చైర్మెన్ అవ్వవలసిన తనను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కుట్రపన్ని డిమోట్ చేశారనీ, త్వరలోనే తనను కంపెనీ నుంచి శాశ్వతంగా బయటకి పంపించటానికి అతకం వేస్తున్నారనీ డేనియల్ వుహించాసాగాడు. క్రమక్రమంగా అతనిలో తోటి వుద్యోగులపట్ల అనుమానం కలగటం ప్రారంభించింది. తనను కంపెనీనుంచి తొలగించటం చేతకాని పక్షంలో తనని చంపడానికి కూడా తోటి వుద్యోగులు వెనుకాడరని డేనియల్ అనుమానింటము ప్రారంభించాడు. అంతకుముందు తన భార్య- పిల్లలు మరణించటానికి తనే కారకుడని అనే మానసిక వేదనతో వున్న డేనియల్ యిప్పుడు తన ప్రాణాలకు అపాయం సంభవించినట్లు భావించసాగాడు. ఇంటినుంచి అఫేస్ కు వచ్చే మార్గాలను తరుచుగా పండుకునేవాడుకాదు. తాను సరుకులు కొనుక్కునే జనరల్ స్టోర్స్ వాడు తన శత్రువులతో చేతులు కలిపాడనీ, తినే పదార్దాల్లో విషం కలిప్దనీ నమ్మటం ప్రారంభించాడు. చివరకి తన నీడను చూసి తనే భయపడే స్థితికి వచ్చాడు డేనియల్. మొదట్లో అతన్లో ప్రారంభమైన అపరాధ భవం అతన్ని హొమిసైడర్ పారనాయిస్ గా మార్చింది. ఇప్పుడు డేనియల్ నడుస్తున్న టైంబాంబ్ లాంటివాడు. తన దృష్టిలోని అనుమానితలను చంపటానికి కూడా వెనుకాడని మనస్తత్వం అతనీకి అలపడింది.
డాక్టర్ ఇంద్రమిత్ర తన ఎదురుగా కూర్చుని వున్న డేనియల్ వైపు చూసి అడిగాడు_
"నిన్న రాత్రి హాయిగా నిద్రపట్టిందా?"
డేనియల్ చెప్పాడు_
"లేదు. ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళకు నేను దొరకలేదు. ఆ సమయంలో నేను బెడ్ రూమ్ లోపలి వైపున త్లంవేసుకుని దాక్కున్నాను."
ఇంద్రమిత్ర చెప్పాడు_
"పోనీ.. మిమ్మల్ని చంపటానికి ప్రయత్నించిన విషయం పోలీసులకి చెప్పకపోయారా?"
ఇంద్రమిత్రను ఓ పిచ్చివాడని చూసినట్లు చూసి నవ్వాడు డేనియల్.
"మీకు తెలియదనుకుంట_ పోలీసుల్లో కూడా హంతుకుల ఇన్ ఫార్మర్స్ వున్నారు. అందుకే నేను పోలీసులకు ఇన్ ఫామ్ చేయలేదు. అంటే కాదు నిన్న ఏం చేశారో తెల్సా?"
ఇంద్ర మిత్ర చెప్పమన్నట్టు చూశాడు.
"హంతకులకు దొరక్కుండా వాటర్ టబ్ లో దూరి పడుకున్నాను."
ఇంద్రమిత్ర అశాంతిగా కణతలు రుద్దుకున్నాడు. డేనియల్ అతని దగ్గరకి వచ్చి అప్పటికీ ఆరు నెలలయింది. అతని పరిస్థితి రోజు రోజుకూ మరింతగా దిగజారిపోతుంది. అఫ్హేస్ పనిలో తన క్రమశిక్షణరాహిత్యం, వల్ల కాక, తన మీద కుట్రపన్ని తనను చైర్మెన్ పోస్ట్ కి కాకుండా చేశారనే నమ్మకం అతనిలో బలపడింది.
ఇంద్రమిత్ర చెప్పాడు_
"మిస్టర్ డేనియల్! కాసేపు పడుకుని రిలాక్స్ ఆపండి" డేనియల్ పక్కనే వున్న బెడ్ మీద వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుంటూ చెప్పాడు.
"నకు నిద్రరాదు డాక్టర్ ! నేను కంటినిండా నిద్రపోయి పన్నెండు నెలలు అయింది."
ఇంద్రమిత్ర అడిగాడు_
"పోనీ ఇంటికి కాపలా కాయటానికి ఎవరన్నా గూర్జానిగాని, పని మనిషి కానీ పెట్టుకోలేకపోయావా?"
"పెట్టుకున్నాను. కాని వాడు రెండు రోజుల క్రితం నాకు అన్నంలో విషం కలవాటానికి ప్రయత్నిం చాడు."
"వాడ్ని ఏం చేశావ్?"
"మొదట వాడ్ని చంపేద్దాం అనుకున్నా. తర్వాత వాడు తిన్న అన్నాన్ని వాడిచేతనే తినిపింఛా."
"వాడు చచ్చాడా?"
"లేదు_ తెలివిగా వాడు విషం వుందని ఎలా వూహించగలవ్?"
పెద్దగా నవ్వి చెప్పాడు డేనియల్.
"నేను విషాన్ని వాసనా చూడగలను. అంతేకాదు_ ఈ సారి ఎవరయినా నన్ను చంపడానికి ప్రయత్నిస్తే ఈ వాడిని సఫా చేసి పారేస్తా."
డేనియల్ ఠక్కున కళ్ళు తెరిచి షర్ట్ చాటునుంచి పొడవాటి కైజార్ బయటకి తీసి చూపించాడు.
ఇంద్రమిత్రకు ఆర్నెల్లునుంచీ పడుతున్న శ్రమ ఒక్కసారిగా నిష్పయోజనం అయినట్టు అనిపించింది. డేనియల్ పూర్తిగా పిచ్చివాడయి పోయాడు. అతడ్ని మెంటల్ ఆస్పత్రికి పంపించాక తప్పదు. డాక్టర్ ఇంద్రమిత్రకు డేనియల్ జాలివేసింది. ఇంద్రమిత్ర మౌనంగా ఉండటం చూసి అడిగాడు డేనియల్.
