Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 23

ఇంద్రమిత్ర అడిగాడు_
"ముందు ఏం తీసుకుంటారు చెప్పండి. కోకాకోలా, పెప్సీ, థమ్సప్."
"నకు సైన్స్ ప్రాబ్లం వుంది. ఛాయ్ తీసుకుంటాను."
ఇంద్రమిత్ర ఎపార్ట్ మెంట్స్ సేక్యూరీటి మనిషికి ఫోన్ చేసి రెండు కప్పుల ఛాయ్ పంపించమని చెప్పాడు. ఇంద్రమిత్ర ఫోన్ కాల్ క్రేదిల్ చేసిన తర్వాత అన్నాడా యువకుడు.
"నేను మీరు నడివయస్సులో వుంటానని వూహించుకున్నాను. కనీసం యాబై ఏళ్లయినా వుమ్తాయనుకున్నాను. కాని యువర్ సో యంగ్."
ఆ యువకుడి కాప్లింమెంట్ కి ఇంద్రమిత్ర చిరునవ్వు నవ్వి అన్నాడు_
"చెప్పండి మీ సమస్య ఏమిటి?"
ఆ యువకుడు చెప్పాడు.
"నాది ఒక విచిత్రమయిన సమస్య నా సమస్యకు కారణం కూడా నేనే! దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలీక మీ దగ్గరకి వచ్చాను,"
ఆ యువకుడు కొంచెం సిగ్గు పడుతున్నట్లు, సంకోచిస్తున్నట్లు కనిపించాడు.
ఇంద్రమిత్ర అతడిలో బెరుకుతనం పోగోట్టే ప్రయత్నంలో చెప్పాడు.
"మరేం భయంలేదు. మనస్సులో ఏమాత్రం సంకోచం లేకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మొత్తం చెప్పండి. నేను న పేషెంట్లు చెప్పే ప్రతి విషయాన్ని రహస్యంగా వుంచుతాను. ప్రాణం పోయినా కూడా మూడో మనిషికి ఏ మాత్రం బయట పెట్టాను. పేషెంట్ల రహస్యాలు సీక్రీట్ గా వుంచటం డాక్టర్ గా నా మొట్ట మొదటి కర్తవ్యం. లేకపోతే ఈ వృత్తిలో ఎంతో కాలం వుండలేం."
ఇప్పుడు ఆ యువకుడితో ధైర్యం ప్రవేశించింది. అతడు ఏదో చెప్పబోతుండగా బయట అడుగుల శబ్దం వినిపించింది.
ఖాకీ యూనీఫంలో మనిషి ప్లాస్క్ తో లోపలికి వచ్చాడు. రెండు కప్పులనిండా  చాయ్ చేసి ఇద్దరికీ అందించి శాల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
తీ చప్పరిస్తూ ఆ యువకుడు.
"మా ఊరి పేరు లింగాల దిబ్బ! మా పక్క ఊరి పేరు పాలకొండాపురం. బోర్లించినపాలగిన్నెల్లాంటి రెండు కొండల మధ్యనున్న లోయలో వున్న చిన్న గ్రామం పాలకొండాపురం. మా వూరిలో వెయ్యినొక్క లింగాలున్న గుడి ఒకటి వుంది. అందుకుని మ వూరికి లింగాలదీబ్బ అనే పేరు వచ్చింది. పాలకోండాపురంలోనివసించేవాళ్ళు పాలు, పెరుగు  నెయ్యి పిడకలు అమ్మి జీవినం సాగించేవారు. మా వుర్నించి ఉదయం ఐదుగంటల కల్లా నెత్తిమీద పెరుగుకుండలు పెట్టుకున్న ఆడవాళ్లు ఐదు కిలోమీటర్ల దూరం నడిచి వెయ్యిలింగాల గుడిముందు గుమికూడెవారు. మా వూరి జనం వల్ల దగ్గర పలు, పెరుగు కొనుక్కుంటూ వుండేవాళ్ళు.
సంవత్సరంలో ఒక్కరోజు పాలకుండాపురం నుంచి పాలకుండలు పెరుగుకుండలు రాకపోయినా లింగాలదిబ్బ గ్రామం అల్లలాడిపోయేది.
ఇక ప్యామలీ విషయానికి వస్తే మ్ నాన్న లింగాల దిబ్బా హైస్కూల్లో హెడ్ మాస్టార గా పనిచేసేవాడు. మామ్మ అదే స్కూల్లో సెకండ్ గ్రేడ్ టీచర్ గా పనిచేసేది. మా అమ్మా, నన్న ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. మొదట్లో మామ్మ తరుపువారు, మానాన్న తరుపువారు మాఅమ్మా నాన్నలను వేలేశారట. నేను పుట్టిన తర్వాత ఇద్దరివైపు నుంచి రాకపోకలు మళ్ళీ మొదలయ్యాయిట.
నేను పుట్టిన తర్వాతే బంధుత్వాలు కలిశాయి కనక మా అమ్మా నాన్న నన్ను అల్లారుముద్దుగా పెంచారు. ప్రతిరోజూ మా నాన్న పొద్దున్నే లేచి వెయ్యినోక్కటి లింగాల గుడి దగ్గరకి వెళ్ళి పాలు పోయించుకుని వస్తుండేవాడు. నేను పెద్దయ్యాక మా నాన్న వెంట లింగాల గుడికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను.
నాకు ఏడేళ్ళ వయస్సు వచ్చిన తర్వాత నా అంతట నేనే పాలు పోయించుకు వస్తుండేవాడిని. ఇక ప్రస్తుతానికి వస్తే సంవత్సరంక్రితం దున్నపోతుల పండుగ జరిగింది. ఎప్పుడు నాకు పరిచయమైంది చాముండి ఆ అమ్మాయిది  పాలకొండాపురం. ఆ ఊర్నుంచి ప్రతిరోజూ తట్టలో పాలకుండలు, పెరుగుకుండలు పెట్టుకుని వెయ్యి లింగాల గుడి దగ్గరకి వచ్చి అమ్మూతూ వుండేదిట. ఆర్నెల్లనుంచీ ఆ అమ్మాయి పాలు అమ్మడానికి వస్తోందట. అంతకాలం ఆ అమ్మాయిని గమనించనందుకు నన్ను నేనే తుట్టుకున్నాను.
పాలకోడాపురంనుంచి ప్రతి సంవత్సరం దున్నపోతుల్ని అలంకరించి వాటి శరీరంనిండా నల్లగా నిగనిగలాడేలా ఆముదం పట్టించి మా వూరిలో వున్న వెయ్యి లింగాల గుడికి తోలుకు వస్తారు. అక్కడ దున్నపోతుల పోటీ జరుగుతుంది. అందులో నెగ్గే దున్నపోతుకు వెయ్యినూటపదహార్లు బహుమానం యిస్తారు. అంతేకాకుండా వాతానుగా ప్రతిరోజూ పాలు పోయించుకునేవాళ్ళు దున్నపోతు యజమానికి ఎంతోకొంత డబ్బు బహుమతిగా ఇవ్వవలసి వుంటుంది. మాకు ప్రతిరోజూ పాలుపోసే పాపాయమ్మ కూడా దున్నపోతుల్ని తోలుకొచ్చింది. నేను అర్డనూటపదహార్లు దున్నపోతు మేడలో కట్టిన సంచీలో వేశాను. దున్నపోతు మేడలోవేలాడదీసిన సంచిలో చాలా డబ్బులున్నాయి.
అంతలో చామంతి అక్కడికి వచ్చింది. ఆమె పాపాయమ్మని అడిగింది.
"నువ్వు వెళ్ళిపోయేటప్పుడు చెప్పు_ ఇద్దరం కలసి వెళదాం. నాకు ఎవరూ తోడులేరు." అని.
పాపాయమ్మ తల వూపింది. నేను మాత్రం ఛామంతినే పరీక్షిగా చూస్తూ నిలపడ్డాను. నన్ను మొదట చూపులోనే చామంతి బాగా ఆకర్షించింది.
పాపాయమ్మకి నా చూపుల అర్ధం తెలిసిపోయిందనుకుంటాను. నా వైపే అదో విధంగా నవ్వూతూ అంది_
"ఈ అమ్మాయి పేరు చామంతి. మాపక్కిల్లె" నేను ఆ అమ్మాయికి నమస్కారం చేశాను. అంతకముందు తనకెవరూ అలా నమస్కారం పెట్టలేదని కాబోలు చామంతి బోలెడు సిగ్గుపడిపోయింది తాను కూడా ప్రతి నమస్కారం పెట్టి తనను ఎవరో తరుముతున్నట్టు అక్కడ్నించి పారిపోయింది. నేను అమెవైపే చూస్తుండిపోయాను.
పాపాయమ్మ నవ్వూతూ అడిగింది_    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS