"డాక్టర్! ఇప్పుడు మన కన్వర్ సెషన్ రికార్డ్స్ చేస్తున్నారా?"
ఇంద్రమిత్ర ఓ విషయాన్ని చాలా రోజులక్రితమే గ్రహించానన్నాడు. తను కూడ శత్రువుల జాబితాలలో ఒకడు కాదుకదా క్రాస్ ఎగ్జావ్ చేస్తున్నాడు. బహుశా తన కదలికల్ని చాటుగా పరిశేలిస్తుండవచ్చు.
ఇంద్రమిత్ర తన పేషెంట్ల తో జరిగిన సంభాషణల్ని టేప్ చేస్తుంటాడు. పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత వల్ల సంభాషణల్ని పదేపదే వినడం ద్వారా వల్ల మానసిక పరిష్టుతికి అంచనా వేయడం ఇంద్రమిత్రకు ఈ జీ అవుతుంది. తనతో జరిపే సంభాషణలను టేప్ చేస్తున్నట్టు ఇంద్రమిత్ర పేషెంట్లకు చెప్పాడు. అందువల్ల వాళ్ళు మానసికంగా వత్తిడికి గురయి తనతో సరిగ్గా సంభాషించలేరు.
కానీ డేనియల్ విషయంలో మాత్రం తన అలవాటును మినహాయింపుకు యిచ్చాడు ఇంద్రమిత్ర. డేనియల్ తన చుట్టూ వున్న ప్రతి మనిషినీ అనుమానించే సారనయిడ్ స్టేజీలో వున్నాడు. తన ప్రాణానికి రక్షణ లేదనే నమ్మకం అతడిలో క్రమక్రమంగా బలపడసాగింది. అవసరమయితే తాను అనుమానించే వ్యక్తిని చంపడానికి అయినా వేనుదీయని 'హొమి సైడర్ మేమ్తాలటీ' అతడికి అలవడింది. అలాంటి వ్యక్తితో తాను ప్రాంక్ గా వుండాలి. అతడు తనతో జరిపే సంభాషణల్ని టేప్ చేసే సంగతి రహస్యంగా వుంచటంవల్ల అతడు తననే అనుమానించే అవకాశంవుంది.
అందుకే ఇంద్రమిత్ర డేనియల్ కి మాత్రం తను చేస్తున్న విషయం చెప్పేశాడు.
డేనియల్ ప్రశ్నకు ఇంద్రమిత్ర తలవూపి చెప్పాడు.
"డేనియల్ మీరు నాకో ప్రామిస్ చేయాలి."
"చెప్పండి"
"నాతో చెప్పకుండా మీరు ఎలాంటి కీలకమయిన నిర్ణయాలు తీసుకో కూడదు ఇంకో విషయం మీరు ఎవరిమీదనయినా పగ తీర్చుకోవాలనుకుంటే ముందుగా నాతో చెప్పండి."
"ఎందుకని?"
"మీ శత్రువుల గురించి నేను క్షుణ్ణంగా స్టడీ చేశాను. వాళ్ళు మీకు చైర్మెన్ ఫోస్ట్ దక్కకుండా చేశారు. మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాలను కుంటున్నారు అవునా?" ఇన్నాళ్లుగా తన ఆలోచనలకు అడ్డు చెప్పే ఇంద్రమిత్ర యిప్పుడు తనను సమర్దిస్తూ మాట్లాడటంతో ఆనందంగా అరిచినంత పనిచేశాడు డేనియల్.
"అవును_ అవును డాక్టర్ వాళ్ళ మోటివ్ అదే!"
ఇంద్ర మిత్ర కొనసాగిస్తూ చెప్పాడు_
వాళ్ళు చాలా తెలివిగా మిమ్మల్ని బోల్తా కొట్టించాలనుకుంటున్నారు. అయినా మీరు వాళ్ళ కంటే తెలివైనవాళ్ళు అనుకోండి. వాళ్ళు మీరేదైనా నేరం చేస్తారు మోనని ఎదురు చూస్తుస్తున్నారు. మీరు కనక ఎవర్నయినా హత్య చేస్తే వెంటనే మిమ్మల్ని ఫోలీసులకు పట్టించి జైల్లో వేయించి శాశ్వతంగా చేతికి మట్టి అంటకుండా అడ్డు తొలగించుకావాలనుకుంటున్నారు. మరి మీరు రేపు కంపెనీ చైర్మెన్ అయితే వాళ్ళందర్నీ పీకిపారేస్తారు కదా? అందుకుని మిమ్మల్ని యిరికిమ్చాలని చూస్తున్నారు.
ఆ మాటతో డేనియల్ ముఖం ట్యూబ్ లైట్ లా వెలిగిపోయింది.
"ఎస్ డాక్టర్! మీరు చెప్పంది కరెక్టే! వాళ్ళు నన్ను యిరికించాలని చూస్తూన్నారు. నేను వాళ్ళకి ఏ మాత్రం చిక్కను" ఇంద్రమిత్ర చెప్పాడు.
"అంతేకాదు _వాళ్ళ మనుషులు మిమ్మల్ని అన్ని వేళలా కనిపెడుతూ వుంటారు. రోడ్డు పక్కన శనక్కాయలు అమ్ముకునేవాడి దగ్గర్నుంచి బూత్ ఫాలిష్ చేసేవాడిదాకా వాళ్ళ మనుషులు మారూవేషలల్లో తిరుగుతూ మిమ్మల్ని ఇరవైనాల్గంటలూ పరిశీలిస్తూ వుంటారు. మీరు ఎవర్నయినా చంపాలనుకున్నా, అలాంటి ప్రయత్నాలు చేసినా వెంటనే ఫోలీసులకు చెప్పేశారు. కనుక అలాంటి ప్రయత్నాలు చేయకండి. మీ చేతులో వున్న కత్తియిలా యివ్వండి."
డేనియల్ తన దగ్గరున్న చురకత్తి ఇంద్రమిత్రకి యిచ్చాడు. అతడు దాన్ని కిటికీ లోంచి బయటకువేసి చెప్పాడు.
"ఇది దగ్గర వుంటే ఉద్రేకంలో మీరు శత్రువుల్ని హత్య చేయవచ్చు. మీ మనసుకు అశాంతిగా అనిపించినపుడు మళ్ళీ రండి."
డేనియల్ వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన డేనియల్ వైపే చూస్తున్నా ఇంద్రమిత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
అల్ రెడీ డేనియల్ హంతుకుడిగా మారి వుండలేదుకదా? తనని హత్యచేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతి ఒక్క మనిషి నీ అనుమానించే డేనియల్ ఐరిస్ మాత్రం ఎందుకు అనుమానించకూడదు? అదే విధంగా హతుడు సాదూరాం ను కూడా డేనియల్ తన దగ్గర చూసి వుంటాడు.
సాదూరాం, ఐరిస్ లు యిద్దరూ తాను శత్రువులుగా భావించిన డేనియల్ వాళ్ళని హత్య చేయడానికి పూర్తీ ఆస్కారం వుంది."
ఆలోచిస్తున్నా ఇంద్రమిత్రకు కన్ సల్తిమ్గ్ రూమ్ డోర్ మీద మునివేళ్ళతో తట్టిన శబ్దం వినిపించింది. అలా లయబద్దంగా తలుపు తట్టే వ్యక్తి ఎవరో తెలుసు.
గ్రీష్మ....
ఆమె రూపం మనసులోకిరాగానే ఇంద్రమిత్ర ఒక్కసారిగా సీటులోంచి లేచి తలుపు తెరిచాడు.
ఇంద్రమిత్రని చూడగానే గ్రీష్మ మనోహరంగా నవ్వింది. తన్మయంగా ఆమెవంక చూశాడు. గ్రీష్మ మెల్లిగా నడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చుంది.
మొట్టమొదటి మూడు నెలలుక్రితం గ్రీష్మ ఇంద్రమిత్రని కలవడానికి వచ్చింది. పైగా ఆమె ముందుగా అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాతే ఇంద్రమిత్రని కలవటం జరుగుతుందని. కాని ఐరిస్ తో గ్రీష్మ వాదన వేసుకుంది. బయట జరిగే గొడవకు ఇంద్రమిత్ర సీతూమిర్రర్ లోంచి గ్రీష్మ ని చూశాడు. మొదట చూపులోనే ఆమె చాలా అందగత్తె గా అర్ధం చేసుకున్నాడు.
