాళ్ళ ఇద్దరీకీ చిన్నప్పటినుంచీ ఓకే కంచం, ఓకే మంచం అట. పెళ్ళీళ్ళు చేసుకుని విడి పోవాల్సి వస్తుంది. అనే ఆలోచనతో వాళ్ళు అసలు పెళ్ళి చేసుకోవద్దు అనుకున్నారట. చివరకి ఇద్దరూ ఒకళ్ళనే పెళ్ళి చేసుకుని విడి పావువాలసి వస్తుంది. అనే ఆలోచనతో వాళ్ళు అసలు పెళ్ళి చేసుకోవద్దు అనుకున్నారట. చివరకి ఇద్దరూ ఒకళ్ళనే పెళ్ళి చేసుకుంటే ఎలా వుంటుంది అనే ఐడియా రాగానే దాన్ని అమలు పరిచారట. మొత్తానికి ఇద్దరూ కలసి నన్ను పూల్ ని చేశారు. మా ఇరుపక్షల పెద్దవాళ్ళు మొదట యీ ప్రేపోజల్ కు వ్యతిరేకించారు. రాధ, మధురి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించేసరికి నాకు ఇద్దర్నీ ఇచ్చి పెళ్ళి చేయడానికి ఒప్పుకున్నారు."
చిరంజీవి చెప్పటం ఆపాడు.
ఇంద్రమిత్ర అడిగాడు_
"మీ పెళ్ళికి మా వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు కూడా సిద్దంగానే వున్నారు. ఇంకా ఏంటి ప్రాబ్లం?"     చిరంజీవి చెప్పాడు_
నేను ఇపుడు రెండు పెళ్ళీళ్ళు  చేసుకుంటున్నానుకదా! రేపు నాకు పిల్లలు పుడితే వాళ్ళు కూడా నాలాగే రెండు పెళ్ళీళ్ళు  చేసుకోవలనుకుంటారా? ఇదే సమస్య. అదే కనక జరిగితే నా మనుషులు... ముని మనవలు కూడా నా దారిలోనే నడచి, రెండు పెల్లీల్లు వంశం అనే పేరు వస్తుంది అనేది నా డౌటు"
ఇంద్రమిత్ర నవ్వి చెప్పాడు__
"మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటున్నా రాధ, మాధురిల నాన్న రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడా?"
చిరంజీవి తల అడ్డంగా వూపాడు.
"పోనీ మీ నాన్న?"
"ఆయనకూ ఒక్క పెళ్ళే."
"ఇదీ అంతే! మీరు ఇద్దర్ని చేసుకున్నంత మాత్రాన మీ పిల్లలు చేసుకోరు. మీ వంశానికి ఎలాంటి అప్రదిష్టారాదు. ధైర్యంగా వెళ్ళి మీ పని మీరు చేసుకోండి."
అని చెప్పాడు ఇంద్రమిత్ర.
చిరంజీవి రిలీఫ్ గా నిట్టూర్చాడు. అతడు ఇంద్రమిత్రాకు థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు.   
                                *    *    *    *
చిరంజీవి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రమిత్ర టేబుల్ మీది కేస్ షీట్స్ తీసి ర్యాంక్ లో సడ్డాడు మర్నాడు రాబోయే పేషెంట్ల తాలూకు కేస్ పైల్స్ తీసి ముందు వేసుకున్నాడు. వాటిని పరిశీలించడం పూర్తీ అవడానికి అతనికి ఓ గంట సమయం పట్టింది. అ తరువాత బయటకి నడిచాడు. బయట తన ఏపార్టమెంట్ గోడకు తగిలించిన ఫోస్ట్ బాక్స్ ఓపెన్ చేసాడు. ఆ రోజు వచ్చిన ఉత్తరాలు తీసుకుని లోపలకి నడిచాడు.
వాటిల్లో కొన్ని తనను షేర్స్ కొనమంటూ పపించినవి.మరి కొన్ని పుస్తకాల క్యాటలాగ్స్. అలాంటి వాటిని విప్పి చూడకుండానే డస్ట్ బిన్ లో పడేశాడు. ముఖ్యమయినవి అనుకున్న ఉత్తరాలకు మాత్రం రిప్లయ్ వ్రాశాడు. అ పని పూర్తీ చేయడానికి అతనికి అరగంట సమయం పట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS