Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 21

నాలో ఓణుకు ప్రారంభం అయింది. అయినా ధైర్యం తెచ్చుకున్నాను. పైన సపోర్టింగ్ రాడ్ ను పట్టుకున్న ఐరిస్ చేతిమీద నా చెయ్యి వేశాను.
ఐరిస్ చివ్వున తలతిప్పి చూసింది.
నన్ను తన ఏపార్టమెంట్స్ లోనే వున్న కుర్రాడిగా గుర్తించినట్టుంది. ఆమె ముఖంలో కోపం మాయమయింది. ఆమె ముఖం తిప్పుకుని నా చేతి క్రింద నుంచి తన చేతిని తీసేసి ఓ అడుగు ముందుకువేసింది. నేను కూడా ఓ అడుగుమీద రెండు అంగుళాలు ముందుకు జరిగాను. ఇప్పుడు ఐరిస్ నకు తగిలేలా నిలబడ్డాను. సరిగ్గా అదే అమాయమ్లో బస్ ఆగింది. ఐరిస్ క్రిందకి దిగింది. నేను కూడా కంగారుగా బస్ దిగాను. క్రింద జనం గుంపుగా నిలబడి వున్నారు. వాళ్ళను తోసుకుంటూ ముందు వైపు కదిలాను. నాకు ఐరిస్ కనిపించలేదు. జనంలో ఐరిస్ ఎటో వెళ్ళిపోయింది.
"నేను కంగారుగా దిక్కులు చూశాను."   
చెబుతున్నరాజేంద్ర క్షణమాగాడు.
పక్కనే వున్న గ్లాసు అందుకుని మంచినీళ్ళు తాగాడు.
తర్వాత అడిగాడు_
"నేనెంతవరకూ చెప్పాను?"
"బస్ దిగాక నాకు ఐరిస్ కనిపించలేదు." అన్నాడు ఫెర్నాండెజ్.
అవును కదూ! అంతలో రోడ్డు క్రాస్ చేసి ఎదురుగా వున్న లేన్ లోకి నడుస్తున్న ఐరిస్ నాకు కనిపించింది. హడావిడిగా నేను కూడా రోడ్డు క్రాస్ చేసి ఐరిస్ వెళ్ళినవైపు వెళ్ళాను... ఐరిస్ ఎక్కడికి వెడుతోందో అని పాలో చేయసాగాను. ముందు వెడుతున్న ఐరిస్ హాఠాత్తుగా ఆగి నా వైపు చూసింది. నేను కూడా ఠక్కున ఆగాను. ఆమె వెనక్కి తిరిగి నా వైపు రాసాగింది.
నాకు గుండె వేగం పెరిగింది.
భయంతో కాళ్ళు వణకసాగాయి.
నాలుక పిడచకట్టుకుపోయింది.
ఐరిస్ నా దగ్గరికి వచ్చినా కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తూ అడిగింది.
"నువ్వు నన్నెందుకు ఫాలో చేస్తున్నావ్ ?"
నేను ఓసారి రోడ్డుపక్కన ఆగి వున్న బీటు కానిస్టేబుల్ వైపు చూశాను. ఐరిస్ కనక గొడవచేస్తే ఈవ్ టీజింగ్ కింద అరెస్ట్ అవడం ఖాయం.
ఈ అవకాశం వదులుకుంటే నా మనసులో వున్నమాట చెప్పే అవకాశం రాకపోవచ్చు. నేను అన్నిటికీ సిద్దపడినట్లు అనేశాను_
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను."
నేను వూహించిననట్లు ఐరిస్ పక్కన వున్న బీటు కానిస్టేబుల్ కి కంప్లయింట్ చేయలేదు. అలాగని ఆమె ముఖంలో చిరునవ్వు కూడా ప్రత్యక్షం కాలేదు. ఆమె సమాధానంగా అన్నది_
"నేను నా గురించి నీకు చెప్పాలి. అంతా విన్న తర్వాత నే నిర్ణయం మార్చుకోలేక తప్పదు. ఇవాళ సాయత్రం మనం సంజీవయ్యా పార్కు దగ్గర కలుద్దాం. పార్కు మెయిన్ గేటుకు ఎడం వైపున వున్న రాజ్ గార్డెన్ లో నీకోసం ఇవాళ ఈవినింగ్ అయిదు గంటలకు వెయిట్ చేస్తుంటాను."
నేను నాచెవుల్ని నేనే నమ్మలేకపోయాను.
సరిగ్గా అయిదు గంటలకు నేనామేని కలిశాను. ఆమె నకు తన గత జీవితం గిరించి చెప్పింది తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కొద్దిరోజులు మావుహిమ్డిలో గడిపింది. నాకు కావలసింది ఆమె మనస్సు. నేనూ అదే విషయం ఆమెతో చెప్పాను. అదే రాత్రి మేం శారీరకంగా ఒకటి అయ్యాం. నేనూ త్వరలోనే మా పేరెంట్స్ కి ఐరిస్ విషయం చెపుదాం అనుకుంటుండగా ఈ ఘోరం జరిగిపోయింది."
తర్వాత జరిగిన ఇంటరాగేషన్ లో రాజేంద్ర చూపించిన ఆధారాలతో అతడు హంతకుడు కాదు అని తెలియడంతో ఫెర్నాండెజ్, చిదంబరంలు రాజెంద్రను నిరపరాధిగా భావించి అతడిని వదిలేశారు.  
                                                        *    *    *    *
ఐరిస్ హత్య జరిగిన మర్నాడు ఇంద్రమిత్ర క్లినిక్ ఓపెన్ చేయలేదు. ఆ రోజు రావలసిన పేషెంట్స్ అందరికీ తనే ఫోన్ చేసి అపాయింట్ మెంట్స్ కాన్సెల్ అయినట్టు చెప్పాడు. అప్పటికే ఇంద్రమిత్ర దగ్గరికివచ్చేపేషెంట్స్, ఇంద్రమిత్ర స్నేహితులు మొదలైనవారికి ఐరిస్ మర్డర్ విషయం తెలిసింది. ఐరిస్ హత్య గురించి ఫోటోలతో  సహా పేపర్లో న్యూస్ ఐటం వచ్చింది. న్యూస్ ఐటం చదివినవారు అందరూ ఇంద్రమిత్రకు రింగ్ చేసి పరామర్శించారు.
క్లినిక్ మూసేసిన రోజు సాయంత్రం వరకూ స్పాట్ లోనే గడిపాడు ఇంద్రమిత్ర తర్వాత బోర్ గా అనిపించటంతో దగ్గర్లో వున్న ధియేటర్ కి సెకండ్ షోకి బయలుదేరాడు. అందులో ఏదో ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. సినిమాకు వెళ్ళడన్నమాటేగాని అతడికి ఐరిస్ హత్య జరిగిన సంఘటన పదేపదే గుర్తుకురాసాగింది. అతడు ఇంటర్ వేల్ లోధియేటర్ నుంచి బయటబడ్డాడు. దారిలో హొటల్ లో మీల్స్ చేశాడు.
తర్వాత తన ప్లాట్ కి వెళ్ళిన ఇంద్రమిత్ర తలుపు తెరవబోతూ క్షణం ఆగడు . లోపల ఎవరో కదలిన అలికిడి చెవులకు సోకింది. ఇంద్రమిత్ర చెవులు రిక్కించి చూశాడు. ఇప్పుడు లోపలినుంచి ఎలాంటి శబ్దమూ వినిపించలేదు. కారిడార్ మొత్తం గడాంధకారంగావుంది. ఎక్కడో చిన్న గుడ్డిగా వెలుగుతున్నా పార్టీ కాండిల్ బల్బు చీకటిని పారద్రోలలేకపోతుంది.
దూరంగా ఎక్కడో కుక్క ఏడుస్తోంది.
ఒక్కసారిగా చలిగాలి రివ్వున వీచింది. ఏదో ప్రమాదం జరగబోతున్నట్టు ఇంద్రమిత్ర హ్యాండిల్  మీద చెయ్యిచేసి డోర్ ముందుకు నెట్టాడు. కిర్రుమని శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది. సరిగ్గా అదే సమయంలో బెడ్ రూమ్ లో వెలుగుతున్న క్యాండిల్ ఠఫ్ న అరిపోయినట్టు అనిపించింది.
అది ఒక వేళ క్యాండిల్ లా లేక టార్చి లైటా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS