"చామంతి నీకు నచ్చిందా?"
నాకు చాలా సిగ్గేసింది
పాపాయమ్మ అంటక ముందు అలా ఎప్పుడూ మాట్లాడి వుండలేదు.
నేను సమాధానం చెప్పకుండా యింటికొచ్చేస్తాను.
కానీ నా మనసులో ఇంకా చామంతి రూపం మొదలూతునే వుంది.
నేను నిద్ర లేకుండా గడిపిన మొదటిరాత్రి అంది. రాత్రంతా చమమ్తిని గురించిన ఆలోచనలతో గడిచిపోయింది.
నేను నిద్రలేకుండా గడిపిన మొదటిరాత్రి అది. రాత్రంతా చామంతిని గురించిన ఆలోచనలతో గడిచిపోయింది.
నేను నిద్రలేకుండా రోజూకంటే తొందరగా నిద్రలేచాను. పలు తేవడానికి స్టీలు గిన్నెతో వెయ్యిలింగాల గిడికి వెళ్ళాను
అప్పటికే పాపయమ్మగేదెలకు పాలు తీస్తూ కనిపించింది, నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. నేను పాపాయమ్మకి గిన్నె అందించాను. ఆమె పితుకుతూ ఓరకంట నా వైపు చూసి నవ్వూతూ అంది_
"ఎవరికోసం వేణుగారు చూస్తున్నారు?"
"మా ప్రెండ్ కూడా వస్తానన్నాడు. ఇంకా రాలేదని చూస్తున్నా" అంటూ తడబడుతూ సమాధానం చెప్పాను.
పాపాయమ్మా మాత్రం ఇంకా నవ్వూతునే వుంది. ననాకు చాలా అవమానమనిపిం చింది, నేను పాలు పోయించుకుని యింటికి వచ్చేస్తాను. ఆ తర్వాత పది హేనురోజులావరకూ నకు చామంతి దర్శనం కాలేదు. నాకు రోజు రోజుకూ మనసు దుర్బరంగా అనిపించసాగింది.
అప్పటికే నేను రెండుసార్లు సైకిల్ మీద పాలకొండాపురం వెళ్ళాను. వీదుల్నీ పిచ్చిపట్టినట్టు తిరిగాను. అయినా చామంతి మాత్రం నాకు కనిపించలేదు. కాని పాపాయమ్మా మాత్రం నాకు రెండు మూడుచోట్ల వీధుల్లో సరుకులు కొంటూనే, గుండెల్ని తోలుకు వస్తునో కనిపించింది. నేను ఆమెని చూడనట్టు నటిస్తూ తప్పించుకున్నాను.
ఓ రోజు మా నాన్న చెప్పాడు_
మేం అందరం మ దూరపు బంధువుల పెళ్ళికి విషయం. పైగా పెళ్ళి జరిగేది కూడా పాలకొండాపురంలోనే అనే విషయం తెల్సిన వెంటనే నేను చెక్కపెట్టె తెరిచి దాపుడికి వుంచిన పండగ బట్టలు తీసి ధరించాను. మేమందరం కల్సి ఎడ్ల బండ్ల మీద పాలకొండాపురం చేరుకోవడానికి అరగంటే ఎక్కువ సమయం పట్టలేదు.
మేము వెళ్ళింది మగ పెళ్ళివారి తరపున. దాంతో మాకు మర్యాదలు ఘనంగానే జరిగాయి. మాకు మిద్దేమీదకి చేరుకున్న నేను పాపాయమ్మను చూసి ఆశ్చర్యపోయాను. పాల వ్యాపారం మీద పాపాయమ్మ అంత డబ్బు సంపాదించిందంటే నాకు ఆశ్చర్యం వేసింది.
పెళ్ళి జరగడానికి ఇంకా రెండురోజుల సమయం వుంది. ఆడపెళ్ళి తరుపున పాపాయమ్మ మాకు ఏర్పాట్లు బాగానే చేసింది.
కాసేపు పెళ్ళి వాళ్ళింటి దగ్గర గడపిన నాకు చామంతి గుర్తుకు వచ్చింది. నాకు అక్కడ వుండబుద్దికాలేదు. చామంతికోసం వీధులన్నీ తిరిగాను. చివరికి సాయంత్రం వేళకి కాళ్ళు ఈడ్చుకుంటూ విడిది గదిలోకి చేరుకున్నాను. అలసటగా బెడ్ మీదకి వాలిపోయాను.
