Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 16

ఈసారి ఎస్.ఐ. చిదంబరం కల్పించుకుని చెప్పాడు_ "ఆ మాట మాత్రం నిజం కేవలం డబ్బుకోసం మాత్రం ఈ హత్య జరగలేదు. ఎందుకంటే చనిపోయినపుడు హతుడు సాదూరాం మణీ పర్స లో వెయ్యి రూపాయల క్యాష్ వుంది హంతకులు అందులోంచి ఒక్క పైసాకూడా ముట్టుకోలేదు.దీన్నిబట్టి ఈ హత్య డబ్బుకోసం కాదని తెలుస్తోంది."
చిదంబరం చెప్పటం ఆపాడు.
రెండు క్షణాలసేపు ముగ్గురిమద్యా నిశబ్దం ఆవరించింది. తిరిగి చిదంబరమే ఇంద్రమిత్ర కళ్ళలోకి చూస్తూ అన్నాడు_
"ఒకవేళ మీరే ఈ హత్య చేశారేమో!"
ఆ ప్రశ్నకు ఇంద్రమిత్ర ఒకసారి ఉలిక్కిపడ్డాడు. రెండు క్షణాలవరకూ అతడు శాక నిశ్చబ్దంగా వుండిపోయాడు.
చిదంబరం కొనసాగిస్తూ అన్నాడు.
"అవును డాక్టర్! మీరు హ్యండ్ సమ్  గా వుంటారు. మీ దగ్గరకి వచ్చే అడ పేషెంట్స్ ని ఆకర్షించడానికి అవసరమయిన అందం, తెలివితేటలు, పర్సనాలిటీ వాళ్ళను లోబరుచుకోవడానికి అవసరం అయినా వాక్ చాతుర్యం సమస్తం మీ దగ్గర వుంది. సాదూరాం హొమోసెక్స్ వల్ అతడు మీ పట్ల ఆకర్షణ పెంచుకోవడానికి కావలసిన అన్ని లక్షణాలు మీ దగ్గర వున్నాయి. దాంతో అతడు మీపట్ల ఓ హొమోలా ప్రవర్తించివుంటాడు. మీరు అతడ్ని తిరస్కరించి వుంటారు. అతడు మీతో బలవంతంగా తన కొరకే తీర్చుకోవడానికి ప్రయత్నించి వుండవచ్చు ఆ ప్రయత్నం ఫలితమే నిన్న జరిగిన సాదూరాం హత్య."
చిదంబరం తనను ఓ హొమో అనీ, హంతకుడు అనీ అనటంతో కోపంతో ఇంద్రమిత్ర ముఖం ఎర్రగా కందగడ్డలా తయారైంది.
అతడు చిదంబరం వైపు చూస్తూ అరిచాడు.
"ఇన్స్ స్పెక్టర్! మీ తమ్ముడ్ని హత్యచేసిన రజాక్ విషయం నేను ముక్కు సూటిగా వ్యవహరించినందుకు మీరు నా మీద కక్షకట్టారు. మీ తమ్ముడ్ని హత్యచేసిన వ్యక్తికి శిక్ష పడకుండా తప్పించినందుకు ఇపుడు రివెంజ్ తీర్చుకోవాలనీ ప్రయత్నిస్తున్నారు.
చిదంబరం సీట్ లోంచి లేచి అరిచాడు.
"డాక్టర్! మాటలు జాగ్రత్తగా రానీయండి . పోలీసులతో పెట్టుకుంటే శాల్తీలు మిగలవ్ జాగ్రత్త!"
"ఏం చేస్తావ్, చంపుతావా!"
"చంపను. ఇంటరాగేషన్ చేస్తాం. ఒకటికి రెంటికి కూడా మంచంలోనే పోవాల్సి వస్తుంది."
"నన్ను చంపుతానని బెదిరించావనిఇపుడే పోలీసులకు కంప్లేయిట్ చేస్తాను."
"ఆ కంప్లెయింట్ నువ్వు నాకే ఇవ్వవలసి వుంటుంది. ఈ ఏరియా ఇన్స్ స్పెక్టర్ ని నేను."
ఫెర్నాండెజ్ ఇద్దరికీ అడ్డుపడుతూ చిదంబరంతో  అన్నాడు.
"ప్లీజ్ కూల్ డౌన్ చిదంబరం! జరిగిందేదో జరిగిపోయింది.కూల్ డౌన్ ఐసే..." తర్వాత ఇంద్రమిత్ర వైపు తిరిగి...
...మిస్టర్ ఇంద్రమిత్రా! ఈ రెయిన్ కోటుకు ఇన్ వెస్టిగేషన్ కు పనికి వస్తుంది. దీన్ని మేం తెసుకుపోతున్నాం. నిజానికి రక్తపు మరకలు పడిన ఆ రెయిన్ కోటు ఇంద్రమిత్రకు ఏమాత్రం సారధికాదు. పైగా చురకత్తి వేటుపడినపుడు రెయిన్ కోటు రెండు చోట్ల చీరుకుపోయింది.
ఇంద్రమిత్ర చెప్పాడు.
"ఆ రెయిన్ కోటుతో నాకు పనిలేదు" చిదంబరం అన్నాడు.
మా పరిశోధన పూర్తీ అయ్యేవరకూ మేం వస్తూనే వుంటాం. రేపు మీరు ఓ సారి పోలీసు స్టేషన్ కు అటెండ్ అవ్వవలసి వుంటుంది."
ఇంద్రమిత్ర సమాధానం చెప్పలేదు.
ఫెర్నాండెజ్ చిదంబరం చెయ్యి పట్టుకుని బయటకు లాక్కుపోయాడు.
వాళ్ళు ఇద్దరూ వెళ్ళిపోయాక ఇంద్రమిత్ర ఓ పదినిమషాల సేపు మౌనంగా కూర్చుండిపోయాడు. సరిగ్గా పదినిమిషాల్లో అతడి ఆవేశం పూర్తిగా మయం అయింది. అతడు ముందు గదిలోకి వచ్చాడు.
అక్కడ ఐరిస్ అతడి రాకకోసమే  ఎదురుచూస్తొంది. ఇంద్రమిత్ర ఆఫీస్ కీస్ ఐరిస్ కిందిమ్చి చెప్పాడు.
"నేను వెడుతున్నాను. రేపటి కేస్ షీట్స్ రడీగా వుంచి డోర్స్ కు లాక్ వేసి వెళ్ళు"
ఐరిస్ తల వూపింది.
ఇంద్రమిత్ర బయటకి నడిచాడు.  
                                                             *    *    *    *
ఇంద్రమిత్ర బయటకి వెళ్ళిన తర్వాత ఐరిస్ కూడా ఇరవై నిమిషాల సేపు అక్కడుంది. ఆమె ముందుగా మర్నాడు ఉదయం రాబోయే పేషెంట్స్ తాలూకు కేస్ శితే తీసి వరస క్రమంలో వుంచింది. టేబుల్ క్యాలెండర్ లో డేటు మార్చింది. దస్త బిన్ బయట గుమ్మం పక్కగా వుంచింది. ఆఫీస్ తెరిచేలోపే రోజూ వచ్చే గార్చిగేజ్ కలెక్టర్ 'డస్ట్ బిన్ '
ఖాళీ చేసి తిరిగి దాన్ని అక్కడ వుంచుతాడు.
ఆ రోజు కష్టమర్స్ వదిలేసినడైలీ పేపర్ లను పేజీల వారిగా వరస క్రమంలో పెట్టి వాటిని పాట డెయిలీ పేపర్ల పైన వుంచింది. కిటికీ తలుపులు బాత్ రూమ్ లోకి నడిచి ముఖం కడుక్కుమ్ది. నాప్ కిన్ తో తుడుచుకున్నాక ఫాన్ క్రింద కాసేపు టేబుల్ సొరుగులోనుంచి అద్దం తీసింది.
అదే సమయంలో ముందు గడితాలూకు డోర్ నాబ్ మెల్లిగా తిరగడం ఆమె గమనించలేదు. ఆమె ముఖానికి పౌడర్ పూసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు లోపలకి అడుగుపెట్టారు. ఇద్దరి చేతుల్లోనూ పొడవాటి చురకత్తులు మెరుస్తున్నాయి. మెడమీద పౌడర్ రాసుకుంటూ ఐరిస్ వెనగ్గా ఏదో అలికిడి అవడంతో చటుక్కున తల తిప్పింది.
ఇద్దరు అగంతకులు_
వల్ల చేతుల్లో పొడవాటి చుత్రకత్తులు. ఆమె భయంతో ఆర్తనాదం చేయబోయింది. ఆ ప్రరయత్నాన్ని ముందే పసికట్టిన ఇద్దరూ చిరుతపులిల్లా వేగంగా ఆమె వైపు కదిలారు.
                                                            *    *    *    *
క్లినిక్ నుంచి డాక్టర్ ఇంద్రమిత్ర కారు డ్రయివ్ చేస్తూ నేరుగా సంగీత్ దీయేటర్ వెళ్ళాడు. ఇంద్రమిత్ర చాలా  డేర్ గా సినిమాలకు పోతుంటాడు. అతడు ఎక్కువుగా క్లాసిక్స్ చూడడానికే ఇష్టపడతాడు. ఆ దీయేటర్ లో సాబ్ స్టిట్యూట్ వైఫ్ అనే సినిమా ఆడుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS