ఆ రోజు ఉదయం ఆరు గంటలకే ఇంట్లో తిఫెంస్ టిని అందరం శివాలయం నండి విగ్రహం దగ్గరకి చేరాం. అక్కడ్నుంచి గుడి మొత్తం తిరిగి కంతికినచ్చిన అమ్మాయి దొరక్కపోవటంతో వీధుల్లో పడ్డాం. పెద్ద బజారు గంటాలమ్మ చెట్టు దగ్గర అమ్మాయిల గుంపు కన్పించింది.
మాలాగే వాళ్ళుకూడా మొత్తం ఆరుగురు అమ్మాయిలు. నీలం ఓణీ వేసుకున్న అమ్మాయి నకు మొదటి చూపులోనే ఆకర్షించింది, నేను వెంటనే నీలం అమ్మాయి నాది అంటూ చెప్పాను. మిగిలినవాళ్ళు ఎవరికీ నచ్చిన వాళ్ళని వాళ్ళు పంచేసుకున్నారు.
ఆ ఆరుగురు అమ్మాయిలూ ఓణీలు వేసుకుని వున్నారు. ఆరుగురూ చేరుగుడులు నములుతున్నారు. బహుశా ఎర్ర బస్సు దిగివచ్చి వుంటారు. మేం ఆ అరుగుర్నీ ఫాలో అవసగాం. కొద్ది సేపటిలో మా గురించి వాళ్ళకి తెలిసినట్టయింది. కోరచూపులతో మా వైపు చూస్తున్నా నేను మొదట ఆ సంగతి గమనించలేదు. గమనించే సమయానికి ఆరుగురు అమ్మాయిల్లో ఊ అమ్మాయి వేగంగా నడుస్తూ జనంలోకి అదృశ్యమైంది. మాకు జరిగింది అర్దమయ్యే యువకులు. వాళ్ళకు మ పని తెలిసిపోయినట్టు గ్రహించాం. వెంటనే లెక్కలు చూపిద్దాం. జనంలో పడి పరిగెడుతున్నా వాళ్ళకు దొరక్కుండా తప్పించుకున్నాం. వాళ్ళకే కనక చిక్కివుంటే మా ఎముకుల్లో మ్సున్నం కూడా వుండేదికాదు. అయినా మేం ఏ మాత్రం భయపడలేదు. ఇలాంటి సంఘటనలు మాకు మామూలే. అ పల్లుతూరి జనం మమ్మల్ని వెతుక్కుంటూ మరో వైపు వెళ్ళి పోగానే మేం వేరే వైపు వెళ్ళి మా పనిలో పడ్డాం.
సరిగ్గా అరగంట తర్వాత మా కృషి ఫలించింది. దాదాపు పన్నెండు మంది కలసి వున్న అమ్మాయిల గుంపు మాకు ఎదురుపడింది. రాజుగాడు అందర్నీ లెక్క పెట్టాడు.. వాళ్ళు ఖచ్చితంగా పన్నెండుమంది వున్నారు. మేం మొత్తం ఆరుగురం.
డాంగేగాడు ఆనందంగా. వాళ్ళు పన్నెండుమంది. ఒక్కొక్కరికి యిద్దరు _హిహిహి" అన్నాడు.
ఒక్కోడూ యిద్దరు అమ్మాయిల చొప్పున ఎన్నుకోవటం మొదలుపెట్టారు.
మొదట బదిరీగాడు చెప్పాడు_
"అకుపచ్చా లంగా, పసుపుపచ్చ ఓణీ రెండూ నావి."
బుచ్చాలు అరిచాడు_
"ఆ రెండు జెల్ల సీత, ఏర్రంచు నీలంకోక నవి."
అంటే వాడు ఆ యిద్దరు అమ్మాయిల్ని రిజర్వ్ చేసుకున్నాడన్న మాట.
అంతలో కోటిగాడు కేక పెట్టాడు_
"రేయ్! ముందుకు జడ వేసుకున్నా ముద్దుగుమ్మా, చిలకరెక్కా కోకకట్టుకున్న చిత్రాంగినీ నేను చూసుకుంటా."
ఇలా అమ్దరూఎవారికి తగిన అమ్మాయిల్ని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఇక మిగిలింది నేను, ఈశ్వర్.
"మీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పండ్రా?" అన్నాడు దాంగావు.
సమాధానంగా ఇద్దరమూ ఒకేసారి అన్నం.
"అడుగో ఆ ఎల్లో పరికిణీ వేసుకున్నా అమ్మాయి నాది."
మిగిలిన మిత్రులు మా యిద్దరి వంకా ఆశ్చర్యంగా చూశారు. నిజానికి ఓట్లు ఎంచుకున్నా అమ్మయికిమరావుకరు బీటు కొట్టకూడదు. కాని ఈ ఒఅక్కసారీ అందుకు విరుద్దంగా జరిగింది. పైగా వాడు కనీసం నాతో ఒక్క సహనం ముందు ఆ అమ్మాయి గురించి చెప్పివున్నా ఆమెను వాడికి వదిలేసేవాడిని. పాపం సాయంత్రం వరకూ ఆమెకు బాడీ గార్డులా పనిచేసి రాత్రికో కాళ్ళమోకాని ఆ తరవాత ఏం చేసేవాళ్ళం కాదు. వాళ్ళు నదిలో స్నానంచేసి దేవుడ్డ్ని దర్శించిన దగ్గర్నుంచీ ఎర్ర బస్సు ఎక్కేదాకా వెంటబడి తిరిగే వాళ్ళం. తెలివయిన అమ్మాయిలు మాత్రం మా గురించి పసిగట్టెవాళ్ళు. మేం నచ్చితే మాత్రం వెంట తిప్పించుకునీ_ తిప్పించుకునీ ఓ చిరునవ్వు విసిరేవాళ్ళు. దానికే మేం మెలికలు తిరిగిపోయే వాళ్ళం. శివరాత్రి తిరణాలు అయిపోయిన తర్వాత మా అబద్దాలు కూడా దొర్లుతూ వుండేవి. అంటే ఫలానా అమ్మాయిని కౌగలించుకున్నట్లు ముద్దులు కూడా పెట్టుకున్నట్లు చెప్పుకునేవాళ్ళం అలా కేవలం నేత్రానందంతో సారి పెట్టుకుంటున్నరోజులన్నమాట అవి. ఇప్పుడు మేం యిద్దరం ఒకేసారి పసుపురంగు ఓణీ అమ్మయిని ఎంచుకోవడంతో మిగిలిన మిత్రులకు ఏం చేయాలో అర్ధంకాలేదు.
"ఆ అమ్మాయి నాకే కావాలి."
"కాదు నాకే కావాలి."
అనుకున్నాం నేను, ఈశ్వర్ పట్టుదలగా. చిట్టా చివరికి డాంగేగాడి సలహామీద టాస్ వేయటానికి నిశ్చయించుకున్నాం. నేను బొమ్మా, ఈశ్వర్ రుసు కోరుకున్నాం. బుచ్చాలుగాడు ఓ అర్ధరూపాయి బిల్లా జేబులోంచితీసి గాలిలికి ఎగరేశాడు. అది నేలమీద పడి దొర్లుకుంటూ ఎటో పోయింది.
"అయ్ బాబోయ్ నా అర్దరూపాయి"అంటూ బుచ్చాలుగాడు అటు వైపు పరిగెత్తాడు. మేం కూడా వాడిని ఫాలో అయ్యాం.
చివరకి మంచంమీద మిఠాయి అమ్ముకునే షాపు దగ్గర పడివున్నా అర్దరూపాయి బిల్లా మాకు కనిపించింది.
నేను కళ్ళు మూసుకుని మనసులోనే దేవుడ్ని ధ్యానించుకున్నాను.
"శంబో శంకరా... బొమ్మే పడాలి. బొమ్మ కనక పడితే నీకు అభిషేకం చేయిస్తా" అనుకునాను.
నేనింకా దేవిడ్ని తలచుకుంటూ వుండగానే డాంగేవాడు కంఠం వినిపించింది.
"బొమ్మే పడింది. చిరంజీవి గెల్చాడు. ఎల్లో కలర్ అమ్మాయి చిరంజీవిది"
వెంటనే నేను ఆత్రంగా కళ్ళు తెరచి ఆ అమ్మాయి కోసం చూశాను. కాని ఆ అమ్మాయి కానీ ఆమెతో వచ్చిన మిగిలిన అమ్మాయిలు కూడా కనిపించలేదు. ఈ గొడవలో పడి మేం వాళ్ళ గురించి పూర్తిగా మర్చిపోయాం. ఈలోపు వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. నేను ఆతర్వాత రెండు రోజులవరకూ ఆ అమ్మాయికోసం చూస్జ్హాను. కాని తాను నా కళ్ళ పడలేదు. తిరణాల చివరి రోజున రాదోత్సవంనాడు నా కళ్ళు ఆమె కోసం వెతికాయి. కాని చివరికు నిరాశే ఎదురయ్యింది. ప్రతి సంవత్సరం రథం లాగటం నాకు పరదా.లావుపాటి మోకు పట్టుకుని రథం లాగుతుంటే ఎంతో థ్రిల్లింగ్ గా వుంటుంది. ఆ సంవత్సరం నేను రథోత్సవంలోపాల్గోనలేదు. పండుగ ఉత్సాహం మొత్తం కోల్పోయిన నేను కనిపించమని ప్రియురాలికోసం వూరంతా తిరిగాను.
