కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు ఇంద్రమిత్ర_
"నియర్లీ ఆన్ ఇయర్ వర్క్ చేస్తోంది."
చిదంబరం ఇంద్రమిత్ర కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు_
"ఐరిస్ హత్య చేయబడింది. ఇంకా శవం అక్కడే వుంది. మనం ఇప్పుడు హత్యాప్రదేశానికి వెడుతున్నాం."
* * * *
ఐరిస్ శరీరంవేల్లకిలా నగ్నంగా నేలమీద పడివుంది. ఆమె రెండు చేతులూ వీపు వైపుకు కదలకుండా నిలన్ రోప్ తో కట్టివున్నాయి. ఆమె తాలూకు దుస్తులు దూరంగా కుప్పగా పడివున్నాయి. ఆమె గుండెల్లో పిడివరకు బాకు దిగబడివుంది.
"హత్యాచేయబడడానికి ముందు ఆమె రెప కిగురి అయిందే" అంటూ చెప్పాడు యసి చిదంబరం.
ఇంద్రమిత్ర ఐరిస్ శరీరంమీద నుండి చూపులు మరల్చుకున్నాడు. కన్ సాల టేషన్ డోర్ తెరుచుకుని వుంది. టేబుల్ సోరుగులు తెరిచుకున్నాయి. కేస్ పైల్స్ తాలూకు షీట్స్ చిందరవందరగా నేలమీద పడివున్నాయి. చివరకి దస్త బిన్ లో పడి వున్నా కాగితం ముక్కలని కూడా హంతకులు వదల లేదు. ఏదో వస్తువు కోసం వాళ్ళు ఆఫీస్ లోని అంగుళం అంగుళం వెతికినట్లు స్పష్టమౌతోంది.
ఐరిస్ శవాన్ని ఫోలీస్ ఫోటో గ్రాఫర్ ఫోటోలు తీసుకుని హాస్పిటల్ కి పంపించటానికి గంట టైం పట్టింది.
చిదంబరం చెప్పాడు_
"ప్రిమ్గార్స్ ప్రింట్స్ దొరకలేదు డాక్టర్! హంతకులు చేతులకు గ్లోజ్స్ తోడుకున్నారు."
ఇంద్రమిత్ర మౌనం వహించాడు.
ఇన్స్ స్పెక్టర్ చిదంబరం ఇంద్రమిత్ర వైపు చూస్తూ చెప్పాడు_
"మరణించిన ఐరిస్ గర్బంతో వుంది. దాన్నిబట్టి ఆమెకు ఎవరితోనో అక్రమ సంభందం ఉండి అని అర్ధమవుతోంది. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే సాదూరాం, మడ్కోంకర్, ఐరిస్ ల హత్య వెనక ఓకే ఒక వ్యక్తి హస్తం వున్నాట్లు తెలుస్తోంది."
ఫెర్నాండెజ్ చిదంబరంవంక ఆసక్తిగా చూశాడు.
చిదంబరం చెపాడు___
"ఐరిస్ చాలా అందమైన అమ్మాయి, మానసికంగా ట్రీట్ మెంట్ యిచ్చి సక్రమ పద్దతిలో పెట్టడానికి ఇంద్రమిత్ర ఆమెను ఎడాస్ట్ చ్సు కున్నాడు. అదే విధంగా ఇంద్రమిత్ర వద్దకు వచ్చే మానసిక రోగుల్లో ఒకడయిన సాదూరాం అందమయిన మనిషి. అచ్చం సినిమా హీరోలా వుంటాడు..."
రెండు క్షణాలు ఆగాడు చిదంబరం.
ఇంద్రమిత్ర, ఫెర్నాండెజ్ అతనివైపు ఆసక్తిగా చూశారు.
చిదంబరం సిగరెట తీసి వెలిగించి గుండెల నిండుగా దమ్ములాగి చెప్పాడు__
"వయస్సులో ఉన్న ఆడదీ, మగాడూ పరస్పరం ఆకర్షించుకోవడానికి అవసరమైన ఏకాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం మొదలైనవన్నీ ఇంద్రమిత్రాకూ, ఐరిస్ నూదగ్గర చేసి వుంటయి. అదే సమయంలో తరచుగా ట్రీట్ మెంట్ కు వచ్చే సాదూరాం కూడా ఐరిస్ పట్ల ఆకర్షణ పెంచుకుని వుంటాడు. పైగా ఐరిస్ గత జీవితం పెద్దాగా చెప్పుకోదగినవి కాదు. ఆమె ఒక ప్రాస్టిట్యూట్ అనే విషయం పాత రికార్డ్ లను చూస్తే అర్దమవుతుంది. డబ్బుకోసం ఐరిస్ యిద్దరితోనూ సంబందం పెట్టుకుని వుంటుంది. ఈ విషయం సహించలేక ఇంద్రమిత్ర ఆవేశం పట్టలేక ప్రీ ప్లాన్డ్ గా మొదట సాదూరాంను, తర్వాత ఐరిస్ నూ చంపేసి వుంటాడు."
ఇంద్రమిత్ర ముఖం కోపంతో జేవురించింది. అతను ఏదో అనే లోపే మాట్లాడవందంటూసైగ చేస్తూ ఇంద్రమిత్ర తో చెప్పాడు చిదంబరం_
"ఈ హత్యలు జరిగిన సమయంలో నువ్వు స్పాట్ లో లేవు అంటావ్? అందుకు సంబంధించిన ఎలిబీలు నీ దగ్గర రడీగా వున్నాయి. అంతే నువ్వు ప్రీ ప్లాద్ గా యీ హత్య చేశావు అని అర్దమవుతోంది."
"షటప్" అని అరుస్తూ ఇంద్రమిత్ర ఆవేశంగా లేచి చిదంబరం టేబుల్ మీద పడబోయి చేతుల సపోర్టింగ్ తో ఆగాడు.
అదే సమయంలో ఫెర్నాండెజ్ ఇద్దరికీ అడ్డుపడుతూ చెప్పాడు_
"చిదంబరం! ప్లీజ్ కూల్ డౌన్ ఇస్."
తర్వాత ఇంద్రమిత్ర వైపు తిరిగి_
"ప్లీజ్! పోలీసులం అన్నా తర్వాత అన్ని కోణాల్నుంఛీ ఆలోచిస్తాం. స్వంత భార్యాను చంపేసిన భర్త తనే ఫోలీసు స్టేషన్ కు వచ్చి భార్య కన్పించటం లేదంటూ రోపర్ట్ యిచ్చిన సంఘటనలు అనేకం వున్నాయి."
ఇంద్రమిత్ర చిదంబరం వైపు రౌద్రంగా చూస్తూ చెప్పాడు.
"ఇతని తమ్ముడ్ని హతం విషయంలో రజాక్ అనే మానసిక రోగికి జైలు శిక్ష పడకుండా తప్పించాను. అతనికి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ యిప్పిమ్చాను. ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకుని యిప్పుడు న మీద రివెంజ్ తీర్చుకావాలనుకుంటున్నాడు. చేయని నేరంలో నన్ను ఇరికించ్జ్హాలనుకుంటున్నాడు."
సర్కిల్ ఫెర్నాండెజ్ చిదంబరం వైపు చూసి చెప్పాడు.
"చిదంబరం! నీ అరోపణల్లో అర్డంలేదు. నా వుధేశ్యంలో యీ హత్యలకీ, ఇంద్రమిత్రకీ ఎలాంటి సంబంధంలేదు."
"అయితే హతురాలు ఎవరివల్లగర్బవతి అయిందీ అనే విషయం తేలాలి. లాబ్ రిపోర్ట్ కనుక్కోవడానికి రాదేగా వుండు డాక్టర్ " అంటూ చాలెంజ్ గా చెప్పాడు చిదబరం.
జవాబుగా ఇంద్రమిత్ర చెప్పాడు_
"ఐరిస్ కి బై ప్రెండ్ ఒకడు వున్నాడు. అతని పేరు రాజేంద్ర. తను రాజేంద్రను ఒకసారి పరిచయం చేసింది కూడా. వాళ్ళిద్దరి పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నారు.ఐరిస్ ఉండే ఏపార్ట మెంట్స్ లోనే రాజేంద్ర ప్యామిలీ కూడా వుంటోంది. వాళ్ళ తండ్రి ఓ ప్రవైట్ ఫారంలో ఎకౌంట్స్ అఫీసర్ గా పనిచేస్తాడు."
ఫెర్నాండెజ్ అడిగాడు_
"రాజేంద్ర ఆడ్రస్ ఏంటి?"
ఇంద్రమిత్ర చెప్పాడు.
* * * *
ఇంద్రమిత్రను ఐరిస్ హత్య విషయంలో ప్రశ్నించిన తర్వాత ఫెర్నాండెజ్, చిదంబరం అక్కడి నుండి నేరుగా ఐరిస్ వుండే పాల్త్స్ వెళ్ళారు. ఐరిస్ ప్లాట్ కు ఎదురు ప్లాట్ లోనే వుంటున్నాడు రాజేంద్ర.