సరిగ్గా రెండు నిమిషాల తరువాత ఓ కోమలకంఠం_"మంచినీళ్ళు" అంటూ నా చెవులకు సోకింది.
నేను కళ్ళు తెరచి చూశాను.
గుమ్మంలో చామంతి నిలబడి వుంది.
ఆమె వైపే నేను విభ్రాంతితో చూస్తుండిపోయాను.
చామంతి నాకు మంచినీళ్ళు గ్లాసు అందించింది.
నాకు దగ్గరగా నిలబడిన ఆమె దేహం నుంచి సహజ సిద్దమటిన పరిమళం నన్ను చుట్టిముట్టింది.
నేను ఎక్కడో చదివాను.
స్రీలు సహజ సిద్ధమయిన దేహా పరిమళాన్ని వేద జల్లుతుందనీ, డానికి ఎటాక్ అయినా మగాడు ఆమెతో జతకట్టడానికి తహతహలాడుతుంటాడని.
చామంతి సిగలో అలకరించుకున్న మల్లెపూలు వాతావరణాన్ని మరింత ఘాటేక్కిస్తున్నాయి. నేను గ్లాస్ అందుకుంటూ చెప్పాను_
"ఆ రోజు వెయ్యి లింగాల గుడి దగ్గర మిమ్మల్ని చూసిన దగ్గర్నుంచి నాకు మీరే గుర్తుకు వస్తున్నారు. నేను మీకోసం సైకిల్ మీద ఈ వూరు మొత్తం పిచ్చివాడిలా తిరిగాను."
చేమంతి నేల చూపులు చూస్తొంది.
నా మాటలు ఆమెలో కల్లోలం రేపుతున్నాయి అనే విషయం నకు అర్ధమవుతోంది.
నా లోకి ధైర్యం మొత్తం కేద్రీకరించుకుంటూ చెప్పాను_
"చామంటీ...ఐ...లవ్... నువ్వు లేకపోతే నేను క్షణం కూడా గడపలేను."
చామంతి సమాధానం చెప్పలేదు. మంచి నీళ్ళగ్లాసు స్టూలుమీద వుంచి లగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
* * * *
సాయంత్రం వరకూ నేను పెళ్ళిమంటపం దగ్గర బిజీగా వున్నాను. ఈ లోపు చామంతి గురించి ఇన్ ఫర్ మేషన్ రాబట్టాను.
తాను పాపాయమ్మకు కోడలు వరసవుతుంది. చామంతి వాళ్ళు పాపాయమ్మ వాళ్ళ ఇంట్లోనే అద్దెకుంటున్నారు.
చామంతి తండ్రి వీరయ్యకి ఎరువుల వ్యాపారం వుంది. చామంతికి ఓ అక్క, అన్నా వున్నారు. వాళ్ళ యిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి చామంతి ఒక్కతేతండ్రితో వుంటోంది. ఇరవైనాలుగుగంటలూ వ్యాపారంలో మునిగి తేలే వీరయ్యకి కూతురు గురించి పట్టించుకునే టైము అస్సలు వుండదు. పాపయమ్మే చామంతి బాగోగులు చూస్తుంటుంది.
* * * *
పెళ్ళి ఇంకా రెండు రోజులు వుంది.
అ రోజు రాత్రినాకు డాబామీద పక్కవేశారు. మా నాన్నకి మాత్రం క్రింద గదిలో పడక ఏర్పాటు చేశారు. మా నాన్నకి చలిగాలి పడడు. దగ్గు వస్తుంది. అందుకుని ఆయన లోపల పడుకోవడానికి నిర్ణయించుకున్నాడు.
నేను బెడ్ వెల్లకిలా పడుకున్నాను. పైనుంచి వెన్నెల తెల్లగా కురుస్తోంది. గాలికి వూగుతున్నా చెట్ల ఆకులూ గలగలామంటున్నాయి.
అంతలో నాకు అందెల శబ్దం వినిపించింది. నేను అటు చూశాను. నేను పడుకునే ప్రదేశానికి రెండు గజాల దూరంలోపరుపువేసి వుంది. పాపాయమ్మ, చామంతి పక్కలుపరుస్తున్నారు.
