Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 30

ఇద్దరూ కలసినపుడల్లా అనేక విషయాలు చర్చించుకునేవాళ్ళు. సినిమాలు, సైన్స్ టెక్నాలజీ పాలిటిక్స్ అనేక విషయాలు వాళ్ళ మధ్య దొర్లిపోయేవి. తనతో మాట్లాడే సమయంలో ఇంద్రమిత్ర ఆమె మనసులో వున్న మాట బయట పడుతుందేమోనని చూసేవాడు. ఆమె మామూలుగా మాట్లాడి వెళ్ళిపోయేది. ఏదో ఒక రోజు ఆమె తన చొట్టూ ఏర్పరుచుకున్న నిశ్శబ్దం నుంచి బయటకి వస్తుంది అని అతడు ఎదురుచూస్తూనే వున్నాడు.
పదిహేను రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ కలవడం యిదే మొదటిసారి.
గ్రీష్మ కుర్చీలో కూర్చుని చెప్పింది_
"ఐరిస్ గురించి పేపర్లో చదివాను. పాపం చాలా అందమయిన అమ్మాయి. ఆమెని ఎవరు చంపి వుంటారు?"
"తెలియదు. ఆ విషయమే ఫోలీసులు ఇన్ వెస్టిగేషన్ చేస్తున్నారు, యింకా హంతకుడు ఎవరో కనిపెట్టలేదు."
"ఐరిస్ హత్య విషయంలో మీరు ఎవర్నయినా ఎనుమనిస్తున్నారా?"
"నాకయితే ఎవరి మీదా అనుమానంలేదు. ఫోలీసులు మాత్రంనన్నే హంతుకుడిగా అనుమానించారు."
"వాట్?"
"అవును. ప్రతి ఒక్కర్నీ అనుమానించటం ఫోలీసులకు అలవాటు."
ఇంద్రమిత్ర నవ్వాడు.
గ్రీష్మ లేచి నిలబడి చెప్పింది_
"నేను వెళుతున్నాను. ఇక ఎప్పటికీ మిమ్మల్ని కలవకపోవచ్చు."
ఇంద్రమిత్రఆమె వైపు కంగారుగా చూశాడు.
అతడు ఏదో అనేలోపే ఆమె డోర్ వరకూ వెళ్ళింది. అపుడు గోటు పెకల్చుకుని చెప్పాడు ఇంద్రమిత్ర_
"పోనీ రేపు సాయంత్రం డిన్నర్ కి వస్తారా?"
ఆమె ఒప్పుకుంటుందని ఇంద్రమిత్రకు ఏ మాత్రం నమ్మకంలేదు. ఆమె ఇంద్రమిత్ర అర్దింపుకు క్షణం ఆగింది. ఆమె మనసు సంసిద్దంగా వున్న విషయం గ్రహించిన ఇంద్రమిత్ర చెప్పాడు.
"ప్లీజ్!"
ఆమె ఇకా ఆలోచిస్తోంది. అరనిమిషం వరకూ ఆమె డోర్ దగ్గరే నిలబడింది. చివరకు ఇంద్రమిత్రతో చెప్పింది_       
"ఓ.కే! నన్ను ఎక్కడికి రమ్మంటారు?"
"హొటల్ పారడైజ్ రేపు ఈవినింగ్ ఆరుగంటలకు మీ కోసం వెయిట్ చేస్తుంటాను."
గ్రీష్మ తల వూపి చెప్పింది_
ఓ.కే! మరోసారి మీరు నన్ను బలవంతం పెట్టకూడదు."
ఇంద్రమిత్ర తల వూపాడు.
ఆమె డోర్ తెరుచుకుని వెళ్ళిపోయింది.
ఇంద్రమిత్రకు ఒక్కసారి శరీరం దూదిపింజిలా తెలికయినట్లు అనిపించింది. ఆమె పెళ్ళయిన స్రీ. ఆమె కోసం ఆశపడటం శుద్ధ దండగ. ఈ విషయం ఇంద్రమిత్రకు తెలుసు. కనీసం ఓ సాయత్రం తాను ఆమెతో గడుపుతాడు. అ జ్ఞాపకం తన మనసు పొరల్లో తీపి గుర్తుగా వుంది పోతుంది అంతే.
తాను ముసలివాడు అయిపోయాక గతస్మ్రుతుల్నీ నెమరువేసుకున్నపుడు గ్రీష్మ తో గడిపిన సాయత్రం తనకు తీయని జ్ఞాపకం అవుతుంది.
ఆ మర్నాడు సాయత్రం అపాయింట్ మెంట్స్ అన్నీ అతడు క్యాన్సిల్ చేయడానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు రావలసిన పేషెంట్లందరకీఫోన్స్ అని. వాళ్ళ పరిస్థితుల్లో తాను అపాయింట్ మెంట్స్ కేన్సిల్ చేయవలసి వచ్చిందని చెప్పాడు. తర్వాత ఓ సారి చేతి గడియారం వైపు చూసుకున్నాడు. ఆ రోజు తనను కలవవలసిన చిట్టాచివరి పేషెంట్ జీవి. పైగా చిరంజీవీ తనను కలవటం అదే ఫస్ట్ టైం.
సరిగ్గా పదినిమిషాల తర్వాత చిరంజీవీ ఇంద్రమిత్రను కలిశాడు.
తనను కలిసిన చిరంజీవి వైపు ఇంద్రమిత్ర పరిశీలనగా చూశాడు.
చిరంజీవి పాతిక సంవత్సరాల వయసు వుంటుంది. మనిషి దృడంగా వున్నాడు. పుల్ హ్యాండ్స్ చొక్కాను మోచేతుల పైవరకూ పదిచాడు. అతడిది ఎక్సర్ సైజ్ బాడీ అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.
కొద్దిసేపు యిద్దరూ పిచ్చాపాటీ మాట్లాడుకున్న తర్వాత అడిగాడు ఇంద్రమిత్ర.
"చెప్పండి మిస్టర్ చిరంజీవీ! మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నావు?"
చిరంజీవి మెల్లిగా నవ్వాడు.
"నాకింకా పెళ్ళికాలేదు... నాకు ఇద్దరు గర్ల్ ప్రెండ్స్ వున్నారు. నేను ఇద్దర్నీ పెళ్ళిచేసుకుందాం  అనుకుంటున్నాను.
ఈ విషయం ఆ యిద్దరికీ తెల్సా?"
"వాళ్ళుకూడా వప్పుకున్నారు పైగా వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్లు."
"వ్వాట్?!"
"అవును అసలు జరిగిందేమిటో మావుదత్నుమ్చీ చెప్తాను."
చిరంజీవి కాఫీ, ఛాయ్ తాగే అలవాటు లేదు. అందుకుని ఇంద్రమిత్ర ప్లాస్క్ లోంచి పోసి యిచ్చిన  వేడివేడి పాలు సిప్ చస్తూ చెప్పా సాగాడు చిరంజీవి_
"మాది గుంటూరు దగ్గర ఓ పల్లెటూరు. మావూరిశివాలయం చుట్టుప్రక్కల చాలా ప్రసిద్ది చెందింది. అందుకుని మా వూరి తిరణాలకు పక్క వూళ్ళోనుంచి జనం తండోప తండాలుగా వచ్చేవాళ్ళు. శివాలయానికి దగ్గర్లో మా విధీ వుండేది. శివరాత్రికి మా వూరి కుర్రాళ్ళం రాత్రంతా జాగారం చేస్తుండేవాళ్ళం. చాలామంది ఓకే టికెట్లు మేం మాత్రం అమ్మాయిల వేటలో వుండేవాళ్ళం. సరిగ్గా సంవత్సరం క్రితం తిరణాలకి చాలా మంది జనం వచ్చేవాళ్ళు.అలవాటు ప్రకారం మేం అమ్మాయిలకు బీట్లు కొడుతూ వాళ్ళ వెనకే బాడీగార్డుల్లా వీదుల్లో తిరుగుతూ పొద్దుపుచ్చుతున్నాం. మా గ్యాంగ్ మొత్తం అరడజనమంది సభ్యులం. మాలో ఎవడన్నా తిరనాలకు వచ్చిన అమ్మాయిని ఎంచుకుంటే ఆ అమ్మాయి వైపే మిగిలిన అయిదుగురూ సైటు కొట్టకూడదు. పైగా ఆమెను స్వంత సిస్తార్లా వూహించుకోవాలి. అదే ఒడంబడిక. ఆ ఒడంబడికను మేము అరడజను మంది తుచ తప్పకుండా పాటించేవాళ్ళం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS