అతడు సైకోలిస్టుగా స్థిరపడిన తర్వాత ఎంతమందో అమ్మాయిల్ని చూశాడు. కానీ గ్రీష్మలాగా మొదటి ఆకర్షించినవాళ్ళు అతడికి ఇంతవరకూ తగ్గలేదు. కళ్ళు తిప్పుకుని అందం ఆమెది. తాను వెంటనే మిగిలిన అప్పాయింట్ మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని గ్రీష్మ ని వెంటనే లోపలకి పంపమని ఐరిస్ కి ఇంటర్ కంలో ఫోన్ చేసి చెప్పాడు.
నడుస్తున్నా పూలతోటలో తన గదిలోకి వచ్చింది గ్రీష్మ. తన మనసులో ఏ మూలో చిన్న కదలిక. ఏళ్లతరబడి బీడువాడిన భూమిమీద వానజల్లు పడినట్లు ఆమె నవ్విన నవ్వు తన హృదయాన్ని స్పందింపచేసింది. విశాలమైన ఆమె కళ్ళు చూసినప్పుడు, కోటేరు ముక్కు చూసినప్పుడు తేనెలో ముంచిన గులాభీ రేకుల్లాంటి ఎర్రటి పెదాలను చూసినప్పుడు రక్తపు ఉరవడి పెరిగింది.
నేర్వేస్ తో వణుకుతున్న శరీరాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ అడిగాడు ఇంద్రమిత్ర.
"మీరు?"
"నా పేరు గ్రీష్మ. మీరు చాలా బిజీ అని తెలుసు.కాని మిమ్మల్ని వెంటనే కలుసుకోవాలని అనిపించటంతో వచ్చేశాను.
"అసలు నన్ను కలుసుకోవాలని ఏమ్డుయ్కు అనిపించింది?"
గ్రీష్మ ఏదో చెప్పింది.
కాని ఆ విషయం ఇంద్రమిత్ర చెవులకు వినిపించలేదు. ఆమె మేడలో వేలాడుతున్నా మంగళసూత్రాన్ని చూస్తూనే ఇంద్రమిత్ర మనసు మొద్దుబారినట్లు అనిపించింది. తన శరీరంలోని రక్తం మొత్తం ఇంకిపోయినట్లు అనిపించింది. హీనస్వరంతో అడిగాడు ఇంద్రమిత్ర_
"మీకు పెళ్ళాయిందా?"
అయిమ్దన్నట్టు గ్రీష్మ తల వూపింది. ఇంద్రమిత్ర మనసులోని భావాలు ముఖంమీద కనబడకుండా అడిగాడు_
"మీ భర్త ఏం చేస్తుంటారు?"
"బిజినిస్."
"అసలు మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారు?"
గ్రీష్మ గోళ్ళవంక చూసుకుంటూ చెప్పింది_
"తెలీదు. ఎందుకో మిమ్మల్నికలవలనిపించింది. మనసులో ఏదో చెప్పలేని అశాంతి. అందుకే మీ దగ్గరకి వచ్చాను" కొంతమంది ఆడవాళ్ళు డాక్టర్ కూడా తమ సమస్య చెప్పుకోలేరు. డాక్టర్ వాళ్ళతో స్నేహంగా మాట్లాడి వాళ్ళ సమస్యని రాబట్టావలసి వుంటుంది"
"మీది లవ్ మ్యారేజా?"
"కాదు_పెద్దలు కుదిర్చిన పెళ్ళి."
ఇంద్రమిత్రకు ఆ సమాధానం రిలీఫ్ ని యిచ్చింది.
"మీ పెళ్ళయి ఎన్ని రోజులయింది?"
"ఆర్నెల్లు."
"మీ భర్త మిమ్ముల్ని శారీరకంగా తృప్తి కలిగిస్తున్నాడా?"
గ్రేష్మ మౌనం ప్రశ్న మళ్ళీ అడిగాడు.
ఆమె తృప్తి కలిగిస్తున్నాడు అన్నట్టు తల వూపింది.
"పెళ్ళికి ముందు మీకు లవ్ ఎపైర్స్ ఏమయినా వుందా?"
గ్రీష్మ కోపంగా చూసింది.
"ఓ.కే! మీ భర్త హోమో సేక్సువలా?"
ఆమె తల అడ్డంగా వూపింది గ్రీష్మ.
"మీ తల్లి తండ్రులు మీ చిన్నప్పటినించీ అనురాగంగా వుమ్దేవారా? లేక ఇద్దరి మద్యా తరచూ పోట్లాటలు జరుగుతుండెవా?"
వాళ్ళది అన్యోన్య మయిన దాపత్యం... మొన్ననే 'ఆంద్రతేజం' పత్రిక వాళ్ళు పెట్టిన పోటీలో ఉత్తమ జంటగా ఎన్నిక అయ్యారు కూడా."
"మీరు మీ తల్లి తండ్రులకు ఒక్కరే సంతానమా లేక తోడబుట్టిన వాళ్ళు ఇంకెవరయినా వున్నారా?"
"నాకు ఒక అక్క, ఒక అన్నా. ఒక తమ్ముడు, చేల్లెయి వున్నారు."
"ఆర్దికంగా మీరేమన్నా ఇబందుల్లో వున్నారా?"
"మాకు స్వంత కారు, రాజ భవన దేలక్స్ అపార్ట్ మెంట్స్ వున్నాయి. అవుకాక సిటీలో అరడజను స్వంత ఇల్లు వున్నాయి మా హజ్ బెండ్ బాగా డబ్బున్న మనిషి."
"అయన మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటడా?"
చూసుకుంటాడు అన్నట్టు తల వూపింది.
"మీరు తరుచుగా వ్యాధులకు గురవుతూ వుంటారా? లేక ఇంతకు ముందు మీకు తీవ్రమైన జబ్బుచేసిందా?"
"లేదు"
"మీరు ఖాళీగా పనిలేకుండా గడిపే సమయం ఎక్కువుగా వుంటుందా?"
"లేదు. నాకు ఇరవై న్నాలుగు గంటలూ చాలా పని వుంటుంది. పెయింటింగ్, ఫోటోగ్రఫీ నా హాబీస్."
ఇంద్రమిత్ర గ్రీష్మ ని ప్రశ్నించటం ముగించాడు.
అర్దిగంగా, మనసిగంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్నివిధాలుగా ఆమెమంచి స్థితిలో వున్న విషయం అతడు గ్రహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రీష్మ మానసికంగా ఎలాంటి లోపాలు వుండటానికి వీల్లేదు.
ఒకవేళ తన ప్రశ్నలకు అబద్ద సమాధానం చెబితే తప్పా_
"అసలింతకూ మీ ప్రాబ్లం ఏమిటి?"
గ్రీష్మ మళ్ళీ ఓసారి గోళ్ళవంక చూసుకుంది.
"తేలేదు. అందుకే ఒక సైకాయాలిస్ట్ ని కలవాలనిపించింది. అందుకే వచ్చాను. ఇక యిపుడు అవసరం లేదనిపిస్తోంది."
ఇంద్రమిత్ర చెపాడు_ "మెంటల్ గా యూవర్ ఫర్ ఫెక్ట్ లీ అల్ లైట్! మీరు నా ప్రశ్నకు అన్నీ నిజాలే చెబుతారని ఆశిస్తున్నాను, మీకు మళ్ళీ నన్ను కలవాలనిపిస్తే రండి"
గ్రీష్మ తల వూపింది.
ఆ తర్వాత ఆమె ఎదావురేమ్డు సార్లు వచ్చి వెళ్ళింది. ఆ రెండుసార్లూ ఆమెతో గడిపిన ఇంద్రమిత్రఒకటి గ్రహించాడు. ఆమెకు యింత వరకూ తన మనసుకు నచ్చిన మిత్రుల్ని ఏర్పరుచుకోలేదనీ, ఆమెకు ప్రాణాస్నేహితులు అనేవారు ఎవరూ లేరనీ.
