Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 17

ఓ మధ్యతరగతి గృహిణికి కాన్సర్ జబ్బు సోకుతుంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు వుంటారు. తనకు క్యాన్సర్ సోకిన విషయం భర్తకు చెప్పకుండా రహస్యంగా వుంచుతుంది. తాను చనిపోయేలోపు భర్తకు ఓ మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేద్దాం అనుకుంటుంది. ఆ ప్రయత్నంలో ఆమెకు ఓ అనాధ యువతి తారసపడింది. నా అనే వాళ్ళు లేని ఆ అనాధ యువతి ఆకలి తీర్చుకోవడం కోసం వ్యభిచార్యాన్ని వృత్తిగా స్వీకరిస్తుంది. ఆ యివతి మంచి మనసున్నదానిగా గ్రహిస్తుంది. మండ్య తరగతి గృహిణి. ఆ యువతిని తన భర్త ఇచ్చి వివాహంచేసి చివరకు మరణిస్తుంది. సమాజంలో అత్యంత హినమయిన బ్రతుకు బ్రతుకుతున్నా ఓ యువతికి సంఘంలో ఇఉన్నతమయిన స్థానం కల్పించడంతోపాటు తాను పోయిన తర్వాత తన భర్తను చూసుకోవడానికి ఓ భార్యని, తన పిల్లలను చూసుకోవడానికి తల్లిని ఏర్పాటు చేయటానికి తపనపడే మధ్యతరగతి గ్రిహిని పాత్రలో నటించిన ఫేరా ఫేమాత్ కంటతడి పెట్టించింది.
సాధారణంగాఇంగ్లీష్ సినిమాలో సోషల్ కాన్సప్ట్ తో ఉండే సినిమాలు చాలా అరుదుగా విడుదలతుంటాయి. అలాంటి అరుదైన సినిమాల్లో సబ్ స్టి ట్యూబ్ వైఫ్ ఒకటి.
ఇంద్రమిత్రకు ఒక మంచి సినిమా చూసిన తృప్తి కలిగింది. తర్వాత అతడు మినర్వ హొటల్లో భోజనం చేసి తన ప్లాట్ వైపు కారు తిప్పాడు.
   
                                                      *    *    *    *   
మినర్వా నుంచి తన ప్లాట్ చేరుకోవడానికి ఇంద్రమిత్రాకు యిరవైనిమిషాల సమయం పట్టింది.
ఇంద్రమిత్ర లిప్ట్ లో అయిదో అంతస్తుకి చేరుకున్నాడు. లిప్ట్ బోయ్ నర్సింగ్ లు ఇంద్రమిత్రతో ఏదో చేబ్బబోతుతున్నట్టు చూశాడు.
ఈ విషయం గమనించిన ఇంద్రమిత్ర "ఏదన్నా డబ్బు కావాలా?" అంటూ అడిగాడు.
నర్సింగ్ లు తల అడ్డంగా ఊపాడు.
ఇంద్రమిత్ర నర్సింగ్ లు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు అనిపించింది. అతడు లిప్ట్ ఆగిన వెంటనే తన ప్లాట్ వైపు మూవ్ అయ్యాడు.
డోర్ తెరిచే ప్రయత్నంలో కీ బంచ్ కోసం ప్యాంటు జేబులో చెయ్యి పెట్టిన ఇంద్రమిత్ర క్షణం ఆగాడు.
ప్లాట్ తలుపు తెరిచినట్ట్లుగా లోపల్నించి ట్యూబ్ లైట్ వెలుతురు కారిడార్ లోకి దూసుకివస్తోంది.
ఒకవేళ దొంగలుకాని ప్లాట్ లోకి ప్రవేశించలేదు కదా!
నేల రోజులక్రితం ఇంద్రమిత్ర పక్క ప్లాట్ లో వుండే సవాళ్ళు తమ బంధువుల ఇంతలో ఫంక్షన్ కి అటెండ్ అయివచ్చారు. వీళ్ళా మందువులు వుండేది కూడా పక్కవీధిలోనే, వాళ్ళు వెళ్ళిరావటానికి గంటకంటే ఎక్కువ సమయం పట్టలేదు. ఈ గంటలోనే ఇల్లు మొత్తం దోపిడికి గురి అయింది. ఖరేధయిన వస్తువులు మొత్తం దొంగలు దోచేశారు.
ఇంద్రమిత్రాకు ఆ సంఘటన గుర్తుకువచ్చింది. వెంటనే సర్కిల్ ఫెర్నాండెజ్, ఇన్ స్పెక్టర్ చిదంబరం సోఫాలో కూర్చుని వున్నారు. ఇంద్రమిత్ర తాను ప్లాట్ లోకి వచ్చే సమయంలో పార్కింగ్ ప్లస్ లో ఓ పోలీసు జీపు అగివుమ్డటం గమనించాడు. కాని దాని విషయం అతడు ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఫెర్నాండెజ్, చ్చిడంబరం ఇద్దరూ తన అనుమతిలేకుండా లోపలకి వచ్చినందుకు ఇంద్రమిత్రాకు కోపంముంచుకు వచ్చింది. ఆ విషయం గమనించిన ఫెర్నాండెజ్ చెపాడు_
"సారీ ఇంద్రమిత్రా! మేం వచ్చిన సమయానికి ఒక దూప్లీకేట్ కీ జర ని అడిగి ప్లాట్ తెరిపిమ్చాను."
ఎపార్ట్ మెంట్స్ మేనేజర్ దగ్గర ఇంద్రమిత్ర ఒక డూప్లి కేట్ కీ వుంచుతాడు, తాను లేనప్పుడు ప్లాట్ ని శుభ్రం చేయించటం, వాటర్ పట్టి వుంచటం, లాండ్రీ నుంచి బట్టలు వాడ్  రోబ్ లో పెట్టడం, బట్టలు ఉతకటం మొదలైన పనులు చేసిన తర్వాత పనిమనిషి ప్లాట్ కీ మేనేజర్ కి యిచ్చిపోతుంది.
ఇప్పుడు దూప్లీ కేట్ కే సహాయంతో ఫెర్నాండెజ్, చిడంబరాలు ఇంద్రమిత్ర ప్లాట్ తలుపులు తెరిపించారు.
బహుశా తాను వచ్చేలోపు వాళ్ళు ప్లాట్ మొత్తం సెర్చ్ చేసి వుంటారు. ఇంద్రమిత్ర మనస్సులోని భావం గుర్తించినట్లు చెపాడు యస్.ఐ.చిదంబరం_
"నువ్వు వూహిస్తున్నది కరక్టే డాక్టర్! మేం మీ ప్లాట్ మొత్తం సెర్చ్ చేశాం."
పాత విషయాల్ని మనసులో పెట్టుకున్న చిదంబరం, ఇప్పుడు తనపగ తీర్చుకుంటున్నట్లు ఇంద్రమిత్ర అర్డంచేసుకున్నాడు.
ఇంద్రమిత్ర కోపంగా ఏదో అనేలోపు చెప్పాడు సర్కిల్ ఫెర్నాండెజ్.
"మీరు ఇవ్వాళ సాయత్రం ఎన్ని గంటలకి ఆఫీస్ క్లోజ్ చేశారు.?"
"ఫైఫ్ థర్టీకి."
"ఆ సమయంలో మీతోపాటు ఇంకా ఎవరైనా వున్నారా?"
"లేరు నేను అలవాటుప్రకారం ఐరిస్ కి కీస్ యిచీ ఆఫీస్ క్లోజ్ చేయమని చెప్పాను. తర్వాత సంగీత్ దీయేటర్ లో సబ్సి టూబ్ ఉమెన్ ఇనిమాకి వెళ్ళాను. ఆ తర్వాత హొటల్ కి మీల్స్ చేశాను"
చిదంబరం అడిగాడు_
"మీరు సినిమాకి వెళ్ళారని రుజువు ఏంటి?"
ఇంద్రమిత్ర జేబులోంచి టికెట్ తీసి చిదంబరానికి అందించాడు.
చిదంబరం టికెట్ మీద ప్రింట్ అయినా మేటర్ పరిశీలించాడు. అతను అది ఆ రోజు ఫస్ట్ షో టికెట్ గా అర్ధంచేసుకున్నాడు. తిరిగి దాన్ని ఇంద్రమిత్రకు అందించి చెప్పాడు_
"ఐరిస్ మీ దగ్గర ఎంతకాలంనుంచి పనిచేస్తుంది?"
ఇంద్రమిత్ర ఆలోచనగా అడిగాడు_
"అసలు ఐరిస్ కి ఏమైంది?"
"ప్రశ్నకు ప్రశ్నే సమాధానం కాదు డాక్టర్! ఐరిస్ మీ దగ్గర ఎంతకాలంనుంచి పనిచేస్తుంది?" కటువుగా అన్నాడు చిదంబరం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS