Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 22

ఇంద్రమిత్ర తేల్చుకోలేకపోయాడు.
అతడు చీకట్లో తడుముతూ స్విచ్ వేశాడు. లైటు వెలగలేదు. ఇంద్రమిత్ర వెనక్కి తలత్రిప్పి వీధిలో వున్న ఇళ్ళ వైపు చోశాడు. కరెంట్ ఫెయిల్ అనే విషయం అర్దమయింది. పైగా కారిడార్లోంచి వస్తున్నా గుడ్డి వెలుతురు అతడ్ని ఆకర్షించింది. బిల్డింగ్ మొత్తం కరెంట్ వున్నప్పుడు తన ఏపార్ట మెంట్ లో ఎందుకు లైట్లు వేలగాడంలేదు. ఒకవేళ ఫీజుపోయి వుంటుందా?
ఇంద్రమిత్రకు సిగరేట్స్ తాగే అలవాటు లేదు.
కరెంట్ ఫెయిల్ అయినపుడు అతడు ఎమర్జన్సీ ల్యాంప్ వాడతాడు. ఇంద్రమిత్ర ముందుగదిలో వున్న టేబుల్ వైపు మూవ్ అయ్యాడు. ఆ టేబుల్ మీద ఎమర్జన్సీ ల్యాంప్ స్విచ్ అన్ చేయాలి అంది అతని వుద్దేశ్యం .
టేబుల్ వైపు నడుస్తున్నప్పుడు ఇంద్రమిత్ర బూతు కాళ్ళ శబ్దం ఎమర్జన్సీ ల్యాంప్ అందుకున్నాడు.
సరిగ్గా స్విచ్ అన్ చేస్తుండగా అతడి వెనక నీడలా కదిలించ ఆకారం.
ఎమర్జన్సీ ల్యాంప్ వెలగటం ఆ ఆకారం కదలటం ఒకేసారి జరిగాయి. ఇంద్రమిత్రకు అర్దమయింది. తనమీదకి ఎటాక్ జరగబోతున్న విషయం. అగంత వ్యక్తి చేత్తో వుంది పొడవాటి ఐరన్ రాడ్. దాన్ని ఇంద్రమిత్ర తలమీద కి బలంగా విసిరికొట్టాడు. ఇంద్రమిత్ర తల వెనుక వైపున తగిలింది దెబ్బ. అది రబ్బర్ లైనింగ్ అమర్చిన ఇరాన్ రాడ్ అవడంతో దెబ్బ తగిలినపుడు ఎలాంటి శబ్దం వెలువడలేదు. ఒక్కసారి కళ్ళముందు నక్షత్రాలు మెరిసినట్లు అనిపించింది. ఆ వ్యక్తి మరోసారి ఇరాన్ రాడ్ పైకి లేపాడు. వాడేకనక కొట్టడం జరిగితే తాను బ్రతకటం అసంభవం. ఇంద్రమిత్ర తన చేతిలో వున్న ఎమర్జన్సీ ల్యాంప్ అతడి ముఖానికి తగిలి భళ్ళున బ్రద్దలయ్యింది. లాంప్ ముందువైపున వున్న ప్లాస్టిక్ షీట్ ముక్కలైపోయి లోపలివైపున వున్న రెండు ట్యూబ్ లైట్లు పగిలిపోయాయి. వాటి ముక్కలు ఇంద్రమిత్ర మెడకి ఎటాక్ చేసిన వ్యక్తి ముఖం నిండా గుచ్చుకున్నాయి. ఆ వ్యక్తి భయంకరంగా అరిచాడు.
తన చేతిలోకి ఇరాన్ రాడ్ క్రిందకి వదిలేశాడు. పెద్ద శబ్దం చేస్తూ ఇరాన్ రాడ్ క్రింద పడిపోయింది. ఆ వ్యక్తి రెండు చేతులతో ముఖం మూసుకుని బాధగా అరుస్తున్నాడు. ఇంద్రమిత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలాక్ర్టిక్ మెయిన్ అన్ చేశాడు. గది మొత్తం ఒక్కసారిగా వెలుతురుతో నిండిపోయింది.
ఆ వ్యక్తి నేల మీద పడి బాధగా దోర్లుతున్నాడు. ఆ వ్యక్తి కుడి కంటిలో ట్యూబ్ లైట్ ముక్కలు దిగినట్లు ఇంద్రమిత్ర గ్రహించాడు. ఇక అతడు జీవితాతం ఓంటికంటితో గడపక తప్పదు.
ఇంద్రమిత్ర లొపలిగది లైట్ ఆఫ్ చేశాడు. బెడ్ రూం బీరువా బట్టలు మొదలైనవన్నీ చిందరవందరగా క్రిందపడి వున్నాయి. ఇంద్రమిత్ర తన దగ్గర ఎక్కువ డబ్బు వుంచుకోడు. పైగా అతడి దగ్గర గిల్డ్ ఆరన మెంట్స్ వంటి ఖరీదైన వస్తువులు కూడా లేవు.
గదిలో దెబ్బతిన్న వ్యక్తి బాధగా అరుస్తూనే వున్నాడు. అతడి కుడికంట్లోకి రక్తం ధారగా కారుతోంది. ఇంద్రమిత్ర ఫోన్ అందుకుని ఫోలీసులకు రింగ్ చేశాడు.
సరిగ్గా అరగంట తర్వాత ఫోలీసులు రావటం ఇంద్రమిత్ర మీద అటాక్ చేసిన వ్యక్తి అరెస్ట్ చేయటం, వాడిని హాస్పిటల్ కి తరలించటం జరిగిపోయాయి. ఇంద్రమిత్ర మీదికి ఎటాక్ చేసిన వ్యక్తి పాత కేదీగా ఫోలీసులు గుర్తించారు. మూసివున్న అపార్ట్ మెంట్స్ లోంచి దొంగతనం చేయటం అతడి వ్రిట్టి. పోలీసులు వెళ్ళిపోవడానికి మరోగంట సమయం పట్టింది.
   
                                                     *    *    *    *   
ఇంద్రమిత్రకు తన క్లినిక్ మళ్ళీ ఓపెన్ చేశాడు. కన్సల్టింగ్ రూం లోకి వెళ్ళబోతున్న అతడు ఐరిస్ కూర్చున్నా కుర్చీవంక చూశాడు. సరిగ్గా నలబై ఎనిమిదిగంటలక్రితం అదే కుర్చీలో కూర్చుని వున్న ఐరిస్ తనను చూడగానే నవ్వుతూ విష్ చేసింది. జీవితంలో స్థిరపడే సమయంలో ఆమె దారుణంగా హత్యకు గురి అయింది.
అప్పటికీ ఇంకా పేషెంట్స్ ఎవరూ ర్లేదు. తనకు ఇప్పుడు ఓ మనిషి అవసరం ఇంద్రమిత్ర ఆలోచిస్తూ వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు.
తెల్లకాగితం, కలం తీసుకుని వ్రాయసాగాడు.
                  WANTED IMIEDIATELY
                  OFFICE ASSISTAT. SALARY 2000Rs.
                  KNOWLEDGE IN TYPE WRITING
                  PREFFRED
అతడు మొదట ఆ యాడ్ ను దక్కన్ ఎక్స్ ప్రెస్ కి యిద్దామనుకున్నాడు. అతడు డైరెక్టరీ తో చూసి దక్కన్ ఎక్స్ ప్రెస్ నెంబర్ కి డయల్ చేశాడు. అవతలివైపు నుంచి "గుడ్ మార్నింగ్ దక్కన్ ఎక్స్ ప్రెస్" అంటూ వినబడింది.
ఇంద్రమిత్ర ఫోన్ లో యాడ్ టారిఫ్ అడిగి తెలుసుకున్నాడు. అతడు అలాగే అసిస్టెంట్ కావాలి అమ్తూప్రకతన యివ్వదలచుకున్నాడు.
అక్కడ తాను యాడ్ యివ్వవలసిన మ్యాటర్ వ్రాసిన కాగితాన్ని మడిచి జేబులో వుంచుకుంటుండగాతలుపు దగ్గర అలికిడయ్యింది. ఇంద్రమిత్ర "కమిన్!" అంటూ అరిచాడు.
ఓ పాతిక సంవస్తరాల వయసున్నా యువకుడు లోపలకి అడుగుపెట్టాడు. మొదటచూపులోనే ఆ యువకుడు తన కన్సన్ టేషన్ కోసం వచ్చి వుంటాడనే విషయం గ్రహించాడు. ఇంద్రమిత్ర. అతడ్డ్ని కూర్చోమన్నట్లు సైగ చేశాడు.
ఆ యువకుడు ఇంద్రమిత్ర ఎదురుగ్గా వున్న కుర్చీలో కూర్చుని చెప్పాడు_
"న పేరు వేణుమాధవన్. నేను నిజం కాలేజిలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను."
అంటూ చెప్పాడు ఆ యువకుడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS